సంగీత ప్రపంచంలో భారతరత్న పొందిన గొప్ప షెహనాయి విద్వాంసులు ఉస్తాద్ ఖమ్రుద్దీన్ బిస్లిల్లాఖాన్ గురించి ఓ సంఘటన జనబాహుళ్యంలో ఉంది. ఆయన హిందూ పుణ్యక్షేత్రమైన వారణాసిలో ఉండేవారు. ఆయనను కలిసినవాళ్లు ‘‘మీరు ఇంకా గొప్పవారు కావాలంటే ఢిల్లీలో ఉంటే బాగుంటుంది కదా!’’ అంటే ఆయన తడుముకోకుండా ‘‘్ఢల్లీలో విశే్వశ్వరుడు, గంగానది లేవు కదా!’’ అని ఎదురు ప్రశ్నించేవాడట.
ఆయన ‘షెహనాయి’ సంగీతం అభివృద్ధికోసం తన జీవిత కాలంలో చాలా భాగం బయటి ప్రపంచానికి తెలియకుండా బ్రతికాడు. అతనికి కాశీ విశే్వశ్వరుడి పట్ల, గంగానది పట్ల అంత ప్రేమ ఎందుకున్నాయో ఈరోజు సూడో సెక్యులర్, లిబరల్ మేధావులు ఆలోచించాలి.
అలాగే ఇటీవల కేరళ గవర్నర్‌గా నియమింపబడిన మాజీ మంత్రి ఆరీఫ్ మహ్మద్‌ఖాన్ ప్రతిపాదిస్తున్న జాతీయవాద భావనను ఇపుడున్న పరిస్థితుల్లో ఈ దేశ ముస్లింలు అర్థం చేసుకోవాలి. 1986 రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో ఉండి షాహబానో కేసు తర్వాత త్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా అనర్గళ ప్రసంగం పార్లమెంటులో చేసారు. తదనంతర కాలంలో ముస్లిం పర్సనల్ లా బోర్డ్ బెదిరింపులకు లొంగిన రాజీవ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విభేదించి, ముస్లిం మహిళల హక్కులవైపు నిలబడి తన మంత్రి పదవికి రాజీనామా చేసిన ధీశాలి.
ఆయన రచించిన ‘టెక్స్ట్‌అండ్ కంటెక్స్ట్’ అన్న పుస్తకం ప్రతి ముస్లిం చదివి తీరాలి. ఇటీవల ఆయన ప్రసంగాల్లో సర్ సయ్యద్, వౌలానా అబుల్‌కలాం ఆజాద్ వంటి వారిని బాగా ఎక్స్‌పోజ్ చేసారు. వేద, ఉపనిషత్తుల్లోని మంత్రాలను, శ్లోకాలను దివ్య ఖురాన్‌కు అనుసంధానం చేసి గొప్పగా చెబుతున్నారు. ఇదే పని వివాదాస్పద మతగురువు డా. జకీర్‌నాయక్ చేసాడు.
వేదోపనిషత్తుల్లోని నిర్గుణ తత్వాన్ని ఉపయోగించుకొని దీని అంతిమ నిర్ణేత ఇస్లాం అంటూ ప్రచారం చేసాడు. అతని ప్రచారం బెడిసికొట్టి మత ప్రచారం తీవ్రవాదానికి కారణం అయ్యింది. ఇపుడు డా. జకీర్ నాయక్ ఇతర దేశాల్లో నేరస్థుడిగా మారి మలేషియా, సౌదీల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అదే ఆరీఫ్ మహమ్మద్‌ఖాన్ ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లాడు. పదవి రాగానే అతని స్పందన ‘‘కేరళ దేవభూమి, నేను యుపీలో పుట్టినా భారతదేశం చివర అంచుకువెళ్లి సేవచేసే భాగ్యం నాకు లభించింది’. భారతదేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. ఇక్కడ ముస్లింలు అనుభవిస్తున్నంత స్వేచ్ఛ ఇంకెక్కడా దొరకదు’’ అన్నాడు.
ఇది అక్షర సత్యం. ఇక్కడ సూడో సెక్యులరిస్టులు ఆరోపిస్తున్నట్లు హిందూ సంస్థలవల్ల ముస్లింలు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నది దుష్ప్రచారం తప్ప ఇంకేం కాదు. మరి ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ లేని సౌదీ అరేబియా, టర్కీ, ఇరాన్, ఆప్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, ఇండోనేషియా, చెచెన్యా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, స్పెయిన్, సైప్రస్, రష్యా, యుకె. మొదలైన దేశాల్లోకూడా నిత్యం బాంబుల మోతలు ఎక్కడివి? అక్కడ రోజూ ఏదో ఒకచోట ప్రాణనష్టం జరుగుతూనే ఉంది కదా? అక్కడ కూడా హిందూ సంస్థలే దాడి చేస్తున్నాయా?
దీనికి కారణాలు ఏనాడో భారతీయ సమాజం గుర్తించింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ‘ఇస్లామిక్ స్టేట్’ పేరుతో ఐసిస్ ఉగ్రవాదం తీవ్రతను ఇపుడు అన్ని దేశాలు అనుభవిస్తున్నాయి. జీహాద్ పేరుతో జరుగుతున్న ఈ దుశ్చర్యలపై ఏ వౌల్వీని అడిగినా ‘‘అది అసలు ఇస్లాం సంస్కృతే కాదు’’ అంటూ విచిత్రమైన సమాధానం చెప్తారు. మరి ఏది అసలు సిసలైన ఇస్లాం? అంటే ఎవరూ సమాధానం చెప్పరు.
ఇక సెక్యులర్ ముసుగేసుకున్న హిందూ వ్యతిరేకత జీర్ణించుకొన్న ఎర్ర మేధావులను అడిగితే సౌదీలోని ఆయిల్ దొంగిలించేందుకు ‘‘ఇది అమెరికా అంకుల్ శ్యామ్‌గాడు పన్నిన పన్నాగం’’ అంటారు. అలాగే భారత్‌లో తీవ్రవాదానికి ఆరెస్సెస్ కారణం అంటూ కుతర్కం చేస్తారు. ఒక వ్యక్తి సెక్యులర్ అయినా కావాలి లేదా ముస్లిం అయినా కావాలి లేదా నాస్తికత్వం అంటూ మతం మత్తుమందు అనే మార్క్సిస్ట్ అయినా కావాలి. ఈ దేశంలో ఈ కలగాపులగం ఏంటో ఎవరూ నిర్వచించరు!?
నిజానికి ‘సెక్యులరిజం’ అన్నది మన రాజ్యాంగంలో మొదట చేర్చలేదు. భారత్‌లో సంతుష్టీకరణ రుచిమరిగిన తర్వాత విదేశాలనుండి తెచ్చుకున్న అరువు పదం. నిజానికి అన్ని స్వీకరించే గుణం ఋగ్వేదం ‘ఏకం సద్విప్రాబహుధావదన్తి’ అంటూ నిర్వచించింది. అందుకే ఓ మేధావి చెప్పినట్లు ‘‘ప్రపంచం మొత్తం నశించినా భారత్ ఒక్కటుంటే చాలు. ఎందుకంటే ప్రపంచంలోని వైవిధ్యాలన్నీ భారత్‌లో కన్పిస్తాయి. ఇక్కడ ఆదిశంకరుడు, గురునానక్, బుద్ధుడు, మహావీరుడు, జీసస్, మన్సూర్.. అందరూ ఏకకాలంలో ఆరాధింపబడతారు’’ అంటాడు. నిజమే! దానికి మూలం హిందువుల్లోని సహిష్ణుత మాత్రమే కాదు.
స్వీకరించే గుణం. ఈ స్వీకరించే గుణం ఉన్నందునే క్రీ.శ. 629లోనే కొచ్చిన్ దగ్గర హిందూరాజులు మసీదు నిర్మించి ఇచ్చారు. మహమ్మద్ ప్రవక్త దేహ త్యాగం చేసాక 18గం.ల వరకు ఖననం జరుగకుండానే మొదలైన హత్యాకాండ ఆయన కుటుంబ సభ్యులనూ వదిలిపెట్టలేదు. వారికి ఆశ్రయం ఇచ్చిన సింధురాజు దాహిర్‌సేన్ మహమ్మద్ బిన్ కాశీం చేతిలో మరణించాడు. అలాంటి మహమ్మద్ బిన్ కాశీం గొప్పవాడంటూ సయ్యద్ వౌలానా వౌదూదీ అసనలీబన్నా, సయ్యద్ కుతుబ్ వంటివారు ‘‘ఇస్లామిక్ బ్రదర్‌హుడ్’’ పేరుతో పుస్తకాలు రాసి ఢిల్లీలో పంచుతున్నారు?! ఎంత విచిత్రం! ప్రపంచంలోని ఎడారి ప్రాంతాల్లోని సౌదీ చుట్టుప్రక్కల గల 16 దేశాలు చిన్నవికాబట్టి వాళ్లు ‘మతపరమైన బ్రదర్‌హుడ్’ రాజకీయ అవసరాల సౌకర్యంకోసం పెట్టుకొన్నది.
ఇండోనేషియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి ముస్లిం దేశాల్లోని ఒక్కో దేశంతో సమానమైన ముస్లిం జనాభా మన దేశంలో ఉంది. ఇస్లాం అరబైజేషన్ అయ్యాక ‘వహాబిజం’ పెరుగుతూ మన దేశంలో అసలు సిసలైన ‘్భరతీయ ఇస్లాం’ను ప్రభావితం చేస్తున్నది. దానివల్లనే ఇక్కడ ప్రసిద్ధమైన ఖవ్వాలీ సంగీతం, సూఫీల తాత్వికత, మన్సూర్, బులెషా, బందెనవాజ్, గరీబన్నవాజ్, హజ్రత్ నిజాముద్దీన్ వంటి వాళ్ల స్మృతులు ఇపుడు చెరిపేస్తున్నారు. గాలిబ్, ఫిరార్ వంటి కవులను మాయం చేస్తున్నారు. బాద్షాఖాన్, వౌలానా అబుల్‌కలాం, ఏపీజే అబ్దుల్‌కలాం వంటి నేతలను మతం మత్తులో ప్రక్కకు తప్పిస్తున్నారు.
ఇదంతా హిందూ సంస్థలు చేయడంలేదు. ఇదంతా హిందుస్థాన్‌లో పుట్టిన, పెరిగిన ఇస్లాం రూపం. అజ్మీర్‌కు చెందిన ఇస్లాం గురువు ఖ్వాజా గరీబన్నవాజ్ కదలకుండా ప్రపంచంలోని 90 లక్షల మంది చేత ‘కల్మా’ చదివే విధంగా ఇస్లాం వ్యాప్తిచేసాడు. గతంలో వాజ్‌పేయ్‌తో చర్చలు జరిపేందుకు భారత్‌కు వచ్చిన పర్వేజ్‌ముషర్రాఫ్ మొదట అజ్మీర్‌ను సందర్శించాలని, తర్వాత ఎందుకు వెనక్కితగ్గాడో ఎవరికైనా తెలుసా? ఈ చరిత్రపై అవగాహనాశూన్యులైన ఈ దేశ లెఫ్ట్ లిబరల్స్ హిందూ వ్యతిరేకతను సెక్యులరిజంగా, ‘ఇస్లామిక్ సుపీరియారిటీ’ని మైనార్టీ హక్కుల రక్షణగా భావిస్తున్నారు.
హిందూ తత్వగ్రంథాలను అనువాదం చేసిన దారాషికోను మరుగున దాచిపెట్టి, తండ్రిని జైల్లో బంధించి, సోదరులను చంపి, చెల్లెల్ని ఎర్రకోటపైనుండి క్రిందకు తోసి చంపిన ఔరంగజేబును హీరోగా భావిస్తున్నారు. ద్విజాతి సిద్ధాంతంతో భారత్‌ను మతప్రాతిపదికన రెండుగా చీల్చిన పాకిస్తాన్ ఖాయిదే ఆజం మహమ్మదాలీ జిన్నాకు వామపక్షాలు మద్దతు తెలిపాయి. నిజానికి జిన్నా హజ్ యాత్ర లేదు. పంది మాంసం తిన్నాడు. స్నేహితుడి కూతురిని లేపుకుపోయాడు. ఇదంతా ఇస్లాంకు విరుద్ధం, అయినా అతడిని హీరోను చేసారు. విభజనవల్ల 10 లక్షల మంది మరణించారు. హిందువులకు జీవనాడి లాంటి సింధు నాగరికతను కోల్పోయాం. లవుడి పేరుతో ఏర్పడ్డ ‘లాహోర్’ కోల్పోయాం.
మన ప్రాచీన నాగరికత అంతా రావి, సట్లేజ్, సింధు నాగరికతల చుట్టూ తిరిగింది కదా! జిన్నాకు ఏ సంబంధం లేని సింధు ప్రాంతాన్ని నిర్ధాక్షిణ్యంగా ఇచ్చేస్తే అక్కడి ప్రజలు తాము ఏం తప్పుచేసామో తెలియకుండా తమ ప్రాంతాన్ని వదిలేసారు. ఆర్య- ద్రావిడ సిద్ధాంతం బలపరిచే ప్రబుద్ధులు తమిళుల ద్రావిడ భాషల సరసన ఉండే ‘బ్రాహోరుూ’ భాష బలూచిస్తాన్ వాళ్లదని ఎప్పుడైనా ఆలోచించారా? ఏనాడైనా పాకిస్తాన్ మత కోరల్లో నలిగిపోతున్న బలూచీల ఆవేదన గురించి పాలస్తీనాపై కురిపించే ప్రేమలో పదోవంతు అయినా తమ పుస్తకాల్లో చెప్పారా? అక్కడున్న ‘నానీమందిర్’ను రక్షించడంలో వాళ్లు కోల్పోయిన ప్రాణాల సంఖ్య ఎంతో కాశ్మీరియత్ గురించి మాట్లాడేవాళ్లు చెప్పగలరా? కాబూల్‌లో తన వీరప్రతాపం చూపించిన రాజారంజిత్‌సింగ్ గురించి ఎప్పుడైనా గర్వంగా చెప్పుకొన్నామా? సిక్కుల ఆనవాళ్లు నిర్ధాక్షిణ్యంగా పాకిస్తాన్‌లో ధ్వంసం అవుతుంటే ఎప్పుడైనా కన్నీరు కార్చామా? హిందీ భాష దక్షిణాదిపై రుద్దుతున్నారని గోలపెట్టే మేధోవర్గం పాక్‌లోని పంజాబ్‌లో ఒక్క పంజాబీ పాఠశాల ఎందుకు లేదని అంతర్జాతీయ జర్నల్స్‌లో వ్యాసం రాసారా?
ఈ దేశంలో హిందుత్వం నశించాక మిగిలేది బూడిదే. భారత్‌లోని ఢిల్లీ, ముంబై, కలకత్తా, హైద్రాబాద్ వంటి నగరాల్లో ముస్లిం జనాభా 20 శాతం దాటింది. మరి కరాచీ, రావల్పిండి, లాహోర్, పెషావర్‌లలో స్వాతంత్య్రం కన్నాముందు తర్వాత, ఇప్పుడు హిందూ జనాభా ఎంత? కాశ్మీరీయత్ గురించి గగ్గోలుపెట్టేవారు ఈ డెబ్బై ఏళ్లలో జమ్మూకశ్మీర్‌లో ఒక్క హిందూ సీఎం కాలేదో చెప్పగలమా? తన కొడుకుకు సద్దాం హుస్సేన్ అని పేరుపెట్టుకొన్న గులాం నబీ ఆజాద్ అదే ఇరాక్ ప్రక్కనున్న బమియాన్ బుద్ధవిగ్రహాలు తాలిబన్ల చేతిలో ధ్వంసం అవుతుంటే విచారం వ్యక్తం చేసాడా?
సింధు నాగరికతను పరాయివాడి చేతిలోపెట్టి గంగా యమునా తహెజీబ్ అంటున్న ‘మూర్కిస్టుల’కు ఇవన్నీ ఎప్పుడు కన్పిస్తాయి? ఇపుడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మత తీవ్రవాదం మూలం తెలియకుండా ఇక్కడ చిల్లరమల్లర రాజకీయాల్లో పడి చేస్తున్న వాదన పేరుతో సాగుతున్న మత రాజకీయవ్యాప్తి ఇపుడు ప్రపంచ తీవ్రవాదంగా మారుతున్నవేళ ఇక్కడి ‘బహుళత్వం’లోని ఏకత్వాన్ని గ్రహించకుండా లిబరల్ శక్తులు వేస్తున్న అడుగులు భారత్‌కు ప్రమాదం అని తెలుసుకొంటే మంచిది.
బుజ్జగింపు, సంతుష్టీకరణ ధోరణులతో ఒక మతంవాళ్లను ప్రత్యేకం అనే ధోరణి పెంచడంవల్ల కాంగ్రెస్, కమ్యూనిస్టులు తమ ఉనికిని రోజురోజుకు కోల్పోతున్నారు. సంతుష్టీకరణ ఓ సిద్ధాంతంగా మార్చిచేస్తున్న విన్యాసాలు మోదీ, షాలను మరింత గొప్ప హీరోలుగా మారుస్తున్నాయన్న స్పృహకూడా వీళ్లకు లేదు. ‘్భరతీయులంతా సమానం’ అన్న ధోరణి ఇక్కడున్న అన్ని మతాల వాళ్లలో కలగాలి. ముఖ్యంగా ‘మేం ప్రత్యేకం’ అన్న భావన ముస్లిం సమాజం వదిలిపెట్టాలి. వెయ్యేళ్లు బానిసత్వం అనుభవించిన హిందువుల్లోని గూడుకట్టుకొన్న ఆక్రోశాన్ని వారి మనోభావాలను గౌరవించి తగ్గించాలి. ప్రాచీనమైన యోగా సంప్రదాయం గౌరవించాలి. ఎక్కడో పుట్టి, మరెక్కడో మరణించిన బాబ్రీ మనస్తత్వాన్ని వదిలేసి హిందువులను ఖుషీచేయాలి. సాక్షాత్తూ మహమ్మద్ ప్రవక్త నమాజ్ చేసిన ‘బిలాల్ మసీదు’నే అక్కడ వసతులకోసం కూలగొట్టారు. బాబర్ లాంటి దురాక్రమణదారు పేరుమీద మసీదు పంచాయతీ చేయడం హిందువులను మరింత రెచ్చగొడుతుంది.
విగ్రహారాధకులను కాఫిర్లుగా భావించి ద్వేషించడం సరైంది కాదు. బాబర్, లోడి, ఔరంగజేబు, ఘజనీ, నాదిర్షా, తైమూర్లండ్, కాశీం లాంటివారే కొన్నాళ్లు పాలించి, కొందరిని చంపారు అంతే! ఇక్కడున్న బహుళత్వాన్ని చంపితే ప్రపంచానే్న చంపేసినట్లు!! మహమ్మద్ ప్రవక్త ఓ హదీస్‌లో చెప్పినట్లు ‘‘మై హిందు సేన హీహూఁమగర్ హింద్ మజ్‌మేహై’ అన్న వాక్యాల వెలుగులో ఈ దేశాన్ని అధ్యయనం చేయాలి. అపుడు హిందూ, ముస్లింలది ఒకే భవిష్యత్తు అయి తీరుతుంది.
బుజ్జగింపు, సంతుష్టీకరణ ధోరణులతో ఒక మతంవాళ్లను ప్రత్యేకం అనే ధోరణి పెంచడంవల్ల కాంగ్రెస్, కమ్యూనిస్టులు తమ ఉనికిని రోజురోజుకు కోల్పోతున్నారు. సంతుష్టీకరణ ఓ సిద్ధాంతంగా మార్చిచేస్తున్న విన్యాసాలు మోదీ, షాలను మరింత గొప్ప హీరోలుగా మారుస్తున్నాయన్న స్పృహకూడా వీళ్లకు లేదు. ‘్భరతీయులంతా సమానం’ అన్న ధోరణి ఇక్కడున్న అన్ని మతాల వాళ్లలో కలగాలి. ముఖ్యంగా ‘మేం ప్రత్యేకం’ అన్న భావన ముస్లిం సమాజం వదిలిపెట్టాలి. వెయ్యేళ్లు బానిసత్వం అనుభవించిన హిందువుల్లోని గూడుకట్టుకొన్న ఆక్రోశాన్ని వారి మనోభావాలను గౌరవించి తగ్గించాలి. ప్రాచీనమైన యోగా సంప్రదాయం గౌరవించాలి. ఎక్కడో పుట్టి, మరెక్కడో మరణించిన బాబ్రీ మనస్తత్వాన్ని వదిలేసి హిందువులను ఖుషీచేయాలి. సాక్షాత్తూ మహమ్మద్ ప్రవక్త నమాజ్ చేసిన ‘బిలాల్ మసీదు’నే అక్కడ వసతులకోసం కూలగొట్టారు. బాబర్ లాంటి దురాక్రమణదారు పేరుమీద మసీదు పంచాయతీ చేయడం హిందువులను మరింత రెచ్చగొడుతుంది.
విగ్రహారాధకులను కాఫిర్లుగా భావించి ద్వేషించడం సరైంది కాదు. బాబర్, లోడి, ఔరంగజేబు, ఘజనీ, నాదిర్షా, తైమూర్లండ్, కాశీం లాంటివారే కొన్నాళ్లు పాలించి, కొందరిని చంపారు అంతే! ఇక్కడున్న బహుళత్వాన్ని చంపితే ప్రపంచానే్న చంపేసినట్లు!! మహమ్మద్ ప్రవక్త ఓ హదీస్‌లో చెప్పినట్లు ‘‘మై హిందు సేన హీహూఁమగర్ హింద్ మజ్‌మేహై’ అన్న వాక్యాల వెలుగులో ఈ దేశాన్ని అధ్యయనం చేయాలి. అపుడు హిందూ, ముస్లింలది ఒకే భవిష్యత్తు అయి తీరుతుంది.
********************************
*✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి : భాస్కరవాణి *
*ఆంధ్రభూమి : భాస్కరవాణి *
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి