ఫ్రపంచం ముందుకు దూసుకుపోతుందని మనం అంటుంటాం. కాని ఆ పరుగులో మనం ఎక్కడున్నా, ఈ దేశ అస్థిత్వం మాత్రం పలుచబడుతుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా సాంస్కృతిక, భాషాపరమైన అంశాల్లో మనం చాలా వెనుకబడ్డామనే చెప్పొచ్చు.

భారతదేశం దాదాపు వేయి సంవత్సరాలు బానిసత్వంలో మగ్గింది. మన సార్వభౌమత్వాన్ని సవాలుచేస్తూ, ఈ దేశ సంస్కృతిని, నాగరికతను, భాషను అణచివేసిన బ్రిటీషువారు మన దేశంనుండి వెళ్ళిపోయినా, వారి సాంస్కృతిక భాషా బానిసత్వం మాత్రం మనల్ని వెంటాడుతూనే వుంది.

భారతదేశం స్వాతంత్య్రం పొందినా పరభాషావ్యామోహం తగ్గకపోగా, రోజురోజుకు ఇంకా పెరిగిపోతోంది. మన దేశంలాగానే ప్రపంచంలోని ఆఫ్రికా, బర్మా, శ్రీలంక, బ్రెజిల్, చీలి, చైనాలాంటి అనేక దేశాలు చాలా ఏళ్లు బానిసత్వంలోనే మగ్గిపోయాయి. పై వాటిలో చాలా దేశాలు ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా దేశాలకు బానిస దేశాలుగా ఉన్నాయి. ఆ దేశాలన్ని స్వతంత్రం పొందాక భాష విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ తమ అస్థిత్వాన్ని చాటుకొన్నాయి. తమ మాతృభాషల్లో పాలన సాగిస్తూ విశేషమైన అభివృద్ధి సాధించాయి.

చైనా 1949లో స్వాతంత్య్రం పొందింది. సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇవాళ అమెరికాలాంటి దేశాలకే సవాల్ విసరగలిగే స్థాయికి చేరింది. దానికి కారణం తమ మాతృభాష అయిన ‘చీనీ’్భషను పాలన భాషగా మార్చుకోవడమే. ‘‘చైనా ఇప్పుడు కూడా ఆంగ్ల భాషలో మునిగితే, ఇప్పటివరకు ఇంత అభివృద్ధి సాధించేదికాదు’’అంటారు అక్కడి మేధావులు.

అలాగే జపాన్ ఒకప్పుడు అమెరికా పాలన క్రింద బానిస దేశంగా ఉండేది. కాని ‘జపనీష్’ను మాతృభాషగా చేసుకున్న తర్వాత సామాజిక, ఆర్థిక రంగాల్లో ఆకాశమంత ఎత్తుకుఎదిగింది. అమెరికా నియంత్రణలో నడుస్తుందని చెప్పుకునే ‘‘హాలీవూడ్’’ ఇవాళ జపాన్ సహకారంతో నడుస్తుందని చెప్పొచ్చు. హాలీవుడ్ సినీ పరిశ్రమలో జపాన్ పెట్టుబడులే ఉన్నాయన్నది నమ్మలేని నిజం. 

మోటారు, సినిమా, పెట్రోలియం వంటి రంగాల్లో జపాన్ పెట్టుబడులు, మానవ వనరులు అన్నీ ఎక్కువభాగం జపాన్‌వే. రెండవ ప్రపంచయుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అమెరికా ఆటంబాంబులు వేసి ఆ దేశ వెనె్నముకను విరిచింది. అయినా జపాన్ తమ దేశంలో మాతృభాష అయిన ‘జపనీష్’ను పాలనాభాషగా ప్రవేశపెట్టి చాలా ప్రగతి సాధించింది. వైజ్ఞానిక పరిశోధన, విశ్వవిద్యాలయం, పాఠశాల వంటి అన్ని విభాగాల్లో మాతృభాషను ప్రవేశపెట్టి జపాన్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. 

‘మాతృభాషనే మా సంకల్పశక్తికి కారణం’అంటారు ఆ దేశ మేధావులు. ఈ జపాన్, చైనా రెండు మన దేశానికి చాలాదగ్గరగా ఉన్నాయి. కాని మన దేశంనుండి దూరంగాఉన్న బ్రెజిల్ కూడా మాతృభాషలోనే పరిపాలనచేస్తూ అభివృద్ధిలో ముందుకుపోతోంది. ఈ దేశం అమెరికాకు భౌగోళికంగా చాలా దగ్గరగా ఉంది కాని అక్కడ అమెరికాకు చెందిన భాషలు గాని, ఆంగ్లం గాని నడవదు. ఈ దేశం చాలా సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నా మాతృభాషను పకడ్బందీగా అమలుచేస్తున్నది. అందువల్లనే అభివృద్ధిలో దూసుకుపోతోంది.

ఇదే విధంగా ఫిన్‌లాండ్, డెన్మార్క్, నార్వే వంటి 26 దేశాలు ప్రపంచంలో చాలా చిన్నవి. ఈ దేశాల్లో 15నుండి 30 కోట్లకన్నా ఎక్కువ జనాభా లేదు. వాటికి సైనికశక్తి, మానవ వనరులు తక్కువగాఉన్నా ఏ అగ్ర దేశానికి భయపడకుండా తమ మాతృభాషను అమలుచేస్తున్నాయి.

ఫిన్‌లాండ్ వంద సంవత్సరాలు బానిసగా ఉన్నది. ఆ దేశ మాతృభాష అయిన ఫిన్‌ష్‌ను ఇంజనీరింగ్, మెడికల్ రంగాల్లో కూడా ఉపయోగించుకుంటూ ముందుకుసాగుతుంది. విచిత్రం ఏమిటంటే ఫిన్‌లాండ్, బ్రిటన్‌కు దగ్గరగా ఉంది కాని ఇంగ్లీషు భాషకు దూరంగానే వున్నది. ‘‘నా భాష మాకు రక్షణగా ఉన్నన్ని రోజులు మా స్వాతంత్య్రాన్ని ఎవరు గుంజుకోలేరు’’ అంటారు ఈ దేశ ప్రజలు. కేవలం 22లక్షల జనాభాఉన్న డెన్మార్క్ తమ మాతృభాష ‘డెనిష్’ను తమ దేశంలో ప్రతి అవసరంలో, ప్రతి రంగంలో ఉపయోగిస్తుంది. ప్రపంచంలోనే అతి తక్కువ శబ్దాలుగల భాష మాది అని వాళ్లు గర్వంగా చెప్పుకొంటారు.

 అలాగే బానిసత్వం ఉన్న స్వీడన్ స్వాతంత్య్రం పొందినప్పటినుండి స్వీడిష్‌ను అమలుచేస్తున్నది. అదే విధంగా ఇంకా చిన్న దేశమైన నార్వే తమ మాతృభాష నార్వేజియన్‌ను కేజి నుండి పీజి వరకు అమలుచేస్తున్నది. ఈ దేశాలన్ని ప్రపంచ దేశాలముందు ఆర్థిక, భౌగోళిక, విషయాల్లో తక్కువస్థాయిలో ఉండవచ్చు కానీ భాష విషయంలో మాత్రం రాజీపడలేదు.

ప్రపంచంలోనే ఎక్కువ మానవ వనరులు కల్గిన దేశాల్లో భారత్ స్థానం గొప్పది. ఎక్కువ మంది వైద్యులు, ఇంజనీర్లు, రైతులు, కార్మికులు భారతదేశంలోనే ఉన్నారు. కాని మాతృభాషల పరిరక్షణలో భారతదేశం వెనుక బడింది. భారతదేశంలో సంస్కృతం పాలనాభాషగా ఉన్నన్ని రోజులు స్వర్ణయుగంగా, బంగారుపిట్టగా పిలవబడింది. ఈ దేశంలోని గొప్ప సాహిత్యంగల 25 భాషల్లో ఏ ఒక్కటీ ఈ దేశ రాజభాషగా, అధికార భాషగా స్థిరపడలేకపోయింది.

విద్య, జ్ఞానం, దార్శనిక శాస్త్రాల్లో భారతదేశం 17, 18 శతాబ్దాల వరకు అగ్ర భాగంలోనే ఉంది. ఎప్పటివరకు సంస్కృతం రాజభాషగా ఉందో అప్పటివరకు శిరసెత్తుకుని నిలబడింది. సంస్కృతం దేవభాష. దేవతలు జ్ఞాన స్వరూపులు. ఆ సంస్కృతం ఎలా పతనమయ్యిందో అలాగే భారతదేశం కూడా పతనంవైపు అడుగులు వేసిందనే చెప్పవచ్చు.


- ఇంకావుంది...


***************************************
✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ


వేమన రసవాధి అని చెప్పే పద్యాలు మచ్చుకు కొన్ని చూడొచ్చు.

* ఇహమున సుఖియింప హేమతారక విద్య
పరమున సుఖియింప బ్రహ్మవిద్య
కడమ విద్యలెల్ల కల్ల మూఢుల విద్య॥

* అంజనంబు కనుల కంటించి చూచిన
సొమ్ము దొరకు భువిని సూత్రముగను
నమ్మి గురుని కరుణ నభిమంటి చూడరా ॥

* ఉక్కుదిన్నవాడె ఉర్విపై సిద్ధుండు
యుక్కుదిన్నవాడె యుండు జగతి
నుక్కుసుధకు మిఱుగ నెక్కు కల్పంబు॥

* ఉక్కు భస్మం దీర్ఘాయుష్యునిగా చేస్తుందని భావం.

* ఉక్కు రసము జేర్చి యుదుటగ సింధూర
హరిదళము చేత హతము జేయ
గరసవాద మదియె ధరజేయ లేరది ॥

(శరీరంలో కొత్త రక్తాన్ని, పుష్టిని కల్గించేందుకు ఆయుర్వేదంలో ఉక్కు భస్మంతో చేసే మందుల విధానం ఉంది. ఆమవాదం, ఉబ్బుజాడ్యం, గ్రహణి, గుల్మము, ప్రమేహము, పాండువు మొ.న రోగాలను నయంచేసే మందు ఉక్క్భుస్మం కలపడం ఆయుర్వేదంలో ప్రసిద్ధం)

* ఉప్పు చింతపండులూరిలో నుండగా
కరవదేల వచ్చె కాపులారా
తాళకంబెరుగరో? తగరంబ నెఱుగరో ॥

రాగిని బంగారం చేయాలని రసవాదులు పడే తాపత్రయాన్ని చెప్తూ-

* కనకంబు సేయను కలియుగంబున జనులు
పచ్చనాకులు దెచ్చి పసరు పిండి
రాగిదుడ్డుకు సవిరి రవళించి చూతురు ॥

* విశ్వబ్రాహ్మణుల రసవాదాన్ని ప్రశంసించాడు

కల్లలాడుదురిల కంసాలి దొంగని
యతని సొమ్ముకెట్టులతడు దొంగ
మన్ను బంగరును మఱిచేసి పెట్టడా ॥

* పరస మినుముసోక బంగారమైనట్లు
కప్పురంబు జ్యోతి గలిసినట్లు
పుష్పమందు తావి పొసగినట్లు ముక్తి ॥

రస విద్యద్వారా బంగారం తయారుచేయవచ్చా?

స్వర్ణవిద్య, హేమతారక విద్య, స్వర్ణం తయారీ- అనే పేర్లుగల ఈ విద్య ఋషులకు మాత్రమే తెలుసు. ఇది రసవిద్యలో భాగంగా ప్రచారం అయింది. ఇప్పటికే రహస్యమైన ఋషులవద్ద ఈ విద్య ఉంది. అలాంటి స్వర్ణ రసవిద్య సాధ్యమా? అని ఆలోచిస్తే-

* శాస్త్రాల్లో వస్తువును మార్చే ‘జాత్యంతర పరిణామం’అనే విద్య ఉన్నది. దానే్న బయాలజీలో ట్రాన్స్‌ముటేషన్ అంటారు.

* మనకు దాదాపు 109కి పైగా మూలకాలున్నాయి. వాటిలో ఒక్కో మూలకానికి ఒక్కో పరమాణు సంఖ్య ఉంది. ఆ మూలకాల్లో కొన్ని అస్థిర మూలకాలు ఉన్నవి. అవిపోగా మిగిలిన వాటిలో ఉదా॥ 90 స్థిరమైనవి అనుకుందా. ఈ 90వ మూలకాలకి ఒక నిర్దిష్టమైన ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ సంఖ్య ఉందనుకుందాం. ఈ మూలకాలన్ని వాటికున్న నిర్ధిష్ట పరమాణు సంఖ్యవల్లనే ప్రత్యేక ధర్మాలు కల్గిఉన్నాయని విజ్ఞానశాస్త్రం చెబుతుంది. అలాంటప్పుడు ఈ 90 పరమాణు సంఖ్యగల మూలకాల్లో ఒక సంఖ్యను తొలగిస్తే 89వ మూలక ధర్మాలు ఈ పదార్థానికి వస్తాయికదా! అంటే ఒక మూలకము పరమాణు సంఖ్యను ఏ పదార్థంలో తేలగలిగితే అది బంగారం కావడానికి అవకాశం ఉంది. అదే దృష్టితో ఇవాళ శాస్తవ్రేత్తలు ఈ విషయాన్ని ఆలోచిస్తున్నారు.

సూర్య విద్య:

అలాగే సూర్య సిద్ధాంతం ప్రకారం దాదాపు 150కి పైగా ఉన్న సూర్యకిరణాలను ఒక క్రమపద్ధతిలో పంపి ఒక పదార్థాన్ని ఇంకో పదార్థంగా మార్చే విద్య ‘సూర్యవిద్య’. ఈ సూర్యవిద్యలో రావణుడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు నిష్ణాతులు. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగాడు విశ్వామిత్రుడు. ‘సూర్యునినుండి విడివడ్డదే భూమి’అనే థయరీ మనం చెబుతున్నాం. 
సూర్యతత్వాన్ని ఆపోసన పట్టినవాడు అగస్త్యుడు.
డళ్ఘూష్ద జశ ఒళషూళఆ నిశజూజ్ఘ’ఱక -్ఘ ఱ్ఘూశఆ్యశ తన పరిశోధనలో భాగంగా కాశీలో ఒక మహాత్ముణ్ణి కలుసుకొన్నప్పుడు ఆయన బ్రంటన్‌కు ఎన్నో మహిమలు చూపాడు. ఇసుకను-వజ్రాలుగా మార్చడం, చనిపోయిన పిచ్చుకను బ్రతికించడం, తన జేబురుమాల్లో వారి దేశంలో అరుదుగా పూసే పుష్పపు వాసన గుబాళింపజేయడం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఈ పుస్తకం 20కి పైగా ముద్రణలు పొందింది. అంతవరకు ఈ జేబురుమాలు వాసన ఉన్నట్లు తెలియజేయడం జరిగింది.

* సైన్సు ప్రకారం ఇప్పటివరకు బంగారం తయారుచేయలేదు కాబట్టి ఇకముందు తయారుచేయలేం అనడం నిజం కాదు. ఎందుకంటే ‘సైన్సు ఏమి జడ పదార్థం కాదు అన్న విషయం మరవొద్దు’- న్యూటన్ సమయంలో ఒక సిద్ధాంతం ఉంటే, అది ఐన్‌స్టీన్ కాలంలో ఇంకో సిద్ధాంతంగా మారింది. ఇప్పుడు ఐన్‌స్టీన్‌ను కూడా దాటి పరుగెత్తుతోంది. కాబట్టి ఈ విషయంపై ఇంకా పరిశోధనలు కొనసాగించాల్సి ఉంది.

* మహాభారతంలో ‘అక్షయపాత్ర’ను ధర్మరాజు సూర్యోపాసన ద్వారానే పొందాడు.

* అలాగే శ్రీకృష్ణుడిక లభించిన ‘శమంతకమణి’ కూడా సూర్యవిద్యకు సంబంధించినదే.

* ఆధునికకాలంలో ప్రపంచం మొత్తం ప్రాచుర్యం పొందిన ‘ఒక యోగి ఆత్మకథ’ రచించిన పరమహంస అనుభవాల్లో వస్తువులను స్పృశించి మాయంచేసే ‘్ఫకీరు’ గురించిన సందర్భాన్ని చూడవచ్చు.

* పుస్తకరచయిత స్వామిరామ హిమాలయ యోగులూ ‘అక్షయ పాత్ర’ను పొందినట్లు తెలుస్తుంది. కాబట్టి వస్తువులను సృష్టించడం, బంగారం తయారుచేయడం వంటి విద్యలు ఈ దేశంలో చాలామంది చేసేవారు ఉన్నారు. వారిని గురించి పరిశోధించే వారే లేరు, ఈ పరిశోధనల మీద ఆసక్తి చూపించకపోవడంతో నష్టపోయేది మనమే.

- ఇంకావుంది...

********************************************************
✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ




ఒక ఊళ్లో ఓ మనిషి చనిపోయాడు. మృతుడి ఇంటివాళ్లను పలకరించడానికి ఓ వ్యక్తి వచ్చాడు. ‘అ య్యో! ఈయన ఎలా చనిపోయాడు’? అని ప్రశ్నించగా- ‘పాము కరిచింది’ అని ఇంటివాళ్లు చెప్పారు. వెంటనే ‘ఎక్కడ కరిచింది?’ అని ఆ వ్యక్తి అన్నాడు. ‘కన్నుకు పైభాగంలో’ అని ఇంటివాళ్లు సమాధానం ఇచ్చారు. ‘అరే..! కొంచెం అయితే కంట్లో కరిచేది కదా.. కనే్న పోయేది కదా?’ అన్నాడట. మనిషే చచ్చిపోతే కన్ను గురించి మాట్లాడటం తెలివితక్కువతనం కాదా?- ఈ పిట్టకథ దానం నాగేందర్ తెరాసలో చేరినపుడు సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నాయకుడు జైపాల్‌రెడ్డిని గురించి చమత్కారంగా చెప్పినది.

ఈ నాలుగేళ్లు మాట్లాడినదానికన్నా ఇటీవలి సభలో కేసీఆర్ చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడి కాంగ్రెస్ వాళ్లను ఆత్మరక్షణలో పడేసాడు. అభివృద్ధి విషయంలో సిద్ధిపేటను అగ్రస్థానంలో కేసీఆర్ నిలిపాడు. తాను ఎన్నడూ ఓటమి చెందలేదని చెబుతూ, ‘పూర్వపు మెదక్ జిల్లాలో పశ్చిమ భాగంలో బాగారెడ్డి, తూర్పు భాగంలో నేనూ నిరంతరం గెలుస్తూ వచ్చాం’ అన్నాడు. ఇలా మితిమీరిన వ్యూహంతో మాట్లాడి శత్రుపక్షాన్ని నిరుత్తరులను చేయడంలో కేసీఆర్ దిట్ట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాల్లో గెలవబోతున్నామని ఇంకో మాట చెప్పి రాజకీయ వర్గాల్లో క్రొత్త ఆలోచనను రేకెత్తించాడు. ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చినప్పటినుండి ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలకు తెరలేచింది. కాంగ్రెస్ వాళ్లు ఎక్కువ మాట్లాడితే ఎన్నికలకు వెళ్తానని కూడా కెసిఆర్ ప్రకటించడంతో రాష్ట్రంలో చర్చ మొదలైంది. జైపాల్‌రెడ్డిని టార్గెట్ చేసి ఆయన విమర్శనాస్త్రాలు సంధించాడు.

ఇటీవల కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలకు జైపాల్‌రెడ్డి కారణమని కెసిఆర్ భావించవచ్చు. ఇక్కడి కాంగ్రెస్ ఆనుపానులన్నీ కెసిఆర్‌కు బాగా తెలుసు. రేపుకాంగ్రెస్ యవనికపై ముఖ్యభూమిక పోషించే రేవంత్ రెడ్డి వెనుక జైపాల్ స్థైర్యం వుందని కూడా ఆయనకు తెలుసు. కెసిఆర్ ఎప్పుడూ బయటకు వచ్చి అనవసరంగా మాట్లాడడు. సభలు, సమావేశాలు జరిగినపుడు సరైన ‘పంచ్’లతో, సామెతలతో, అవతలివారి ఆలోచనలను తలదనే్న విధంగా ‘ప్రిపేర్’ అయి వస్తాడు. కెసిఆర్ మాటల్లో ఎంత సూటిదనం, సరళతరం వుంటుందో వ్యూహం కూడా అంతే వుంటుంది. ఇపుడున్న రాష్ట్ర ప్రభుత్వాధినేతల్లో కెసిఆర్ లాంటి వక్త, వ్యూహకర్త ఎవరూ లేకపోవచ్చు. అదే చంద్రబాబు మాట్లాడితే క్లాసులో పాఠం విన్నట్లుగా ‘డ్రై’గా వుంటుంది. అదీ ఎకనామిక్స్ క్లాసులో కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ బాబు మాట్లాడడం కూడా బోర్‌గా వుంటుంది. కెసిఆర్ తనకు కావలసిన వ్యక్తులకు సరైన స్థానం ఇచ్చి వారిని శత్రుపక్షంపై విరుచుకుపడేట్లు చేస్తాడు. ఏ వర్గం వారు తమపై దాడి చేస్తే అదే వర్గంపై ఎదురుదాడి చేయిస్తాడు. బహుశా.. వాళ్లకు ఇలా మాట్లాడమని ఆయననేమీ చెప్పకపోవచ్చు. 

ఉద్యమంలో పనిచేసినందున వాళ్లలో ఆ బలం నిర్మాణమై ఉండవచ్చు. ఇదంతా ఎందుకంటే- దాదాపు10 నెలలకు ముందే ఎన్నికలకు వెళ్లడానికి కెసిఆర్ ఇచ్చిన సంకేతాలను తెరాస పార్టీ శ్రేణులు అందుకొంటున్నాయని చె ప్పడానికే.
బీసీ జనాభా గణన సరిగ్గా లేదని హైకోర్టు పం చాయతీ ఎన్నికలను వాయి దా వేయడం ఊహించని పరిణామం కాదు. పంచాయతీ ఎన్నికల కన్నా ముందే సాధారణ ఎన్నికలు జరగాలని తెరాస కోరుకొంటోంది. ఎందుకంటే 2014కు కాస్త అటూ ఇటూగా గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు ఎక్కువ మంది తెరాసలో చేరి ఉన్నారు. కాంగ్రెస్, తెదేపా నుండి ఎందరో తెరాస ప్రభంజనంలో కలిసిపోయారు. మొదట పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల్లోని వ్యక్తులు తలా ఓ పార్టీలోకి చేరిపోతారు. గెలిచినా, ఓడినా వాళ్లు వర్గ శత్రువులుగా మారిపోయి ఒకరికొకరు వ్యతిరేకంగా పనిచేస్తారు. దాంతో అసెంబ్లీ ఎన్నికలకు ఇతర పార్టీలకు లేని కార్యకర్తలను, ఓటు బ్యాంకును మనమే అందించినవాళ్లం అవుతాం అని తెరాసాలోని క్రింది స్థాయి కార్యకర్తల్లో బలంగా అభిప్రాయం ఉంది. కానీ కెసిఆర్ ఎక్కువ ఆత్మవిశ్వాసంతోనే కన్పించారు. ఈలోపు కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు కాంగ్రెస్ పార్టీ బీసీ గణనపై కోర్టుకెక్కింది. ఇపుడు కెసిఆర్ వ్యూహానికి మార్గం మరింత సుగమమైంది. రాష్ట్రంలో లెఫ్ట్, రైట్ అన్నీ కెసిఆర్ నడిపిస్తున్నందువల్ల కమ్యూనిస్టులకు ఇక్కడ పనిలేకుండా పోయింది. తెలంగాణ భాజపా నేతలకు కెసిఆర్‌తో శత్రుత్వం కన్నా పరోక్ష ప్రేమనే ఉందని విశే్లషకుల అంచనా. తెరాస, భాజపాలకు- ‘కాంగ్రెస్‌ను కదలకుండా చేయడమే’ ముఖ్యమైన పని.

ఇక కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్నికల వేడిని పుట్టించే నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకున్నారు. రంజాన్ మాసంలో కాల్పుల విరమణ తర్వాత జరిగిన అనేక పరిణామాల పేరుతో కాశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి భాజపా మద్దతు ఉపసంహరించుకొంది. కర్ణాటకలో ‘తగుదునమ్మా..’ అని పీఠమెక్కేందుకు సిద్ధపడిన కుమారస్వామిని సీఎంగా చేసి, లోలోపల కుమిలిపోతూ బయటకు బ్రహ్మానందాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ కాశ్మీర్ విషయంలో అడుగు ముందుకు వేయలేకపోయింది. 

మోదీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలనూ ఏకం చేస్తామని దేశమంతా డప్పుకొట్టి చెబుతున్న కాంగ్రెస్ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపిలను కలిపి ఎందుకు ప్రభుత్వం ఏర్పాటుచేయించలేకపోయింది?! ఎన్నికల వేళ కాశ్మీర్‌పై మోదీ తీసుకొనే ప్రతి నిర్ణయం దేశ ప్రజలపై పడుతుందని మోదీకి తెలుసు. జింకను వేటాడే పులి మొదట రెండడుగులు వెనక్కి వేసినట్టు రంజాన్ మాసంలో కాల్పుల విరమణ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఫ్తీ దుర్నీతిని పసిగట్టింది. అందుకే భాజపా నేత రాం మాధవ్ చేత మద్దతు ఉపసంహరించుకొంటున్నామని చెప్పించి ప్రభుత్వం నుండి బయటకు వచ్చేసింది. నిజానికి భాజపాకు కాశ్మీర్ విషయంలో పెద్ద కమిట్‌మెంటే వుంది. ముఖ్యంగా 370 ఆర్టికల్ అక్కడి మతోన్మాద శక్తులకు ఊతంగా మారింది. మన సైన్యంపై రాళ్లు రువ్వుతూ వేర్పాటువాదులు, ఉగ్రవాదుల మద్దతుదారులు సహనానికి సవాల్ విసురుతున్నారు. భాజపా తాను పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ రద్దుచేస్తామని చెప్పింది. కాశ్మీర్ కోసమే నాటి జనసంఘ్ నాయకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ ప్రాణాలు వదలిపెట్టాడు. ఈ పోరాటంలో ఎందరో జాతీయవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ క్షుణ్ణంగా తెలిసిన మోదీ పాకిస్తాన్‌లో నవాజ్ షరీఫ్ ఇంటికి ఆకస్మిక అతిథిగా వెళ్లడం, పిడిపితో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరడం, హురియత్ నేతల దగ్గరకు చర్చలకు పంపడం వంటి సామరస్య పరిష్కారాలు చేశారు. శాంతి ప్రయత్నాలు చేయలేదని భవిష్యత్తులో ప్రతిపక్షాలు ఆరోపణలు చేయకుండా ఉండడానికే మోదీ ఇవన్నీ చేశారు. ఈ మధ్యలో సర్జికల్ స్ట్రైక్‌తో పాక్ సైన్యంపై భారత్‌దే పైచేయి అని చెప్పారు. దౌత్యపరంగా పాకిస్తాన్‌పై పెద్ద విజయమే సాధించారు.

నాలుగు రోజుల క్రితం లక్నోలో సాధుసంతులు నృత్యగోపాల్ దాస్ మహంత్ జయంతి ఉత్సవం జరిపి అందులో రామ మందిర నిర్మాణ ఉద్యమం గురించి మోదీ ప్రస్తావించారు. అతిథిగా వచ్చిన యోగి ఆదిత్యనాథ్ మనం రాజ్యాంగ సంస్థలను గౌరవించాలని చెప్పారు. నిజానికి మోదీ ప్రభుత్వం డా.సుబ్రహ్మణ్యస్వామి ద్వారా సుప్రీం కోర్టులో అయోధ్య కేసును ముందుకు తెచ్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నిజాయితీపరుడైన, నిఖార్సయిన వ్యక్తని అందరికీ తెలుసు. ఆయన ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ చేయబోతున్నాడు. కాబట్టి సుబ్రహ్మణ్యస్వామి అయోధ్య కేసును ఈయనతో పరిష్కరించాలని ఆశించారు. కానీ కాంగ్రెస్ ఇతర సూడో సెక్యులర్ పార్టీలు దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం పెడితే ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు అయోధ్య అంశం కూడా కీలకం కాబోతున్నది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు చర్చకు రాబోతున్నది. దానికి అనుబంధంగా ఉమ్మడి పౌర స్మృతిపై దేశమంతా పరోక్ష చర్చ జరగవచ్చు. ఇలా అనేక అంశాలు ఎన్నిక వేళ సందడి చేయనున్నాయి.

మరోవైపు ప్రతిపక్షాలన్నీ ఒకవైపు, భాజపా ఒక్కటే మరోవైపు కదనరంగంలోకి దూకనున్నాయి. బెంగాల్‌లో సిపిఎం-తృణమూల్, కేరళలో సిపిఎం- కాంగ్రెస్, ఏపిలో టిడిపి-కాంగ్రెస్, యూపిలో ఎస్పీ-బిఎస్పీ-కాంగ్రెస్ వంటి పార్టీల తీరుతెన్నులపై ఎన్నికల ఫలితాలుంటాయి. వీళ్లంతా విడిగా ఎన్నికల్లో కొట్లాడి మొన్న కర్ణాటకలో ఏకమైనట్లు ఏకమవుతారా? లేదా? అన్నది చూడాలి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీలో చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు. మోదీ విదేశీ విధానంలో దూసుకుపోతూ నిజాయితీ విషయంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ పెద్దనోట్ల రద్దు, పెట్రో ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అవగాహన కల్పించి ఏటిఎంలను సరిచేయాలి. లేదంటే ఎన్నికల వేళ బ్యాంక్ ఉద్యోగుల సంఘాల వాళ్లతో కలిపి కుట్ర జరిగే అవకాశం వుంది. ఎన్నికల కోడ్ వస్తే బ్యాంకర్లను నియంత్రించడం కేంద్రానికి కష్టంగా ఉంటుంది. జిఎస్టీ వల్ల పెరిగిన ఆదాయాన్ని పేదల కోసం ఎలా ఖర్చుపెడుతున్నారో వివరించాలి. హద్దులుమీరిన ఆర్థిక క్రమశిక్షణ పాటించి సామాన్యులకు ఇబ్బంది కల్గించవద్దు అనే సూత్రం తక్షణ కర్తవ్యంగా చేపట్టాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో భాజపా ఆత్మరక్షణలో పడకుండా వ్యూహం రచించాలి. టిడిపిని ఆత్మరక్షణలో పడేస్తేనే అక్కడి చీకటి మబ్బులు తొలగిపోతాయి.

ఇక ఏపీలో ఈసారి చంద్రబాబు గెలుపు నల్లేరుమీద నడకేం కాదు. మోదీని, భాజపాను ఏపి ప్రజల ముందు చంద్రబాబు విలన్‌గా నిలబెట్టడంలో ఈ మూడు నెలల్లో సక్సెస్ అయ్యాడు. పాదయాత్ర చేస్తున్న వై.ఎస్.జగన్ పట్ల జనంలో ఇమేజ్ పెరుగుతోంది. భాజపాలోని అదృశ్య శక్తులను ప్రక్కనబెట్టి, పనిచేసే వాళ్లకు స్వేచ్ఛ ఇస్తే చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తారు. ఇప్పటికీ భాజపాలోని ఒక వర్గం నిశ్శబ్ద వౌనం పాటిస్తూ చంద్రబాబు విషయంలో వినయం ప్రదర్శిస్తోంది. పెద్దనోట్ల రద్దు సలహా తానే ఇచ్చానని చెప్పిన బాబు ఇపుడు నోట్లరద్దు తప్పుడు నిర్ణయం అంటున్నాడు. ప్రత్యేక ప్యాకేజీని మించిన స్వర్గం లేదన్న వ్యక్తి మళ్లీ ఏపీకి ప్రత్యేక హోదా కావాలి అంటున్నాడు. ఈ ద్వంద్వ వైఖరి ప్రజలకు అర్థం కావాలి.

ఏపీలో చంద్రబాబు, భాజపా కలిసి ఉన్నంతవరకు కమ్యూనిస్టులు ఉద్యమాలు చేశారు. ఇపుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు గెలుపుకోసం శల్య సారథ్యం మొదలుపెట్టారు. ఏపీలో పనిలేని బి.వి.రాఘవులు, నారాయణ తెలంగాణలో కెసిఆర్‌ను రెచ్చగొడుతున్నారు. ఎంతసేపూ అమరావతి నిర్మాణం అనే బూచిని తలకు ఎత్తుకున్న చంద్రబాబు ఉత్తరాంధ్రను, రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారని జనం భావిస్తున్నారు. అందుకే ఇటీవల పవన్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తే స్పందన బాగా ఉందని తెలిసాకే టిడిపి అతనిపై ఎదురుదాడికి దిగింది. విశేషం ఏమిటంటే పవన్‌కళ్యాణ్, కోదండరాం- ఇద్దరూ తమ పార్టీలను కమ్యూనిస్టు ఛాయల్లో నడుపుతున్నారు. కాబట్టి వీరిద్దరూ భవిష్యత్తులో ‘కాగితం పులులే’! ఆ నీడలోంచి బయటకొస్తే తప్ప పార్టీగా ఎస్టాబ్లిష్ కాలేరు. జస్టిస్ పార్టీ ‘అవశేషాలు’గా ఉన్నవారు ఏపీ కమ్యూనిస్టు పార్టీల్లో పెత్తనం చేస్తున్నారు. వారికి చంద్రబాబు అధికారంలో ఉండడమే కావాలి! ఈ జస్టిస్ పార్టీ ‘అవశేషం’ భాజపాలోనూ గుప్తంగా పనిచేస్తుంది. ఇన్నాళ్లు భాజపా ఎదగకపోవడానికి అదే కారణం అని విశే్లషకుల అంచనా. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలు క్రొత్త ఆలోచనలతో వేడిని పుట్టిస్తాయి. దాని వెనుక ఉన్న పరమార్థాలను ప్రజలు గ్రహించకపోతే పాత సారాను కొత్త సీసాలో పోయడమే!


***********************************************

డాక్టర్. పి. భాస్కర యోగి 
Published  : Andhrabhoomi 




– హిందూ ఉగ్రవాదం గురించి నేనెప్పుడు మాట్లాడాను ? సంఘ్‌ పరివార్‌ ఉగ్రవాదానికి పాల్పడుతుందనే చెప్పాను.
– కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌
– మీ అధ్యక్షుని బాటలో నడుస్తున్నావా డిగ్గీరాజా ! రెండు రాష్ట్రాల ఇన్‌చార్జ్‌షిప్‌ ఊడగొట్టేసరికి పంథా మార్చావా ?
– దేవుడి దయతో మల్లన్న సాగర్‌పై తొలగిపోయిన స్టే. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్న కాంగ్రెస్‌.
– మంత్రి హరీశ్‌రావు
– వారు పీకేసిన ప్రతి ఈకను అందుకొని మీరు ‘నెమలి పింఛం’గా తయారు చేసుకుంటారు. ఇంకేంటి అన్నా !
– పాలనా వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం ఉండదు. సంకీర్ణ ధర్మానికి ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలుగనీయను.
– కర్ణాటక సిఎం కుమారస్వామి
– 108 సీట్లున్న భాజపా, 78 సీట్లున్న కాంగ్రెసు నోరు తెరిచి చూస్తుంటే 38 సీట్లున్న నీవు అధికార పీఠం ఎక్కావు. ఇంకేం తక్కువ! ‘రొట్టె వాడి కన్నా ముక్క వాడే గొప్ప’ అన్న సామెత నిజమైంది కదా !
– మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం. వచ్చే సంవత్సరం జూన్‌ నాటికి అధికారం మాదే.
– టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
– డెభ్బైఏళ్ళ నుండి ఒకటే పాట. అయినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే. గొంగళిది తప్పా! దానిని వేసిన వాడిది తప్పా!
– రంజాన్‌ సందర్భంగా కాల్పుల విరమణ నిర్ణయం ఘోర తప్పిదం.
– భాజపా ఎమ్మెల్యే సురేంద్రసింగ్‌
– శాంతిదూత నిర్ణయానికి తుపాకీ మోతల సందేశాలు !?
– 72 గంటల్లోపు నా కుమారుణ్ణి చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. లేదా నేనే ఆపని చేస్తా.
– ప్రభుత్వానికి వీరజవాన్‌ ఔరంగజేబు తండ్రి విజ్ఞప్తి
– మరో సర్జికల్‌ స్ట్రెక్‌ జరపాల్సిందే !
– ఉత్తర కర్ణాటక ప్రాంతానికి ప్రాధాన్యం దక్కడం లేదు. సిఎం సహా అన్ని కీలక పదవులు దక్షిణ కర్ణాట వారే స్వంతం చేసుకుంటున్నారు.
– కాంగ్రెసు సీనియర్‌ నేత యం.బి.పాటిల్‌
– ‘సిద్ధరామయ్య విభజన వాదం’ ఇప్పుడు తెలిసొచ్చిందా!
– చాముండేశ్వరి నియోజకవర్గ ప్రజలు నన్ను మోసం చేసారు. అక్కడి ఓటమి నన్ను బాధించింది.
– మాజీ సిఎం సిద్ధరామయ్య
– అబ్బ ఛా.. !
– అధికారం కోసం బిజెపి గవర్నర్‌ను వాడుకొంటోంది.
– టిడిపి నేతలు
– మొన్నటివరకు గవర్నర్‌ మీకు పితృ సమానుడు. మీరు బిజెపితో విడిపోగానే ఆయన బిజెపి ఏజెంట్‌ అయ్యాడా ?! ఏం సెప్పారండీ !?
– ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును మేము అడ్డుకొన్నాం. ముస్లింలకు రక్షణగా మేం ఉంటాం. కేంద్రంపై యుద్ధం చేస్తాం.
– ఎపి సిఎం చంద్రబాబు
– ఓట్లకోసం ఇంతగా కూడా దిగజారతారా!

************************************************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట  విశ్లేషణ : జాగృతి




‘అత్త పగుల గొడితే పాతకుండ ! కోడలు పగులగొడితే కొత్తకుండ !’ అన్న సామెత తెలుగునాట ఓ పచ్చ పత్రికకు అక్షరాలా వర్తిస్తుంది. తమకు నచ్చపోతే ఎవరు చేసిన తప్పునైనా గిట్టనివారి ఖాతాలో వేసి మొట్టికాయలు వేయడం ఆ పత్రికకు గత మూడు నెలల నుండి పరిపాటి అయ్యింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఓ తెలుగు ప్రముఖ దినపత్రిక ‘స్వామీ! అంత రహస్యమేమి?’ అన్న శీర్షికతో ఓ ఆశ్రమాన్ని బజారుకీడ్చింది. ఈ స్వామి ఉత్తరాది నుండి వచ్చి తిరుపతిలో ఆశ్రమం పెట్టడమే మహానేరం అయ్యింది.
ఈ మధ్య ఉత్తరాది వాళ్లను, గుజరాత్‌ వాళ్లను అన్ని విషయాల్లో నేరస్తులుగా చూపిస్తున్న తెలుగు మీడియా ఆఖరుకు స్వాములను, ఆశ్రమాలను కూడా వదిలిపెట్టలేదు.
సదరు స్వామిని భాజపా అధ్యక్షుడు కలవడం అత్యంత రహస్యంగా జరిగిందంటూ చేసిన దర్యాప్తులో కూడా వారిని విలన్లుగా చిత్రీకరించడమే పనిగా పెట్టుకుంది. అయినా స్వాములను కలిసేవాళ్లు రహస్యంగా కాకుండా డప్పువేసి వెళ్తారా ? స్వాములు సాధన చేసుకొనే స్థలంలో కాకుండా బస్టాండుల్లో తిరుగుతారా ?
ప్రతిదాన్ని సిబిఐ దర్యాప్తు చేసినట్లు చేస్తూ, రహస్యం అంటూ లేని అనుమానాలకు కలిగించడమే ఈ దుర్వార్తలోని దురుద్దేశం. ఈ పచ్చకళ్ళు తిరుపతి పోటులో తవ్వకాలప్పుడు, శ్రీవారి ఆభరణాల మాయమప్పుడు మూసుకుపోయాయా!

************************************************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట  విశ్లేషణ : జాగృతి





– మోదీ హత్యకు కుట్ర. రాజీవ్‌గాంధీ హత్య తరహా ప్లాన్‌ లేఖలో వరవరరావు పేరు.
– ఇంటెలిజెన్స్‌ వర్గాలు
– ఆర్‌టిసి ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్తే కఠిన చర్యలు. త్వరలోనే ప్రక్షాళనకు కార్యాచరణ
– సిఎం కెసిఆర్‌
– సీతయ్య ఎవరి మాటా వినడు.
– చూస్తే జబ్బకు సంచి వేస్తారు. వీళ్ళకు పట్టిన ‘ఎర్రజబ్బు’ ఇపుడు ఎవరు వదిలిస్తారో ఏమో.
– చూడండి. నేనేదైతే భయపడి మా నాన్నను హెచ్చరించానో సరిగ్గా అదే జరిగింది.
– ప్రణబ్‌ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ
– మరీ అంత కాంగ్రెస్‌ భక్తి పనికి రాదు. దేశద్రోహులకు సేవ చేస్తామని వెళ్ళిన మీ పార్టీ నేతలను ఓసారి మనసులో తలచుకోండి!
– మాకు గౌరవ ప్రదమైన సీట్లిస్తేనే పొత్తు
– సిపిఎం నేత సీతారాం ఏచూరి
– ఇపుడు అంత అగౌరవంగా చూస్తున్నారా ఏంటి ?
– అరె బబూవా (పిల్లోడా!) సోదరా ! 70 ఏళ్ళలో మీరు చేసిందేమిటి? మీ మూడుతరాలు డెబ్భై ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అప్పుడే వారు అన్ని పనులు చేసి ఉంటే ఇపుడు మాకు మంచి పనులు చేసే అవకాశం ఉండేదా!
– భాజపా అధ్యక్షుడు అమిత్‌షా
– పిల్లోడని పిలిచి మరీ అంత ఘాటుగా విమర్శించి ఏడ్పిస్తారా అమిత్‌షాజీ!
– తెరాస, భాజపాల మధ్య రహస్య ఒప్పందం. మజ్లిస్‌కు, తెరాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లే.
– ఇఫ్తార్‌ విందులో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
– తెరాస మీతో రహస్య ఒప్పందం చేసుకొంటే బాగుండదుగా.
– నాలుగేళ్ళలో 4 వేలమంది రైతులు చనిపోతే కెసిఆర్‌ పరామర్శించాడా!
– కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, పొన్నాల ప్రభాకర్‌
– అందుకే కదా రైతు బంధు పథకం !
– కేంద్రం మాపై కక్ష గట్టింది. తిరుమలపై రాజకీయాలు చేస్తున్నారు. మోదీ మాకు ద్రోహం చేశారు.
– ఎపి సిఎం చంద్రబాబు
– కేంద్రాన్ని ఆడిపోసుకోవటం తప్ప మీ వద్ద వేరే మాటలేవీ లేనట్లుంది !
– అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో ఋణమాఫీ
– కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
– అరవై ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారో.. మరి !
– మోదీ ప్రధానమంత్రి అయ్యాక దేశంలో ముస్లింలు, ఇతర మైనార్టీ వర్గాలకు రక్షణ లేదు. భాజపా పాలనలో అభివృద్ధి లేదు.
– కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డి
– ఇన్నాళ్ళూ మీరు చక్కని ఆంగ్లంలో మాట్లాడ్డం తప్ప సొంత జిల్లాకైనా ఏమైనా చేశారా!

************************************************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట  విశ్లేషణ : జాగృతి







అరభ్బీలోని ‘ఆల్’ (పవిత్రమైన) చేర్చబడి- అల్కెమీ- ధాతువాదం రసవాదంగా రూపొందింది. అంటే ఇది పవిత్ర రహస్య శాస్త్రం అని భావించారు.

- ఆచార్య నాగార్జునుడి తర్వాత ఈ శాస్త్రానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది.

- న్యూటన్ పరిశోధనలపై ఆధారాలతో కూడిన పరిశోధన చేసి- ఆయన కూడా ‘ఆల్కెమిస్టు’గా మారాడాని తెలిపారు.

- సీసాన్ని బంగారంగా మార్చే విద్యపై పరిశోధనలు చేస్తున్న రాబర్ట్ బోయిల్‌తో కలిసి రహస్య ప్రయోగాలలో గంటల తరబడి ప్రయోగాలు చేశాడని తెలిపారు. రాబర్ట్ ఆకస్మిక మరణంతో ఆ పరిశోధనకు ఫుల్‌స్టాప్ పడింది.

- న్యూటన్ 20 ఏళ్ళ పరిశోధన పెంపుడు కుక్క కొవ్వొత్తిని తన్నడంతో బుగ్గిపాలైంది.

- న్యూటన్ రసవాదంపై చేసిన రచనల్లోని అంశాలు (డాక్యుమెంట్స్) ఇప్పటికీ డీకోడ్ చేయలేకపోతున్నారు.

- 2003 ప్రథమార్థంలో బ్రిటన్‌లోని స్ట్థాస్లైడ్ యూనివర్సిటీ పరిశోధకుడు కెన్‌లెండింగ్‌హామ్ జరిపిన ఒక ప్రయోగంలో బంగారం పాదరసంగా రూపుదాల్చింది అని పత్రికలు పేర్కొన్నాయి.

రసవాదం రహస్యంగా ఉంచడమెందుకు?

శ్లో అతఃపరం ప్రవక్ష్యామి తంత్రాణాం హేమకారకం
యోగోయం గోపనీయంచ సద్యస్సిద్ధిప్రదం శుభం
జితేంద్రియస్సత్యవాదీ దైశభక్తి పరాయణ
యోగ్యతాసిద్ధి మాప్నోతి గృహస్థ స్యన కదాచన

పరమశివుడు: ఈ శుభప్రదమైన హేమవిద్య నేర్పించెదను వినుము. ఇది చాలా రహస్యమైనది. మర్మాలను గ్రహించి ఆచరిస్తే- కేవలం ఓషధుల ప్రభావంతో సిద్ధిస్తుంది. దీన్ని జితేంద్రియులు, యోగపుంగవులు, సత్యవ్రతం కలవాళ్లు, దైవభక్తి గలవాళ్ళకే తెలపాలి. గృహస్థులైనవాళ్లు కూడా ఆచరించకూడదు (దత్తత్రేయ తంత్ర విద్య)

- రసవిద్య అవ్యాప్తికి ఋషులు నైతిక రేఖ గీసుకున్నారు.

- ఇంద్రియాతీతమైన, మానవసాధ్యాతీతమైన విద్యలు బహిరంగపరచడం సాధ్యం కాదు.

- యన్.ఎ.యస్.ఎ (నాసా) పరిశోధనలు ఎంత రహస్యంగా జరుగుతాయికదా! అలాగే ఈ రస్యవిద్య కూడా రహస్యంగా ఉంచబడింది.

- బంగారు యోగాలు, యోగులు వాళ్ళకోసమే చేస్తారు. దుర్వినియోగం కానివ్వరు.

వేమన- రసవాదం

* వేమన రసవాది అని చెప్పడానికి బలమైన ఆధారాలు చాలా ఉన్నాయి. రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు వేమన. రాయలసీమ ప్రాచీన కాలంలో ‘హిరణ్మయ మండలం’(బంగారు భూమి) పిలిచేవారు.

* నేటి భూగర్భ శాస్తవ్రేత్తల ఆధారంగా భారతదేశం మొత్తంమీద 8 చోట్ల బంగారు గనులుంటే, కేవలం రాయలసీమలోనే 4చోట్ల బంగారు గనులున్నాయి.

* శ్రీపర్వతం పురాతన కాలంనుండి రసవిద్యకు ఆటపట్టు. నాగార్జునుడు శ్రీశైలం, అహోబిళం ప్రాంతాల్లో నివసించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ శ్రీపర్వతం రాయలసీమలోనే ఉంది.

* రసంతో వనమూలికలను చేర్చి, పుటం పెట్టే సంప్రదాయం ఇప్పటికీ శ్రీపర్వత ప్రాంతంలో జరుగుతుంది. అది ప్రస్తుతం ‘చిట్కావైద్యం’ క్రింద మారిపోయింది.

* ఆ క్రమంలో వేమన దృష్టి రసవాదం వైపు మళ్లి ఉండవచ్చు.

* శ్రీశైలంలోని పాతాళగంగకు దగ్గరగాగల గుహలో సిద్ధ నాగార్జునుడి శిష్యుడైన ఆత్రేయుని కాలంనుండి ఉన్న ‘రసయోగ ప్రయోగశాల’లో వేమన తన ప్రయోగాలు చేసినట్లు తెలుస్తుంది.

* యోగులకు ఈ కృత్రిమ బంగారంమీద ఆశ ఎందుకు పుట్టిందో అని ‘వేమన’ గ్రంథం రచయత రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ ఆశ్చర్యపడ్డారు. హఠ యోగ సాధనకు కావల్సిన దేహశక్తిని పొందడానికి ‘పుష్టాహారం’ దొరక్క రససిద్ధితో చేసిన (స్వర్ణం)- స్వర్ణ్భస్మాలతో దేహశక్తిని వృద్ధి పరచుకొన్నారని వారే ఊహించారు.

* వేమన నీతి పద్యాలను పక్కనబెడితే, వేదాంత, తాత్త్విక, మత విషయాల్లో భిన్న దృక్పథాలను ప్రదర్శించారు. కాని ‘రసవాదం’ చెప్పిన పద్యాల్లో నకారాత్మక దృక్పథం కాని, వ్యతిరేకంగా, భిన్నంగా గాని మాట్లాడకపోవడంవల్ల వేమన-రసవాదం ప్రశస్తిని పొందింది.

* పద్యమాధ్యమంగా సాగిన ‘వేమన-రసవాదం’ తెలుగువారి మెదళ్లలో నిల్చి, ఒక బలమైన విశ్వాసంగా మిగిలింది.

* అంతేకాక వేమన రసవాద పద్యాల నడకలో వచ్చిన ‘సనారీ విశే్వశ్వర సంవాదం’ అనే గ్రంథం, బహుశా! వేమనకు ముందో, వెనుకనో ఉండవచ్చు. అందులో కూడా ఈ రసవాదం ప్రస్తావన ఉంది.

* భారతదేశంలో ‘రసవాదం-దాని సాహిత్యం’అనే పరిశోధన చేస్తే, తెలుగు ప్రాంతంలో రసవాదం అనేది ఒక జానపద కళారూపం పొందినంత ప్రాచుర్యం పొందింది. అందుకు ప్రధాన కారణం-

1) నాగార్జున కొండ ఆలవాలంగా పరిశోధనలుచేసిన బౌద్ధ నాగార్జునుడు.

2) కర్ణాటక ప్రాంతంనుండి వచ్చి శ్రీశైలం పర్వతాల్లో స్థిరపడ్డ సిద్ధ నాగార్జునుడు.

3) రసవాద దృక్పథాన్ని పద్యమాధ్యమంగా ప్రచారంచేసిన రసవాది వేమన.

--ఇంకావుంది...

***************************************
డాక్టర్‌. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ



ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని పాత్రికేయుల సమావేశంలో ఓ విలేఖరి “మీరు విదేశాలకు వెళ్లేటప్పుడు ఎక్కువగా సిల్కు చీరలు ధరిస్తారు. అదే మనదేశంలో మామూలు నూలు చీరలు కట్టుకుంటారు ఎందుకో చెప్పగలరా?” అని ప్రశ్నించాడట.  పైపై మెరుగులంటే చాలా ఇష్టం. కానీ మన దేశంలో నేను చీర మాత్రమే కాకుండా, గౌను తొడిగినా నా మీద ఎనలేని గౌరవం ప్రదర్శిస్తారు ప్రజలు” అని ఇందిర జవాబిచ్చింది. ఆనాటి పాత్రికేయ లోకం సెలబ్రిటీల నుండి రాబట్టే జవాబును కూడా సందేశాత్మకంగా అందించేది. అలాగే రాజకీయ నాయకులతో పాటు ఇతర సెలబ్రిటీలు మీడియాను తమ వ్యక్తిగత ప్రచారానికి కాకుండా తమ దగ్గరున్న పరిజ్ఞానాన్ని లోకానికి అందించే ప్రయత్నం చేసేవారు.

అలాగే ఓ బూతు పత్రిక నడిపే వ్యక్తి కాలమిష్టుగా మారి వ్యాసాలు పంపితే ఓ దినపత్రికలోని ఆడ కంపోజర్లు ఆ రాతలను కంపోజ్ చేయకుండా నిరసన వ్యక్తం చేసారు. అదీ ఆనాటి కమిట్‌మెంట్. నిషి మనసు కన్నా వేగంగా పరుగెత్తుతున్న సాంకేతిక పరిజ్ఞానం హోరును అందుకోవాలనే తహతహ ప్రసారమాధ్యమాలకు ఎక్కువైంది. ఒకప్పుడు పత్రికలు రాసే విషయంలో స్పష్టత, నిర్దుష్టత మాత్రమే కాకుండా సమాచారమార్పిడి ఆలోచనాత్మకంగా ఉండేది. వార్తలను ఆచితూచి అందించేవారు. ఇప్పుడు ప్రసారమాధ్యమాల పరుగుపందెంలో వార్త కన్నా వ్యాఖ్యకే ప్రాముఖ్యం పెరిగింది.  స్టోరీ బోర్డ్‌లు, వార్తావ్యాఖ్యలు నిష్పక్షపాతంగా నిర్మాణాత్మకంగా కాకుండా స్వీయ దురభిమానంతో జరగడం దురదృష్టకరం. తమ కులం వ్యక్తిని గద్దెపై స్థిరంగా ఉంచాలన్నా లేదా గద్దెపైకి ఎక్కించాలన్నా దానికోసం మాధ్యమాలు నిస్సిగ్గుగా విషపు కూతలు కూస్తున్నాయి.

తమ వ్యక్తిగతంగా పెట్టుకొన్న చానళ్లు వారి కార్యకలాపాలకు పెద్దపీట వేస్తున్నాయి. అలాగే వర్గ దృక్పథంతో పనిచేసే చానళ్లు సిద్ధాంతాల వారు తమ సిద్ధాంతాలకు ప్రాచుర్యం కల్పిస్తూ వ్యాఖ్యానిస్తున్నాయి. అలాగే తమ వ్యాపారాల సంరక్షణకు కవచంగా ఉండే పార్టీలకు మరికొన్ని చానళ్లు కొమ్ముగాస్తున్నాయి. విలువలకు పట్టం కట్టాల్సిన చానళ్లు సమజాంలో కలకలం రేపుతున్నాయి. సమన్వయంతో సమాజాన్ని నడిపించాల్సిన వారు సంఘర్షణలు రేకెత్తిస్తున్నారు!?  రేటింగ్‌ల కోసం సమాజంలోని ఉద్వేగకర అంశాలను వేడివేడిగా వండి వార్చాలన్న అత్యుత్సాహంతో కొన్ని చానళ్లు కుల, మత, ప్రాంత, భాషాపరమైన అంశాలను తమకు సాధనాలుగా వాడుకొంటున్నాయి. పత్రికల్లో వచ్చే వార్తలు మనసులోని ఉద్వేగాలు కాస్త చప్పబడ్డాక చదివితే వివేకాన్ని పెంచేవి.

ఇపుడు నిమిష నిమిషానికి ‘బ్రేకింగ్ న్యూస్’లతో ప్రతీది ఉడికించడం ఎలక్ట్రానిక్ మీడియాకు పరిపాటి అయ్యింది.  మెడలో గంట ఎవరు కడతారు?’ అన్న చందంగా సమాజాన్ని ఫోర్త్ ఎస్టేట్‌గా ఉండి రక్షించే మీడియా సర్వభక్షకిగా మారనుందా? మనుషుల మనోవికాసాన్ని చంపేసే వ్యాపారాత్మక కార్యక్రమాలు, నేర ప్రవృత్తిని పెంచే నేరాలు లైంగిక దాడులు జరిపే సినిమాల ఎక్స్‌పోజింగ్, మహిళలను విలన్లుగా జిడ్డు సీరియళ్లు మన అత్యున్నత గౌరవాలను కించపరిచే కామెడీ షోలు, బాలలను బానిసలుగా మారుస్తున్న కార్టూన్లు... అన్నీ పరిమితికి మించి సాగిస్తున్న విన్యాసాలు మనల్ని ఎక్కడికి తీసుకుపోతాయో చెప్పలేం. మరి అలా అయితే ఈ పరిజ్ఞానాన్ని ఒక్కసారిగా ధ్వంసం చేయడం సాధ్యమా?  పరిమితులు, చట్టంలోని లొసుగులు ఇలాంటి అవాంఛనీయమైన పరిస్థితులకు అన్నిరంగాల్లో కారణం అవుతున్నాయి. అయితే మిగతా రంగాలు సమాజంలోని కొంత భాగాన్ని మాత్రమే ప్రభావితం చేయగలుగుతాయి.

కానీ ప్రసార మాధ్యమాలు సింహభాగం సమాజాన్ని అతలాకుతలం చేయగలవు కాబట్టి ఈ మాధ్యమాలకు స్వీయనియంత్రణ అవసరం. ముఖ్యంగా తెలుగు చానళ్ల భావదారిద్య్రం ఇటీవల ఈ నియంత్రణ కోల్పోయింది. సినిమా కుటుంబాలను, నటులను, క్రికెట్ స్టార్లను రాజకీయ వేత్తలుగా మార్చే పనిని కూడా ప్రసార మాధ్యమాలు తమ భుజానికెత్తుకున్నాయి!? కేవలం వ్యాపార బుద్ధితో కొన్ని చానళ్లు ప్రవర్తిస్తే, వ్యక్తిగత స్వార్థం కోసం మరికొందరు చానళ్ల ద్వారా ఉద్వేగాలు పెంచుతున్నారు. అలాంటి ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. ఇటీవల పోసాని కృష్ణమురళిని ఓ ప్రముఖ చానల్ రాజకీయ విశ్లేషణకు పిలిచింది. అతని ఎదురుదాడికి విశ్లేషకుడి గొంతు మూగబోయింది. ఆ సందర్భంగా జర్నలిస్ట్ మాట్లాడిన మాటలు స్త్రీలను అగౌరవపరచగా, ఈ అంశం పోలీస్ స్టేషన్ వరకు చేరింది.

2014లో తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని హేళన చేస్తూ రెండు ప్రముఖ చానళ్లు విశ్లేషణ చేశాయి. దాంతో కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యి ఆ రెండు చానళ్లను కొన్నాళ్లపాటు నిషేధం చేసాడు. ఆ దెబ్బతో హైదరాబాద్ కేంద్రంగా నడిచే మీడియా సంస్థలన్నీ దారిలోకొచ్చాయి. అందుకే కేసీఆర్ ప్రభుత్వంపై ఏవైనా ఆరోపణలు ప్రతిపక్షాలు చేసినప్పుడల్లా దానిపై ఎక్కడ చర్చించాల్సి వస్తుందో అని కొత్తదారి వెతుక్కుంటున్నాయి. తాము దాడి చేయలేని పరిస్థితి వచ్చినప్పుడల్లా ఎలక్ట్రానిక్ మీడియా తనపైన తానే యుద్ధం చేసుకొని ఎంగేజ్ అవుతుంది. సినిమా నటుల డ్రగ్స్ వ్యవహారంపై ఎలక్ట్రానిక్ మీడియా చేసిన హడావుడి ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో భూమ్యాకాశాలు ఏకమైనంతగా చర్చోపచర్చలు చేశారు.

అలాగే శ్రీరెడ్డి వ్యవహారం పేరుతో ‘క్యాస్టింగ్ కౌచ్’పై పెద్ద దుమారం లేపారు. అది తిరిగి తిరిగి పవన్ కల్యాణ్ మెడకు చుట్టుకొని వ్యక్తిగత దూషణల వరకు వెళ్లేసరికి మీడియా సినిమా ఇండస్ట్రీ లోలోపల సెటిల్మెంట్ చేసుకున్నాయి. మరుసటి రోజు నుండి ఈ రోజు వరకు శ్రీరెడ్డి ఊసేలేదు. సినిమా పెద్దల, రాజకీయ పెద్దల వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతింటుందని తెలియగానే ఈ దమ్మున్న దగ్గున్న చానళ్లు ఆ అంశాలను పెట్టెలో వేసి మూసేస్తాయి. స్త్రీని భోగ వస్తువుగా మార్చేసి నాలుగు మాటలు నేర్పించి తెరముందు కూర్చోబెట్టి యువతను మత్తెక్కిస్తున్నారు!? ఇలాగే ఇటీవల ‘సెక్స్ రాకెట్’ పేరుతో జరిగిన వ్యవహారాన్ని అంతర్జాతీయ విషయంగా ఎక్స్‌పోజ్ చేస్తున్నాయి. కొన్నాళ్లు బ్యూటీషియన్ శిరీష హత్య కేసులోని విషయాలను పరోక్షంగా లైంగిక విషయాలను చెప్పే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా అందించేది.

కొందరు రాజకీయ నాయకుల దుర్మార్గపు ఘనకార్యాలను వాళ్లకు ప్రచారం కల్పించేటట్లుగా ప్రసార మాధ్యమాలు తమ తలకు ఎత్తుకుంటున్నాయి. అలాగే నాయకుల పుత్రరత్నాల క్లబ్బు డ్యాన్సులు, దాడులు, పబ్బు హుక్కాలు, డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిరాటంకంగా ప్రసారం చేసి వాళ్లకు భావి రాజకీయ యవనికను సిద్ధం చేస్తున్నాయి. పూర్వం సెలబ్రిటీలంటే గొప్ప నాయకులు, సాహిత్యవేత్తలు, కళా రంగానికి చెందినవారు, ఆధ్యాత్మిక వేత్తలు ఉండేవారు. ఇపుడు ఫేస్‌బుక్, ట్విట్టర్ ఉపయోగించదగిన ప్రతివారూ సెలబ్రిటీలే. వీళ్ల తోలు మందం చూసి మీడియా వాళ్లకు తగినంతగా ప్రాచుర్యం కల్పిస్తున్నది. ఈ మధ్య తెలుగు ప్రసార మాధ్యమాలకు పచ్చకామెర్ల రోగం పట్టుకుంది. ఏకంగా ఓ మూలబడ్డ చానల్ యాంకర్ పార్టీ కార్యకర్త కన్నా ఎక్కువ ఆవేశంతో అర్నాబ్ గోస్వామిలా రెచ్చిపోయి ఆ చానల్‌కు ఎనలేని ప్రచారం కల్పించాడు.

నరేంద్ర మోదీని తిట్టడమే తెలుగువారి ఆత్మగౌరవం కాపాడడం అన్న భ్రమలో కొందరు యాంకర్లు ప్రవర్తిస్తున్నారు. టీడీపీ  బీజేపీ మైత్రీబంధం బద్దలయ్యాక తెలుగు చానళ్ల ప్రైమ్ టైమ్ న్యూస్‌లో ‘ప్రత్యేక హోదా తప్ప’ ఇంకేమీ ఉండడం లేదు.  చానల్‌లో చేరి మంట పుట్టిస్తున్న ఈ ‘మహా’నటులు మూర్తీభవించిన కళాకౌశలం ప్రదర్శిస్తున్నారు. అలాగే భుజాలపై శాలువాలు ధరించి పుచ్చలపల్లి సుందరయ్యల్లా ఫోజులిచ్చే స్వయం ప్రకటిత మేధావులు మీడియాకు ఉప్పందిస్తున్నారు! తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణలో ఏమీ లేదన్న పార్టీలు, స్వయం ప్రకటిత మేధావులు ఇపుడు తెలంగాణ ప్రభుత్వం మిగులు బడ్జెట్‌తో ఆంధ్రాలో లేని పథకాలు ప్రకటిస్తున్నది.

అదే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కేంద్రం ఇస్తే తప్ప మేం ఏం చేయలేం అని చేతులు ఎత్తేశాడు. ఈ తర్కంలోని ద్వంద్వ విధానాన్ని ఒక్క ప్రసారమాధ్యమం ప్రశ్నించదు!? రోజూ సాయంత్రం కాగానే కేసీఆర్‌ను, చంద్రబాబును ఏమీ అనలేక తమకున్న వ్యతిరేకతను మోదీ లక్ష్యంగా దుమ్మెత్తి పోస్తున్నారు. కేసీఆర్‌పై భయంతో, చంద్రబాబుపై భక్తితో జరుగుతున్న ఈ ప్రహసనంపై సోకాల్డ్ మేధావులెవరూ నోరు మెదపకపోవడం మరో విడ్డూరం! వీళ్లంతా ఇపుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంధీ అయ్యారు.

తమకిష్టమైన వారిని రాత్రికి రాత్రి గొప్పవాళ్లను చేయడం, తమకు నచ్చని వాళ్లను పాతాళంలోకి తొక్కడం ప్రసార మాధ్యమాలకు నిత్యకృత్యం అయ్యింది. స్వీయ నియంత్రణ లేని ఈ విశృంఖల వార్తా స్వైర విహారం సమాజాన్ని ఎటువైపు తీసుకుపోతుందో చూడాలి. దీనికితోడు సామాజిక మాధ్యమాల దౌడును అందుకోవడానికి జరుగుతున్న ఈ రేసుగుర్రం పరుగుపందెం సమాజాన్ని తమ కాళ్ల క్రింద వసుకొని తొక్కేస్తుందన్న విషయం విస్మరిస్తున్నది. ప్రసార మాధ్యమాలను పట్టి కుదిపేస్తున్న ఈ కుసంస్కారపు ఎత్తుగడలకు స్వీయనియంత్రణ లేకపోతే కేసీఆర్ మార్గమే శరణ్యం.


********************************************

*✍✍డాక్టర్. పి. భాస్కర యోగి* 

 సంపాదకీయ వ్యాసం :  విజయక్రాంతి