మోదిని మోదేయండి..! భాజపాను బండకేసి కొట్టండి..! దేశంలో అన్యాయం.. అరాచకం..! మోదీ, షాలు ప్రమాదకారులు..!!
ఈ రోజు దేశం నిండా ఎక్కడ చూసినా ఇవే నినాదాలు. కులపార్టీలు, కుటుంబ పార్టీలు ‘భారతదేశం మా వారసత్వ సంపద…! ఇది మోది కబ్జా చేస్తే కళ్లుమూసుకొని కూర్చొంటామా! కాళ్లు ముడుచుకొని నిల్చుంటామా!’ అంటూ బెంగలన్ని వదిలేసి బెంగుళూరుకు వెళ్లి ‘కుత్సిత కుమారయజ్ఞం’లో పాల్గొన్నారు. అందులో పాల్గొన్న 16 పార్టీలు – తమ కుటుంబ వారసత్వాన్ని ఎల్లప్పుడూ ప్రస్తుతించేవే. వీళ్లంతా కలిసి మరో నెహ్రూ కుటుంబ వారసుణ్ణి గద్దెనెక్కించాలని చంకలు గుద్దుకుంటున్నారు.
‘మేం లక్ష తప్పులు చేశాం. అందుకే బిజెపిని గెలిపించారు’ అని నిస్సిగ్గుగా చెప్పుకొంటూ; ఇప్పుడు ‘దేశం కోసం అహరహం శ్రమించే, ఏ తప్పు చేయని ‘సెలవు లేని కూలీ’ నరేంద్రమోదిని గద్దె మీది నుండి దింపి, గుజరాత్‌ గడ్డపైకి పంపిస్తాం’ అంటున్నారు.
మరి ఈ డెబ్భై ఏళ్ల నుండి చేసిన తప్పులను మళ్లీ అధికారంలోకి వస్తే చేస్తారా! చేయరా! అనేది చెప్పట్లేదు. కుటుంబం, కులం, అవినీతి, స్వార్థ, దేశద్రోహ శక్తులన్నీ కలగూరగంపగా కలిసి కొత్త వంటకం వండి వడ్డించబోతున్నాయి..!? జాగ్రత్త !!

************************************************************
– డా|| పి.భాస్కరయోగి
మాటకు మాట  విశ్లేషణ : జాగృతి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి