*    కొద్దిమంది వల్ల సినిమా పరిశ్రమ పరువు పోతోంది. రేవ్‌పార్టీ కల్చర్ ఎంతో బాధాకరం. బర్త్ డే పార్టీలపైనా ఓ కన్ను వేయాలి.
– సినీరంగ ప్రముఖుల ఆందోళన
–    ముందు మీ పాటల రిలీజ్ కార్యక్రమాల పైన కన్నేయండి. మీ సినిమా వాళ్ళు భూదందాలు, భూకబ్జాలు, హత్యలు ఆఖరుకు మత్తు పదార్థాల కేసులోనూ తలకాయ దూర్చారు. సినిమాల్లో చూపేవన్నీ నిజ జీవితంలో కూడా చూపిస్తున్నారు..!
*    టిఆర్‌ఎస్‌ది చెత్త పాలన. అధిష్ఠానం అనుమతిస్తే పాదయాత్ర చేపట్టి కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతా..
– కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి
–    మీది ఉత్త (ఉత్తమ్) పాలన, వాళ్లది చెత్త పాలన. విమర్శించడంలో మీకు మీరే సాటి.
*    తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం పిడిపి- భాజపా కూటమి కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మోది వల్లే కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరుగుతోంది.
– కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధి
–    మా బాగా చెప్పావు నాయనా ! ఈ విషయం మరణించిన మీ ముత్తాతను (నెహ్రూ) అడిగితే అద్భుతంగా వివరిస్తాడు. గతంలో ఇదే పిడిపితో మీ పార్టీ ఎన్నిసార్లు పొత్తులు వెలగబెట్టిందో మీ పార్టీలోని వృద్ధ నాయకులను అడిగితే వివరిస్తారు.
*    కాంగ్రెసుకు నాయకత్వం లేదు. నితిశ్‌కు పార్టీయే లేదు. అందువల్ల అధ్యక్షుడిగా నితిశ్‌ను ప్రకటించాలి. లేకపోతే కాంగ్రెసు, నితిశ్‌లకు రాజకీయ భవిష్యత్తు ఉండదు.       
– చరిత్రకారుడు రామచంద్రగుహ
–    మీరేమైనా కాంగ్రెసు అధికార ప్రతినిధా ‘అలా మాట్లాడుతున్నారు’ ?
*    చేయి తగిలిందో లేదో నాకు తెలియదు. క్షమాపణ చెప్పినా ఈ కేసులేంది?
– ఎమ్మెల్యే శంకర్ నాయక్
–    మా బాబే ఎంత మంచి లీడర్‌వి నాయనా ! తగిలిందో లేదో కూడా తెలియనంత స్పృహ లేకుండా జీవిస్తున్నావా !
*    హిల్లరీ ప్రెసిడెంట్ కావాలవి రష్యా అధ్యక్షుడు ఫుతిన్ కోరుకున్నాడు.
– అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
–    హిల్లరీ క్లింటన్‌ని అధ్యక్షురాలిని చేయాలని బిల్‌క్లింటన్ కోరుకోవడంలో తప్పు లేదు. ఫుతిన్ కోరుకోవడమేంటి ? అర్థాలు మారిపోతాయి ట్రంప్ సార్.
*  లైంగిక దాడికి గురైన నటి పేరు చెప్తే తప్పేంటి ? మీరూ దాచకండి ?
–  మీడియాకు సూచించిన కమల్ హాసన్
–    ఈ మధ్య మీరు రాజకీయాల్లో స్పీడైపోతున్నారు. రాజకీయాలు మంచివే. కాని వ్యర్థ ప్రలాపాలు మంచివి కావు.
*    చిన్నమ్మకు జైల్లో రాణి భోగం; జైళ్ల డిజిపికి, సిబ్బందికి 2 కోట్ల లంచం.     
–  కర్ణాటక జైళ్ల డిజిపి రూప నివేదిక
–    ‘డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు’ అని సినిమా కవి చెప్పినట్లు లంచం పారేస్తే ఇల్లుకన్న జైలే పదిలం అన్నమాట.
*    ధర్నాలెందుకు? మేం రైతులకు ఎరువులు అందిస్తున్నందుకా? ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నందుకా? మండలానికో గోదాం నిర్మిస్తున్నందుకా? చెరువులను బాగు చేసినందుకా?    
–  ఉత్తమ కుమార్‌రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు
–    కాంగ్రెసు నాయకులారా ! మాటలు నేర్వండి ప్లీజ్ !
*    చైనాతో యుద్ధం వద్దు; సామరస్యంగా పరిష్కరించుకోవాలి.
– సిపిఐ నేత నారాయణ
–    మన ‘ప్రధానిని (మోది) కొట్టిపారేయండి’ అంటూ మావో తమ్ముడిలాగా మాట్లాడుతావ్. చైనాను గుండెలకు హత్తుకోమని నెహ్రూలా ఉపదేశాలిస్తావ్! మొత్తానికి మీరు చైనా భక్తులని మళ్ళీ నిరూపించుకున్నారు ! నారాయణ ! నారాయణ !
 

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి