– మేం వస్తే జిఎస్‌టిని సంస్కరిస్తాం. ప్రమాదంలో విదేశాంగ విధానం. కశ్మీర్‌లో అవకాశవాద కూటమి. సంఘ్‌ గుప్పిట్లో కేంద్రం.

– కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్‌ గాంధి
– ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుదాం అనుకుందట !
– పాక్‌లోనే నాకు ఎక్కువ షేరు లభిస్తోంది. భారత్‌లో అంతా విద్వేషమే. ఇక్కడ చాలా మంది నాకు స్వాగతం పలుకుతున్నారు. వారెవరో నాకు తెలియకున్నా వచ్చి కౌగిలించుకుంటున్నారు. ద్వైపాక్షిక కీలక అంశాల పరిష్కారానికి చర్చలే మార్గం. పాక్‌ అంగీకరించినా, భారత్‌ అంగీకరించడం లేదు.
– బహిష్కృత కాంగ్రెసు నేత మణిశంకర్‌ అయ్యర్‌
– మరీ ఇంత నోటి దురద మంచిది కాదు అయ్యర్‌..!
– సిపిఎం రాజకీయ ఎత్తుగడలు గందరగోళంగా ఉన్నాయి. కాంగ్రెసుతో పొత్తు లేకుండా బిజెపిని ఓడించడం ఆ పార్టీ వల్ల కాదు. అతిపెద్ద పార్టీ కాంగ్రెసుతో జట్టు కట్టకుండా బిజెపి వ్యతిరేక ఓట్లలో చీలికను ఎలా నివారించగలం?
– సిపిఐ నేత డి.రాజా
– ఎమర్జెన్సీలో కూడా మీరు కాంగ్రెసును వదల్లేదు. ఇప్పుడు మాత్రం దూరంగా ఉండగలరా రాజా !
– మోది ముందు కెసిఆర్‌ పిల్లి
– కాంగ్రెసు నేత షబ్బీర్‌ ఆలీ
– గతంలో సోనియాగాంధీతో మీ పార్టీ నాయకులకున్న అనుభవం కొద్దీ చెప్పుకొచ్చారా !
– సైనికుల్లో భారత ముస్లింలు ఎందరు చనిపోయారో ఓవైసీ లెక్క చెబుతారు. అలాగే జవాన్లపై దాడులు చేసి చంపేస్తున్న ఉగ్రవాద సంస్థల్లో ముస్లిం సంఖ్య ఎంతో కూడా ఆయన చెబుతారా!
– భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి
– ఇంత ఘాటుగా, హాటుగా అడగగలిగేది మీరే !
– సోనియా కరుణించకుంటే 50 ఏళ్లైనా తెలంగాణ వచ్చేది కాదు. ఆంధ్రా కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే భగీరథ.
– కాంగ్రెసు నేత జానారెడ్డి
– ‘ఎవడేలుతున్నడురో తెలంగాణ – ఎవని పాలయ్యిందిరో తెలంగాణ’ అన్న పాట ఎత్తుకోండి ప్లీజ్‌ !
– ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదికి ఎవరైనా ఐ లవ్‌ యు చెప్పారా? నాకు అయితే అనుమానమే. ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నా. ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు నటి ప్రియా ప్రకాశ్‌ వీడియో చెంపపెట్టు.
– జిగ్నేష్‌ మేవాని, గుజరాత్‌ ఎమ్మెల్యే
– మోది ఏమైనా మీ ఫ్రెండ్‌ హార్దిక్‌ పటేల్‌ అనుకొన్నావా!?
– వివిధ పార్టీలతో పొత్తుల వల్లే రెండున్నర దశాబ్దాలుగా నష్టపోవడం.
– సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం
– అందుకే మిమ్మల్ని తోక పార్టీలంటుంటారు! పొత్తు లేకుండా మీరు బతకడం కష్టం.
– ఇక సినిమాలు చేయను
– నటడు కమల్‌ హసన్‌
– రాజకీయాల్లో నటన బాగానే చేస్తున్నారు కదా! నటన కూడా అదిరిపోతోంది.
– చనిపోయిన ఏడుగురు జవాన్లలో ఐదుగురు ముస్లింలే. అయినా మమ్మల్ని అవమానిస్తున్నారు.
– అసదుద్దీన్‌ ఒవైసి
– ఇదే ‘మతోన్మాదం’ అంటే. అలాగే లెక్కలు తీస్తూ వెనక్కి వెళ్లండి.

****************************************************
– డా|| పి.భాస్కరయోగి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి