– కాంగ్రెస్‌వాళ్లు అసంబద్ధంగా మాట్లాడి అభాసు పాలవుతున్నారు.
– సిఎం కెసిఆర్
– అది వాళ్ల దురదృష్టం, మీ అదృష్టం.
– ముప్పై ఏళ్లు కాంగ్రెస్‌కు ఎంతో సేవ చేశాను.
– మాజీ మంత్రి దానం నాగేందర్
– టిడిపి నుండి కాంగ్రెస్‌లోకి, ఇప్పుడు టిఆర్‌ఎస్‌లోకి. ఇక మీ ఇంట్లో మీ తరాలకు ఢోకా లేదు.
– ఎన్నికల దాకా ఉత్తమే సారథి. ఆయన ఆధ్వర్యంలోనే పని చేయాలి. మీడియాకెక్కితే చర్యలే.
– టిఎస్ కాంగ్రెస్ ఇన్‌చార్జి కుంతియా
– ఎవరికి తోచింది వాళ్లు కక్కుతుంటే మీడియాకు ఎక్కొద్దంటున్నారేరటి !?
– ఒక్క చాన్స్ ఇవ్వండి. తెలంగాణ తలరాత మారుస్తాం. కుటుంబ పాలన అంతమొందిస్తాం.
– జనచైతన్య యాత్రలో డా||లక్ష్మణ్
– ప్రజలు సిద్ధమే. మీదే ఆలస్యం.
– ఫెడరల్ వ్యవస్థకు ప్రధాని మోదీ తూట్లు పొడుస్తున్నారు. కేరళ అంటే చిన్నచూపు.
– కేరళ సిఎం పినరాయ్ విజయన్
– మొన్న ఢిల్లీలో చంద్రబాబుతో కలిశారుగా! ఆ గాలి మీకూ సోకిందా !
– ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌కు జిహదీలు, మావోయిస్టులు అంటే సానుభూతి లేదు.
– కేంద్రమాజీ మంత్రి చిదంబరం
– సానుభూతి లేనప్పుడు అనుభూతులెందుకో ?!
– ప్రగతిభవన్‌లో బందీ అయిన తెలంగాణ.
– కాంగ్రెసు నేత పొన్నం ప్రభాకర్
– ఢిల్లీలో 10 జన్‌పథ్, ఇక్కడ ప్రగతి భవన్.
– టిజి వెంకటేశ్ పిచ్చోడు. ఆయనకు పిచ్చాసుపత్రిలో చేర్పించాలి.
– టిఆర్‌ఎస్ నేత కర్నె ప్రభాకర్
– అందుకేనా ! ‘తెలంగాణ ఆసుపత్రులు’ తెగముస్తాబు చేస్తున్నారు !?
– కాంగ్రెస్‌లో నాకూ అన్యాయమే జరిగింది. అయినా పార్టీని వీడానా?
– కాంగ్రెసు నేత విహెచ్
– మీకు ముఖ్యమంత్రో, ప్రధాన మంత్రో అవ్వాలని లేదా !
– ఉత్తమ్ సారథ్యంలో కాంగ్రెసుకు అధికారం రాదు.
– కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
– ఉత్తమ వ్యాఖ్యలే అధిష్ఠానాన్ని అలరిస్తాయి.
************************************************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట : విశ్లేషణ : జాగృతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి