‘ఈ మొకద్దమాలో చలాయిచిన కార్రవాయి అంటే జాలీది. సాహెబు జిల్లాజాయె వౌక్ఖాకు పోయి తహకీకా చేసి కైపియ్యతు రాసినాడు గదాకె ఫరీఖు దావా బిల్కూల్ నాజాయజు, ఆయిందా రుూ తేర్న కార్రవాయి చేసిన సూరత్‌లో...’
1914 ప్రాంతంలో తెలుగు భాషా దుస్థితిని గురించి ఆనాటి ప్రముఖ రాజకీయవేత్త, రచయిత శ్రీ మాడపాటి హనుమంతరావు పేర్కొన్న ఒక ఉదాహరణ వాక్యం. అలాంటి స్థితి నుండి భాషను ఆత్మగౌరవ సాధనంగా మార్చుకొని ఈ ప్రాంతం ప్రత్యేక తెలంగాణగా ఏర్పడింది.
కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా తెలుగు భాషను, తెలంగాణ తల్లిని తన వాక్చాతుర్యంతో ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లి, ఈ రోజు సంచలనాత్మకంగా ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ నిర్వహించి మరో సంచలనం సృష్టించారు.
ఉద్యమ కాలంలో తెలంగాణ యాసను భాషగా గుర్తించాలని పోరాటం చేసిన కవులు, మేధావులు, భాషకున్న నిర్మాణ శాస్త్రాన్ని అర్థం చేసుకొని తెలుగు భాష ప్రాచీనత్వానికి అద్దం పట్టేలా సభలు జయప్రదం చేయాలని అంటున్నారు. విరసం లాంటి కొన్ని సంస్థలు, డా.జయధీర్ తిరుమలరావు, జూకంటి జగన్నాథం వంటి రచయితలు సుతిమెత్తగా బహిష్కరించాలని చెప్పినా దాని ప్రభావం పెద్దగా లేదు. ప్రధాన స్రవంతి రచయితలంతా ఇందులో భాగస్వామ్యం అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటివరకు పేర్లు కూడా తెలియని కవుల పేర్లతో తోరణాలు ఈ రోజు నగరంలో దర్శనం ఇవ్వడం సంతోషదాయకం. దున్న ఇద్దాసు, వేపూరు హనుమద్దాసు, ఈగ బుచ్చిదాసు వంటి కవుల పేర్లతో వెలసిన తోరణాలే అందుకు ఉదాహరణ.
తెలంగాణ ప్రాంతం తెలుగు గొప్పదనానికి ప్రతీక. ఇక్కడ గోపరాజుల కాలం (క్రీ.పూ.300) నాటి నాణేలలో ‘నారన’ అనే పేరు విన్పించింది. ఇందులోని ‘అన్న’ అనేదే తొలి తెలుగు మాటగా గుర్తించారని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే క్రీ.శ.61లో హాలుడు రచించిన ప్రాకృత గ్రంథం ‘గాథాసప్తశతి’లో అత్త, పిల్ల, పత్తి లాంటి తెలుగు పదాలు కన్పించడం ఈ ప్రాంతంలో తెలుగు ఎలా నడకలు నేర్చిందో చెప్పడానికి ఒక ఉదాహరణ. అదే విధంగా క్రీ.శ.947 నాటి కుర్క్యాల శాసనంలోని కంద పద్యాలు ఈ ప్రాంతంలో పద్యం పరిఢవిల్లిందని చెప్పడానికి మరో ఉదాహరణ. మొత్తానికి యుద్ధమల్లుని శాసనం, అద్దంకి పండరిరంగని శాసనం, ధనుంజయుని కళ్లమళ్ల శాసనాలకన్న అటూ ఇటూ తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషా చరిత్ర కనబడుతుంది. అందుకు తెలుగు వాళ్లు ఏ ప్రాంతంలో ఉన్నా గర్వించాలి.
రాజమహేంద్రవరంలో నన్నయభట్టు మహాభారతం ఆంధ్రానువాదం రచనకు పూనుకోగా ఆయన సహాయకుడు, మిత్రుడుగా పేర్కొన్న నారాయణభట్టు కన్నడ, తెలంగాణ ప్రాంత సరిహద్దువాడని ఇటీవల చెప్తున్నారు. నారాయణభట్టు సహాయంతోనే నన్నయ భారత రచనకు పక్కా ప్రణాళిక చేశాడు. తెలుగు భాష స్థిరీకృతం కోసం నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణిని రచించడం ఒక మెట్టైతే దానిని ఆధారంగా పెట్టుకొని లక్షణ శాస్త్రాన్ని సృష్టించిన కాకునూరి అప్పకవి తెలంగాణ ప్రాంతంవాడు కావడం మరో విశేషాంశం. అప్పకవి విరచిత ‘అప్పకవీయం’ ఈ రోజుకూ లక్షణ గ్రంథాల్లో మేటిరత్నం.
అలాగే కవిజనాశ్రయం కర్తృత్వ విషయంలో మత భేదాలున్నా ఇది ఇక్కడ పుట్టిన తొలి తెలుగు గ్రంథంగా కొందరు విమర్శకులు ప్రకటించారు. కోస్తా ప్రాంతంలో స్ర్తి ప్రకృతిగా కావ్యశాస్త్రాలు ఎక్కువగా పుడితే, తెలంగాణ ప్రాంతంలో పురుష ప్రకృతిగా లక్షణ శాస్త్రాలు పుట్టడం చెప్పుకోదగిన అంశం.
తెలంగాణ ప్రాంతంలో పంపకవి ‘ఆదికావ్యం’ పేరుతో మొదటి జైనతీర్థంకరుడైన వృషభదేవుని చరిత్రను రచించాడు. క్రీ.శ.1530 నాటి ప్రాచీన కావ్య సంకలన గ్రంథంలో ఈ పంపకవి ‘పద్మకవి’గా పేర్కొనబడ్డాడు. కన్నడంలోని రత్నత్రయానికి తెలంగాణ ప్రాంతానికి సంబంధం ఉన్నట్లు చెప్పబడుతున్నా ఇవన్నీ మరింత లోతుగా పరిశీలించాల్సి ఉంది. అలాగే ఇక్కడి వేములవాడ భీమకవిని శాపానుగ్రహ సమర్థుడైన కవిగా చెప్తారు. కవిసార్వభౌముడైన శ్రీనాథుడే ఇతని గురించి పేర్కొన్నాడు. కానీ ఇతని కావ్యాలేవీ లభించలేదు. ఇప్పటికీ చాలా సంకలన గ్రంథాల్లో ఈ కవి చాటు పద్యాలు కన్పిస్తాయి. నీతిపద్యాల రారాజైన బద్దెకవి, వ్యాఖ్యాత్ర చక్రవర్తిగా బిరుదు పొందిన మల్లినాథ సూరి తెలంగాణ ప్రాంతంలో ప్రభవించడం తెలుగు ప్రజల అదృష్టం.
ఇక నన్నయకు సమకాలంలో ధీటైన కవి ఎవరూ రాకున్నా నన్నయ తర్వాత భారతానువాదం చేసిన తిక్కన సోమయాజికి ఈ నేలతో సంబంధం ఉందని చెప్తున్నారు. తాను ఆస్థానంలో మంత్రిగా ఉన్నపుడు నెల్లూరు మండల రాజు మనుమసిద్ధిని రక్షించడానికి ఇక్కడి కాకతీయ చక్రవర్తి గణపతి దేవుణ్ణి ఆశ్రయించి ఆపదను తప్పించాడని చెప్తారు. అందుకు కృతజ్ఞతగా కాకతీయ ప్రభువు కోరిక మేరకు ఇక్కడే మిగిలిన భారతానువాదం ప్రారంభించాడని పరిశోధకులు చెబుతున్నారు.
అలాగే దేశి కవిత్వాన్ని నీచంగా భావిస్తున్న రోజుల్లో ఆచారాలను, భాషను, సంప్రదాయాలను దేశిగా మార్చుకొని, ద్విపద సాహిత్యాన్ని నెత్తిన ఎత్తుకొని రెండు మహాకావ్యాలు బసవ పురాణం, పండితారాధ్య చరిత్రను రచించి మసాకావ్యాల సరసన నిలబెట్టిన పాల్కురికి సోమనాథుడు సాహిత్యంలో ఓ విప్లవమే సృష్టించాడని చెప్పవచ్చు. అనేక ప్రక్రియల్లో 32కు పైగా గ్రంథాలు రచించి మొదటిసారి బుట్టలల్లేవారు, బట్టలు నేసేవారు, బట్టలుతికేవారిని నాయకులుగా మలచిన పాల్కురికి తెలుగు జాతంతా ఋణపడే ఉంటుంది.
భక్తి మందారంలోని మకరందాన్ని తెలుగు ప్రజలకందించి ఈ నేలను పద్యమయం చేసిన పోతన ఈ పురిటిగడ్డపై జన్మించడం ఈ ప్రాంత ప్రజల సుకృతమే. సంకీర్తనా సాహిత్యానికి ఆద్యమైన వచనాలను 12వ శతాబ్దంలోనే తెలుగు ప్రజలకు అందించిన తొలి వచన కర్త సింహగిరి కృష్ణమాచార్యులు ప్రస్తుత రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రక్కనున్న సంతాపూర్ గ్రామస్థుడని తెలిసినపుడు అక్కడి ప్రజల హృదయాలు పులకించకుండా ఉంటాయా?
పంట కోతల్లో, నూర్పిళ్లలో పాడుకొనే విధంగా రంగనాథ రామాయణం రచించి అవాల్మీకాలతో, కొంగ్రొత్త అంశాలతో రామాయణం నిత్య పారాయణంగా మార్చిన గోన బుద్ధారెడ్డిని ఈ ప్రాంతం తడిమి చూసుకొనే సందర్భం పులకింత గాకపోతే ఇంకేమిటి?
కొఱవి గోపరాజు, మారన, కాసె సర్వప్ప, జాయపసేనాని, హుళక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమారు రుద్రదేవుడు, కుప్పాంబిక, కొలని రుద్రదేవుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు, కుచిమంచి తిమ్మకవి, కందుకూరి రుద్రకవి, మడికి సింగన వంటి కవులు ఈ ప్రాంత సాహిత్య వినీలాకాశంలో మెరిసే మెరుపు తీగలు.
ఎన్నో సాహిత్య ప్రక్రియలకు ఆలవాలంగా నిలిచిన తెలంగాణలో భాష కోసం ఆధునిక కాలంలో ఏ జాతీ చేయరాని పోరాటం చేసింది. రాకమచర్ల వేంకటదాసు, చెర్విరాల బాగయ్య, దాశరథి, సినారె, వట్టికోట, వానమామూలై వరదాచార్యులు, గంగుల సాయిరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి వంటి మహనీయులు ఈ నేలపై తమ అస్తిత్వాన్ని చాటి చెప్పారు. తెలుగు భాషా పరిరక్షణకు ఇక్కడి ప్రజల యోగదానం అమూల్యమైంది. అలాంటి మహనీయుల స్మృతిపథంలోని నవతరాన్ని తీసుకెళ్లే మహత్తర యజ్ఞమే ప్రపంచ తెలుగు మహాసభలు.
గడిచిపోయిన కాలాన్ని, ఇంకిపోయిన సిరాను మళ్లీ సరిక్రొత్త అక్షరాలతో తీర్చిదిద్దే ఈ సాహిత్య చరిత్ర తెలుగు జాతి మెడలో రత్నహారమే. జాతిగా ప్రజలు ఎన్ని ముక్కలైనా అందరినీ కలపగల వారధిగా తెలుగును నిర్మించుకోవడమే ఇందులోని ప్రధాన ఎజెండా. ‘ఎన్ని ముక్కలైనగాని తెలుగు భాష ఒక్కటే’ అన్న చందంగా భవిష్యత్తులో ఈ ప్రాంతం కవులకు, రచయితలకు సముచిత స్థానం లభిస్తే అది సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర అవుతుంది. లేదంటే రెండు సాహిత్య చరిత్రలు రూపొందాల్సిన అవసరాన్ని ఇక్కడి ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజామాధ్యమంగా ఉండాల్సిన భాషను అవహేళన చేయడం కూడా ప్రజల మధ్య అడ్డుగోడలు నిర్మిస్తుంది. అలాంటి స్పర్థలు తొలగిపోయి ‘తెలుగు భాష’ అందరినీ ఒక్కటిగా ఉంచాలని కోరుకొందాం.

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125


Published AndhrabhoomiFriday, 15 December 2017




కులమతాలకు అతీతంగా బతుకమ్మ సంబరాలలో పాలుపంచుకుంటున్న మహిళలు.
తెలంగాణ జనసామాన్యంలో నుండి ఏర్పడ్డ విశ్వాసంతో పుట్టిన పండుగ బతుకమ్మ. అంటే ‘జీవించు - బ్రతికించు’ అని అర్థం. అదే తెలంగాణ సంస్కృతిలో ఆయువుపట్టుగా నిలిచింది. కాకతీయులకు శక్తి, పరాక్రమాలందించిన ఈ దేవతను మాతృస్వరూపిణిగా ఆరాధించి అటు శక్తితత్వాన్ని, ఇటు మాతృదేవతారాధనను వారు స్థిరీకరించారు. భట్టు నరసింహకవి రచించిన ఈ పాటే ఈ కథకు, బతుకమ్మ పేరుకు ఆధారంగా నిలిచింది.
‘ధరచోళదేశమున ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో

ఆ రాజు భార్యరో ఉయ్యాలో అతివ సత్యవతి ఉయ్యాలో’
ధర్మాంగదుడనే చోళరాజు, సత్యవతి దంపతులు ఎన్నో నోములు నోచి కుమారులను కన్నారు. కాని యుద్ధంలో ఏదో కారణంతో వారంతా చనిపోయారు. సత్యవతి పూజలకు సంతోషించిన లక్ష్మీదేవి తానే ఆమెకు కూతురుగా పుట్టిందట. ఆ బిడ్డను ఆశీర్వదించడానికి దేవాదిదేవతలు, మహర్షులు వచ్చి ...
‘బతుకగనె ఈ తల్లి ఉయ్యాలో బ్రతుకమ్మ అనిరంత ఉయ్యాలో శ్రీలక్ష్మీదేవియు ఉయ్యాలో సృష్టి బ్రతుకమ్మాయె ఉయ్యాలో...’ అని ఆమెకు ‘బతుకమ్మ’ అనే నామకరణం చేశారని ఈ జానపద గాథ తెలుపుతుంది.

‘శ్రీలక్ష్మీ నీ మహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై పార్వతీదేవివై పరమేశురాణివై
పరగలక్ష్మీవయ్యా గౌరమ్మ భార్యవైతివి హరికినీ గౌరమ్మ’
అనే పాట బతుకమ్మను త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ, లక్ష్మీ, గౌరీ స్వరూపంగా తెలియజేస్తుంది. బతుకమ్మకు సంబంధించి ఎలాంటి పౌరాణిక ఆధారాలు, శ్లోకాలు దొరకవు కాబట్టి బతుకమ్మ పాటలే మనకు ఆధారం.
మహాలయ అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు సాగే బతుకమ్మ ఆరాధన ఎంతో విశిష్టమైంది. ఇది నిరాకార నిర్గుణ ఆరాధనగా చెప్పవచ్చు. మట్టి నుండి పుట్టిన చెట్టు, ఆ చెట్టు నుండి వచ్చే పూలు మళ్లీ నీటిలో కలిసిపోయి మట్టిగా మారినట్లే జీవులన్నీ ఎక్కడినుండి పుడతాయో భోగాలను అనుభవించి అక్కడికే చేరతాయి అన్న ఆధ్యాత్మ, తాత్విక సందేశం ఈ పండుగ మనకు ఇస్తుంది. ఎన్నో రకాల పూలు ఒకదానిపై ఒకటి కూర్పబడి అందంగా బతుకమ్మ నిర్మాణం అయినట్లే ఎన్నో కులాల, వర్గాల మనుషులు కలిసిమెలిసి అందమైన సమాజంగా మారాలనే సామాజిక సందేశం కన్పిస్తుంది.
దుసరిచెట్టు తీగలతో అల్లిన శిబ్బి - శిబ్బెం లేదా తాంబాళంలో అడుగున గుమ్మడి, ఆనపు, మోదుగ వంటి పెద్ద ఆకులను ఉపయోగించి కింది పీఠంలా తయారుచేస్తారు. ఆ పీఠంపై వర్తులాకారంగా ఈ కాలంలో దొరికే గుమ్మడి, తంగెడి, గునుగు, గోరింట, గడ్డిపూలు, కలువ, కట్ల, బంతి, బీర, పొట్ల, రుద్రాక్ష, చేమంతి, నీలంకట్ల, పారిజాత, పొన్న, మందార, మల్లె, మొల్ల, గుల్మాల పూలతో మెట్లుమెట్లుగా పేర్చి అందంగా తీర్చిదిద్దుతారు. మొత్తం బతుకమ్మపైన పసుపుముద్దను గౌరీదేవిగా పై స్థానంలో నిల్పుతారు. ఈ మొత్తం దృశ్యం మేరుప్రస్థ శ్రీచక్రంలాగా ఉంటుంది.
మహాలయ అమావాస్య బతుకమ్మను ‘ఎంగిలిపూల బతుకమ్మ’, చిన్న బతుకమ్మ అని పిలుస్తారు. చివరిరోజైన సద్దుల బతుకమ్మకు ఐదు రకాల సద్దులు పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడితో నైవేద్యం చేసి సమర్పిస్తారు. రకరకాల బతుకమ్మ పాటలతో నృత్యగీతాలాపన కొనసాగుతుంది. ఆటలు పూర్తయ్యాక కొత్త సిబ్బి పాత సిబ్బి అంటూ సద్దులను పంచుకొని తింటారు.
 బతుకమ్మ ఉత్సవంలో ఆటపాటలకు చాలా ప్రాధాన్యం ఉంది. ‘బతుకమ్మ ఆట’ అని ఈ నృత్యానికి పేరు. గ్రామాల్లో ఏ ఉత్సవమైనా, ఏ ఊరేగింపు అయినా ‘బతుకమ్మ ఆట’ (నృత్యం) చేస్తూ ఆ సందర్భానికి అనుగుణంగా పాడుతారు. అంతగా చొచ్చుకుపోయింది ఈ ఆట - పాట. ఈ రోజున ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అని ముగిస్తారు. శ్రీ మూర్తి అయిన అమ్మవారిని సాటి స్త్రీ మూర్తులే ఆరాధించే ఈ పండుగలో స్త్రీల కళా నైపుణ్యం, సహ జీవన తత్వం, ప్రకృతి తాదాత్మ్యం కన్పిస్తాయి. అందరినీ బతుకమనీ, అందరికీ బతుకునివ్వమనీ కోరుకొనే ఈ మహోత్సవాన్ని  అందరూ జరుపుకోవాలి. అప్పుడే అందరి బతుకమ్మ అవుతుంది. 

- డా॥పి. భాస్కరయోగి 
 Oct 09, 2016, 00:28 IST  సాక్షి ఫ్యామిలీ 

మత ప్రచారానికిధర్మ ప్రసారానికి వేదయుగంలోనూ, ఆ తర్వాత సంస్కృతభాష ప్రధాన వాహిక అయ్యింది. వేదయుగం తర్వాత వైదిక సంస్కృతం చాలా కష్టం అయ్యింది. అందువల్ల వైదిక సంస్కృతం సరళీకృతం చేసి లౌకిక సంస్కృతం సృష్టించుకొన్నారు. తదనంతరం జైన,బౌద్ధాలు ప్రబలిపోయి వారు సంస్కృతాన్ని వదలిపెట్టి పాళీని, ప్రాకృతాన్ని ముందుపెట్టి మత ప్రబోధం చేశారు.
మత ప్రచారానికి కథా సాహిత్యాన్ని మొదట ఆశ్రయించిన ఈ రెండు మతాలు ఆనాటి ప్రజా భాషతోపాటు ప్రభాఛందస్సును కూడా స్వీకరించి గాథల రూపంలో జైనులు త్రిషష్టి శలాకపురుషుల వృత్తాంతాలు, బౌద్ధుల జాతక కథలు సృష్టించుకున్నారు. అదే మార్గంలో తమిళంలో పెరియ పురాం, కన్నడలో అరువత్తు మూవురు శివభక్తుల కథలు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలోనే ప్రజలకు దేశిభాషలపై మక్కువ ఏర్పడింది. 12వ శతాబ్దంలో కన్నడ ప్రాంతంలో బసవేశ్వరుడు ప్రజల భాషకు ప్రాధాన్యత ఇచ్చి వచన రచనకు ఆద్యుడయ్యాడు. అయితే తెలుగునాట కూడా చాళుక్యుల కాలం వరకు మార్గ ఛందస్సుదే ప్రధాన భూమిక ఉండేది. చాళుక్యులు ఓ అడుగుముందుకేసి దేశి ఛందస్సుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆ దేశి ఛందస్సులోనే నన్నయ భారత రచనకు పూనుకొన్నాడు.
ఈ దేశి ఛందస్సులోనే రెండు పాదాలున్న ద్విపద తెరపైకి వచ్చింది. అది విషయానికి చాలదని ఆనాటి కవులు నిరాదరించగా పాల్కురికి సోమనాథుడు పునరుద్ధరించి బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర రచించగా అదో సంచలనం అయ్యింది. దానితో దేశి ప్రక్రియలకు పునరుత్తేజం కలిగింది. ఇలాంటి సాహిత్య భాషా విప్లవాలు ఈ గడ్డనుండే రావడం విశేషంగా చెప్పవచ్చు.
పరమశివుని ఢమరుక నాదంనుండి వర్ణ సమామ్నాయం పుట్టింది కాబట్టి శైవులు మత ప్రచారానికి దేశి సాహిత్యాన్ని ప్రధానంగా తీసుకొన్నారు. శ్రీకృష్ణుని వేణువు నుండి రాగ ప్రపంచం పుట్టింది కాబట్టి వైష్ణవులు సంగీతాన్ని ప్రధాన ఆలంబనం చేసుకొన్నారు. దక్షిణ భారతదేశంలో ఈ రెండూ సంస్కరింప బడి మార్గ పద్ధతిని ఒక వర్గం అందుకోగా, దేశిపద్ధతిని మరో వర్గం పట్టుకొంది. సరిగ్గా సంకీర్తనా ప్రపంచంలో కూడా ఇలాగే జరిగింది. మార్గ పద్ధతిలో శాస్త్రీయ సంగీతం ఉరకలెత్తగా, దేశి పద్ధతిలో సంకీర్తన, భజన, తత్త్వం… రూపంలో సామాన్యుల వరకు చేరింది.
ముఖ్యంగా తెలంగాణ ప్రాంతభాషకు ప్రాచీన స్వరూపం యొక్క సౌష్ఠవం ఎక్కువ. దేశితనం, నిండుతనం ఈ భాషకు ప్రాణం.
మానవజీవితంలోని ఆధ్యాత్మికతను, తాత్వికతను వైయక్తికంగా, సామాజికంగా గానం చేయడానికే సంకీర్తన కవులు కృషి చేశారు. సంకీర్తనలు భగవన్నుతితో ప్రారంభమై సామాజిక, తాత్విక, ఆధ్యాత్మికరంగాన్ని తనలో నింపుకొన్నాయి. సంకీర్తన లక్షణాలు తెలుగు సాహిత్యంలో పాల్కురికి పేర్కొన్న ‘వాలేశు పదాలు, గొబ్బి పదములు, తుమ్మెద పదములు.. మొదలైన వాటిలో ఉన్నప్పటికీ 13 శతాబ్దానికి చెందిన కృష్ణమాచార్యుల సింహగిరి వచనాలతో వచన కీర్తనారూపంగా ప్రారంభమయ్యింది. అన్నమయ్య, క్షేత్రయ్య వంటి సంకీర్తనాచార్యుల ఒడిలో ‘పదం’గా రూపుదిద్దుకొని త్యాగరాజువంటి వాగ్గేయకారుల హృదయంలో ‘నామసంకీర్తన’గా నవీనత్వం సంతరింపజేసుకొని, భక్త రామదాసు, పోతులూరి వీరబ్రహ్మం, సిద్ధప్పలాంటివారి తాత్విక భావనలవల్ల ‘తత్వం’గా రూపొందింది. ఈ తత్వం, భజన జానపద కవుల చేతిలోపడి భజనగా రూపాంతరం చెందింది. ఇది ప్రక్రియాపరమైన రూపాంతరమేగాని మౌలిక రూపాంతరం కాదు.
తెలంగాణ ప్రాంతానికి ‘భజన’పేరుతో వచ్చిన సంకీర్తన సాహిత్యం పెద్ద రాశిగా ఉంది. బహుశా! శతక కవుల తర్వాత సంఖ్యాపరంగా ఇంత ఎక్కువమంది కవులకు స్థానం దొరికింది ఈ సంకీర్తన సాహిత్యంలోనే కావచ్చు. భావం, భాష విషయంలో తెలంగాణ ప్రాంతానికి ఓ ప్రాచీనత ఉందనే నిర్దుష్టంగా చెప్పవచ్చు. వసంతం వస్తే కోకిల కూసినట్లు, వర్షఋతువులో కప్పలు బెకబెక అరిచినట్లు కవులు సహజంగా కవిత్వం రాయడం తెలంగాణ ప్రాంత సంకీర్తనలో మనం చూడవచ్చు. సాహిత్యాన్ని సామాన్యుడు సంగీతంతో జతపరచి పాడడంవల్ల అతని అలౌకికానందం వర్ణించలేము. ఎంత కఠిన తపస్సు చేసినా స్థిరంగాని మనస్సు సంగీతంతో కూడిన సాహిత్యం దగ్గర నిలిచిపోతుంది. ఇలాంటి తాత్విక భావన తెలంగాణలో ఎందరో వాగ్గేయకారులను సృష్టించింది.
తెలంగాణలో 1. హరిభజన 2. ఊరిభజన 3. కులుకు భజన 4. పండరి భజన 5. కోలాట భజన 6. సప్త తాళ భజన 7. వేదాంత భజన ప్రసిద్ధంగా ఉన్నప్పటికీ సప్తతాళభజన, అడుగుల భజన, పండరి భజన, హరిభజన, చెక్క భజన, కులుకు భజన ఎక్కువగా నడుస్తాయి. మార్గ సంగీతంలో రాగం ఎక్కువ ప్రాధాన్యత వహించగా, తెలంగాణ భజనలో తాళ ప్రాధాన్యం ఉంటుంది. తాళం అంటే సంగీతంలో ఒక కాలమానం. తెలంగాణ లాక్షణికుడు అప్పకవి ఈ తాళాలు ఎట్లా ఏర్పడుతాయో ఉపజాతుల తర్వాత చెప్పడం జరిగింది. ఆటతాళం, ఆదితాళం, ఏకతాళం, రూపకతాళం, జుల్వతాళం, త్రిపుట తాళం, జంపెతాళం అని 7 విధాల తాళాలు భజనలో ఉపయోగిస్తారు. వీటిలో ఒక్కో తాళంలో మంద్ర-మధ్య-తార అనే మూడు గతుల్లో భజన సాగుతుంది. అందువల్ల 7 తాళాలు మూడు స్థాయిల్లో 21 విభాగాలవుతాయి. ఇదే సప్తతాళ భజన తెలంగాణ ప్రాంతానికి వచ్చే ఇంకా సరళస్థాయిలో సామాన్యులను సైతం సంకీర్తన కవులను చేసింది.
బసవన్న వచనాల తర్వాత ఆ ప్రభావంతో తెలంగాణలో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని సంతూరు (సంతాపూర్‌) గ్రామానికి చెందిన సింహగిరి కృష్ణమాచార్యులు ‘సింహగిరి వచనాలు’ రచించారు. చాలామంది దుర్మార్గంగా ఇతడి పేరులోని సింహగిరి (సింహాచలం)చూసి ఆంధ్రా ప్రాంతం కవిగా ప్రచారం చేశారు.
డా|| యం. కులశేఖర్‌రావు వంటి పరిశోధకులు ఇతని జన్మస్థానం తెలంగాణగా నిర్ధారించారు. ఇతని వచనాల్లో సంస్కృత శబ్ధగాంభీర్యం, దేవతాస్తుతికి అనుకూలమైన లయ, దేశి రూపాన్ని సంతరించుకుని వచనాలుగా కన్పిస్తున్నాయి. ఇవి ఇక్కడి భజన కవులకు మార్గదర్శకం అయ్యాయి. ‘భక్తిగలవారే బ్రాహ్మణులు’ అన్న సంస్కరణ దృక్పథం13వ శతాబ్దిలోనే ఈ కవి ప్రకటించడం తెలంగాణ కీర్తి కిరీటం కాగా, ఆ తర్వాత వచ్చిన అన్నమయ్య ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొకటే’ కీర్తన కు మార్గదర్శనం కూడా కావచ్చు. ”దేవా విష్ణుభక్తిలేని విద్వాంసునికంటె హరి కీర్తనము సేయునతడే కులజుండు, శ్వపతుండైన నేమి? ఏ వర్ణంబైననేమి? ద్విజునికంటె నతడె కులజుండు”-అన్న కృష్ణమాచార్యుల వాక్యాలు తెలంగాణ వాగ్గేయకారులు తలపై దాల్చారు. ఆ పరంపర అలాగే కొనసాగింది. 1959లో ‘సుజ్ఞాన కల్పవల్లి’పేరుతో ప్రొద్దుటూరు వీరయ్యగుప్త, రుద్రస్వామి కలిసి అచ్చువేసిన తత్వాల్లో జ్ఞానికి, భగవంతునికి కులం లేదు అనే సంవాదం గొప్పగా ఉంటుంది. ఇది శివ-పార్వతుల మధ్య జరిగిన సంవాదం.
పా. కులమున తక్కువ వనితను దేగను
తలుపు నేనెటుదెరుతూ నీ తప్పులు నేనెటుమరుతూ
శి: కులములేల ననుగొలుచువారి నా
కులమున గలుపుక నుందూ. ఇది
దెతిలయద పార్వతి ముందూ”
తెలంగాణ సంకీర్తన కవులను జయదేవుడు, లీలాశుకుడు, నారాయణతీర్థులు, అన్నమయ్య, రామదాసు, భక్త కవి పోతన, క్షేత్రయ్య, త్యాగయ్య, తూము నృసింహదాసు వంటి వాళ్ళు భజనమార్గంలో రచనలు చేయడానికి స్ఫూర్తిని ఇచ్చారు. అలాగే ఈ ప్రాంత తత్వ కవులను పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, శివరామ దీక్షితులు, భాగవతుల కృష్ణదాసు, సిద్ధప్ప, ఈశ్వరాంబ, వేమన., వంటివారు ప్రభావితం చేశారు.
వీరితోపాటు పురందరదాసు, సదాశివ బ్రహ్మేంద్రులు, ముత్తుస్వామి, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, వ్యాసారాయలు, సారంగపాణి కూడా సంకీర్తన సాహిత్యంపై తమ ప్రభావం చూపించారు.
తెలంగాణ ప్రాంతంలో మరో గొప్ప వాగ్గేయకారుడు భద్రాచల రామదాసు (1620-1684). ఇతడు తానీషా సమకాలికుడు. మార్గపద్ధతిలోని సంకీర్తనను భజన కూటాల్లోపాడే విధంగా క్రిందకు దింపిన రామదాసు సంకీర్తనలు అసలు సిసలైన జానపదగేయాలు. త్యాగయ్య, క్షేత్రయ్య, సారంగపాణివంటి కవులు సంకీర్తనను సంగీతంతో పరాంకోటికెక్కిస్తే, రామయ్యను ఆధారంగా పెట్టుకొన్న రామదాసు సంకీర్తనను సామాన్యుల దరిజేర్చాడు. కాఫీ, కమాను, దర్బారువంటి
ఉత్తరాది రాగాలను తెలుగు ప్రజలకు పరిచయంచేసి, ఆనందభైరవి రాగంతో తొలి కీర్తన రచించాడు రామదాసు. తెలంగాణ ప్రాంతంలో వాగ్గేయకార వైభవంలో మొదటి పుటను అలంకరించిన రామదాసును చాలామంది సంకీర్తన కవులు అనుకరించారు. అలాగే రాముణ్ణి దర్శించాలని భద్రాచలం వచ్చిన తూము నృసింహదాసు (1790-1833) కూడా తెలంగాణ మట్టి పరిమళం ఆస్వాదించినవాడే. మేలుకొలుపులు, అభ్యంజనం, దిష్టి, ఉయ్యాల, జాలి, లాలి, విరిచెండ్లాట, చూర్ణికలను కూడా సంకీర్తనలతోపాటు రచించి క్రొత్త ఒరవడికి శ్రీకారంచుట్టిన నృసింహదాసు సదా స్మరణీయుడు.
తెలంగాణ గర్వించదగ్గ వాగ్గేయకారుల్లో రాకమచర్ల వేంకటదాసు ప్రముఖులు. ప్రస్తుత వికారాబాద్‌ జిల్లా ఉమ్మెంతాలలో వారు జీవించారు. 500కుపైగా సలక్షణమైన కీర్తనలు రచించి భజనకూటాలను నిరంతరం చైతన్యంగా ఉంచిన మహనీయుడు వేంకటదాసు. సంకీర్తనల్లో వేంకటదాసు అనేక వైవిధ్యాలు చూపించాడు. బహుశా! రామదాసు తర్వాత అంత సలక్షణమైన కీర్తనలు వేంకటదాసువే అని చెప్పవచ్చు. ప్రౌఢమైన సంస్కృత సమాసాలను సామాన్యుల నోళ్లలో నానేటట్లు చేసిన రాకమచర్ల వేంకటదాసు ప్రతిభకు క్రింది పాదాలు ఒక ఉదాహరణ మాత్రమే
”దండము లివిగో రామ! భవఖండన తారకనామ
చండకిరణ సమకుండలధర వేదండ రక్షకాఖండ విజైభవ
శ్రీకరపరమోల్లాసా కరుణాకర వరదరహాసా
లోకనాధ బుధ! లోక వశీకర ప్రాకట గుణ సామ్రాజ్య విజైభవ”
ఒకప్పటి నల్లగొండ జిల్లా నారాయణపురం సంస్థానం నివాసి శివరామ దీక్షితులు (1690-1791) స్థాపించిన అచల మార్గంలో అనేకమంది తత్వ కవులు ఉదయించారు. కులం గోడలు బద్దలుకొట్టి ఆత్మ స్వరూపాన్ని బట్టబయలుగా చూపించిన అచల మార్గ తత్వ కవులు తెలంగాణ సంకీర్తన సాహిత్య మణికిరీటంలోని మేలిరత్నాలు. భాష విషయంలో వీరిది దేశీయమైన శైలి అయినా భావం విషయంలో శుద్ధ మైన వేదాంతాన్ని, నిర్గుణతత్వాన్ని, తాత్వ దృష్టిని అందించారు. శివరామ దీక్షితుల తర్వాత కంచావారి అప్పదాసు, భాగవతుల కృష్ణదాసు ఎందరో శిష్య, ప్రశిష్యులను తయారు చేశారు. వాడపల్లి ఆగదాసు, వెలివర్తి రామదాసు, గౌహాళ్ళ రాజయోగి, జూపూడి హనుమద్దాసువంటి సంకీర్తనకవులు ఈ పరంపర నుండి వచ్చినవాళ్ళే.
తెలంగాణలో బ్రహ్మానంద భజనమాల, తారకామృతసారము, తిక్కయ తత్వాలు, సుజ్ఞానచంద్రిక, యడ్ల రామదాసు తత్వాలు, మానసానంద భజనమాల, జ్ఞానబోధ లింగాత్మ కీర్తనలు, కలి ప్రమాణ తత్వ కీర్తనలు, వేపూరు రామకీర్తనలు ఎంతో ప్రసిద్ధి పొందాయి.
వేపూరు హనుమద్దాసు దేశీయమైన శైలితో పాలమూరు పలుకుబడులను ఉపయోగించి రామభక్తిని రసరమ్యం చేస్తే, ఖ్వాజా అహమదుద్దీన్‌ గొప్ప ఆత్మ దృష్టిని తన తత్వాల్లో ప్రదర్శించాడు. అన్నకదాసుల పురుషోత్తం, తిమ్మసానిపల్లి రంగదాసు, చిలుక కృష్ణదాసు, ఉప్పరిపల్లి కృష్ణదాసు, భక్తిని, తత్వాన్ని రెండు కళ్లలా నడిపించారు. తెలంగాణలో కృతులు రచించిన ఏకైక కవి పల్లా నారాయణాధ్వరి. ఇవి రాశిలో తక్కువైనా వాసిలో బహు గొప్పగా ఉన్నాయి.
17వ శతాబ్దంలో రాజోలును పాలించిన వాదె గౌడ ముష్టిపల్లి వేంకట భూపాలుని 3476 కీర్తనలు ఈనాటికి తాళపత్రాల్లో మూలుగుతున్నాయి. అవి పుస్తకరూపంలో వస్తే మన వాగ్గేయకారుల వైభవం మరో మెట్టు ఎక్కినట్లే.
తత్వాలు కొన్ని మాత్రమే రచించినా ఆధ్యాత్మిక ఉన్నతిని సమాజానికి అందించిన తెలంగాణ తొలి దళితకవి దున్న ఇద్దాసు ప్రభావం ఆ కాలంలో నాటి రెండు పెద్ద జిల్లాలపై (నల్లగొండ, మహబూబ్‌నగర్‌)ఉండడం విశేషం.
మనసాని లక్ష్మమ్మవంటి స్త్రీ సంకీర్తనకవులు కూడా తెలంగాణ జిల్లాల్లో ఉండడం ఈ భక్తి చైతన్యానికి, తత్వ దృష్టికి నిదర్శనంగా చెప్పవచ్చు. తెలంగాణ సంకీర్తన తత్వకవులు దేశీయమైన జీవభాషను బ్రతికించారు. సాహిత్యంలోని భాషను ప్రజల్లోకి, ప్రజల్లోని భాషను సాహిత్యంలోకి ఎక్కించిన పుణ్యమూర్తులు.
తెలంగాణ కీర్తనల్లోని వస్తు వైవిధ్యం పరమాద్భుతం. వైయక్తిక, సామాజిక, ప్రాకృతిక, ఆధ్యాత్మిక, తాత్విక భావనలను కీర్తనల్లో పలికించారు. ఇక్కడి సంకీర్తనల్లో ఎంతో భావ వైవిధ్యంతో, భక్తిమార్గం, నాయికా-నాయకభావం, హఠయోగంవంటి యోగమార్గం, చాటు సంకీర్తనలు చెప్పుకోదగినవి. తెలంగాణ ప్రాంతాన్ని సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వాసనల్లో ముంచెత్తిన వాగ్గేయకారుల వైభవం ఇక్కడ రేఖామాత్రమే ప్రస్తావించాం. ఇక్కడి వాగ్గేయకారుల వైభవం ఈ ప్రాంత, భాషా, సాంస్కృతికధారను అనధికారికంగా నిలబెట్టిందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. తెలంగాణలోని పాటకు ప్రాణం, మూలం ఇక్కడి వాగ్గేయకారుల పూర్వ రచనలే. ఆ మార్గం సరళతరమై ఈనాడు జానపద సంగీతమై మనల్ని కదిలిస్తున్నది నిజం. అలాంటి సంకీర్తనలు తెలంగాణలో ఈ రోజుకు కూడా సజీవంగా ప్రజల నోళ్ళలో నాట్యమాడటం నిజమైన భాషా పరిరక్షణగా చెప్పవచ్చు.
డా|| పి. భాస్కరయోగి 
‘మరుగునపడ్డ కావ్యం తృణవిలాపం’ అనే శీర్షికన 2015 డిసెంబర్‌ 14వ తేదీన ‘వివిధ’లో ద్వా.నా.శాసి్త్ర ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో తిమ్మసానిపల్లి రంగదాసు గురించి అస్పష్ట సమాచారం ఉన్నందునే ఈ వివరణ. నేను పరిశోధించి ప్రచురించిన ‘పాలమూరు జిల్లా వాగ్గేయ కారులు’, ‘పాలమూరు జిల్లా సంకీర్తనా సాహిత్యం’ అనే రెండు పుస్తకాల్లో వారి జీవితాన్ని, సాహిత్యాన్ని గురించి రాయడం జరిగింది. రంగదాసు స్వస్థలం మహబూబ్‌నగర్‌ - పిల్లలమర్రి మధ్యగల తిమ్మసానిపల్లి. ఇతని తల్లిదండ్రులు భీమమ్మ, బాలయ్య. రంగదాసు మొదటి పేరు రఘునాథుడు. యాదవ కులంలో జన్మించిన ఈ కవి ఉపాధ్యాయునిగా పనిచేసి 2002 ప్రాంతంలో మరణించారు. ఈయన మహబూబ్‌నగర్‌లోని తిరుమలదేవుని గుట్టపై వెలసిన బాలబ్రహ్మేంద్రయోగి (బాలయ్య తాత)కి శిష్యుడై ‘రంగదాసు’గా మారిపోయారు. పద్యం, సంకీర్తన ఈయన రచనా ప్రక్రియలు. మొట్టమొదట కవిత్వం వెలువరించాలన్న సహజమైన ఉత్సుకతతో ‘తృణవిలాపం’ రచించారు. ఇతణ్ణి అందరూ ‘రాజర్షి’ అని పిలిచేవారు. ఇతని కవిత్వం అపప్రయోగాలకు తావు లేకుండా, జనసామాన్యమైన శైలిలో సలక్షణంగా నడిచింది. జీవితాంతం ఆధ్యాత్మిక, సామాజిక సేవలో గడిపిన ఈ కవి ఆంజనేయ భజన కీర్తనల్ని 1956లో రచించారు. ఇందులో 201 కీర్తనలు ఉన్నాయి. అలాగే శ్రీ లక్ష్మీనృసింహస్వామి భజన కీర్తనలు, బాల బ్రహ్మేశ్వర తత్త్వామృతసారం అనే గొప్ప సంకీర్తన గ్రంథాలు కూడా వెలువరించారు. అందులో ఆధ్యాత్మిక, సామాజిక, తాత్త్విక భావనలకు పెద్దపీట వేశారు. ఉదాహరణకు మనుషులకు తేరగా సంపాదించాలనే బుద్ధి ఎక్కువ. అందువల్ల చాలా వేషాలు వేస్తుంటారు. దొరికితే దొంగలు లేదంటే దొరలు. ఈ దొంగలను మనిషిలోని అరిషడ్వవర్గాలతో పోలుస్తూ ఆనాటి గ్రామ రాజకీయాలను తూర్పారబట్టారు.
 
‘దొంగలార్గురు పొంచియున్నారురా! ఊరి లోపల 
దొరతనంబులు చేయుచున్నారురా 
దొంగలార్గురు పొంచియున్నారు దొరతనంబులు చేయుచున్నారు 
ఇంకకుండగ ఎదురు నిల్వుడి మించకుండ అణగద్రొక్కుడి 
మంచివారిని మించనివ్వరురా ఊరూర వెలసిన కొండెగాండ్రు 
పొంచి యుందురు లంచమిచ్చి పటేలు గారిని మంచమును 
దిగనీయకుందురు’
రంగదాసు కవిగానే కాకుండా మంచి భాషా పరిజ్ఞానం ఉన్న రచయిత. ఈయన రచనలు పాలమూరు పలుకుబడులకు పెట్టింది పేరు. పద్యాన్ని, సంకీర్తనలను లక్షణంగా అందించిన నికార్సయిన కవి. కవిత్వాన్ని ఉపాసించిన ఇలాంటి మట్టిలో కలసిన మాణిక్యాలు ఎందరో తెలంగాణలో ఉన్నారు. వారి కీర్తనలు మూడు పుస్తకాలు నా వద్ద వున్నాయి. వారిని గురించిన పూర్తి వివరాలు పైన చెప్పిన నా రచనల్లో చూడవచ్చు. 

-డాక్టర్‌ పి. భాస్కరయోగి
ఆంధ్రజ్యోతి  04-01-2016 02:38:39


గౌతమబుద్ధుని శిష్యుల్లో ప్రసిద్ధుడైన ఆనందుడు ఓసారి మండువేసవిలో ప్రయాణం చేస్తున్నాడు. అతనికి బాగా దాహం వేసింది. నలువైపులకు చూస్తే అల్లంత దూరాన కొందరు స్ర్తిలు నూతి నుండి నీరు తోడుతున్నారు. ‘అమ్మా! దాహం’ అన్నాడు ఆనందుడు. ఆ స్ర్తిమూర్తి వెంటనే నీళ్లు పోసి అతని దాహం తీర్చింది. ఆ తర్వాత ‘నేను మాతంగకన్యను; అంటరాని దానిని’ అన్నది. ‘‘అమ్మా! నేను నిన్ను మంచినీళ్లు మాత్రమే అడిగాను; నీ కులం అడగలేదు. ఇందుకు ప్రతిఫలంగా నాకు ఈ పూట మాత్రమే దాహం తీర్చిన నీకు జన్మజన్మల దాహం తీర్చే మార్గాన్ని చూపిస్తాను’’ అని ఆనందుడు ఆమెను బుద్ధుని దగ్గరకు తీసుకెళ్లాడు.
ఈ కుల సంస్కరణ దృష్టి భారతదేశంలో ఎప్పుడూ కొనసాగింది. ఆదిశంకరుని నుండి బాబా సాహెబ్ అంబేడ్కర్ వరకు నిరంతరం ఈ జబ్బును, కులం గబ్బును వదలించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం జరిగింది. హిందూ ధర్మంలో ఇప్పుడున్న ఈ వేల కులాల పేర్లు ఏ శాస్త్రంలో చెప్పలేదు. కులవ్యవస్థ ఒక సాంఘిక వ్యవస్థ మాత్రమే అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలి.
వర్ణాశ్రమ వ్యవస్థ పూర్తిగా గుణాధారితమైనదే కానీ జన్మ ఆధారితం కానేకాదు. మొదట యజుర్వేదం (31-11)లో చెప్పబడిన విరాట్ పురుషుని అవయవాల నుండి వివిధ వర్గాల పుట్టుక ఓ అలంకారికమైన వర్ణన తప్ప అవయవాల స్థానాల నుండి పుట్టిన వారి స్థాయిలను నిర్ణయించడం కాదు. విరాట్పురుషుని అవయవాల నుండి పుట్టడం అంటే స్ర్తి గర్భం నుండి శిశువు పుట్టినట్లు, చెట్లకు కాయలు పుట్టినట్లు భావించవద్దు. ఇక్కడ విరాట్పురుషుడు అంటే సమాజం. సమాజంలోని వ్యక్తులు ఈ ప్రజలకు ఎలా సేవలు అందించాలో అన్నివర్గాలను గురించి చెప్పింది. అదొక విస్తృమైన చర్చ.
అలాగే శాస్త్రాల్లో అనేక చోట్ల వ్యక్తుల మధ్య సమరసత నిర్మించి ఈ లోకాన్ని ముందుకు నడిపించడమే పూర్వీకుల సమన్వయతత్వం. కానీ దురదృష్టవశాత్తూ వెయ్యేళ్ల బానిసత్వంలో కులాల మధ్య అడ్డుగోడలు పెట్టబడే అవి మరింతగా పెరిగిపోయాయి. అంటరానితనం ఒకప్పుడు మన సమాజాన్ని ఓ జాడ్యంగా పీడించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఆధునిక మనువుగా చెప్పబడే మేధావి డాక్టర్ బాబాసాహెబ్ నేతృత్వంలో రచించబడిన రాజ్యాంగం ద్వారా ప్రజాపాలన సాగుతోంది.
అయితే ఇప్పటికీ అక్కడక్కడ దేవాలయ ప్రవేశాలు, సహపంక్తి భోజనాల తంతు నడవడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దేవాలయ ప్రవేశం, సహపంక్తి భోజనాలు పెట్టి దళిత వర్గాలను సమాజం నుండి దూరం చేయవద్దు. వాళ్లు ఈ సమాజంలో అంతర్భాగం, ఈ రోజు దళితులు కోరుతున్నది ఆత్మగౌరవం. ఆలయ ప్రవేశాలు, సహపంక్తి భోజనాలు శాస్త్ర సమ్మతంగా, రాజ్యాంగబద్ధంగా దళిత వర్గాలకు ఎప్పటినుండో ఉన్నాయి. ఓటు బ్యాంక్‌గా దళితులను వాడుకొనే వారు ఈ రోజుకూ ప్రహసనం కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో అస్తిత్వ వాదాల పేరుతో విదేశీ సిద్ధాంతాలను ఈ దేశ ప్రజలపై రుద్దుతున్నవారే రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి డెబ్బయి ఏళ్లు దాటినా పోరాటం, ఉద్యమం, వర్గతత్వం అంటూ ప్రచారం చేస్తున్న శక్తులు దళితులకు ఒరగబెట్టింది ఏమీలేదు. కనీసం సంప్రదాయక పార్టీలైనా ఏదో రకంగా బహుజనవర్గాలకు తమతమ పార్టీల్లో స్థానం కల్పించాయి. ఈ రోజు రాజకీయ యవనికపై కన్పిస్తున్న బహుజన నాయకుల్లో ఎక్కువమంది అలాంటి పార్టీల నుండి వచ్చినవారే.
వర్గదృక్పథం పేరుతో భావోద్వేగాలను రెట్టింపు చేసిన పార్టీలు నక్సలైట్లుగా, మావోయిస్టులుగా అమాయకపు యువకుల్ని ఆకర్షించి అధికారం మాత్రం కొన్ని వర్గాల చేతిలోనే పెట్టుకొన్నది నిజం. వీళ్లమాటలు సాహిత్యం చదివి ప్రాణాలు పోగొట్టుకొన్న వారి సంఖ్య చాలా పెద్దది. వాళ్ల అవసరాలకు తగినట్లుగా బూర్జువా పార్టీలతో జతకట్టి, వాళ్ల పల్లకీమోసే ఈ డెబ్బై ఏళ్ల నుండి కుల పార్టీలను, వారసత్వ పార్టీలను అవినీతిపరులను గద్దెపై కూర్చోబెట్టారు. మతతత్వం అనే పేరుతో హిందూద్వేషం, మిగిలిన మతాల సంతుష్టీకరణనే వీళ్ల లక్ష్యం. దాని విపరిణామమే ఈ రోజు ఉత్తరాదిలో భాజపా ప్రభంజనం.
ఈ కులం కుంపట్లు పెట్రోలు పోసి మరీ కాపాడుతున్న ఈ అస్తిత్వ వర్గాలు ఇటీవలకాలంలో ఈ జాడ్యం అన్ని కులాలకు కలిగించారు. రాజకీయ ప్రయోజనాలకోసం మరో పార్టీ అధికారంలో ఉన్న పార్టీని ఇరుకున పడేసి గద్దె దింపడానికి కొత్త ‘రిజర్వేషాలు’ వేయించింది. అందులో భాగంగా రాజస్థాన్‌లో గుజ్జర్ల ఉద్యమం తారాస్థాయికి చేరింది. అది చాలాసార్లు హింసాత్మకంగా మారింది. అదే క్రమంలో గుజరాత్ భాజపా ప్రభుత్వాన్ని దోషిగా చూపడానికి అక్కడా కులతత్వం పాచిక విసిరారు.
దాని ఫలితమే ఇప్పుడు పుట్టిన కులనాయక త్రయం హార్దిక పటేల్, జిగ్నేష్ మేవానీ, అల్షేష్ ఠాకూర్‌లు. వాళ్లు విసిరిన మాయాజాలం గుజరాత్ ఎన్నికల్లో పనిచేయలేదు. దానిని ఎదుర్కొవడానికి నరేంద్రమోదీ ‘ఓబిసీ’ మంత్రం అందుకొన్నారు. ‘పటేళ్లకు రిజర్వేషన్లు ఏ ప్రాతిపాదికన కాంగ్రెస్ ఇస్తుంది? సాధ్యంకాని హామీని రాహుల్, కాంగ్రెస్ జనం ముందుకు తెచ్చిందని’ మోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా చేరవేశారు. దానితో అటు ఓబిసీలు భాజపావైపు మళ్లగా, పటేళ్లు కాంగ్రెస్‌ను నమ్మలేక భాజపాకు ఓటు వేశారు. దీనితో కాంగ్రెస్ పరిస్థితి ‘రెంటికి చెడిన రేవు’ అయ్యింది.
ఈ రిజర్వేషన్ల వరుస క్రమ పరిణామాలు రేపు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రొత్త రాజకీయాలకు తెరలేపనున్నాయి. రిజర్వేషన్లు మొత్తానికి యాభై శాతం మించకుండా ఉండాలన్న రాజ్యాంగ సూత్రానికి, వివిధ కోర్టు తీర్పులను తుంగలో తొక్కి ఓటు బ్యాంక్ విధానాలు అనుసరిస్తున్న పార్టీలకు మోదీ నిర్ణయం శరాఘాతమే.
హడావుడిగా సుధీర్ కమిటీ, బీసీ కమిషన్ ఏర్పాటుచేసి తెలంగాణ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనుకొని అసెంబ్లీ తీర్మానం చేసిన తెరాస ప్రభుత్వ నిర్ణయం అడుగు ముందుకు పడడం కష్టం. ఇప్పటికే వైయస్ రాజశేఖర్‌రెడ్డి నాటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం అండ చూసుకొని ముస్లింలకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ల కేసు సుప్రీంకోర్టులో ఉండగా దానిని త్రోసిరాజని కేసీఆర్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం అమలుకాదని ఇటీవల గ్రహించిన కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తానని ప్రకటించారు. దానికి తమిళనాడు డిఎంకె నేత స్టాలిన్ మద్దతు ప్రకటించారు.
అలాగే ఆంధ్ర ప్రాంతంలో కమ్మ, రెడ్డి వర్గాలదే రాజకీయాల్లో పైచేయి అనే అపప్రధను తొలగించుకోవడానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తానని చంద్రబాబు కాపు రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టారు. మంజునాథ కమిషన్ రిపోర్టు ఆధారంగా ముద్రగడ పద్మనాభం కోరికను తీర్చడానికి అక్కడ తెదేపా ప్రభుత్వం మొన్న ‘కాపురిజర్వేషన్ల’ను ఆమోదించింది.
రాజకీయంగా క్రొత్త కులాలకు రిజర్వేషన్లు, మతాలకు రిజర్వేషన్లు పెంచడంవల్ల సమాజంలో సరిక్రొత్త ఆలోచనలు మొదలవుతున్నాయి. రిజర్వేషన్లు అనుభవిస్తున్న తమ ఉద్యోగాలకు, ఉపాధులకు భంగం వాటిల్లుతుందని భయపడితే, రిజర్వేషన్లు లేనివారు లోలోపల రగిలిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంత బీసీలు ఆందోళన చేస్తున్నది ఈ రెండు విషయాల్లోనే!
మరోవైపు ఆదిలాబాద్ ప్రాంతంలోని గిరిజనులు ఏకంగా లంబాడీల రిజర్వేషన్లు తొలగించాలని హైదరాబాద్‌నే ముట్టడించారు. వారికి వ్యతిరేకంగా లంబాడీలు ‘మా జోలికి వస్తే ఖబడ్దార్’ అని మరో సభను ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగులు మాకువద్దని వాళ్లను బలవంతంగా పంపేయడానికి గిరిజనులు ప్రయత్నించారు. చివరకు ప్రభుత్వం అక్కడి కలెక్టర్‌ను, పోలీసు అధికారులను బదిలీ చేయాల్సి వచ్చింది.
రేపు ‘మా కులం వాళ్లు మాకే చదువు చెప్పాలి’ అనే నినాదం వస్తే సమాజంలో సుహృద్భావ వాతావరణం ఎలా ఉంటుంది? ఇప్పటికే కులగజ్జి ఓ జాడ్యంలా తయారై సమాజాన్ని పట్టిపీడిస్తుంటే రేపటి పరిణామాలు సమాజాన్ని ఏ దిశకు నడిపిస్తాయో విజ్ఞులు ఆలోచించాలి. అన్ని కులాలు ఆర్థికంగా, సామాజికంగా సమాన స్థాయిలో ఎదగాలి, కానీ వాటి ఎదుగుదల వెనుక పరస్పర ద్వేషం ఉండకూడదు. అప్పుడు మనం భౌతికంగా ఎదుగుతాం కాని మనుషులుగా పతనం అవుతాం.
సమాజంలోని అన్ని కులాలు ఓ దండకున్న రంగురంగుల పూలలాంటి వారు. దండ అనే సమాజం అందంగా కనిపించాలంటే అన్ని రకాల పూలు ఉండాలి. కానీ దానిని బంధించే అంతస్సూత్రం సహృదయత. ఆ దారం తెగిపోతే పూలు ఎంత అందమైనవైనా దండ విచ్ఛిన్నమవుతుంది. ‘సమాజంలో కులం ఉండాలి కానీ కులంలో సమాజం ఉండకూడదు’ అన్న వౌలిక సూత్రాన్ని మరచిపోతే ఏ కులం వాళ్లు ఆ కులం వాళ్లకే పరిమితమవుతారు.
‘‘మానవులంతా ఒకే జాతివారని చెప్పేందుకు ప్రత్యేక సాక్ష్యాధారాలేం అవసరం లేదు. ఒక కుక్క మరో కుక్కని చూసినపుడు అది తన జాతికి చెందిన జంతువే అని గ్రహించగలుగుతుంది. మనిషికి మాత్రమే తోటి మనిషిని చూసినపుడు అనేక సందేహాలు కలుగుతుంటాయి. అంటే జంతువు కంటే కూడా మనిషే నికృష్టంగా ప్రవర్తిస్తున్నాడన్నమాట’’ అన్న నారాయణ గురు వాక్యాలను మనసులో పెట్టుకొని కులం కుంపట్లు రగిలిస్తున్న వారిపట్ల జాగరూకతతో వ్యవహరిస్తే భవిష్యత్తరాలు మనల్ని క్షమిస్తాయి.

డా. పి. భాస్కర యోగి 
Published Friday, 29 December 2017 ఆంధ్రభూమి 

పి. భాస్కరయోగి

వికీపీడియా నుండి
P. Bhaskar Yogi
పి. భాస్కరయోగి
జననండాక్టర్ పసుపుల భాస్కరయోగి
16-07-1977
గ్రామం : బుద్ధసముద్రం, మండలం : తిమ్మాజి పేట
నివాస ప్రాంతంమహబూబ్ నగర్
వృత్తిప్రభుత్వ కళాశాల అధ్యాపకులు
ప్రసిద్ధికవి, సంపాదకులు
మతంహిందూ
వెబ్‌సైటు
https://bhaskarayogi.blogspot.in/
డాక్టర్ పి. భాస్కరయోగి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన  కవి, రచయిత, సాహిత్య పరిశోధకులు.

జీవిత విశేషాలు[మూలపాఠ్యాన్ని సవరించు]

భాస్కరయోగి 1977 లో మహబూబ్ నగర్ జిల్లా పోతిరెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. వారి స్వగ్రామం బుద్ధసముద్రం. చిన్నతనం నుండి ఆధ్యాత్మికసంస్కారం కలిగిన ఈయన, కళాశాల చదివే రోజుల్లో ప్రముఖతాళపత్ర పరిశోధకులు శ్రీరుష్యశివయోగి వద్ద (1996లో) 'యోగదీక్ష' స్వీకరించారు. వారిద్వారానే గోరంట్ల పుల్లయ్యతో పరిచయమేర్పడింది. ఆ తర్వాత హైద్రాబాదులోనే స్థిరపడ్డారు. ఎన్నో గ్రంథాలను పరిశోధించారు. వివిధ ఆధ్యాత్మిక పత్రికల్లో, దినపత్రికల్లో దాదాపు 200 పైగా సాహిత్య, ధార్మిక వ్యాసాలు ప్రకటించారు. ఈ యోగి కేవలం రచనా వ్యాసంగమే కాకుండా ఆధ్యాత్మిక చర్చలు, ఉపన్యాసాలు చేయడంలో కూడా విశేషకృషి చేస్తున్నారు. ఎన్నో ఆధ్యాత్మిక సభల్లో అనేకాంశాలపై వందలకొద్ది ప్రసంగాలు చేసారు. పత్రాలను సమర్పించారు. అదే విధంగా ఈయనకు మహాత్ములన్నా, పండితులన్నా, పుస్తకాలన్నా ఎంతో ఇష్టం. అందుకే చిన్నవయస్సులో ఎన్నో గ్రంథాలను చదివారు. ఎందరో మహాత్ములను దర్శించారు.

రచనలు[మూలపాఠ్యాన్ని సవరించు]

ధర్మజిజ్ఞాస[మూలపాఠ్యాన్ని సవరించు]

వివిధ ఆచారాలు, సంప్రదాయాలు మరియు దైవికంశాలకు సంబంధించి సందేహాల నివృత్తి కోసం సుమారు 300 ప్రశ్నలకు జవాబుల రూపంగా వచ్చిన ఈ పుస్తకం 2009లో ముద్రించబడింది. ఇది వివిధ ఆగమ శాస్త్రాలు, ప్రాచీన, ఆధునిక గ్రంథాల నుండి ఆధారంగా ఈ పుస్తకం వెలువరించారు. ఇది విద్వజనుల ప్రశంసలు పొందింది. మనధర్మం పట్ల ఆసక్తిని, అనురక్తిని కలిగించడానికి ధార్మికులైన వారి మనస్సులోని సందేహాలను 'ధర్మజిజ్ఞాస' రూపంలో మనకు అందిస్తున్నారు. అద్భుతమైన వివరణలతో, పఠనీయతో కూడిన ఈ గ్రంథాన్ని తెలుగు ప్రజలు చక్కగా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం. మహాభారతం సపాదలక్షగ్రంధంకాగా ఈనాడు పాఠకులకు ఒక్కొక్కదానిపై సవాలక్షసందేహలున్నవి. వాటిని తీర్చడానికి ఈనాడు ధార్మికపత్రికలు ఈ ప్రజావేదికను పెట్టి ఎందరో పాఠకుల సందేహాలను శాస్త్రీయమైన సమాధానాలు పండితులచేత యిప్పిస్తున్నవి. ఈ భాస్కరయోగి పాఠకుల సందేహాలను తీర్చడానికి 'ధర్మజిజ్ఞాస' నందిస్తున్నాడు.[1]ఈ గ్రంథానికి గాను భాస్కర యోగికి ఓగేటి అచ్యుతరామ శాస్త్రి సాహిత్య పురస్కారం 2012 ప్రధానం చేయబడింది.ఈ గ్రంథం 2015లో రెండవ ముద్రణ పొందింది.

పాలమూరు జిల్లా సంకీర్తన సాహిత్యం[మూలపాఠ్యాన్ని సవరించు]

ఇది సంకీర్తన సాహిత్యంపై వెలువడిన పరిశోధన గ్రంథం. ఈ పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు 2011లో వీరికి డాక్టరేట్ ప్రధానం చేసింది. 300 పుటల ఈ గ్రంథము పాలమూరు సంకీర్తన సాహిత్యానికి సంబంధించిన ఏన్నొ ఆజ్ఞత విషయాలను వెలుగులోకి పలువురు విద్వాంసుల ప్రశంసను పొందింది. పాలమూరు సీమ పూర్వకాలం నుంచి నేటి వరకు సాహిత్య, రాజకీయ సాంస్కృతిక రంగాలలో ఖ్యాతిగాంచినదనీ, ఇన్నాళ్లూ చరిత్రకు అందని ఎన్నో సాహిత్య పరిమళాలను వెలుగులోకి తెచ్చారు భాస్కరయోగి. తెలంగాణ జిల్లా గ్రామీణ ప్రపంచంలో ఉన్న సారవంతమైన సంస్కృతికి నిదర్శనంగా ఉన్న సంకీర్తన సాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి.

పాలమూరు జిల్లా వాగ్గేయకారులు[మూలపాఠ్యాన్ని సవరించు]

పాలమూరు సాహిత్య పరిమళాన్ని పదిమందికి పంచాలనే స దుద్దేశ్యంతో ఎంతో శ్రమించి ఎందరో అజ్ఞాత సంకీర్తన కవుల జీవితాలను వెలుగులోకి తెచ్చారు కవి, రచయిత భాస్కరయోగి. భాస్కరయోగి పేరుకు తగ్గట్టుగానే అపారమైన తపస్సు లాంటిది చేసి ఈ గ్రంథాన్ని రూపొందించారు. పల్లె జీవితంతో వాగ్గేయకారుల జీవితాలను తెలుసుకోగోరు వారంతా తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. పాలమూరు జిల్లా వాగ్గేయకారులు పుస్తకాన్ని పి.భాస్కరయోగి రచించాడు. 2011లో ముద్రించిన ఈ పుస్తకంలో భాస్కరయోగి పాలమూరు జిల్లా పరిశోధనలు చేసి వాగ్గేయకారుల జీవితచరిత్రలు, వారి కీర్తనలు పొందుపర్చారు. ప్రముఖ కవి కపిలవాయి లింగమూర్తిఅభివీక్షణం పేరుతో దీనికి ముందుమాట రాశారు. జిల్లాలోని 160 వాగ్గేయకారుల జీవితచరిత్రలను సంక్షిప్తంగా వివరించడమే కాకుండా ప్రతి వ్యాసం చివరన వారి కీర్తనలు కూడా రచయిత ఇచ్చాడు[2]. చాలామంది వాగ్గేయకారుల చిత్రాలను కూడాపొందుపర్చడం జరిగింది. తెలుగులో తొలి వాగ్గేయకారుడు 13వ శతాబ్దికి సంతాపూర్ గ్రామవాసి అయిన సింహగిరి కృష్ణమాచార్యులు అని ఇతనితోనే సంకీర్తనా సాహిత్యం ప్రారంభమైందని[3] రచయిత వివరించాడు. 13వ శతాబ్ది నుంచి నేటి వరకు జిల్లాలో నివసించిన 137 వాగ్గేయకారులే కాకుండా పూర్తి వివరాలు లభించని మరో 30 వాగ్గేయకారుల గురించి పుస్తకం చివరన సంక్షిప్తంగా వివరించబడింది. ఇందులో వందలాది కీర్తనలు చేసిన వారి నుంచి రెండు-మూడు కీర్తనలు చేసిన రచయితల గురించి కూడా సాధ్యమైనంత వరకు వివరాలు సేకరించడం జరిగింది. పాలమూరు జిల్లా వాగ్గేయకారుల చరిత్రను అక్షరబద్ధం చేయడం హర్షణీయమని ప్రముఖ సాహిత్య పరిశోధకుడు వైద్యం వేంకటేశ్వరాచార్యులు పదార్చన పేరుతో వ్రాసిన ముందుమాటలో పేర్కొన్నాడు.[4] ఈ మహత్తర గ్రంథానికి వీరికి బి.ఎన్ శాస్త్రి కల్చరల్ ఎక్స్లెన్స్ అవార్డ్ 2012లో ప్రకటించింది.

ధర్మధ్వజం[మూలపాఠ్యాన్ని సవరించు]

సమాజంలో అవినీతి పెరిగిపోయింది. విలువలు పతనమవుతున్నాయి. ఎక్కడ చూసినా సామాజిక అశాంతి పెరిగిపోయిం ది. మరోవైపు ఈ దేశ గాలి పీల్చి పరదేశీ పాటపాడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నదని భాస్కరయోగి కలవరంతో చేసిన రచనలు ఇవి.[5]

సమత్వ సాధనలొ సౌజన్య మూర్తులు[మూలపాఠ్యాన్ని సవరించు]

భారతదేశంలో కూలతత్వాన్ని నిర్ములించడానికి, మానవతా తత్వాన్ని నెలకొల్పడానికి కృషి చేసిన ఎందరో సంఘ సంస్కర్తల సాహిత్యం మరియు జీవితాల ఆధారంగా వ్రాయబడిన గ్రంథం ఇది. ఈ ముప్పై సంవత్సరాల కాలం లోనే సుమారుగా 400 మందికి పైగా గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి లో సమరసతా సాధనలో పని చేసిన వారి పేర్లు భాస్కర యోగి గారు పేర్కొన్నారు. దీనిని హిందీలోకి అనువదించారు. తెలుగులో రెండవ ముద్రణ పొందింది.

యాదాద్రి సంకీర్తనాచార్యుడు ఈగ బుచ్చిదాసు[మూలపాఠ్యాన్ని సవరించు]

తిరుపతి శ్రీవేంకటేశ్వరునికి అన్నమయ్య పదసేవ చేసినట్టుగా, భద్రాచల రామునికి కంచర్ల గోపన్న దాసుడయినట్టుగా యాదాద్రి నృసింహస్వామిని ఈగ బుచ్చిదాసు సేవించారు. ఆయన కీర్తనలు, రెండు శతకాలు, మంగళహారతులు, స్తోత్రాలు భాస్కరయోగి సంకలనకర్తగా ఈగ బుచ్చిదాసు సమగ్ర సాహిత్యం రచనలను ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించింది.[6]

సంపాదకత్వం కాలమిస్ట్[మూలపాఠ్యాన్ని సవరించు]

భాస్కర యోగి ప్రస్తుతము మలయాళ స్వామి ఆశ్రమము, గంగాపురం మహబూబ్ నగర్ జిల్లా వారి వారి ద్వారా ప్రచురితమవుతున్న గీత జ్ఞానయోగ సమాచార్ ఆధ్యాత్మిక పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. అలాగే ఆంధ్రజ్యోతిలో పరంజ్యోతి శీర్షికలో ఆధ్యాత్మిక కాలమ్ మరియు అంతే కాకుండా ఆంధ్రభూమి దినపత్రికలో భాస్కరవాణి శీర్షికన రాజకీయ సామాజిక రంగాలపై విమర్శనాత్మక వ్యాసాలతో కాలమ్ నిర్వహిస్తున్నారు.




Hyderabad: Praising Chief Minister K Chandrashekar Rao for establishing a good tradition for holding World Telugu Congress (WTC), Minister for Endowments and Law A Indrakaran Reddy said that the global language conference is a historical moment to reckon with.

Attending as a chief guest to a session on ‘Sathaka, Sankirthana, Geya Sahithyam’ held at Potti Sriramulu Telugu University (PSTU), here on Monday, the Minister said that people from different parts of the country and from abroad have attended the WTC in a big way, making it a historical event in Telangana.

The Minister facilitated famous poet Dr J Bapu Reddy and educationalist Dr Velichala Kondala Rao during the occasion. Prof Kasireddy Venkata Reddy, who presided over the session, said that the state is a treasure trove in all the three genres in the Telugu language and literature. 


Attended by Ashavadi Prakash Rao, a lecture series on Pada Sankirthana, Lalitha Geyalu, Sathaka, and folk and film songs in the Telugu literature in Telangana has been organised.

Telangana Sahitya Akademi Chairman Nandini Siddha Reddy, P Bhaskara Yogi, Suddala Ashok Teja, Vaddepalli Krishna, Tirunagari and Podduturi Yella Reddy were among those who spoke during the lecture series.


THE HANS INDIA |    Dec 18,2017 , 11:59 PM IST

Description

             మాన్యశ్రీ పి. భాస్కరయోగి 1977 లో మహబుబ్ నగర్ జిల్లా పోతిరెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. వారి స్వగ్రామం బుద్ధసముద్రం. చిన్నతనం నుండి ఆధ్యాత్మికసంస్కారం కలిగిన ఈయన, కళాశాల చదివే రోజుల్లో ప్రముఖతాళపత్ర పరిశోధకులు శ్రీరుష్యశివయోగి గారివద్ద (1996లో) 'యోగదీక్ష' స్వీకరించారు. వారిద్వారానే మాన్యులు గోరంట్ల పుల్లయ్య  గారితో పరిచయమేర్పడింది. ఆ తర్వాత హైద్రాబాదులోనే స్థిరపడ్డారు. ఎన్నో గ్రంధాలను పరిశోధించారు. వివిధ ఆధ్యాత్మిక పత్రికల్లో, దినపత్రికల్లో దాదాపు 200 పైగా సాహిత్య, ధార్మిక వ్యాసాలు ప్రకటించారు.
             ఈ యోగి కేవలం రచనా వ్యాసంగమే కాకుండా ఆధ్యాత్మిక చర్చలు, ఉపన్యాసాలు చేయడంలో కూడా విశేషకృషి చేస్తున్నారు. ఎన్నో ఆధ్యాత్మిక సభల్లో అనేకాంశాలపై వందలకొద్ది ప్రసంగాలు చేసారు. పత్రాలను సమర్పించారు. అదే విధంగా ఈయనకు మహాత్ములన్నా, పండితులన్నా, పుస్తకాలన్నా ఎంతో ఇష్టం. అందుకే చిన్నవయస్సులో ఎన్నో గ్రంధాలను చదివారు. ఎందరో మహాత్ములను దర్శించారు. ప్రస్తుతం పాలమూరుజిల్లా సంకీర్తనసాహిత్యంపై పరిశోధన చేస్తున్నారు.
            మనధర్మం పట్ల ఆసక్తిని, అనురక్తిని కలిగించడానికి ధార్మికులైన వారి మనస్సులోని సందేహాలను 'ధర్మజిజ్ఞాస' రూపంలో మనకు అందిస్తున్నారు. అద్భుతమైన వివరణలతో, పఠనీయతో కూడిన ఈ గ్రంధాన్ని తెలుగు ప్రజలు చక్కగా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం. 
            మహాభారతం సపాదలక్షగ్రంధంకాగా ఈనాడు పాఠకులకు ఒక్కొక్కదానిపై సవాలక్షసందేహలున్నవి. వాటిని తీర్చడానికి ఈనాడు ధార్మికపత్రికలు ఈ ప్రజావేదికను పెట్టి ఎందరో పాఠకుల సందేహాలను శాస్త్రీయమైన సమాధానాలు పండితులచేత యిప్పిస్తున్నవి. ఈ భాస్కరయోగిగారు పాఠకుల సందేహాలను తీర్చడానికి 'ధర్మజిజ్ఞాస' నందిస్తున్నాడు.
- పి. భాస్కరయోగి

Features

  • : Dharma Jignasa
  • : T Bhaskara Yogi
  • : Jatheya Sahitya Parishath
  • : NAVOPH0177
  • : Paperback
  • : 252
  • : Telugu



ధర్మధ్వజం


సమాజంలో అవినీతి పెరిగిపోయింది. విలువలు పతనమవుతున్నాయి. ఎక్కడ చూసినా సామాజిక అశాంతి పెరిగిపోయిం ది. మరోవైపు ఈ దేశ గాలి పీల్చి పరదేశీ పాటపాడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నదని భాస్కరయోగి కలవరంతో చేసిన రచనలు ఇవి.

Features

  • : Dharma Dhwajam
  • : Dr P Bhaskarayogi
  • : Navodaya Publishers
  • : NAVOPH0491
  • : Paperback
  • : 2013
  • : 198
  • : Telugu

P. Bhaskara Yogi Book AVKF Online





















Dr.P.Bhaskarayogi

Dr.P.Bhaskarayogi
Display: List / Grid
Show: 
Sort By: 

హిందువులు పండుగలు 
Hinduvula Pandugalu Online





Hinduvula Pandugalu

₹ 500
P.Bhaskar Yogi