– మేం వస్తే జిఎస్‌టిని సంస్కరిస్తాం. ప్రమాదంలో విదేశాంగ విధానం. కశ్మీర్‌లో అవకాశవాద కూటమి. సంఘ్‌ గుప్పిట్లో కేంద్రం.

– కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్‌ గాంధి
– ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుదాం అనుకుందట !
– పాక్‌లోనే నాకు ఎక్కువ షేరు లభిస్తోంది. భారత్‌లో అంతా విద్వేషమే. ఇక్కడ చాలా మంది నాకు స్వాగతం పలుకుతున్నారు. వారెవరో నాకు తెలియకున్నా వచ్చి కౌగిలించుకుంటున్నారు. ద్వైపాక్షిక కీలక అంశాల పరిష్కారానికి చర్చలే మార్గం. పాక్‌ అంగీకరించినా, భారత్‌ అంగీకరించడం లేదు.
– బహిష్కృత కాంగ్రెసు నేత మణిశంకర్‌ అయ్యర్‌
– మరీ ఇంత నోటి దురద మంచిది కాదు అయ్యర్‌..!
– సిపిఎం రాజకీయ ఎత్తుగడలు గందరగోళంగా ఉన్నాయి. కాంగ్రెసుతో పొత్తు లేకుండా బిజెపిని ఓడించడం ఆ పార్టీ వల్ల కాదు. అతిపెద్ద పార్టీ కాంగ్రెసుతో జట్టు కట్టకుండా బిజెపి వ్యతిరేక ఓట్లలో చీలికను ఎలా నివారించగలం?
– సిపిఐ నేత డి.రాజా
– ఎమర్జెన్సీలో కూడా మీరు కాంగ్రెసును వదల్లేదు. ఇప్పుడు మాత్రం దూరంగా ఉండగలరా రాజా !
– మోది ముందు కెసిఆర్‌ పిల్లి
– కాంగ్రెసు నేత షబ్బీర్‌ ఆలీ
– గతంలో సోనియాగాంధీతో మీ పార్టీ నాయకులకున్న అనుభవం కొద్దీ చెప్పుకొచ్చారా !
– సైనికుల్లో భారత ముస్లింలు ఎందరు చనిపోయారో ఓవైసీ లెక్క చెబుతారు. అలాగే జవాన్లపై దాడులు చేసి చంపేస్తున్న ఉగ్రవాద సంస్థల్లో ముస్లిం సంఖ్య ఎంతో కూడా ఆయన చెబుతారా!
– భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి
– ఇంత ఘాటుగా, హాటుగా అడగగలిగేది మీరే !
– సోనియా కరుణించకుంటే 50 ఏళ్లైనా తెలంగాణ వచ్చేది కాదు. ఆంధ్రా కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే భగీరథ.
– కాంగ్రెసు నేత జానారెడ్డి
– ‘ఎవడేలుతున్నడురో తెలంగాణ – ఎవని పాలయ్యిందిరో తెలంగాణ’ అన్న పాట ఎత్తుకోండి ప్లీజ్‌ !
– ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదికి ఎవరైనా ఐ లవ్‌ యు చెప్పారా? నాకు అయితే అనుమానమే. ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నా. ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు నటి ప్రియా ప్రకాశ్‌ వీడియో చెంపపెట్టు.
– జిగ్నేష్‌ మేవాని, గుజరాత్‌ ఎమ్మెల్యే
– మోది ఏమైనా మీ ఫ్రెండ్‌ హార్దిక్‌ పటేల్‌ అనుకొన్నావా!?
– వివిధ పార్టీలతో పొత్తుల వల్లే రెండున్నర దశాబ్దాలుగా నష్టపోవడం.
– సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం
– అందుకే మిమ్మల్ని తోక పార్టీలంటుంటారు! పొత్తు లేకుండా మీరు బతకడం కష్టం.
– ఇక సినిమాలు చేయను
– నటడు కమల్‌ హసన్‌
– రాజకీయాల్లో నటన బాగానే చేస్తున్నారు కదా! నటన కూడా అదిరిపోతోంది.
– చనిపోయిన ఏడుగురు జవాన్లలో ఐదుగురు ముస్లింలే. అయినా మమ్మల్ని అవమానిస్తున్నారు.
– అసదుద్దీన్‌ ఒవైసి
– ఇదే ‘మతోన్మాదం’ అంటే. అలాగే లెక్కలు తీస్తూ వెనక్కి వెళ్లండి.

****************************************************
– డా|| పి.భాస్కరయోగి

ఇతర దేశాల్లో భాస అనుసంధాన సాధకం. విదేశీయులు తమ భాషలను ‘ఉపయోగించే విధానం’పై అధ్యయనం చేస్తారు. మన భాషలో ధ్వని ప్రధానం. వాక్కు, అర్థం రెండూ విడదీయరానివిగా భావిస్తాం. శబ్దాన్ని ‘నాదస్వరూపం’గా పిలుస్తాం. దానినే వేదాంతం ‘శబ్ద బ్రహం’గా అభివర్ణించింది. నిర్గుణ, నిరంజన, స్వయంజ్యోతిర్లింగ పరమాత్మను శబ్దబ్రహ్మతో సూచిస్తాం. ప్రకృతి నిండా వ్యాపించి ఉన్న శబ్దబ్రహ్మానికి ప్రతీక.. ఓంకారం. అది ఆ పరమాత్మకు మరోపేరు. దాని ప్రాముఖ్యత అంతా ఒక ధ్వని, ఒక సంకేతం. దానిలోని అర్థాన్ని గురించిన ప్రశ్న కన్నా దాని ధ్వని స్వరూపానికే మన శాస్త్రాల్లో ప్రాధాన్యం ఎక్కువ ఉంది. దానికి ఆధ్యాత్మికత కన్నా విజ్ఞాన తత్వం ఎక్కువ. సాధకుడు అంతరంగాన్ని కదపగలిగే శక్తి ఆ ఓంకారానికి ఉంది. మనసు లోతుల్లోని పొరల్లో దాగి ఉండే వాసనలనే మలినాలను బయటకు విరజిమ్మి ఆత్మతత్వాన్ని గుర్తుచేసేది శబ్దబ్రహ్మంగా పిలిచే ఓంకారం. ఓంకార జపం చేస్తే చిత్తమాలిన్యాలను తొలగిస్తుంరా శబ్దాన్ని ఉచ్చరిస్తే వివిధ చక్రాలపై పనిచేసి వాటిని చైతన్యవంతం చేసి లక్ష్యసిద్ధిని, ఆనందాన్ని కలిగిస్తుంది. శబ్దం నుంచే యోగం వైపు తీసుకెళ్లే సాధనం ఓంకారం. ప్రకృతి నిండా వ్యాపించిన శబ్దబ్రహ్మానికి ఓంకారం ప్రతీక. నాదబ్రహ్మాన్ని పట్టుకుంటే పరమాత్మవైపు మనం అడుగులు వేసినట్టే. అందుకే మన మహర్షులు.. ఓంకారాన్ని మోక్షసాధనంగా అభివర్ణించారు. 

*********************************************************************************
డాక్టర్‌ పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐఇద్దరు భార్యాభర్తలు గుడికి వెళ్లారట. భర్త దేవునికి మొరపెట్టుకుంటూ స్వామీ! నిన్న మా ఇంట్లో సూది పోగొట్టుకపోయింది. అది దొరికితే రేపు గుడిలో 5 కేజీల చక్కెర పంచి పెడతాను’ అన్నాట్ట. వెంటనే భార్య అందుకొని ఏమయ్యా! నీకు బుద్ధుందా! సూది ధర ఒక్క రూపాయి, చక్కెర ధర 5 కేజీలకు రెండు వందల రూపాయలకు పైగా అవుతుంది. అదేం మొక్కు? అన్నదట. దానికి భర్త అది దొరికేదీ లేదు, నేను పంచేది లేదు అన్నాడట. ఇపుడు దేశమంతా క్రొత్త పార్టీలు, ఫ్రంట్‌లు పెట్టేవారు ఇలాగే ఆలోచిస్తున్నారు.
నరేంద్రమోదీ అనే పర్వతాన్ని ఢీకొట్టి పిండి చేయడం దేశంలో రాజకీయం అయితే, కెసీఆర్ అనే బాహుబలిని గద్దె నుండి దించడం తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో ప్రధాన అంశం. ఇక చంద్రబాబును వ్యవస్థాపరంగా చీకాకు పరచడానికి ముప్పిరిగొన్న అంశాలే ఎక్కువ. ఆంధ్రా పొలిటికల్ వార్‌లో క్లారిటీ తక్కువ. కన్ఫ్యూషన్ ఎక్కువ. అక్కడ రాజకీయం కన్నా ప్రత్యేక హోదానే ప్రధాన దిక్సూచి అయ్యింది.
2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రధాన స్రవంతి పార్టీలు మోదీని ఎన్నికల్లో ఎదుర్కొనే కార్యాచరణ కన్నా అపఖ్యాతిపాలు చేయడానికే ఎక్కువ ప్రయత్నించాయ. ఈ వ్యతిరేక ప్రచారం అంతా మోదీకి కలిసొచ్చింది. హిందూ మతతత్వ భావజాలం ఉన్న వ్యక్తిగా మోదీపై బురదజల్లారు. దాంతో ఈ దేశంలో హిందూ మతతత్వంలో జీవించడం ఓ నేరమా! అని ప్రజలు ఆలోచించారు. ముఖ్యంగా చదువుకొన్న యువకులు సామాజిక మాధ్యమాల్లో మోదీకి మద్దతుగా నిలిచారు. ఆ ఎన్నికలు మోదీ వర్సెస్ సూడో సెక్యులర్ గ్యాంగు మధ్య పోటీగా జరిగినట్టు తలపించాయి. 2019 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మళ్లీ అదే ప్రహసనం ప్రారంభమయింది. మోదీ వ్యక్తిగతంగా ఏ తప్పూ చేయలేదని ఈ రోజుకూ ప్రజల్లో నమ్మకం బలంగా ఉంది. కానీ నోట్ల రద్దు, జిఎస్‌టి లాంటి అపవిత్ర పనులు మోదీలాంటి ఛాయ్‌వాలా ఎలా చేస్తాడు! అన్నట్లు కాంగ్రెస్, కమ్యూనిస్టులు విషప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అద్భుత ఘనకార్యం ఏదైనా చేయాలంటే కాంగ్రెస్ పార్టీనో, మన్మోహన్ సింగ్‌లాంటి ఆర్థికవేత్తనో చేయాలిగానీ మోదీలాంటి అర్భకుడు చేయడం దుర్మార్గం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. దీనికితోడు కమ్యూనిస్టుల కనుసన్నల్లో నడిచే మాధ్యమాలు మోదీని వీలైనంత అపఖ్యాతి పాలు చేస్తున్నాయి.
విచిత్రం ఏమిటంటే బాబ్రీ మసీదు కూలగొట్టకముందు వాజ్‌పేయిని ‘రైట్‌మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ’ అన్నారు. అప్పుడు అద్వాణీ కరడుగట్టిన మతతత్వవాది. ఇటీవల కాలంలో అద్వాణీ పట్ల ప్రతిపక్షాలు,మీడియా వల్ల మాలిన ప్రేమ ఒలకబోస్తున్నారు. యశ్వంత్‌సిన్హా, మురళీమనోహర్ జోషీ, లాల్‌కృష్ణ అద్వాణీ, సుష్మాస్వరాజ్ వంటి నేతలను ఉదారవాదులని బిరుదులు ఇవ్వడం వెనుక మోదీని విలన్‌గా చేయడమే!
ఇలాంటి మోదీ కుర్చీ లాగేయడానికి రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకొని వచ్చాడు కానీ కమ్యూనిస్టులు మాత్రం గద్దెను ఎక్కిన మొదటిరోజు నుండి అదే ప్రయత్నంలో ఉన్నారు. ఆ క్రమంలో అనేక రాజకీయ పణామాలు జరుగుతున్నాయి. దానికోసం వివిధ రాష్ట్రాల్లో అనేక ఫ్రంట్‌లకు జీవం పోస్తున్నారు. ఒకవేళ ఫ్రంట్ నిర్మించలేని చోట మోదీని తిట్టేవాళ్లకు క్రొత్త రక్తం ఎక్కిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో భాజపాను ఓడించి గద్దెనెక్కాక తనకు తానే అతి పెద్ద నాయకుడుగా, మోదీకి సమఉజ్జీగా ఊహించుకొన్నాడు. రోహిత్ వేముల హత్య మొదలుకొని అనేక విషయాల్లో మోదీని అడ్డగోలుగా తిట్టిపోశాడు. ఆప్ పార్టీ నుండి కపిల్ మిశ్రా లాంటి వాళ్లు బయటకు రావడం పంజాబ్ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడం అతని నిజస్వరూపం తెలియజేశాయి. దాంతో మమతా బెనర్జీ మోదీని బాగా తిట్టగల సమర్థురాలయింది. ఆమెను ఆకాశానికెత్తేశారు. చివరకు కన్హయ్యకుమార్ మోదీని బాగా తిడుతున్నాడని అతనికీ విపరీత ప్రచారం కల్పించారు. ఢిల్లీ, బీహార్ తప్ప మోదీ, షా ద్వయం అన్ని రాష్ట్రాల్లో గణనీయంగా తమ ఖాతాలో వేసుకొంది. ఇపుడు దక్షిణాదిపై దృష్టి పెట్టి కర్ణాటకను ముఖద్వారంగా చేసుకొని ప్రవేశించాలని మోదీ, షాల ప్రయత్నం. దానిని నిలువరించాలనే అన్ని పార్టీల ప్రయాస.

ప్రస్త్తుతం సీపీఎం పార్టీ రెండు గ్రూపులుగా మారి, ఎలాగైనా ఎన్టీయేను గద్దె దించాలనే వర్గం ఒకటి. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టాలని మరో వర్గం ఉవ్విళ్లూరుతున్నారు. సీపీఐ కూడా అదే మార్గంలో ఉంది. రేపు త్రిపుర, కర్ణాటకలో ఎన్నికలు జరిగి ఫలితాలు వస్తేగానీ ఈ ఫ్రంట్‌లకు ఉత్ప్రేరకం అందదు. ఉన్న పార్టీలకే ‘సెక్యులర్’ అనే ముద్రవేసి క్రొత్త రుచులు తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ యుద్ధంలో నేరుగా పోరాడలేక ఉత్తర-దక్షిణల మధ్య గోడలు కట్టే ప్రయత్నం జరుగుతుంది. కర్ణాటకలోని సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడు ద్రావిడ పార్టీలు, కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం, ప్రత్యేక హోదాకోసం పడిగాపులు గాస్తున్న తెదేపా ప్రభుత్వం, తెరాస ప్రభుత్వం అన్నింటినీ కలిపి ఒకవర్గం మీడియా ఉత్తరాది వారిపై పోరాడే వీరభటులుగా చిత్రీకరిస్తున్నది. కేసీఆర్‌కు ఈ విషయంపై పెద్ద ఆసక్తి లేకున్నా మీడియామాత్రం మోదీపై ఉన్న అక్కసుతో ముగ్గులోకి దించాలని చూస్తున్నది. నిజానికి మోదీ, షాలు కూడా పశ్చిమ భారత్ వారే. తెలుగు రాష్ట్రాల నుండి ఢిల్లీ ఎంత దూరమో గుజరాత్ నుంచి కూడా ఢిల్లీ అంతే దూరం. నిజానికి ఢిల్లీ అనుపానులు తెలుసుకోవడానికి మోదీ, షాలు కూడా అరుణ్‌జైట్లీ లాంటి స్థానికులైన సీనియర్లపై ఈ రోజుకూ ఆధారపడే ఉన్నారు. మరి గతంలో లాలూప్రసాద్, మమతాబెనర్జీ లాంటి రైల్వే మంత్రులు ఇక్కడి రాష్ట్రాలకు సున్నాజూపి తమ స్వరాష్ట్రాలకు అన్ని ప్రాజెక్ట్‌లను తరలించుకొని పోయినపుడు ఈ ఆత్మాభిమానం ఎక్కడికి పోయింది? 1200 మందికి పైగా తెలంగాణలో యువకులు అమరులవుతుంటే కనీసం నోరు తెరచి మాట్లాడని సోనియాపై ఎవరైనా పనె్నత్తి మాట్లాడారా? ఇటలీ నుండి వచ్చి ఈ దేశంలో ఓ పార్టీకి వారసురాలు అయితే అంగీకరించిన మనం దక్షిణాది ఉత్తరాది అంటూ ప్రగల్భాలు పలుకుతుంటే సిగ్గే మనల్ని చూసి సిగ్గు పడదా? ఆఖరుకు రేణుకాచౌదరి ప్రధానిని అవహేళన చేస్తూ వికటాట్టహాసం చేస్తే ఆయన ఇచ్చిన కౌంటర్‌ను కూడా ఉత్తరాది-దక్షిణాది అంటూ కలర్ ఇవ్వడం ఎంతవరకు సబబు? దక్షిణాది వాళ్లం అయితే అలా ప్రవర్తించవచ్చా?
అలాగే తమిళనాడులో జయలలిత మరణం తర్వాత చిత్ర విచిత్ర రాజకీయాలు జరుగుతున్నాయి. శశికళ జైలుకు వెళ్లడానికి, పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య పంచాయతీకి, దినకరన్ ఎన్నికల్లో గెలవడానికి.. అన్నింటికి భాజపానే కారణం అట!? అక్కడ భాజపాకు, సీట్లూ లేవు. ఓట్లూ లేవు. కానీ ఇటీవల ఆ పార్టీకి కావలసినంత అపఖ్యాతి మూటను అంటగట్టారు. ఒకవైపు కమల్‌హాసన్ భాజపాపై ఒంటికాలితో లేస్తున్నాడు. తనకు తానే వీర సెక్యులర్‌గా ఎగిరిగంతేస్తున్నాడు. మరి సెక్యులర్ మంగళసూత్రం ధరించిన డిఎంకె పరిస్థితి ఏంటి? రజనీకాంత్ సినిమా రిలీజ్ అయ్యింది. మహావతార్ బాబా సింబల్‌ను కూడా మతతత్వం అంటూ ముద్ర వేస్తున్నారు. హిందూ రాజకీయాలకు ద్రావిడ ప్రాంతంలో స్థానం లేదు అంటూ పల్లవి అందుకున్నారు. ఇదంతా రజనీకాంత్‌ను భాజపాతో కలవకుండా నిలువరించడమే!
ఇక తెలంగాణలో పార్టీలు, ఫ్రంట్‌ల ఏర్పాటు చూస్తే నవ్వొస్తుంది. కేసీఆర్ లాంటి రాజకీయ వ్యూహకర్తను ఎదుర్కోవడానికి అనేక తోక పార్టీలకు జీవం పోస్తున్నారు. మజ్లిస్ అధికారంలో ఉన్న తెరాసతో కలవగా, భాజపా ఇంకా ఏలిననాటి శని గ్రహం పరిధిలోనే ఉంది. కాంగ్రెస్ మాత్రం ప్రస్తుతం తెరాసకు ప్రత్యామ్నాయ వేదికగా భ్రమింపజేయడంలో విజయవంతం అయ్యింది. ఇటీవల రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో కలిసినా ఇంకా అంత పెద్ద మార్పు లేదు. పాత కాపులు మాత్రం తెరాసపై మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు.
కమ్యూనిస్టులు ఎన్నో రకాల ఫ్రంట్‌లకు తమ సంజీవిని విద్య ద్వారా ప్రాణం పోస్తున్నారు. గద్దర్, వేదకుమార్ ఓ పార్టీలాంటిది పెట్టారు. అది ఏమయిందో తెలియదు. తమ్మినేని వీరభద్రం ప్రధాన పాత్రగా ఈ ప్రహసనం నడుస్తుంది. టీ-మాస్ పేరుతో ఆవిర్భవించిన వేదికను ఆర్యవైశ్యులపై పోరాడి గెలిచిన కంచ ఐలయ్యకు అప్పగించారు. జస్టిస్ బి.చంద్రకుమార్ పాదయాత్రలు, పరిశీలనలు చేసి మరో క్రొత్త వేదికను సృష్టించబోతున్నట్టు వార్త. కేసీఆర్‌కు కామన్ శత్రువులైన గద్దర్, మందకృష్ణ, ఆర్.కృష్ణయ్యలతో మరో పార్టీ అని లోకం కోడై కూస్తోంది. ఈ మధ్యలో కోదండరాం సార్ చేస్తున్న పార్టీ ప్రయత్నం కొంత ఆశాజనకంగా ఉందని అంటున్నారు. మొదట కేసీఆర్‌తో కలిసి తెరాసకు పురుడు పోసిన గాదె ఇన్నయ్య లాంటి వారు ప్రొఫెసర్ వెనుక ఉండి కేసీఆర్ కామన్ శత్రువులను ఏకం చేస్తున్నారని తెలుస్తుంది. ఏం జరుగబోతోందో చూడాలి. చెరకు సుధాకర్ స్థాపించిన ఇంటి పార్టీ ఇంకా ఇల్లు దాటలేదు. సీపిఎం నేతృత్వంలో వీళ్లందరినీ కలిపే ‘బహుజన ఫ్రంట్’ ఎవరి తోకగా మారుతుందో చెప్పలేం. అయితే వీళ్లందరికీ కేసీఆర్‌ను దింపడమే ప్రధాన ఎజెండా. కానీ కేసీఆర్‌ను ఏమీ అనలేక, ఇటీవల కాలంలో రేవంత్‌రెడ్డితో సహా అందరూ ఇక్కడ ఎలాంటి ప్రభావం లేని మోదీని తిట్టిపోసి, తమ అక్కసు వెళ్లబోసుకొంటున్నారు. కొన్ని పత్రికలు, ప్రసారమాధ్యమాలది కూడా అదే దిక్కుతోచని పరిస్థితి!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదాను సాధించడమే రాజకీయం. హోదావల్ల లాభం ఏంటో నష్టం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు కానీ భాజపాను దుమ్మెత్తి పోయించడంలో తెదేపా విజయవంతం అయింది. చెలరేగిపోతున్న రాజేంద్రప్రసాద్, బుద్ధా వెంకన్న వంటి వాళ్లపై వికర్ణుడిలా సోము వీర్రాజు తిరగబడేసరికి పరిస్థితి మారింది. తనకు తానే చేగువేరాగా భావించే పవన్‌కల్యాణ్ తన రాజకీయ ప్రస్థానం కన్నా కేసీఆర్ మెప్పు పొందడానికే ఎక్కువ ప్రయత్నం చేశాడు. ఆంధ్రా మెస్సయ్యలా చంద్రబాబుపై ఒంటికాలిపై లేస్తున్న జగన్ భాజపాతో కలవడానికే ఈ సంఘర్షణ మొదలుపెట్టాడని తెదేపా నేతల ఆరోపణ. వీళ్లందరినీ కాదని తెలంగాణలో జరిగినట్టే ఉండవల్లి, జెపి, కమ్యూనిస్టు రామకృష్ణ ఏదో ‘క్రొత్త కషాయం’ తయారు చేస్తున్నారు. ఈ పార్టీలు, ఫ్రంట్‌లు ప్రజల అభివృద్ధి అంశాలపై చర్చకన్నా అధికారంలోని పార్టీలను గద్దె దింపడానికే క్రొత్త పొత్తులను మొలిపిస్తున్నారు. ఇది ఎలాంటి ప్రత్యామ్నాయ రాజకీయమో వారే చెప్పాలి. ఇప్పటికే అనధికార గణాంకాల ప్రకారం 7 జాతీయ పార్టీలు, 50 రాష్ట్ర పార్టీలు, 48 గుర్తింపులేని పార్టీలు, 730 రిజిస్టర్ అయి గుర్తింపు పొందని పార్టీలు దిక్కుదివాణం లేక అల్లల్లాడుతుంటే క్రొత్త పార్టీలు, ఫ్రంట్‌లు ఏ మేరకు ప్రభావం చూపుతాయో వేచి చూడాలి!
****************************************************
-డా. పి భాస్కరయోగి సెల్: 99120 70125
Published Andhrabhoomi :
 Friday,  23 February 2018


– సీమాంధ్రుల మనోభావాలు పట్టించుకొలేదు. కాంగ్రెసు రాజకీయ కోసం డ్రామా ఆడింది. ఆంధ్రులను అవమానించడం కాంగ్రెసుకు అలవాటు. అందుకే తెలుగుదేశం పుట్టింది. అంజయ్యను, పీవిని అవమానించారు.
– ప్రధాని నరేంద్రమోది
– మీరు ఆంధ్రుల మనసులు గెలుచుకున్నారు మోదిజి.
– కాంగ్రెస్‌ లోఫర్‌ పార్టీ. నరహంతక చరిత్ర ఆ పార్టీకి ఉంది. రాహుల్‌ పప్పు, ఉత్తమ్‌ దద్దమ్మ.
– ఇష్టాగోష్ఠిలో మంత్రి కెటిఆర్‌
– మీ కుటుంబంలో అందరూ తెలివి గలవారే. మిగతావాళ్ళు కూడా అలా ఉండాలంటే ఎలా !
– కాంగ్రెసు, జెపి, కమ్యూనిస్టులతో కలిసి ప్రత్యేక ¬దా కోసం కేంద్రంపై పోరాటం చేస్తాం.
– ఉండవల్లి అరుణ్‌కుమార్‌
– రాజకీయ నిరుద్యోగుల పని పోరాటం చేయడమే కదా !
ం మీరంటే మాకెంతో గౌరవం
– వెంకయ్యతో విపక్షాల నేతలు
– మరి ఎవరి పైన మీ మంట ?
– సభాపతిజీ రేణుకను అడ్డుకోకండి. రామాయణం సీరియల్‌ తర్వాత అంతటి నవ్వును వినే భాగ్యం మనకు ఈ రోజే దక్కింది.
– వెకిలిగా నవ్విన రేణుకా చౌదరిపై ప్రధాని మోది చురక!
– పాత్ర పేరు చెబితే ఇంకా స్పష్టంగా ఉండేది కదా మోదీజీ !
ం విభజన హామీలు ఏమయ్యాయి ?
– కాంగ్రెసు నేత మల్లికార్జున ఖర్గే
– ‘మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కడం’ అంటే ఇదే మరి.
– రాఫెల్‌, రైతులు, నిరుద్యోగంపై ప్రజల ప్రశ్నలకు మోది జవాబు ఇవ్వాలి.
– రాహుల్‌గాంధి
– మీ తాతల నాటి భోఫోర్స్‌, నేటికీ నడుస్తున్న నేషనల్‌ హెరాల్డ్‌లకు సమాధానాలు చెప్పారా!
– కెసిఆర్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం. తెలంగాణ సెంటిమెంటుకు కాలం చెల్లింది.
– సిపిఎం నేత బివి రాఘవులు
– ‘కాలం చెల్లిన సిద్ధాంతం’ అనేమాట మీకు ఊతపదమా!
– కెటిఆర్‌ వాడిన భాష అభ్యంతరం
– మాజీ మంత్రి జానారెడ్డి
– ‘తలుపు చెక్కకు తమలపాకుతో సమాధానం చెప్పడం’ అంటే ఇదేమరి.
– మోది, కెసిఆర్‌లకు రాజకీయ సన్యాసం తప్పదు.
– యువజన కాంగ్రెసు జాతీయ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌
– ముందు మీ నాయకుణ్ణి జాగ్రత్తగా చూసుకోండి.
– బాబ్రీ మసీదు విషయంలో వెనక్కి తగ్గం
– ముస్లిం పర్సనల్‌ లాబోర్డు సమావేశం
– ‘త్రిపుల్‌ తలాక్‌’ బిల్లులా అవుతుంది జాగ్రత్త.
– మేధావుల మౌనం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. మెరుగైన సమాజ స్థాపనకు రాజకీయాల్లోకి రావాలి.
– పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
– జయప్రకాశ్‌ నారాయణ్‌లా మాట్లాడకండి.

****************************************************
– డా|| పి.భాస్కరయోగి
ఉత్తమ ఫలితాలతోనే గుర్తింపు 

సాక్షి మహబూబ్ నగర్ 03-02-2018
ఈనాడు మహబూబ్ నగర్ 03-02-2018నవ తెలంగాణ మహబూబ్ నగర్ 03-02-2018
 డాక్టర్ పి. భాస్కరయోగి : 03-02-2018

భాస్కరయోగి పుస్తకాలను ఆవిష్కరించిన
 చినజీయర్ స్వామి


ఈనాడు మహబూబ్ నగర్ 12-02-2018

 డాక్టర్ పి.భాస్కరయోగి : 12-02-2018


శివమహాపురాణంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పార్వతీపరమేశ్వరుల వివాహ సందర్భం అది. పురోహితుడు.. ‘మీ తండ్రి పేరేమిటి?’ అని శివుణ్ణి ప్రశ్నించాడు పురోహితుడు. నా తండ్రి ఎవరు! అని శివుడు ఆలోచిస్తుంటే నారదుడు ‘బ్రహ్మ’ అనండి అన్నాడు. అది చెప్పాక ‘మీ తాత ఎవరు?’ అని శివుణ్ణి అడిగితే విష్ణువు అని చెప్పాడు. ‘మీ ముత్తాత ఎవరు?’ అనే ఆఖరు ప్రశ్న అడగ్గానే శివుడు ‘నేనే ముత్తాతను’ అన్నాడు. శివుడు ఆద్యంతాలు కనుక్కోలేని లింగస్వరూపుడు. దేవతలందరిలో నిర్గుణరూపం ధరించినవాడు. దక్షుడు శివుణ్ణి గుణహీనుడని నిందిస్తే ‘‘ఆయన నిర్గుణుడు’’ కాబట్టి ఆ తిట్టు కూడా స్తోత్రమే అని చెప్పుకొంటాం. స్వస్వరూపం కాకుండా లింగరూపంలో సాక్షాత్కరించే శివుడి ‘ఆద్యంతాలు కనుక్కొంటాం’ - అని బ్రహ్మవిష్ణువులు ప్రయత్నించే కథ ఒక ప్రతీక మాత్రమే.

నిర్గుణతత్వం తెలుసుకోవాలనుకొంటే సాధకుడు విష్ణుత్వం పొంది సహస్రారం వైపైనా వెళ్లాలి, బ్రహ్మత్వం పొంది మూలధారంలోని కుండలినైనా స్పృశించాలి అన్న యోగరహస్యం అందులో ఉంది. ఈ యోగం ద్వారా పరబ్రహ్మ సాక్షాత్కారం కలగడమే లింగోద్భవం. అదే సాధకుడికి శివరాత్రి. నిర్గుణుడైన శివుడు నిత్యతృప్తికి చిహ్నమై ఆనందస్వభావంగల నందిని ఎదురుగా పెట్టుకున్నాడు. మంద, తమో గుణాలుగల గజము చర్మం ధరించి వాటికి ఆతీతంగా ఉండాలని సందేశం ఇచ్చాడు. విభేదాలను భస్మం చేసి దానిని ధరించి అద్వైతభావన, స్థిరత్వం సూచిస్తున్నాడు. డమరు చేతిలో ధరించి శివుడు నాదబ్రహ్మమయినాడు. అలాంటి ‘శివం’ ఓ సర్వ వ్యాపకమైన ఉనికి. దు:ఖాన్ని నశింపజేసి మంగళతత్వాన్ని కలిగిస్తుంది.

*********************************************************************************

                                                         డాక్టర్‌ పి.భాస్కరయోగి : 
                                                     ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన : 
                                                       13-02-2018 : మంగళవారం– రైతులకు, రాష్ట్రానికి అన్యాయమే; ఇది రైతు వ్యతిరేక బడ్జెట్‌. గుజరాత్‌లో దెబ్బతిన్నా తీరు మారలేదు.
– తెరాస నేతలు హరీశ్‌రావు, వినోద్‌కుమార్‌
– అప్పుడే ‘బద్నాం’ చేయడం మొదలు పెట్టారన్నమాట…!
– సమ్మక్క దయతోనే ప్రత్యేక రాష్ట్రం. తెలంగాణ సల్లంగుండాలని మొక్కిన.
– సిఎం కెసిఆర్‌
– మీరు ఉన్నాక అంతా చల్లదనమే. ఉడుకు నెత్తురు ఎప్పుడో చల్లబడింది.
– బొడ్డుపల్లి శ్రీనివాస్‌ మాకు శత్రువు కాదు. మేమెందుకు చంపుతాం ?
– తెరాస ఎమ్మెల్యే వేముల వీరేశం
– అంటే శత్రువులైతే చంపేస్తారా ?
– రాష్ట్రంలో అగ్రకుల ఆధిపత్య పాలన, కార్పొరేట్‌ శక్తులకు బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పడింది. రాష్ట్రంలో 93 శాతం గల ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలను ఏకం చేసి రాజ్యాధికారం సాధించడమే మా లక్ష్యం.
– సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం
– దయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదే మరి. మీరు అగ్రకుల పెత్తనం గురించి మాట్లాడుతారు. ఒకసారి తమరెవరో చూసుకొండి వీరభద్రం గారూ! వర్గ పోరాటాలూ, సాయుధ పోరాటాలూ, గతి తార్కిక భౌతికవాదం అయిపోయి బహుజన వాదం అందుకున్నారా ఇప్పుడు !?
– కాంగ్రెసుకు డెబ్భై సీట్లు వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా !
– మంత్రి కెటిఆర్‌
– అంటే కాంగ్రెసు గెలవదనే కదా మీ ఉద్దేశ్యం ?!
– కాంగ్రెసు అధికారంలోకి వస్తే మీరు, మీ కుటుంబం రాజకీయాల నుండి వైదొలగాలి.
– పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
– బస్తీ మే సవాల్‌ ! బాగుందన్నా !
– గాంధీభవన్‌లో కూర్చొని ఎన్నైనా మాట్లాడవచ్చు. కాంగ్రెసువారు కళ్లున్న కబోదులు.
– మంత్రి హరీశ్‌
– కొంపదీసి వాసన్‌ ఐ కేర్‌కు తీసుకెళ్ళి కళ్లద్దాలు ఇప్పిస్తారా ఏంటి?
– నేను హిందూ వ్యతిరేకిని కాను. హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ మతాలను ఒకే విధంగా చూస్తాను.
– నటుడు కమల్‌ హాసన్‌
– అన్నీ మీకు సమానమే కానీ.. కొన్ని అంటేనే ఇష్టం. మీది ఎర్ర రక్తమేగా!
– మరీ ఇంత అన్యాయమా? హామీలపై ఒక్క మాటైనా ప్రస్తావించరా?
– కేంద్రంపై చంద్రబాబు ఆగ్రహం
– ‘వెనుక నుయ్యి ముందు గొయ్యి’ అంటే ఇదేమరి…!
– 1967 నుంచి రాష్ట్రంలో ద్రవిడ పార్టీలే అధికారంలో ఉన్నాయి. వంతుల వారీగా తమిళనాడును ఏలుతున్నాయి. తమిళనాట జాతీయ పార్టీలకు స్థానం లేదు.
– పన్నీరు సెల్వం, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి
– మొన్నటి వరకు జయలలితే పురుచ్చితలైవి, ఇప్పుడెవరు ? అధికారం ఎవరి స్వంతమూ కాదు సెల్వం..!
– 70 వేల రూపాయల విలువ చేసే జాకెట్‌ నేను కొనలేదు, ఎవరో బహుమతిగా ఇచ్చారు.
– రాహుల్‌ గాంధీ
– అబ్బో ! మరీ అంత వెర్రి పప్పల్ని చేయకండి.
*********************************************************************************************
– డా|| పి.భాస్కరయోగి : విశ్లేషణ
 జాగృతి : మాటకు మాట
12-18 February 2018భారత్ ఎంత మహోన్నతమైందో, అన్ని ఎదురు దెబ్బలూ తిన్నది. పడిలేస్తూ తన అంతర్గత సంస్కృతిని, ఆలోచనలను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ, కొత్తరూపంలో వ్యక్తీకరించుకుంటూ ముందుకు వెళ్తున్నది. దానికి కారణం ఇక్కడి బహు సంఖ్యాకులైన హిందూ జాతి మాత్రమే. 800 ఏళ్లు ముస్లింలు, 200 ఏళ్లు క్రైస్తవులు పాలించినా మన దేశంలోని హిందూ ప్రజలు తమ మతాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఈ దేశంలో ఇంకా 89 శాతం ప్రజలు హిందువులుగానే ఉన్నారు. దీని వెనకున్న రహస్యం ఏమిటి? ఈ అంశంపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. క్రీ.శ 712లో మహమ్మద్ బిన్ కాశిం హిందూ రాజ్యంపై దండెత్తినప్పటి నుంచి మొదలైన విదేశీ దురాక్రమణదారుల పాలన 1947లో వైస్రాయ్ లార్డ్ వౌంట్ బాటన్ బ్రిటన్‌కు తిరిగి వెళ్లేవరకు సాగింది.
అందుకే హిందూ మతం నిరంతరం వివిధ రూపాల్లో అనేక దాడులను ఎదుర్కొంటూనే వున్నది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోను మెజారిటీ ప్రజలు ఎవరుంటే వాళ్ల సంస్కృతి, చరిత్ర, నాగరికతలే ప్రధాన స్రవంతిగా కొనసాగుతాయి. ఇది జగద్విదితం. కాని మన దేశంలో పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. దురదృష్టవశాత్తూ ఇక్కడి మెజారిటీ ప్రజలు తల ఎత్తి ‘ఇది మాది’ అని చెప్పే పరిస్థితి ఎక్కడా కనబడటం లేదు. దాదాపు గత 1400 ఏళ్ల బానిసత్వంలో ఇక్కడి హిందువులు తమకు ముఖ్య ఆరాధనా కేంద్రాలైన ముప్ఫై వేల దేవాలయాలను కోల్పోయారు. అవి పరమత పాలకుల ‘మత సంకుచిత దృష్టికి’ బలయ్యాయి. అందులో శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య రామమందిరం, మధురలోని శ్రీకృష్ణ మందిరం, కాశీ విశ్వనాథ మందిరం ప్రధానమైనవి.
వందల ఏళ్ల పోరాటం తర్వాత ఇప్పటికీ ఈ దేశ మెజారిటీ ప్రజలు వీటిని పునర్నిర్మించుకోలేక పోతున్నారు. 1947 నవంబర్ 9న సర్దార్ పటేల్ సౌరాష్ట్ర పర్యటనలో-‘సోమనాథ్ మందిరం ఎక్కడ ఉండేదో అదే స్థలంలో నిర్మిస్తాం’ అని ప్రకటించారు. పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్ చొరవతో ఒక్క సోమనాథ్ మందిరం మాత్రం నిర్మించుకోగలిగాం. మందిర నిర్మాణానికి ముందే పటేల్ మరణించడం విషాదం. అలాంటి స్ఫూర్తి తరువాతి పాలకుల్లో లేకపోవడంతో మిగతా దేవాలయాల నిర్మాణం కోసం కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం.
1925లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ (ఆర్‌ఎస్‌ఎస్) స్థాపనతో హిందువుల్లో చైతన్యం రావడం ప్రారంభమైంది. స్వాతంత్య్రానంతరం ఈ చైతన్యం మరింత పెరిగింది. 1985 తర్వాత హిందువులు చరిత్రలో ఎన్నడూ లేని ఏకత్వాన్ని సాధించారు. అది ‘రామజన్మభూమి ఉద్యమం’ రూపంలో.
అయోధ్య ఉద్యమం..
దేశంలోని ప్రతి హిందువును ఈ ఉద్యమం కదిలించింది. ప్రతి మారుమూల గ్రామం, బస్తీ నుంచి రామజన్మభూమి కోసం ఇటుకలు వెళ్లాయి. సాధువులు, విశ్వహిందూ పరిషత్, బిజెపి, శివసేన, ఇతర సంస్థలు ఇందులో నిర్మాణాత్మక పాత్ర పోషించాయి. బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వానీ నిర్వహించిన రథయాత్ర ఓ చారిత్రాత్మక ఘట్టం. 1528 ప్రాం తంలో బాబర్ సేనాని మీర్‌బాకీ నేతృత్వంలో అయోధ్యపై మతోన్మాదులు దాడిచేసి అక్కడి సుందర నగరాన్ని, రామమందిరాన్ని ధ్వంసం చేశారు. మందిరం ఆనవాళ్లు లోపల ఉండగానే దానిపై మసీదు నిర్మించారు. దీనిపై బ్రిటీష్ చరిత్రకారుడు కన్నింగ్ హోమ్- మీర్‌బాకీ ఫిరంగులతో మందిరాన్ని పేల్చివేయడానికి విఫలయత్నం చేశాడు. దాదాపు 15 రోజులపాటు హిందువులు ప్రతిఘటించారు. సుమారు 17,400 మంది హిందువులు ఈ దురాగతానికి ఎదురు తిరిగి మరణించారని రాశారు. క్రీ.శ 1528 నుంచి 1949 వరకూ రామజన్మభూమి స్వాధీనం కోసం 760 యుద్ధాలు జరిగాయి. 1934లో జరిగిన ఉ ద్యమం చారిత్రాత్మకమైనది. అప్పటి నుంచి పోరాటం నడుస్తూనే ఉంది. 1983 తర్వాత ఈ ఉద్యమం ప్రతి భారతీయుడినీ కదిలించింది. హిందువుల్లో చైతన్యం మొదలైంది. వేయేళ్ల నుంచి మహ్మదీయ క్రైస్తవుల పాలన కింద నలిగిపోయిన హిందువులు తమ అస్తిత్వాన్ని గుర్తించడం మొదలుపెట్టారు. రామమందిర ఉద్యమానికి చేయూతనందించారు. 1983లో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక హిందూ సమ్మేళనం నిర్వహించారు. రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన గుల్జారీలాల్ నందాతోపాటు దావూ దయాళ్ ఖన్నా అందులో పాల్గొన్నారు. అయోధ్య రామజన్మభూమి, మధుర కృష్ణ జన్మస్థాన్, కాశీ విశ్వనాథ్ మందిర విముక్తి కోసం ఖన్నా ఇచ్చిన పిలుపు హిందువులను కదిలించింది. ‘రామజన్మభూమి ముక్తి యజ్ఞసమితి’ని ఏర్పాటుచేసి మహంత్ అవైద్యనాథ్ అధ్యక్షునిగా, దావూ దయాళ్ ఖన్నా ప్రధాన కార్యదర్శిగా కార్యాచరణ మొదలుపెట్టారు. 8, ఏప్రిల్ 1984న ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో సాధుసంతులు సమావేశమై, అయోధ్య మందిరం తాళాలు తెరిపించాలని సంకల్పించారు. 1986 ఫిబ్రవరి 1న ఫైజామాద్ జిల్లా న్యాయమూర్తి కె.ఎం.పాండే తాళాలు తెరిచారు. 1989లో జరిగిన ‘ప్రయాగ కుంభమేళా’లో పూజ్య దేవరహ బాబా సమక్షంలో ప్రతి గ్రామంలో శిలాపూజకు సంకల్పించారు. 2.75 లక్షల రామశిలలకు పూజలు జరిగాయి. 1989 నవంబర్ 9న కామేశ్వర చౌపాల్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 1990 మే 24న హరిద్వార్‌లో జరిగిన విరాట్ హిందూ సమ్మేళనంలో కరసేవ చేయాలన్న నిర్ణయం జరిగింది.
1990 అక్టోబర్ 30 నుంచి కరసేవకులు సిద్ధమయ్యారు. 1990 అక్టోబర్ 18న దీపావళి నాడు రామజ్యోతి దేశమంతా వెలిగింది. నాటి యుపి సీఎం ములాయం సింగ్ అయోధ్యలో ‘పక్షి కూడా రెక్క కదల్చలేదు’ అని బీరాలు పలికాడు. కానీ 1990 అక్టోబర్ 30న రామభక్తులు గుమ్మటాలు ఎక్కి కాషాయ ధ్వజం ఎగురవేసారు. నవంబర్ 2న ధ్వజం ఎగురవేసిన కొఠారి సోదరులు ప్రభుత్వ దమనానికి బలయ్యారు. ఎందరో కరసేవకులను ప్రభుత్వం కాల్చేసింది. వారి అస్తికలతో కలశయాత్ర చేసి 1991 జనవరి 14న మాఘమేళాలో 25 లక్షల మందితో భారీ ర్యాలీ జరిగింది. ఆ తర్వాత యూపీలో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వం కొలువుదీరడంతో ఉద్య మం మరింత ఊపందుకుంది. 1992 సెప్టెంబర్ 26న శ్రీరామ పాదుకాపూజ జరిగింది. 1992 అక్టోబర్ 30న ఢిల్లీలో సాధుసంతులు సమావేశమై 5వ ధర్మసంసద్‌లో ద్వితీయ కరసేవ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత లక్షలాదిమంది కరసేవకులు 1992 డిసెంబర్ 6 నాటికి అయోధ్య చేరుకొన్నారు. అదే సమయానికి కోర్టు నిర్ణయం వాయిదా వేసినందున రామభక్తులలో క్రోధం పెరిగింది. వారి క్రోధానికి బాబ్రీ గుమ్మటాలు నేలకూలాయి. భారత చరిత్రలో మరిచిపోని రోజు అది. హిందూ జాతి చరిత్రలో అందరినీ ఏకం చేసిన రోజు.
మరిన్ని ఉద్యమాలు
అయోధ్య రామజన్మభూమి ఉద్యమం హిందూ జాతీయ భావానికి ప్రతీక అయితే ఆ తర్వాత వచ్చిన ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల ఏర్పాటు హిందూ ధార్మిక భావ చైతన్యానికి ప్రతీక అని చెప్పవచ్చు. హిందూ జాతిపై జరిగిన అనేక దాడులు ఎన్నోసార్లు హైందవ సమైక్యతకు తోడ్పడ్డాయి. హిందూ ధార్మిక భావన పునాదిగా పుట్టిన ఎన్నో సంస్థలు కూడా హైందవ చైతన్యాన్ని విశేషంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. దాదాపు 50 అంతర్జాతీయ సంస్థలు హిందూ ధార్మికతను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రచారం చేస్తున్నాయి. కృష్ణ భక్తి సంఘం (ఇస్కాన్) అనే సంస్థ వందలాది దేశాల్లో పనిచేస్తూ కృష్ణతత్వంపై బాగా ప్రచారం చేస్తోంది. దీనిని శ్రీల ప్రభుపాదులుగా పేరుపొందిన ఏ.సి. భక్తి వేదాంతస్వామి స్థాపించారు. హిందువుల ఆధ్యాత్మిక గ్రంథమైన భగవద్గీతను దేశదేశాలకు అందించారు. పాశ్చాత్య దేశాల్లో ఎన్నో కృష్ణ మందిరాలను నిర్మించారు. 100 ఏళ్లలో 3100 శాఖలను స్థాపించిన రామకృష్ణ మిషన్, ఆర్యసమాజం, అరవిందాశ్రమం, రమణాశ్రమం వంటివి ఈరోజుకూ హిందూ ధార్మిక రంగంలో అనంత సేవలందిస్తున్నాయి. ఆనందమూర్తిగా పిలువబడే ప్రభాత్ రంజన్ సర్కార్ స్థాపించిన ఆనంద్‌మార్గ్ ఆధ్యాత్మిక సామ్యవాదం ప్రతిపాదించి బెంగాల్‌లో కమ్యూనిస్టులకే సవాల్ విసిరింది. తన కార్యకర్తలెందరినో కమ్యూనిస్టులు హతమార్చినా జంకకుండా ఆనంద్‌మార్గ్ తన కార్యకలాపాలు నిర్వహించింది. మహర్షి మహేశ్ యోగి విదేశాల్లో భారతీయ విద్యలను చెప్పే విశ్వవిద్యాలయం స్థాపించి యోగను పరిచయం చేసారు. స్వామి సత్యానంద్, చరణ్‌సింగ్ మహరాజ్, మాస్టర్ సివివి మెహర్‌బాబా, స్వామి ముక్త్యానంద, శివానంద, స్వామి యోగానంద పరమహంస, రమణమహర్షి, పాండురంగ అథవాలే, రామచంద్ర మహరాజ్, ఎక్కిరాల వేదవ్యాస్, స్వామి చిన్మయానంద వంటి మహనీయులు భారతీయతను ఆధ్యాత్మికతతో జోడించి హిందూ ధర్మానికి గొప్ప సేవ చేసారు. వీరిలో చాలామంది 1990కి ముందు దేహాన్ని వదలిపెట్టినా వారు స్థాపించిన సంస్థలు హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. భారతీయ ఆధ్యాత్మిక జీవనాన్ని పరిరక్షిస్తున్నాయి. ఇవన్నీ ప్రత్యక్షంగా హిందూ ఆందోళనల్లో పాల్గొనకున్నా హిందూ ధార్మిక భావాన్ని పునరుత్తేజం చేస్తున్నాయి.
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆధ్యాత్మిక సంస్థ హిందూ ధర్మ ఔన్నత్యానికి ప్రత్యేకంగా అంకితమైంది. దాని స్థాపకులు శ్రీ రవిశంకర్ గురూజీ దేశ విదేశాల్లో ధ్యానంతోపాటు హైందవ సంస్కృతి వికాసానికి కృషి చేస్తున్నారు. కేరళలోని కొల్లం కేంద్రంగా మాతా అమృతానందమయి దేశ విదేశాల్లో ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్నారు. విదేశీయులెందరో ఆమె ధార్మిక శక్తికి ఆకర్షితులవుతున్నారు.
బిహార్ నుంచి వచ్చిన రామ్‌దేవ్ ఇటీవల భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ద్వారా జాతీయ, ధార్మిక భావన నెలకొల్పారు. బాలకృష్ణ మహరాజ్, రాజీవ్ దీక్షిత్‌లతో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశంలో యోగ విద్యను పునరుజ్జీవింపచేసి స్వదేశీ వస్తువులను, ఆయుర్వేదాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. హరిద్వార్ కేంద్రంగా పతంజలి యోగ పీఠం స్వదేశీ ఉద్యమానికి తెరలేపింది. ఈ ఉద్యమం మధ్యలో గొప్ప జాతీయ హిందూ తత్త్వవేత్త రాజీవ్ దీక్షిత్ మరణించడం దురదృష్టకరం. 2005లో సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తమిళనాడు సీఎం జయలలిత ద్వారా కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతిని అరెస్టు చేయించడం హిందువుల్లో ఆగ్రహం రగిలించింది. ఈ ఘటనతో దేశంలోని స్వామీజీలంతా ఏకతాటిపైకి వచ్చారు. ఇలా దేశమంతా ఆధ్యాత్మిక, జాతీయవాద ఉద్యమాలతో హైందవ చైతన్యం వెల్లివిరుస్తోంది.
****************************************************
-డా. పి భాస్కరయోగి సెల్: 99120 70125ఓ తరగతి గదిలో గణితం ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నాడు. ‘ఒక వస్తవ్య్రాపారి మీటరు బట్టకు 50 రూపాయలు తీసుకుంటే 32 మీటర్ల బట్టలో అతడు చేసిన దోపిడీ ఎంత?’ అని ఓ విద్యార్థిని అడిగాడు. ఏం జవాబు చెప్పాలో అర్థం కాక విద్యార్థి బిక్కమొహం వేశాడు. వస్తవ్య్రాపారి తన వ్యాపారం ద్వారా సంపాదించింది లాభమా? దోపిడీనా? వాడికి అర్థం కాలేదు. గతంలో బెంగాల్ కమ్యూనిస్టు ప్రభుత్వం ఇలా అడిగేది అని హాస్యం కోసం కొందరు చెబుతుంటారు. ప్రశ్నను రెచ్చగొట్టే విధంగా నూరిపోయడం కమ్యూనిస్టులకు అలవాటు. అలాగే పత్రికారంగంలో కొత్త పరిభాషల్ని సృష్టించడం కోసం వాళ్లు బాగా ఆరాటపడతారు. ఈ పరిభాష, వ్యాఖ్యానం, విషయ సృష్టి, నిర్వచనం.. అన్నిట్లో ఈ దేశ మూలతత్వంపై మెల్లగా దాడిచేస్తారు. పైగా ప్రచార ప్రసార మాధ్యమ రంగాన్ని తామే నైతిక మార్గంలో నడిపిస్తున్నట్లు భ్రమింపచేస్తారు. కొందరైతే తమది ఏ సిద్ధాంతమో అర్థం కాకుండా చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. వీర కమ్యూనిస్టులా పోజులిచ్చే ఓ విద్యావేత్త బాసరలో యజ్ఞం చేస్తాడు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞానసభలో మాట్లాడగలుగుతాడు. మరో పెద్ద మనిషి మావోయిస్టులతో చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు, శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామిని తన ఇంటికి పిలిపించుకుని ఆయనతో సన్నిహితంగా మెలగుతాడు. ఇలాంటి ‘రెండు నాల్కల’ మహా మనుషులంతా పత్రికలకు సిద్ధాంతకర్తలుగానూ వ్యవహరిస్తారు. వారు నాటిన విషబీజాలే మహావృక్షాలై ఇప్పుడు చాలా పత్రికల్లో కీలక స్థానాల్లో వున్నారు.
వీరు నోరు తెరిస్తే ‘ప్రజల భాష’ అని కలర్ ఇస్తుంటారు, కానీ అది ఏ దేశ ప్రజల భాషనో చెప్పరు. పత్రికల భాష ద్వారా కూడా మన ఆయువుపట్టును దెబ్బతీస్తారు. కొన్ని పదాలకు అర్ధ సంకోచం, మరికొన్ని పదాలకు అర్ధ వ్యాకోచం కల్పిస్తారు. సాంప్రదాయిక పదాలకు అర్ధ నిమ్నత కల్పించి అగౌరవ పరుస్తారు. ‘శఠగోపం’ అనే పదం ఆగమశాస్త్ర పదం. శఠులు అనగా మోసగాళ్లు, వంచకులు అని అర్థం. అలాంటి మోసగాళ్లను తన పాదాల కింద తొక్కిపెట్టేవాడు విష్ణువు అనే దానికి సూచనగా శఠారిని భక్తుల తలపై మూడుసార్లు పెడతారు. శఠారి అంటే మోసగాళ్లకు శత్రువు అని అర్థం. కానీ ఈ పదం ఈరోజు నిమ్నత పొంది ఏదైనా మోసం చేసిన సంఘటనకు అతడు ‘శఠగోపం’ పెట్టి వెళ్లిపోయాడు అని మారింది. కుంభకోణం తమిళనాడులోని ప్రసిద్ధ క్షేత్రం. అక్కడ ఎప్పుడో, ఎవరో మోసం చేసారని ఆ పదాన్ని సామాజిక క్షేత్రంలో డబ్బు కొల్లగొట్టేవారందరికీ ప్రయోగిస్తున్నారు. ఏదైనా డబ్బును కుట్రతో కాజేస్తే పెద్ద కుంభకోణం జరిగింది అని అంటున్నారు. కైంకర్యం అంటే పూజ అని అర్థం. ఇది కూడా ధనం కాజేయడం అనే అర్థంలో వాడుతున్నారు. మంగళం అంటే శుభం అని అర్థం. సాధారణంగా ఆధ్యాత్మిక కార్యక్రమం అనంతరం ముగింపులో మంగళహారతి ఇస్తారు. ఇప్పుడు ‘మూసివేయబడిన’ వాటిని గురించి చెప్పడానికి మంగళం అని వాడుతున్నారు. మరి ఈ పదాల సృష్టికర్తలు ఎవరు?
భాషను, వ్యాకరణాన్ని ధ్వంసం చేసి ప్రాచీనతను నరికివేయాలనే కరడుగట్టిన భాషావేత్తలు, భాషను సరళం చేసే మిషతో వ్యవహార భాషను నెత్తికెత్తుకున్న మేధావులే ఈరోజు భాషలు అంతర్ధానం అవుతున్నాయని గగ్గోలు పెడతారు. నన్నయ్యభట్టు రాజమహేంద్రవరంలో ఉండి భారతం రచించినా, నెల్లూరులో జీవించి తిక్కన సోమయాజి భారత రచన చేసినా, వరంగల్లులో పోతనామాత్యుడు నివసించి భాగవతం గ్రంథస్థం చేసినా ఇందులోని పలుకుబడి అన్ని ప్రాంతాలవాళ్లను అక్కున చేర్చుకొంది. ఈ పద్య, గద్యాలు అన్ని ప్రాంతాలవాళ్లకూ అర్థమయ్యాయి. కానీ, భాషా సంస్కర్తల పేరుతో పత్రికల ద్వారా తెలివిగా మూల భాషను మట్టుబెట్టే ప్రయత్నం చాలామంది ‘ఎర్ర పాత్రికేయులు’ నిర్విఘ్నంగా కొనసాగించారు. అసలు ప్రాథమికమైన వ్యాకరణం నేర్చుకోవడం కూడా నేరం అన్నంతగా ఈ మేధావులు పత్రికా రంగంలో ప్రచారం చేశారు. దీంతో ఏది సాధు పాఠమో ఏది సరైన పద ప్రయోగమో చెప్పలేని దుస్థితి.
నిజానికి ‘విలేఖరులు’ అనే పదంలోనే వ్యాకరణం దోషం వుంది. ఇది భాషా శాస్త్రం చదువుకొన్న వాళ్లందరికీ తెలుసు. ‘విలేఖకులు’ అనేది సరైన పాఠం. భాషా పరిజ్ఞానం కల్పించాల్సిన బాధ్యతను విస్మరించిన ఈ మేధావులు వున్న భాషను జీవం లేకుండా చేసి కొత్త పదాలను సృష్టించడం విడ్డూరం. అవన్నీ కృతకంగా ఉంటున్నాయి.
ఆచార్య కసిరెడ్డి వంటివారు పత్రికా భాష ఎలా ఉండాలనే దానిపై విస్తృత చర్చే చేశారు. పత్రికా రచనలో భాషా సమతుల్యత ఉండాల్సిందిపోయి విషమతుల్యత చోటు చేసుకోవడం వింతల్లోకెంత వింత. సిద్ధాంతాల కనుగుణంగా భాషను సృష్టించి వాటికి నిర్వచనాలు ఇస్తుంటే మనం ఇంత సంకుచితం అయిపోయామా? అనిపిస్తుంది. శైలీశయ్యా సమత కోసం పత్రికా భాషలో చాలా నియమాలు పాటించాలి. ఇవేవీ లేకుండానే పత్రికల్లో భాష చాలావరకు కొనసాగుతుంటే, వీటిపై ఎలాంటి శిక్షణ లేకుండానే టీవీ మాధ్యమాలు దుమ్ము రేపుతున్నాయి. కులోన్మాదులను సెలబ్రిటీలుగా మార్చే ప్రక్రియ ప్రసార మధ్యమాలు నిరాటంకంగా చేస్తుంటే మనం నోరెళ్లబెట్టి చూడడం తప్ప ఇంకేం చేయలేం. వితండ వాదం, అడ్డగోలు వాదనను జర్నలిజంలో అత్యున్నత ప్రమాణంగా పాటిస్తుంటే విలువలు, పాఠాలు వింత పదాలు..!
ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న విలేఖరులకు భాషా నైపుణ్యం, విషయ సేకరణ కొరవడింది. సంచలనమే వార్తగా జగతికెక్కడం భాషను పాతరేయడం కాక ఇంకేమిటి? ఈ గందరగోళంలో మనం భాషా పరిజ్ఞానం కోల్పోతున్నాం. పత్రికా భాషలో గ్రాంధిక భాష కాకుండా వ్యవహార భాష ఉండాలి. మాండలిక ప్రయోగం చేసినా అది కనీసం డెబ్బై శాతం మందికి తెలిసినదిగా ఉండాలి. పదాద్యక్షరాల్లో అచ్చు ఉంటే అచ్చు, హల్లుంటే హల్లే విధిగా రాయాలి. వ్యవహార భాష పేరుతో ఊరును వూరుగా రాయకూడదు. గ్రాంధికంలో వాడే ‘అతనియందు’ లాంటి పదాల్లో అతనిలో అని రాయాలి. సంధికార్యాలు అవసరం ఉంటేనే చేయాలి. ఉచ్చారణ విధిని అనుసరించి లిపి వుండాలి. పరుష సరళాలు గసడదవలు సమాసంలో పాటించవచ్చు. ఉదా: కూరగాయలలో ‘కా’ను ‘గా’గా కూడా రాయవచ్చు. ఆయన కాలు బెణికింది అన్నపుడు ‘కా’ను ‘గా’గా రాయాల్సిన అవసరం లేదు.
ఈనాటి తెలుగులో ‘అర సున్న’ అవసరం లేదు. రెండు పదాలను మించి సమాసం చేయవద్దు. జన వ్యవహారంలో బాగా నానుతున్న అన్యదేశ్యాలు ప్రయోగించవచ్చు. కారు, స్టేషన్, రైలు, బందోబస్తు వంటివి. కొందరు ‘చదవడం’ లాంటి పదాల్లో ‘డ’కు బదులుగా ‘ట’ను వాడతారు. కానీ ఎక్కువమంది ప్రయోగించే ‘డ’ను వాడడం మంచిది. తెలుగులోకి వచ్చిన ఉర్దూ, పారసీ పదాలు ప్రసిద్ధమైతే ఈరోజుకూ వాడుతున్నారు. బర్దస్త్, రద్దీ రాస్తా, రాస్తారోకో, వాజీఫా, దివాలా వంటి పదాలు ఇప్పటికీ జనం నోట్లో నానుతున్నాయి. అందుకే పత్రికలు స్వీకరించాయి. కానీ దీనిని కూడా ఏదో మహాప్రసాదంగా అభివర్ణిస్తూ ‘గంగా యమునా తెహజీబ్’ అని జబ్బలు చరచుకొనేవాళ్లు పత్రికారంగంలో బోలెడంతమంది ఉన్నారు. వాళ్లతో వచ్చిన చిక్కంతా అదే..!
పత్రికా రచనలో విరామ చిహ్నాలకూ ప్రాధాన్యత ఉంది. ఒక్క విరామ చిహ్నం అందులోని భావాన్ని తెలియజేస్తుంది. ముగింపుచుక్క (్ఫల్‌స్టాప్), తోకచుక్క (కామా), కోలన్ (చుక్కతోక), కోలన్ (రెండు చుక్కలు) పొట్టిగీత, ఒంటి ఉల్లేఖనాలు, జంట ఉల్లేఖనాలు, ప్రశ్న చిహ్నం, సంబోధన, రాగ చిహ్నం (ఎక్స్‌లమేటరీ) వంటివి తప్పక పాటించాలి. ఇవి సరిగా పాటించకుంటే అడ్డుకట్టలేని ప్రవాహమే.
చదివేవాళ్లకు విసుగు తెప్పించకుండా అల్పాక్షరాల్లో అనల్ప భావన సారవంతంగా చెప్పాలి. పాఠకుడి మనస్సుపై బరువు పడని అంశాలు రచనలో వుండాలి. భాషా సౌందర్యాన్ని సామాన్యుడి దరిచేర్చేది పత్రిక. అలాంటి పత్రికలు కూడా సిద్ధాంతాల రాద్ధాంతాల చట్రంలో ఇరుక్కొని నలిగిపోవడం గర్హనీయం. ‘పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు’ అన్న నానుడి నిజం కావాలంటే భాషపై విషం చిమ్మే ప్రయత్నం మానుకోవాలి. తమ సిద్ధాంతాలకు అనుగుణమైన భాషను ప్రచార ప్రసార మాధ్యమాలకు ఎక్కించి ‘పీఠాలపై కూర్చున్న కుహనా మేధావుల’కు భాష ద్వారా విషప్రచారం చేయడం బాగా తెలుసు. మూలాలను ముంచేసే ఈ పక్రియ ఈ డెబ్బై ఏళ్లలో పత్రికా రంగంలో బాగా కొనసాగింది. దీనికి సమాంతరంగా ఇప్పుడు సామాజిక మాధ్యమాలు వస్తే వీళ్లు భరించలేక పోతున్నారు. గతంలో వీళ్లు చెప్పిందే వేదంగా ఉండేది. ఇప్పుడు స్వీయ ఆలోచనలతో కొత్త తరం విజృంభిస్తుంటే ఈ కుహనా మేధావులు తట్టుకోలేక అక్కసు వెళ్లగక్కుతున్నారు. ప్రసిద్ధ పాత్రికేయుడైన రాజ్‌దీప్ సర్దేశాయ్ ఎన్నోసార్లు ‘నెట్ హిందువులు’ అంటూ తన ఉక్కబోత వెళ్లగక్కాడు. అక్షరానికి రక్తాన్ని రుద్ది ‘ఎర్రసిరా’ అని నమ్మించవచ్చు, కానీ ‘అక్షరం’ నాశనం లేనిదన్న సత్యం అర్థమైతే అది శాశ్వతమైన భారతీయత అని తెలుసుకొంటారు.*


-డా. పి భాస్కరయోగి సెల్: 99120 70125

– నవ్యాంధ్రులకు సమర్థత లేక కాదు. జరిగింది అశాస్త్రీయ విభజన. ఉమ్మడి రాజధాని కనుకే వెళ్లారు. వెనక్కి రమ్మంటే ఎలా ?
– ఎపి సిఎం చంద్రబాబు
– ప్రజలు కలిసే ఉంటున్నారు. మీ రాజకీయ నాయకులే ఇంకా కొట్టుకుంటున్నారు.
– రాష్ట్ర అభివృద్ధిలో కెసిఆర్‌ పాత్ర ఏముంది ? బిజెపి వ్యతిరేక శక్తుల్ని ఏకం చేస్తాం?
– సిపిఎం నేత సురవరం సుధాకర్‌ రెడ్డి
– మీ జీవితాంతం ఇతరులపై పోరాటానికే సరిపోతారు. గత 80 ఏళ్ల నుండి జాతీయవాద వ్యతిరేక శక్తులను కూడగడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే విశ్వకవిని తిట్టిపోశారు. వివేకానందుణ్ణి తిట్టారు. గాంధీజీని గలీజ్‌ మాటలన్నారు. సావర్కార్‌కు శాపనార్థలు పెట్టారు. నేతాజీని కుక్కతో పోల్చారు. చివరాఖరకు వీటన్నిటిని ‘చారిత్రక తప్పిదాల లిస్ట్‌’లో చేర్చారు. భవిష్యత్తులో ఇదీ అంతే…!
– ప్రగతి భవన్‌ను దవాఖానగా మార్చే వరకు పోరాటం.
– తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ
– వాళ్ల భవనాలను మీరు, మీ భవనాలను వాళ్ళు మార్చుకునే పనేనా ! లేక ప్రజలకు ఏమైనా చేసేదుందా ?!
– బలవంతపు ‘హిందీని’ వ్యతిరేకించాల్సిందే. ఐక్యరాజ్య సమితిలో హిందీ ఎవరికి అర్థం అవుతుంది ?
– కాంగ్రెసు మాజీ మంత్రులు పల్లంరాజు, శశిథరూర్‌
– స్వాభిమానమే లేని మీకు స్వాభిమాన రుచి ఏం అర్థమవుతుంది ? ఏ భారతీయ భాష రాని నాయకుని మోచేతి నీళ్లు తాగినవాళ్లు ఇలా కాక ఇంకెలా మాట్లాడుతారు !
– ప్రధాని మోదిని నేను అనని మాటల్ని మీడియా ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసింది. ‘నీచ్‌’ వ్యాఖ్యలకు మీడియానే కారణం
– బహిష్కృత కాంగ్రెసు నేత మణిశంకర్‌ అయ్యర్‌
– ముందు అనేస్తారు. తరువాత ‘అనలేదు’ అంటారు. మీకిది మొదటినుండి ఉన్న విద్యే కదా !
– నేటి రాజకీయ నాయకుల్లో 95% రాస్కెల్స్‌. ఒక్కొక్కరికి 25 వేల ఎకరాలున్నాయి. 25 వేల కోట్లు సంపాదించారు. ఈ డబ్బంతా వారికి ఎక్కడ్నుంచి వచ్చింది ?
– నటుడు మోహన్‌ బాబు
– మీరు మీ సినీ గురువులుగా భావిస్తున్నవారు, మీరు ఇటీవల తెగపొగుడుతున్న వాళ్లపై కూడా ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి.
– ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డివి ప్రగల్బాలు. కాంగ్రెసుకు 70 సీట్లు వచ్చేంత సీను లేదు.
– తెరాస నేతలు
– చెప్పనివ్వండి. మాటలే గదా!
– అప్పుల కుప్పగా మార్చి నెంబర్‌ వన్‌ అంటారా? అభివృద్ధి గోరంత. చెప్పేది కొండంత.
– కాంగ్రెసు అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌
– మీ పార్టీ వారికి రాని విద్య వారు చక్కగా ప్రదర్శిస్తున్నారు.
– పద్మావత్‌ ఓ చెత్త సినిమా. దేవుడు మిమ్మల్ని సృష్టించింది ఓ రెండు గంటలు సినిమా చుడ్డానికి కాదు. సమయం వృధా చేసుకోవద్దు.
– ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసి
– పిలుపు బాగుంది.
– పద్మావత్‌ సినిమా ఆపలేం
– సుప్రీం కోర్టు
– జల్లికట్టు, కోళ్ల పందాలు, హోళీ.. లాంటివాటిని మాత్రమే ఆపగలరు మీరు!

– డా|| పి.భాస్కరయోగి
మాటకు మాట : విశ్లేషణ : జాగృతి