ఇజ్రాయిల్ స్వతంత్ర దేశంగా ఏర్పడ్డాక అక్కడి ప్రజాప్రతినిధుల మొదటి సభ ఓ ఆశ్చర్యకరమైన వ్యాఖ్య చేసింది. ‘్భరత్‌కు ధన్యవాదాలు.. ప్రపంచంలోని అన్ని వర్గాలచే అత్యాచారానికి గురైన మా జాతి, ఒక్క భారత్ నుండే అలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు..’ అన్న ఆ మాటను ఒక్కసారి- భారత్‌ను, హిందుత్వను ధ్వంసం చేయాలనుకొనే శక్తులు గుర్తుతెచ్చుకోవాలి. భారత్‌ను విచ్ఛిన్నం చేయాలనుకొనే శక్తులు బయటి దేశాల్లో శాంతికాముక సంస్థల్లా ముసుగేసుకుని, ఇక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. భారత్‌లో సంక్లిష్ట రాజకీయాల కారణంగా విదేశీ శక్తులు ఇక్కడి మీడియాను, మేధోగణాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకొని ఆడిస్తున్నాయి. విదేశాల్లో మత తీవ్రవాద శక్తులు మానవ హక్కుల ముసుగేసుకొని ఇక్కడ కొందరిని తమ ఏజెంట్లుగా పెట్టుకొని రోజూ విషం కక్కుతున్నాయి.
అమెరికా జాతీయ సంస్థ డైరెక్టర్ డాన్‌కోట్స్ ఓ నివేదికను సెనేట్ సెలక్ట్ కమిటీకి పంపారు. ‘్భరత్‌లో రానున్న ఎన్నికల్లో మత ఘర్షణల ప్రమాదం పొంచి ఉందని, హిందుత్వ ఎజెండాతో భాజపా ఎన్నికలకు వెళ్తే మత కల్లోలాలు జరిగి, అక్కడి ముస్లింలను వేదనకు గురిచేస్తాయి..’ అంటూ ఆ నివేదికలో ఉన్న అంశాలు పత్రికల ద్వారా బహిర్గతమయ్యాయి.
డాన్‌కోట్స్‌తోపాటు సీఐఏ, ఎఫ్‌బిఐ డైరెక్టర్లు కూడా ఇలాంటి నివేదికలనే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదంతా ప్రపంచ వ్యాప్తంగా హిందుత్వను అపఖ్యాతిపాలు చేసే సంస్థల కార్యాచరణలో భాగమే.
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సంస్థలు, వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా భారతీయతపై అదేపనిగా ఇలాంటి నివేదికలు వెల్లడించారు. పుస్తకాలు ప్రచురించడం, సెమినార్లు పెట్టడం, మీడియాలో గోల చేయడం ఒక వ్యూహాత్మక పద్ధతిలో చేస్తున్నారు. నిజానికి అమెరికా లాంటి దేశంలోనే ఇలాంటి జాతి వివక్ష, రాజకీయ వివక్షలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే అమెరికా ఎన్నికల్లో పోటీపడతానని చెప్తున్న హిందూ అమెరికన్ తులసీ గచ్చార్డ్ ఇటీవల కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆమె రిపబ్లిక్ పార్టీ ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని అనగానే ఆమెపై ‘హిందూ నేషనలిస్ట్’ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. గతంలో ఆమె నరేంద్ర మోదీని కలిసినందువల్ల ఆమె ‘హిందూ నేషనలిస్ట్’ అంటూ ప్రపంచ వ్యాప్త లిబరల్, కుహనా మేధావులు, ఎలాంజలిస్ట్‌లు, మీడియా సంస్థలు దుష్ప్రచారం మొదలుపెట్టాయి.
డొనాల్డ్ ట్రంప్ మోదీపై ప్రశంసలు కురిపించగానే అతనిపై అనేక ఆరోపణలు మొదలుపెట్టారు. నిజానికి తులసీ గచ్చార్డ్ మాత్రమే మోదీని కలుసుకున్న వాళ్ల లిస్టులో లేదు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్ వంటి వాళ్లెందరో మోదీని కలుసుకున్నారు. ఒక హిందూ మహిళ అమెరికా అధ్యక్ష పదవికి పో టీలో ఉండడం ‘వాటికన్’కు నచ్చదు. అదే భారత్‌లో ఇటలీ మూలాలున్న మహి ళ అతి ప్రాచీనమైన రాజకీయ పార్టీని తన చెప్పుచేతల్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు ఆడించవచ్చు! ఇది భారత ప్రజాస్వామ్యం గొప్పతనమో, బలహీనతనో తేల్చుకోలేని దుస్థితి భారతీయులది.
నిజానికి భారత్‌లో హిందువుల సహజమైన ఆదరణీయ మనస్తత్వమే ఇక్కడ భిన్న సంస్కృతుల విస్తృతికి కారణం. అది ఒకరకంగా హిందువుల బలం, బలహీనత! ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత ‘స్వాగత హృదయం’ ఉన్న జాతి మనకు కన్పించదని తారెఖ్ ఫతే లాంటి ఇస్లామిక్ రాజకీయ పరిశోధకుడే చెప్తున్నాడు. ‘దాహిర్‌సేన్ అనే హిందూ రాజు మహమ్మద్ ప్రవక్త అసలైన వారసులకు ప్రాణరక్షణ కల్పించాడు. అలాంటి హిందూ రాజులను జీహాదీ మనస్తత్వం గల మహమ్మద్ బిన్ కాశీం లాంటి మతోన్మాదులు సంహరించారు. ప్రపంచంలోనే మక్కా మసీదు తర్వాత భారత్‌లోని మలబారు తీరంలో రెండవ మసీదు నిర్మించబడింది. అదీ ఓ హిందూ రాజు సహకారంతో సాధ్యమైంది’’ అంటారు తారేఖ్ ఫతే. అలాంటి హిందువులు ఈ దేశంలో వెయ్యేళ్ల పాటు ఇతర మతాల పాలనలో బానిసలుగా ఉన్నా తమ అస్తిత్వాన్ని ఆధ్యాత్మికత రూపంలో కాపాడుకొన్నారు.
ఈ దేశంలో ఛత్రపతి శివాజీ మహరాజ్, కాకతీయ సామ్రా జ్యం, విజయనగర సామ్రాజ్యం, దక్షిణ భారత హిందూ సామ్రాజ్యాలు, రాజపుత్రులు.. ప్రక్కనబెడితే అంతా ఇస్లామిక్ పాలనతోనే హిందువుల కాలం గడిచింది. సంఘర్షణల మధ్య హిందువులు జీవించారు.
స్వాతంత్య్రం రాకముందే దేశంలో మతపరమైన విభజన ఎందుకు మొదలైందో ఈ దేశ చరిత్రకారులుగా పోజులిచ్చే ఎవరూ సరిగ్గా వివరించరు! పోనీ లక్షలాదిమంది హిందువులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ విభజనను అడ్డుకునే ప్రయత్నం ఎందుకు విఫలమైందో ఏ రాజకీయ విశే్లషకుడు నోరు తెరచి మాట్లాడడు.
15 మే 1999న హురియత్ కాన్ఫరెన్స్ నేత మిర్వాయిజ్ ఒమర్ ఫరూక్ శ్రీనగర్‌లో మాట్లాడుతూ- ‘‘కాశ్మీరు భూలోక స్వర్గం. వే లాది విగ్రహాలను, ఆవును పూజించే అవిశ్వాసులు స్వర్గాన్ని స్వంతం చేసుకోలేరు. ఎలాగైనా సరే వారికి అక్కడ తావు లేకుండా చేయాలి’’ అని బహిరంగ ప్రకటన చేశాడు. అదే మనస్తత్వంతో ఇటీవల కె.ఏ.పాల్ అనే క్రైస్తవ రాజకీయ నాయకుడు ‘విగ్రహారాధకులకు మనం ఓట్లేయకూడదు’ అంటూ బహిరంగంగా చెబుతున్నాడు. ఇం త జరుగుతున్నా, వాళ్లలో ఇంత స్పష్టత ఉన్నా ఈ దే శంలో మెజారిటీ ప్రజలైన హిందువుల్లో ఒక్కరూ నో రుతెరచి మాట్లాడలేని దు స్థితి. దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌లోని హిందూ జనాభా ఈ రోజు ఎంత వుందో చెప్పగలరా? బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లలో హిందువుల జనాభా తగ్గిపోయిందని ఒక్క అంతర్జాతీయ సంస్థ అయినా ఏనాడూ విచారం వ్యక్తం చేయలేదు.
నిజానికి మైనారిటీలంటే జనాభాలో 10శాతం కన్నా తక్కువ వుంటేనే అలా పిలవాలని ఐక్యరాజ్యసమితి ఛార్ట్‌ర్ చెప్తున్నది. కశ్మీర్‌లో హిందువులు మైనారిటీలా? మెజార్టీలా? అంటే ఒక్క కుహనా మేధావి కూడా వ్యా ఖ్యానం చేయడు. ఈశాన్య రాష్ట్రాల్లో, కేరళలో ఎవరు మైనారిటీలు? పంజాబ్‌లో ఎవరు మైనారిటీలు? మొత్తం భారతదేశంలో ఐక్యరాజ్యసమితి ఛార్టర్ ప్రకారం ఎవరు మైనారిటీలు? ఇదంతా రాజకీయ కుయుక్తే గానీ వేరొకటి కాదు. రోజూ మానవ హక్కుల గురించి టీవీ చానళ్లలో గొంతు చించుకునేవారు, పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసేవారు మావోయిస్టు సానుభూతిపరులుగా ఎందుకు మారిపోయారు? మాలేగావ్ పేలుళ్లలో అక్రమంగా అరెస్టు చేయబడి తొమ్మిదేళ్ల తన విలువైన జీవితాన్ని రాజకీయ కుట్రకోసం బలిపెట్టుకున్న సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గురించి వీళ్లు ఎవరైనా మాట్లాడారా? స్ర్తి అని కూడా చూడకుండా, సన్యాసిని అని కూడా చూడకుండా ఆమెను ‘హిందూ ఉగ్రవాది’ అని ముద్ర వేసేందుకు ఒక ప్రభుత్వమే ఎందుకు ప్రయత్నం చేసిందో నిజానిజాలు ఎవరైనా చెప్పగలరా? ‘హిందూ ఉగ్రవాదం’ అన్న పద ప్రయోగం చేసి, దానిని సాకారం చేసేందుకు యూపిఏ మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్, మణిశంకర్ అయ్యర్.. లాంటి నాయకులు సాధ్విని బలిపశువును చేయడం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ ఆమె విడుదలై బహిరంగంగా చెప్పుకొన్నది.
ఇంకా విశేషమేమిటంటే, సన్యాసి వేషం ధరించి దేశ విచ్ఛిన్నకర శక్తులతో కలిసి పనిచేసే స్వామి అగ్నివేశ్ లాంటి వ్యక్తి ఆమెను జైల్లో కలిసి ‘నాకు చిదంబరం బాగా పరిచయం. నీవు కొన్ని సంస్థల పేర్లు, వ్యక్తుల పేర్లు చెప్తే నిన్ను బయటకు తెప్పిస్తా’ అని సాధ్వి ప్రజ్ఞకు చెప్పడం ఈ దేశ రాజకీయాలపై, లౌకికవాదంపై వున్న గౌరవం పోయేట్లు చేయడం కాదా? మానవ హక్కుల పేరుతో పోరాడిన ఇరోమ్ షర్మిలను అంతర్జాతీయంగా గొప్పదానిని చేసిన ఈ దేశ మీడియాకు తొమ్మిదేళ్ల జైలు జీవితంలో చక్రాల కుర్చీలో తిరిగే దుస్థితికి చేరిన సాధ్విపై చిన్నచూపుఎందుకు? ఇవన్నీ బాబర్ కాలంలోనో, ఔరంగజేబ్ కాలంలోనో జరిగిన ఘటనలా? మన కళ్లముందు కదలాడిన కఠోర సత్యాలు.
ఈ దేశంలో హిందువులపై వివక్ష అంతా ఇంతా కాదు. ఎవరైనా ఈ దేశ అత్యున్నత పీఠంపై కూర్చోవచ్చు కానీ హిందుత్వ భావజాలం ఉండే వ్యక్తులు మాత్రం కూర్చోవద్దన్నది ఎలాంటి లౌకికవాదం? మతోన్మాద పార్టీలతో అంటకాగే వారు సైతం ఈ దేశంలో అన్ని పదవులకు అర్హులు. మరి హిందుత్వ రాజకీయం మాత్రం ప్రమాదమా? హిందువులకు మతోన్మాదం ఉంటుందనే అపప్రథను శాశ్వతం చేయడం లక్ష్యంగా ప్రపంచంలోని విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. దానిని ఓటు బ్యాంకుగా మార్చుకొనేందుకు ఇక్కడి రాజకీయ పార్టీలు, కొన్ని వైదేశిక మానసిక శక్తులు తీవ్రంగా ప్రయత్నం జరుపుతున్నాయి.
దేశంలో స్థానికంగా జరిగే చిన్న చిన్న ఘటనలను సైతం భూతద్దంలో చూపిస్తూ హిందుత్వను అపఖ్యాతిపాలు జేయడమే వీళ్ల అసలు ఎజెండా. కానీ గులాబీలను బట్టలో కట్టి దాచినంత మాత్రాన వాటి సుగంధాలు చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రభావితం చేయకుండా ఉంటాయా? గులాబీలపై పేడ చల్లినంత మాత్రాన దాని అంతర్గత సుగంధం చెడిపోతుందా? ఆ గులాబీలు తాత్కాలికంగా పేడ కంపులో కుళ్లిపోయినా దానిని తర్వాత ఎరువుగా మార్చుకొని కొత్త మొక్కలకు జీవనం ఇచ్చినట్లే హిందుత్వ ఎదుగుతుంది. అది చరిత్ర చెప్పిన సత్యం. దానిని విస్మరిస్తే మోదీలు, యోగీలు అనేక మంది పుట్టుకొస్తారు. ఇదే జాతీయవాద నవ జీవనం.
****************************
* డాక్టర్. పి. భాస్కర యోగి *
* ఆంధ్రభూమి : భాస్కర వాణి *
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి