– కర్ణాటకలో మతతత్వ బిజెపిని ఓడించేందుకు కాంగ్రెసు, జెడియస్‌ సహా ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధం.
– జెడియు నేత శరద్‌యాదవ్‌
– అడగని ప్రసంగం చేయడమంటే ఇదే !
– గూండాలకు మానవహక్కులుండవు
– మధ్యప్రదేశ్‌ సిఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌
– చౌహాన్‌జి ! ఈ మాట మీరంటే మతతత్వం. కమ్యూనిస్టులంటే విప్లవం.
– మోదిపై తిరగబడండి. ¬దా అడిగితే కేంద్రం ఆంధ్ర ప్రజలను అవమానిస్తోంది.
– సిఎం చంద్రబాబు
– మా బాబే ! మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆంధ్ర ప్రజలను అన్నట్టా. మరి మీరు ఓటుకు నోటులో దోషిగా నిలబడితే ఆ అవమానం ప్రజలదా..!?
– కాగ్‌ నివేదికతో ప్రభుత్వ బండారం బట్టబయలు. ప్రభుత్వానివన్నీ దొంగ లెక్కలే.
– కాంగ్రెసు నేత దాసోజు శ్రవణ్‌
– మీరు హోంవర్క్‌ సరిగ్గా చేయడం లేదు.
– బిజెపిని ఓడించడానికి అందరినీ కలుపుతాం.
– సిపిఎం నాయకురాలు బృందా కారత్‌
– ముందు ప్రకాశ్‌ కారత్‌ను, సీతారాం ఏచూరిని కలపండి.
– కాంగ్రెసు థర్ట్‌క్లాస్‌ పార్టీ
– మంత్రి కెటిఆర్‌
– ఐటి శాఖ ప్రోగ్రెస్‌ కార్డులు కూడా ఇస్తోందా? కెటిఆర్‌గారూ !
– న్యాయవ్యవస్థ పెను ప్రమాదంలో ఉంది. ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం కాదు.
– జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌
– దానికి ఎవరు బాధ్యులు మిలార్డ్‌ ! మరి జస్టిస్‌ కర్ణన్‌ను ఎందుకు తమరు శిక్షించారు ?
– మోది పాలనలోనే బీఫ్‌ ఎగుమతులు వృద్ధి.
– కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి
– మరి ప్రతిపక్ష పార్టీగా మీరేం చేస్తున్నారో..!?
– వాళ్ల ప్రాజెక్ట్‌లన్నీ టెస్ట్‌మ్యాచ్‌లే. పూర్తవుతాయో, ఫలితం ఉంటుందో లేదో కూడా తెలియదు.
– మంత్రి హరీశ్‌రావు
– మీవన్నీ ఒలింపిక్‌ గేమ్‌లే..!?
– దమ్ముంటే అవిశ్వాసం ఎదుర్కోండి.
– సిపిఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి
– అంతకన్నా ఎక్కువగా దమ్మున్న, దగ్గున్న ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయిగా.
– రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు. కెసిఆర్‌కు సిఎంగా కొనసాగే అర్హత లేదు. ఎన్నికల్లో కాంగ్రెసు ప్రభంజనం ఖాయం.
– టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
– ఉత్తమ వాక్యం. కానీ ఎదుర్కోవడమే ఉత్తమంగా లేదు.
– నరేంద్రమోది తోబుట్టువులతో అంత సన్నిహితంగా మెలగరు. అనుబంధాల పట్ల మోది వైఖరి చిన్ననాటి నుంచీ ఇదే.
– ఆంధ్రజ్యోతిలో విశ్లేషకుడు నరసింహారావు
– అంటే ఇంట్లో ఉన్నవాళ్లందరికీ పదవులు కట్టబెట్టడం, కులం వాళ్లందరినీ దేశం నిండా నింపడం, తన కులం వాళ్లయితే చాలు వాళ్ల రక్షణకు మాన ప్రాణాలు వదలడం – ఇవేనా మీరుకోరుకునే విలువలు ?!

**************************************************************************************
– డా|| పి.భాస్కరయోగి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి