అరభ్బీలోని ‘ఆల్’ (పవిత్రమైన) చేర్చబడి- అల్కెమీ- ధాతువాదం రసవాదంగా రూపొందింది. అంటే ఇది పవిత్ర రహస్య శాస్త్రం అని భావించారు.

- ఆచార్య నాగార్జునుడి తర్వాత ఈ శాస్త్రానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది.

- న్యూటన్ పరిశోధనలపై ఆధారాలతో కూడిన పరిశోధన చేసి- ఆయన కూడా ‘ఆల్కెమిస్టు’గా మారాడాని తెలిపారు.

- సీసాన్ని బంగారంగా మార్చే విద్యపై పరిశోధనలు చేస్తున్న రాబర్ట్ బోయిల్‌తో కలిసి రహస్య ప్రయోగాలలో గంటల తరబడి ప్రయోగాలు చేశాడని తెలిపారు. రాబర్ట్ ఆకస్మిక మరణంతో ఆ పరిశోధనకు ఫుల్‌స్టాప్ పడింది.

- న్యూటన్ 20 ఏళ్ళ పరిశోధన పెంపుడు కుక్క కొవ్వొత్తిని తన్నడంతో బుగ్గిపాలైంది.

- న్యూటన్ రసవాదంపై చేసిన రచనల్లోని అంశాలు (డాక్యుమెంట్స్) ఇప్పటికీ డీకోడ్ చేయలేకపోతున్నారు.

- 2003 ప్రథమార్థంలో బ్రిటన్‌లోని స్ట్థాస్లైడ్ యూనివర్సిటీ పరిశోధకుడు కెన్‌లెండింగ్‌హామ్ జరిపిన ఒక ప్రయోగంలో బంగారం పాదరసంగా రూపుదాల్చింది అని పత్రికలు పేర్కొన్నాయి.

రసవాదం రహస్యంగా ఉంచడమెందుకు?

శ్లో అతఃపరం ప్రవక్ష్యామి తంత్రాణాం హేమకారకం
యోగోయం గోపనీయంచ సద్యస్సిద్ధిప్రదం శుభం
జితేంద్రియస్సత్యవాదీ దైశభక్తి పరాయణ
యోగ్యతాసిద్ధి మాప్నోతి గృహస్థ స్యన కదాచన

పరమశివుడు: ఈ శుభప్రదమైన హేమవిద్య నేర్పించెదను వినుము. ఇది చాలా రహస్యమైనది. మర్మాలను గ్రహించి ఆచరిస్తే- కేవలం ఓషధుల ప్రభావంతో సిద్ధిస్తుంది. దీన్ని జితేంద్రియులు, యోగపుంగవులు, సత్యవ్రతం కలవాళ్లు, దైవభక్తి గలవాళ్ళకే తెలపాలి. గృహస్థులైనవాళ్లు కూడా ఆచరించకూడదు (దత్తత్రేయ తంత్ర విద్య)

- రసవిద్య అవ్యాప్తికి ఋషులు నైతిక రేఖ గీసుకున్నారు.

- ఇంద్రియాతీతమైన, మానవసాధ్యాతీతమైన విద్యలు బహిరంగపరచడం సాధ్యం కాదు.

- యన్.ఎ.యస్.ఎ (నాసా) పరిశోధనలు ఎంత రహస్యంగా జరుగుతాయికదా! అలాగే ఈ రస్యవిద్య కూడా రహస్యంగా ఉంచబడింది.

- బంగారు యోగాలు, యోగులు వాళ్ళకోసమే చేస్తారు. దుర్వినియోగం కానివ్వరు.

వేమన- రసవాదం

* వేమన రసవాది అని చెప్పడానికి బలమైన ఆధారాలు చాలా ఉన్నాయి. రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు వేమన. రాయలసీమ ప్రాచీన కాలంలో ‘హిరణ్మయ మండలం’(బంగారు భూమి) పిలిచేవారు.

* నేటి భూగర్భ శాస్తవ్రేత్తల ఆధారంగా భారతదేశం మొత్తంమీద 8 చోట్ల బంగారు గనులుంటే, కేవలం రాయలసీమలోనే 4చోట్ల బంగారు గనులున్నాయి.

* శ్రీపర్వతం పురాతన కాలంనుండి రసవిద్యకు ఆటపట్టు. నాగార్జునుడు శ్రీశైలం, అహోబిళం ప్రాంతాల్లో నివసించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ శ్రీపర్వతం రాయలసీమలోనే ఉంది.

* రసంతో వనమూలికలను చేర్చి, పుటం పెట్టే సంప్రదాయం ఇప్పటికీ శ్రీపర్వత ప్రాంతంలో జరుగుతుంది. అది ప్రస్తుతం ‘చిట్కావైద్యం’ క్రింద మారిపోయింది.

* ఆ క్రమంలో వేమన దృష్టి రసవాదం వైపు మళ్లి ఉండవచ్చు.

* శ్రీశైలంలోని పాతాళగంగకు దగ్గరగాగల గుహలో సిద్ధ నాగార్జునుడి శిష్యుడైన ఆత్రేయుని కాలంనుండి ఉన్న ‘రసయోగ ప్రయోగశాల’లో వేమన తన ప్రయోగాలు చేసినట్లు తెలుస్తుంది.

* యోగులకు ఈ కృత్రిమ బంగారంమీద ఆశ ఎందుకు పుట్టిందో అని ‘వేమన’ గ్రంథం రచయత రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ ఆశ్చర్యపడ్డారు. హఠ యోగ సాధనకు కావల్సిన దేహశక్తిని పొందడానికి ‘పుష్టాహారం’ దొరక్క రససిద్ధితో చేసిన (స్వర్ణం)- స్వర్ణ్భస్మాలతో దేహశక్తిని వృద్ధి పరచుకొన్నారని వారే ఊహించారు.

* వేమన నీతి పద్యాలను పక్కనబెడితే, వేదాంత, తాత్త్విక, మత విషయాల్లో భిన్న దృక్పథాలను ప్రదర్శించారు. కాని ‘రసవాదం’ చెప్పిన పద్యాల్లో నకారాత్మక దృక్పథం కాని, వ్యతిరేకంగా, భిన్నంగా గాని మాట్లాడకపోవడంవల్ల వేమన-రసవాదం ప్రశస్తిని పొందింది.

* పద్యమాధ్యమంగా సాగిన ‘వేమన-రసవాదం’ తెలుగువారి మెదళ్లలో నిల్చి, ఒక బలమైన విశ్వాసంగా మిగిలింది.

* అంతేకాక వేమన రసవాద పద్యాల నడకలో వచ్చిన ‘సనారీ విశే్వశ్వర సంవాదం’ అనే గ్రంథం, బహుశా! వేమనకు ముందో, వెనుకనో ఉండవచ్చు. అందులో కూడా ఈ రసవాదం ప్రస్తావన ఉంది.

* భారతదేశంలో ‘రసవాదం-దాని సాహిత్యం’అనే పరిశోధన చేస్తే, తెలుగు ప్రాంతంలో రసవాదం అనేది ఒక జానపద కళారూపం పొందినంత ప్రాచుర్యం పొందింది. అందుకు ప్రధాన కారణం-

1) నాగార్జున కొండ ఆలవాలంగా పరిశోధనలుచేసిన బౌద్ధ నాగార్జునుడు.

2) కర్ణాటక ప్రాంతంనుండి వచ్చి శ్రీశైలం పర్వతాల్లో స్థిరపడ్డ సిద్ధ నాగార్జునుడు.

3) రసవాద దృక్పథాన్ని పద్యమాధ్యమంగా ప్రచారంచేసిన రసవాది వేమన.

--ఇంకావుంది...

***************************************
డాక్టర్‌. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి