– ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పే అధికారం మోదీకి లేదు.
– మంత్రి నారా లోకేశ్‌
– వార్డ్‌మెంబర్‌గా కూడా గెలవకుండా మంత్రి కావడానికి మీకు అన్ని అర్హతలుంటాయి. కానీ ఈ దేశ ప్రధానికి ఏపిపై హక్కు ఉండదా ?
– టిఆర్‌ఎస్‌కు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లే.
– కాంగ్రెస్‌ పార్టీ
– మరి కాంగ్రెస్‌కు ఓటేస్తే టిడిపికి వేసినట్లా !
– కొట్లాడి సాధించుకున్నం – దగా పడ్డం
– తెజస నేత కోదండరాం
– కెసిఆర్‌ మొనగాడని నీవంటివి. నీముఖం బంగారు ముద్దలాగుందని కెసిఆర్‌ అన్నడు! మీ ఇద్దర్నీ నమ్మి జనం దగాపడ్డరా!
ం హామీలన్నీ అధికారం కోసమే. తెరాస పాలనలో రాష్ట్రం దగా పడ్డది
– టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
– మీవి ఆపద మొక్కులు. ఆయనవి ఆ-పదవి చెక్కులు..!
– చంద్రబాబు దుర్మార్గుడు. సొంత జెండా లేనోడు. స్వార్థపరుడు. రాజ్యసభ సీట్లను అమ్ముకున్నడు. ఎన్టీఆర్‌ను మోసం జేసిండు. మోసానికి మరో రూపం చంద్రబాబు.
– మాజీమంత్రి మోత్కుపల్లి నర్సిములు
– తత్వం ఇన్నాళ్లకు బోధపడిందన్నమాట !
– ఆరెస్సెస్‌ ఆహ్వానంపై అక్కడే స్పందిస్తా
– ప్రణబ్‌ ముఖర్జి
– జాతి వ్యతిరేక శక్తులకు ఇక ఎదురుగాలే.
– లౌకిక ప్రయోజనాల దృష్టా ఆరెస్సెస్‌ కార్యక్రమానికి వెళ్ళొద్దు.
– కేరళ కాంగ్రెస్‌ నేత రమేశ్‌ చెన్నితాల
– తీవ్రవాదుల ఇళ్ళకో, హురియత్‌ కాన్ఫరెన్స్‌ నేతల ఇళ్ళకో వెళ్తే బాగురటది గదూ..!
– మమ్మల్ని దెబ్బతీయడానికి కేంద్రం, మోదీ, షాలు తిరుమలను ఉపయోగించుకొంటున్నారు. ధొలేరాకు నిధులిచ్చి అమరావతిని వదిలేశారు.
– సిఎం చంద్రబాబు
– అమిత్‌ షాకు తిరుమలలో ప్రత్యేక దర్శనం కల్పించాడనేగా రమణ దీక్షితుల్ని మీరు పక్కన పెట్టారు !
– ఆంధ్రప్రదేశ్‌లో భాజపాకు డిపాజిట్లు కూడా రావు.
– తెదేపా నేత బుద్ధా వెంకన్న
– మొన్న మహానాడులో లోకేశ్‌ భాజపానే మా ప్రధాన ప్రత్యర్థి అన్నారు. ఎందుకో !
– మీడియా వ్యవహారంలో రాజకీయ జోక్యం.
– ఇండియా టుడే కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయి
– మీరు కూడా హద్దుల్లో ఉంటే మంచిది.
– తుత్తుకూడి ఘటనపై సిబిఐ దర్యాప్తు జరపాలి
– సిపిఎం నేత సీతారాం ఏచూరి
– అలాగే పశ్చిమబెంగాల్‌ స్థానిక ఎన్నికలలో విపక్షాల అభ్యర్థులపై జరిగిన దాడుల ఘటనలపై కూడా డిమాండ్‌ చేసే సాహసం వుందా?
– వేర్పాటువాదులు, నేతలు చర్చలను సద్వినియోగం చేసుకోవాలి.
– జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి
– జరిపింది చాలు ! ఇక నారతీయండి.

************************************************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట  విశ్లేషణ : జాగృతి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి