– నవ్యాంధ్రులకు సమర్థత లేక కాదు. జరిగింది అశాస్త్రీయ విభజన. ఉమ్మడి రాజధాని కనుకే వెళ్లారు. వెనక్కి రమ్మంటే ఎలా ?
– ఎపి సిఎం చంద్రబాబు
– ప్రజలు కలిసే ఉంటున్నారు. మీ రాజకీయ నాయకులే ఇంకా కొట్టుకుంటున్నారు.
– రాష్ట్ర అభివృద్ధిలో కెసిఆర్‌ పాత్ర ఏముంది ? బిజెపి వ్యతిరేక శక్తుల్ని ఏకం చేస్తాం?
– సిపిఎం నేత సురవరం సుధాకర్‌ రెడ్డి
– మీ జీవితాంతం ఇతరులపై పోరాటానికే సరిపోతారు. గత 80 ఏళ్ల నుండి జాతీయవాద వ్యతిరేక శక్తులను కూడగడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే విశ్వకవిని తిట్టిపోశారు. వివేకానందుణ్ణి తిట్టారు. గాంధీజీని గలీజ్‌ మాటలన్నారు. సావర్కార్‌కు శాపనార్థలు పెట్టారు. నేతాజీని కుక్కతో పోల్చారు. చివరాఖరకు వీటన్నిటిని ‘చారిత్రక తప్పిదాల లిస్ట్‌’లో చేర్చారు. భవిష్యత్తులో ఇదీ అంతే…!
– ప్రగతి భవన్‌ను దవాఖానగా మార్చే వరకు పోరాటం.
– తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ
– వాళ్ల భవనాలను మీరు, మీ భవనాలను వాళ్ళు మార్చుకునే పనేనా ! లేక ప్రజలకు ఏమైనా చేసేదుందా ?!
– బలవంతపు ‘హిందీని’ వ్యతిరేకించాల్సిందే. ఐక్యరాజ్య సమితిలో హిందీ ఎవరికి అర్థం అవుతుంది ?
– కాంగ్రెసు మాజీ మంత్రులు పల్లంరాజు, శశిథరూర్‌
– స్వాభిమానమే లేని మీకు స్వాభిమాన రుచి ఏం అర్థమవుతుంది ? ఏ భారతీయ భాష రాని నాయకుని మోచేతి నీళ్లు తాగినవాళ్లు ఇలా కాక ఇంకెలా మాట్లాడుతారు !
– ప్రధాని మోదిని నేను అనని మాటల్ని మీడియా ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసింది. ‘నీచ్‌’ వ్యాఖ్యలకు మీడియానే కారణం
– బహిష్కృత కాంగ్రెసు నేత మణిశంకర్‌ అయ్యర్‌
– ముందు అనేస్తారు. తరువాత ‘అనలేదు’ అంటారు. మీకిది మొదటినుండి ఉన్న విద్యే కదా !
– నేటి రాజకీయ నాయకుల్లో 95% రాస్కెల్స్‌. ఒక్కొక్కరికి 25 వేల ఎకరాలున్నాయి. 25 వేల కోట్లు సంపాదించారు. ఈ డబ్బంతా వారికి ఎక్కడ్నుంచి వచ్చింది ?
– నటుడు మోహన్‌ బాబు
– మీరు మీ సినీ గురువులుగా భావిస్తున్నవారు, మీరు ఇటీవల తెగపొగుడుతున్న వాళ్లపై కూడా ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి.
– ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డివి ప్రగల్బాలు. కాంగ్రెసుకు 70 సీట్లు వచ్చేంత సీను లేదు.
– తెరాస నేతలు
– చెప్పనివ్వండి. మాటలే గదా!
– అప్పుల కుప్పగా మార్చి నెంబర్‌ వన్‌ అంటారా? అభివృద్ధి గోరంత. చెప్పేది కొండంత.
– కాంగ్రెసు అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌
– మీ పార్టీ వారికి రాని విద్య వారు చక్కగా ప్రదర్శిస్తున్నారు.
– పద్మావత్‌ ఓ చెత్త సినిమా. దేవుడు మిమ్మల్ని సృష్టించింది ఓ రెండు గంటలు సినిమా చుడ్డానికి కాదు. సమయం వృధా చేసుకోవద్దు.
– ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసి
– పిలుపు బాగుంది.
– పద్మావత్‌ సినిమా ఆపలేం
– సుప్రీం కోర్టు
– జల్లికట్టు, కోళ్ల పందాలు, హోళీ.. లాంటివాటిని మాత్రమే ఆపగలరు మీరు!

– డా|| పి.భాస్కరయోగి
మాటకు మాట : విశ్లేషణ : జాగృతి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి