– చైనా విషయంలో మోదీ వెనుకడుగు వేసారు.
– కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
– మీరు గతంలో చైనా వాల్ దూకి గెలిచారా ఏంటి ?
– లెఫ్ట్‌కు కాంగ్రెసు గుడ్‌బై – పశ్చిమ బెంగాల్‌లో పొత్తులేనట్లే.
– కాంగ్రెసు వర్గాలు
– అవకాశవాద పొత్తులు.. అనుమానాల కత్తులు..!
– ఇదేనా మీ సంస్కారం, రాంమాధవ్ క్షమాపణ చెప్పాలి.
– టిఆర్‌ఎస్ పార్టీ నేతలు శంకర్‌నాయక్, వినయభాస్కర్
– మీ తిట్ల దండకాలను రాస్తే పెద్ద పుస్తకమే అవుతుంది గద అన్నలూ.
– బీ రెడి. ఎన్నికలు ఎప్పుడైనా సిద్ధమే. శక్తియుక్తులను కూడదీసుకోండి.
– సిఎం కెసిఆర్
– కారులో ఎక్కిన నేతలంతా అవిశ్వాసాలూ, ఆందోళనలూ చేస్తూ బిజీగా ఉన్నారు సార్.
– ఆడవాళ్లు సిగరెట్లు తాగడం బాగుండదు.
– నటుడు కమల్‌హాసన్
– అయ్యో! మీరు లెఫ్ట్ లిబరల్ తరఫున మాట్లాడుతున్నారా?
– శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే స్వామి పరిపూర్ణానందకు నగర బహిష్కరణ.
– నగర పోలీసులు వర్గాలు
– ఆయన ఐఎస్‌ఐ తీవ్రవాది మరి !?
ం లైంగిక స్వేచ్ఛను కాదనలేం. స్వలింగ సంపర్కం నేరం కాదు.
– సుప్రీంకోర్టు
– మీరు అన్ని స్వేచ్ఛలు ప్రసాదిస్తూనే ఉండండి.
– ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నన్ను వేధిస్తోంది.
– మాజీ మంత్రి చిదంబరం
– ప్రెస్‌మీట్లు బాగానే పెడుతున్నారు కదా! ఆర్థిక నేరాలకు పాల్పడి ఎవరూ నన్ను అడగొద్దంటే ఎలా!
– కాంగ్రెసు వాళ్లు ఎన్నికలకు భయపడే కోర్టుకు వెళ్లారు.
– మంత్రి ఈటల రాజేందర్
– వారి సత్తా ఎన్నికలలో చూపిస్తారట గదా!
– కెసిఆర్ మూటాముల్లె సర్దుకోవాల్సిందే.
– కాంగ్రెసు నేత డికె అరుణ
– అవన్నీ వాళ్లకు మీరు చెప్పాలా !
– బిసిల చాంపియన్ టిఆర్‌ఎస్సే. కాంగ్రెస్ నేతలకు జ్ఞానం లేదు.
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
– ఆటగాళ్లు తగ్గితే మీలాంటి గజ ఈతగాళ్లు టిఆర్‌ఎస్‌లోకి ఈదడానికి సిద్ధంగా ఉన్నారు కదా !
– ప్రజా సంక్షేమం పట్టని సర్కారు. ఒయును ఓపెన్ జైలుగా మార్చారు.
– కాంగ్రెసు నేత మల్లు భట్టి విక్రమార్క
– ఒకరిది సంక్షేమం, మరొకరిది సంక్షోభం – తేల్చాల్సింది మీరే.
– ఓట్ల కోసం నాకు ఎన్‌డిఎ ప్రభుత్వం ఉరేస్తున్నది.
– ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా
– గురువింద సామెత చెప్పడం అంటే ఇదే.
*********************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట : విశ్లేషణ : జాగృతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి