ఎత్తైన హిమగిరి సొగసులు.. కుంకుమ పువ్వు.. మంచుతుంపరలు.. ఆపిల్‌ తోటలు.. ఇవే కాశ్మీరపు అందాలని అందరం భావిస్తాం. కానీ గత వారంలో జరిగిన తీవ్రవాద శక్తుల పుల్వామా దాడి చూశాక భారతజాతి నివ్వెరపోయింది. స్వర్గధామం కోసం 45 మంది దేశభక్తులను బలిఇచ్చే నరరూప రాక్షసులు మరోసారి పంజా విసరడంతో దేశం అట్టుడికిపోయింది. కొవ్వొత్తుల వెలుగుల్లో వీరజవానుల ఆత్మలు ఆనందపడవచ్చు కానీ ఇప్పుడు ఈ దేశ రక్తం సలసల కాగిపోతుంది. 7వ శతాబ్ది ఉత్తరార్థంలో భారత్‌లోకి చొరబడాలని చూసిన జీహాదీ శక్తులకూ, టర్కీ వలసదారులకు.. ఈ రోజు ఆత్మాహుతి దాడులకు ఏం తేడాలేదు. పైకి దేశాల మధ్య స్పర్థలా, రాజకీయంలా కన్పిస్తున్నా, వీరి లక్ష్యం మాత్రం ఒక్కటే.

భారతదేశంలో ఒకప్పుడు చప్పన్నారు (56) దేశాలుండేవి. అందులో ఏ ప్రాంతానికీ, ప్రదేశానికీ లేని గొప్ప చారిత్రక గ్రంథం కాశ్మీరు దేశానికి ఉంది. 12వ శతాబ్దంలో కల్హణుడు రాసిన ‘రాజతరంగిణి’ గొప్ప చారిత్రక, సాంస్కృతిక గ్రంథమని ‘ఆక్స్‌ఫర్డ్‌ స్టూడెంట్స్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియా’లో వి.ఎ.స్మిత్‌ ప్రకటించాడు. అలాంటి కాశ్మీర్‌ దేశం కశ్యపుని పేరుమీద ఏర్పడ్డది. అది ఇప్పుడు రాకాసిమూకల కబంధ హస్తాల్లో చిక్కి విలవిలలాడుతోంది. 14వ శతాబ్దంలో కాశ్మీరును పాలించిన సహదేవుడు తనకు లొంగిపోయిన ఇద్దరు విదేశీయులకు చోటిచ్చి ఈ పరిస్థితికి బీజం వేశాడు. తర్వాత మతమార్పిడి ముఠాకు నాయకత్వం వహించిన బుల్‌బుల్‌షా అనే మౌల్వీ, అతని బాటలో నడిచిన సద్రుద్దీన్‌ జీహాద్‌ను అమలుపరచే క్రమంలో కశ్మీరీ బౌద్ధ, హిందువుల పాలిట యమకింకరులయ్యారు.

సహదేవుడు, సద్రుద్దీన్‌ల అవతారమే నెహ్రూ, షేక్‌ అబ్దుల్లాలు. వాళ్లు మళ్లీ పుట్టి కాశ్మీర్‌కు ఈ గతి పట్టించారు. రాళ్లు రువ్వడం వారి మత నియమం అని చెప్పుకుంటూ, ఆ నియమంతోనే జిహాదీలు మన జవాన్లపై రాళ్లు రువ్వుతున్నారు. చూసి మనం వింత అనుకోనక్కరలేదు. 24 సెప్టెంబర్‌ 1931న మహారాజా హరిసింగ్‌ జన్మదినోత్సవం జరుగుతున్నది. నగరం కోలాహలంగా ఉంది. విచిత్రం ఏమిటంటే ఈ ఉత్సవంలో మహమ్మ దీయులూ భాగస్వాములవుతున్నారు. సుద్రుద్దీన్‌ ఆత్మ ఆవహించిన షేక్‌ అబ్దుల్లా పథకం ప్రకారం రాజావారి ఊరేగింపుపై రాళ్లు వేయించాడు. హిందువుల ఇళ్లు తగలబడి కాశ్మీర్‌లో బీభత్స వాతావరణం నెలకొన్నది. ఉత్సవాలు ఆగి, శాంతి భద్రతల సమస్య ముందుకొచ్చింది. సరిగ్గా భారత్‌లో ఈరోజు ఇదే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఐదేళ్లలో నిరంతర నిఘా, అంతర్జాతీయ దౌత్యం, సర్జికల్‌స్ట్రెక్స్‌, నోట్లరద్దు కారణంగా ఉగ్రవాద మూలాలు దెబ్బతిన్నాయి.

ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ సైన్యం కోరలు పీకి వేర్పాటువాదుల చేతికి కశ్మీరును వదిలిపెట్టాయి. ఇటీవలికాలంలో సైన్యం కాశ్మీరుపై కొంత పట్టు సాధించింది. 2017లో ఏప్రిల్‌ 6 నాడు కాశ్మీరు మాజీ సిఎం ఫారూఖ్‌ అబ్దుల్లా ‘జమ్మూ కాశ్మీర్‌లో యువత దేశం కోసమే భద్రతా బలగాలపై రాళ్లు రువ్వుతున్నారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా కాశ్మీర్‌పై తీర్మానం చేయాలనే రాళ్లు విసురుతున్నారు’ అన్నాడు. కానీ అదే సంవత్సరం ఏప్రిల్‌ 16న ఫరూఖ్‌ అహ్మద్‌దార్‌ అనే రాళ్లు రువ్వే దేశద్రోహిని రాష్ట్రీయ రైఫిల్స్‌ కంపెనీకి చెందిన క్విక్‌రెస్పాన్స్‌ టీం జీపుకు కట్టి తమను తాము రక్షించుకున్నారు. ఇదీ అప్పటి ప్రభుత్వాలకీ, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా!

దీంతో మతోన్మాద జీహాదీ శక్తుల మోచేతి నీళ్లు తాగే దేశద్రోహ మనస్తత్వం ఉన్న ఒక వర్గం వారు ఓ పథకం ప్రకారం భారత్‌ను దోషిగా నిలబెట్టి పాకిస్తాన్‌కు ఆనందం కలిగిస్తున్నారు. పాక్‌ టీవీ చానల్‌ చర్చలో మణిశంకర్‌ అయ్యర్‌ భారత్‌-పాక్‌ మధ్య చర్చలు జరగాలంటే ‘మోదీని గద్దెదించాలి’ అన్నాడు. నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పాకిస్తాన్‌ వెళ్లి వాళ్ల ఆర్మీచీఫ్‌ను కౌగిలించు కున్నాడు. నషీరుద్దీన్‌ షా అనే వృద్ధ నటుడు ‘భారత్‌లో తమకు భద్రత లేదు’ అన్నాడు. అంతకుముందు అమీర్‌ఖాన్‌ ఇలాంటి దేశద్రోహ వ్యాఖ్యలే చేశాడు. ఇటీవల ఉపరాష్ట్రపతి పదవి అనుభవించి దిగిపోయిన హమీద్‌ అన్సారీ ‘అసహనం’ అంటూ కూనిరాగాలు తీశాడు. ఈ దేశంలో బయటి శత్రువులకన్న ఇంటి దొంగలే ప్రమాదకారులుగా తయారయ్యారు. అమరవీరుల స్థూపాల ముందు వెలిగించిన కొవ్వొత్తుల వెలుగు ఆరకముందే మమతా బెనర్జీ రాజకీయం మొదలుపెట్టింది. ప్రశాంత్‌ భూషణ్‌, అపరమేధావి వి.ప్రకాశ్‌, కవితా కృష్ణన్‌, కమల్‌ హాసన్‌, సానియా మీర్జా, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ – అమర బలిదానాలను కించపరుస్తూ మాట్లాడారు. రేపోమాపో పచ్చ బ్యాచ్‌ రంగంలోకి దిగడం ఖాయం. స్వామి అగ్నివేశ్‌, మేధాపాట్కర్‌, అరుంధతీరాయ్‌, కన్హయ్యకుమార్‌, ఉమర్‌ ఖలీద్‌ వంటి కమ్యూనిస్టు ఆస్థాన గాయకులు తమ గళం కలుపుతారు !?

దేశంపై దాడి జరిగినా స్పందించని గ్యాంగులు మనదేశంలో చాలా ఉన్నాయి. అదే మైనార్టీపై ఈగ వాలినా వాళ్ల యావత్‌ శక్తీ వినియోగిస్తారు. అందుకే చావుకు దగ్గరవుతున్న వృద్ధులు కూడా ఈ ఘటనను ఖండిస్తుంటే అభ్యుదయ వాదులు, సేవ్‌ డెమోక్రసీ గ్యాంగులు, ఇండియా గేట్‌ క్యాండిల్‌ బ్యాచులు, రోహింగ్యాల రక్షణ కవచాలు, అవార్డు వాపసీ వృద్ధ జంబూకాలు, జస్ట్‌ ఆస్కింగ్‌ బ్యాచ్‌, చైనా చంచాలు, మీటూ ఉద్యమకారులు, ఎర్ర కళ్లద్దాల మీడియా, కిస్‌ ఆఫ్‌ లవ్‌ గ్యాంగు, బీఫ్‌ఫెస్టివల్‌ వాళ్లు, పుస్తక స్మగ్లర్లు, ప్రజాస్వామ పరిరక్షకులు, జన అజ్ఞాన వేదికలు, అర్బన్‌ నక్సల్స్‌.. 42 మంది వీర సైనికుల చావు గురించి ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు?!

అయినా మనకు బుద్ధిలేక గానీ!? కోయం బత్తూరు, బెంగళూరు బాంబు పేలుళ్లతో నరమేధం సృష్టించిన అబ్దుల్‌ నాసర్‌ మదానీని విడుదల చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన కేరళ కమ్యూనిస్టులున్న ఈ దేశంలో దేశద్రోహ మనస్తత్వులు కాక ఇంకెవరుంటారు? ఈ దేశ బడ్జెట్‌లో మొదటి ముద్ద ముస్లింలకే అని సవతి తల్లి ప్రేమ చూపించిన మన్మోహన్‌ ఏలిన ఈ దేశం నుండి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించగలం!? బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌లో తీవ్రవాదులు చనిపోతే తెల్లార్లు నిద్ర లేకుండా ఏడ్చిన త్యాగమూర్తి సోనియా నడుపుతున్న పార్టీ ఉన్న ఈ దేశంలో, రోహింగ్యాలకు మా పూర్తి మద్దతు అన్న మమతను భావి ప్రధానిగా చూపిస్తున్న నాయకులున్న ఈ దేశంలో, ఐపియస్‌ కృష్ణ ప్రసాద్‌ను నిర్దాక్షిణ్యంగా చంపిన తీవ్రవాదిని మానవతా దృక్పథంతో విడుదల చేసిన వైయస్సార్‌ పుట్టిన ఈ దేశంలో, ముంబై దాడుల ముష్కరుడిని ఊరేగించే విద్యార్థులున్న ఈ దేశంలో, దేశాన్ని ముక్కలు చేస్తాం అంటూ నినాదాలిస్తున్న కన్హయ్య, ఉమర్‌ ఖలీద్‌లు ముద్దొస్తున్న ఈ దేశంలో, నరహంతకుడి కోసం అర్ధరాత్రి సుప్రీంకోర్టు తలుపులు తెరిపించిన న్యాయకోవిదులున్న ఈ దేశంలో, అలీఘడ్‌ ముస్లిం యూనివర్శిటీలో జిన్నా భూతం ఫోటో తగిలించిన ఈ దేశంలో ఇంతకన్నా ఏం ఆశించగలం?!! ఇదే వేడిలో కాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని గురించి చెప్పే 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తే దొరలెవరో దొంగలెవరో తెలిసిపోతుంది! దేశభక్తులెవరో దేశద్రోహులెవరో తేలిపోతుంది!

***********************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
జాగృతి : వారపత్రిక 
25 ఫిబ్రవరి - మార్చి03 - 2019
సంపుటి : 71, సంచిక : 17
విశ్వరసాయన శాస్త్రం ప్రకారం మనిషికి,ప్రకృతికి మధ్య గొప్ప సంబంధం ఉంది. కానీ దానిని విస్మరించి ప్రాకృతిక నియమాలకు విరుద్ధంగా జీవిస్తూ దానిని గొప్ప భౌతికవాదంగా, ప్రజ్ఞగా ప్రచారం చేస్తాం. దానిలో ఈ రోజు మనం అనుకునేంత సైన్సు లేకపోవచ్చు. కానీ అంతఃప్రజ్ఞఉంది. ఇంట్లోకి కాకులు, గుడ్లగూబలు ప్రవేశిస్తే కొన్నాళ్లు ఇళ్లు వదలమని జ్యోతిష్యులు చెప్తారు. వెంటనే మనకున్న జ్యోతిష వ్యతిరేకతతో దీనిని ఆలోచిస్తే అది అంధశ్వాసంలా కన్పిస్తుంది. కానీ దానిలోని మరో కోణం గమనించాలి.
మనం ఎంతో కలపను ఇంటి అవసరాలకు వాడుతాం. దాని వల్ల అడవులు నశిస్తున్నాయి. దీనివల్ల ఆ చెట్లపైన ఉండే జీవరాశులు గూడు లేనివిగా మారుతున్నాయి. అప్పుడు వాటి కష్టాలు వర్ణణాతీతం. వాటి బాధ మనకు తెసేఏదెలా? గూడుకోల్పోయిన ఆ పక్షులు మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని వదిలి కొన్నాళ్లపాటు అద్దె ఇంటిలో నివసిస్తే.. గూడులేని పక్షిలా జీవనం ఎలా ఉంటుందో మనకు అవగతం అవుతుంది.
ఇదే దీనివెనుక రహస్యం. ప్రతి సృష్టి ధర్మాన్నీ మైక్రోస్కోపులోనో, పరీక్ష నాళికలోనోపెట్టి చూడలేం. ప్రతి విశ్వాస్వాన్నీ మన తర్కంతో, మేధస్సు సహాయంతో, గణితసూత్రాలతో తెలుసుకోవడం సాధ్యం కాదు. కానీ అవి సంభవించి తీరుతాయి. అంతమాత్రాన అదిలేదని చెప్పలేం. అలాగే.. మహాపుణ్యక్షేత్రాలను ఎందరో మహానుభావులు సందర్శిస్తారు. వారందరి తత్వాన్నీ ఆయా క్షేత్రాలు తమలో ఇముడ్చుకుంటాయి. అక్కడికి వెళ్తే వాళ్లందరి స్ఫూర్తీ మనలో నిండుతుంది. ఆ క్షేత్రాలను కేవలం భౌతిక పర్యాటక కేంద్రంగా చూస్తే మనం పొందగలిగేదీ ఏదీలేదు. తాత్విక దృష్టితో జీవించడం కూడా ఒక ఆధ్యాత్మిక సాధన. ఆ పవిత్ర సాధన.. కేత్రాల్లో, ఆశ్రమాల్లో, పవిత్ర స్థలాల్లో, కొన్ని సాంప్రదాయాల్లో, కొన్నిదైవిక కార్యక్రమాల్లో పుష్కలంగా దొరుకుతుంది. మనిషి మనసునిండా ఎన్నో పాపపు జ్ఞాపకాలుంటాయి. అన్ని రకాల జ్ఞాపకాలు మనకు బరువునే కల్గిస్తుంటాయి. వాటిని మన తలపై నుండి దింపుకోవటానికే ఈ పవిత్ర సాధనలు.
ఆత్మాత్వం గిరిజా మతిః పరిచరాః ప్రాణాః శరీరం గృహం
పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః
సచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వాగిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్‌

‘ఓ పరమశివా! నీవే ఆత్మవు; పార్వతి దేవే బుద్ధి; నా ప్రాణములే నీ పరిజనములు; ఈ శరీరమే గృహం. నా విషయోపభోగరచనయే నీకు చేసే పూజలు; నిద్రనే సమాధిస్థితి. నా సంచారమే ప్రదక్షిణ. నీ మాటలే ని స్తోత్రాలు; నేనేమి చేసినా అది నీ ఆరాధనే కదా!’ అన్నారు శంకరులు. ఈ స్థితి కోసమే ఆధ్యాత్మిక సాధన.
- డా. పి. భాస్కరయోగి


********************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య నివేదన ॐ*జమ్మూ కశ్మీర్‌లోని యువత దేశం కోసమే భద్రతా బలగాలపై రాళ్లు రువ్వుతున్నారు.. ప్రజాభీష్టానికి అనుగుణంగా తీర్మానం చే యాలనే రాళ్లు విసురుతున్నారు’- ఈ మహావాక్యం జాలువారింది ఎవరినోటనో తెలుసా? 2017 ఏప్రిల్ 6న కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఈ మాటలన్నారు. కశ్మీర్‌ను రావణకాష్టంలా రగిలిస్తున్న అబ్దుల్లా కుటుంబం నుండి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం.

24 సెప్టెంబర్ 1931న ఆనాటి కాశ్మీర్ రాజు హరిసింగ్ జన్మదినోత్సవానికి రాజ్యమంతా ముస్తాబైంది. ప్రజలంతా శాంతియుతంగా వేడుకలకు సిద్ధమయ్యారు. కానీ కశ్మీర్‌ను ఢాకినీ పిశాచంలా విడవకుండా వెంటాడి వేటాడిన షేక్ అబ్దుల్లాకు ఇది సుతారమూ ఇష్టం లేదు. తన అనుచరులతో రాజావారి ఉత్సవాలపై రాళ్లదాడి చేయించాడు. హిందువుల ఇళ్లు క్షణాల్లో తగలబడిపోవడంతో జన్మదిన వేడుకలు ఆగిపోయి శాంతి భద్రతల సమస్య ముందుకొచ్చింది. కశ్మీర్‌లో రాళ్ల దాడి చరిత్రకు వెయ్యేళ్ల వారసత్వం ఉంది. ఈ చర్చ ఎందుకంటే- ఇటీవల పుల్వామాలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 42 మంది సైనికులు మరణించి, కొందరు క్షతగాత్రులై విలవిలలాడుతుంటే- కొందరు వాళ్లను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడి రాక్షస మూకలు ఆ సమయంలోనూ సైనికులపై రాళ్ల దాడి చేయడం ఎంత ఘోరం!


కశ్యపుడి పేరుతో ఏర్పడిన కాశ్మీర దేశం- పరమ పవిత్ర హిమాలయాలున్న ప్రదేశం. కంకుమపువ్వు, యాపిల్ తోటలకు నెలవైన స్థానం. అమర్‌నాథ్, వైష్ణోదేవి వంటి పవిత్ర స్థలాలున్న పుణ్యప్రదేశం. ప్రాచీన శైవానికి నెలవైన ఈ ప్రాంతం ఎందుకు ఈరోజు రక్తసిక్తమై విలవిలలాడుతోంది? ప్రాచీన భారతదేశ చరిత్రకు ఓ దిక్సూచిలా కాశ్మీర్ చరిత్రను ఒక పద్ధతి ప్రకారం రచించిన కల్హణుని ‘రాజతరంగిణి’లో చెప్పిన స్థానంలో అబ్దుల్లా, ముఫ్తీ, హురియత్ నేతలకు స్థానం ఎందుకు దక్కింది?


14వ శతాబ్ది ప్రథమ భాగంలో కశ్మీర్‌ను సహదేవుడు అనే హిందూరాజు పాలించాడు. అతని ఉదారబుద్ధి తన శరణు జొచ్చిన ఇద్దరు పరదేశీ ఉన్మాదులకు స్థానం ఇచ్చింది. ఆ ఇద్దరిలో ఒకడు టిబెట్ రాజవంశీకుడు రెంచన్, రెండవవాడు అప్ఘనిస్తాన్‌కు చెందిన షామీర్. కాశ్మీర్‌పై పరదేశీ మత దురాక్రమణదారుల కన్ను చాలా ముందే పడింది. ఇరాన్‌లోని సీస్తాన్‌లో ఇస్లామిక్ రాజ్యకాంక్ష మొదలయ్యాక క్రీ.శ. 650 నుండే ఈ విస్తరణకాంక్ష పెరిగింది. క్రీ.శ.712లో మహమ్మద్ బిన్ కాసిం సింధురాజ్యాన్ని ఆక్రమించడంతో మన దేశానికి ఆనాడే పెనుప్రమాదం ప్రారంభమైంది. 


క్రీ.శ.632లో మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత ఎనిమిదేళ్లలోపే ఈ దండయాత్రలు అరేబియా ద్వీపకల్పాన్ని దాటి సిరియా, ఈజిప్ట్‌ల వరకు వెళ్లాయి. క్రీ.శ.660లోనే ఖలీఫా అలీ పెద్ద సైన్యంతో సింధ్ ప్రాంతం మీదకు దం డయాత్ర చేయించి హిం దూ దేశాన్ని ఆక్రమించాలనుకున్నాడు. కిక్రాస్ దగ్గర హిందూ సేనలు వాళ్లను చావుదెబ్బ తీసాయి. ఆ తర్వాత ఇరవై ఏళ్లలో కిక్రాస్‌పై అరబ్బులు ఆరుసార్లు దాడి చేసి ఓడిపోయారు. తర్వాత హిజ్జాజ్, బుదాయిల్ భారత్‌పై దురాక్రమణకు ప్రయత్నించారు. సాధ్యపడనందున అతని అల్లుడైన మహమ్మద్‌బిన్ కాసింకు ఈ బాధ్యత అప్పగించారు. రాజాదాహిర్‌సేన్ ప్రయత్నాలు విఫలమైపోయి ఆ తర్వాత 1947 సెప్టెంబర్‌లో పాక్ దుండగులు మన కాశ్మీర్‌లో అక్రమంగా చొరబడే వరకు మన మొద్దు నిద్ర వదల్లేదు. 712లో ఎలాగైతే దాహిర్‌సేన్ అరబ్బుల దండయాత్రను అనుచరులమీద వదిలేసినట్లే 1947 సెప్టెంబర్ పాకిస్తాన్ దాడిని జవహర్‌లాల్ నెహ్రూ కాశ్మీర్ రాజు స్వంత వ్యవహారం అన్నట్లు మిన్నకున్నాడు. 

పుల్వామాలో జరిగిన దాడి అయినా, క్రీ.శ.712లో జరిగిన సింధు దురాక్రమణ దాడి అయినా దాని వెనుక ఓ స్పష్టమైన లక్ష్యం ఉంది! క్రీ.శ.638 నుండి 712 వరకు మధ్యన 74 ఏళ్లలో 15 సార్లు భారత్‌పై దురాక్రమణ ప్రయత్నం జరిగింది. చివరకు క్రీ.శ.712 జూన్ 16న సాయంత్రం సింధ్ రాజ్య మహావీరుడు దాహిర్‌సేన్ నేలకూలాకగానీ వాళ్ల లక్ష్యం నెరవేరలేదు. మళ్లీ జిన్నాతో క్రొత్త కథ మొదలైంది. 14వ శతాబ్దంలో కాశ్మీర్‌ను పాలించిన సహదేవుడు నెహ్రూగా, కాశ్మీర్‌లో మతోన్మాదం చెలరేగిపోయిన సద్రద్దీన్ షేక్ అబ్దుల్లాగా అవతారం ఎత్తారు. దీనితో కథ మళ్లీ మొదటికి వచ్చింది. కశ్మీర్‌పై దాడి రాజకీయ, భౌగోళిక అంశం ఎంతమాత్రం కాదు. అలా ఆలోచించడంవల్లనే కాశ్మీర్‌లో ఈ పరిస్థితి వచ్చింది. ఇదొక మత దురాక్రమణగా క్రీ.శ.712లో భారతదేశంలోకి చొరబాటు జరిగిందో ఇప్పుడూ అదే ప్రయత్నం! ఇది అర్థం చేసుకోని అజ్ఞానులు ‘కాశ్మీరీ అజాదీ’ అంటూ నినాదాలు ఇస్తున్నారు. కశ్మీర్‌లో పుట్టి పెరిగిన, మూలవాసులైన కాశ్మీర్ పండిట్లు ఎందుకు దేశం విడిచివెళ్లారంటే- ఒక్కరూ సమాధానం చెప్పరు!

‘నిజానికి పాకిస్తాన్ ఓ కృత్రిమమైన జాతి’ అని తారేఖ్ ఫతే రాస్తాడు. వాళ్లకు ఎలాంటి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం లేదు. రాజకీయ అవసరాల దృష్ట్యా ఏర్పడ్డ మతరాజ్యం. భారత్‌లో నెహ్రూ, పాకిస్తాన్‌లో జిన్నా, కాశ్మీర్‌లో అబ్దుల్లా కుటుంబాలు రాజకీయంగా స్థిరపడడానికి బ్రిటీషు వారు పన్నిన ఒక వల అని ఇటీవలి చారిత్రక, రాజకీయ పరిశోధనలు తెల్పుతున్నాయి. కానీ ఈ సమస్య భారత్ మెడకు చుట్టుకొంది. యుద్ధాల్లో మరణించిన మన సైనికులకన్నా ఉగ్రవాద దాడుల్లో చచ్చిపోతున్న వారి సంఖ్య గణాంకాల ప్రకారం ఎక్కువ. యుద్ధం ఒకసారి వస్తే చేయవచ్చు, భారత సైనికులకు ప్రతిరోజూ ఒక యుద్ధమే. దురదృష్టం ఏమిటంటే సైనికులు యుద్ధం చేసేటపుడు రెండు పనులు చేయాల్సి వస్తోంది. తుపాకులు పట్టుకొని శత్రువులపై ఒకవైపు పోరాటం చేస్తే, కెమెరాలు పట్టుకొని మరోవైపు సాక్ష్యాలు సంపాదించాల్సి వస్తోంది. బయటి శత్రువులను నిర్మూలించడానికి తుపాకులైతే, అంతర్గత శత్రువులకు సాక్ష్యం ఇవ్వడానికి కెమెరాలు కావాల్సి వస్తోంది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? 42 మంది వీరజవాన్ల కుటుంబాల్లో విషాదం నిండిపోవడమే గాక, దేశమంతా అట్టుడికిపోతుంటే అమరజవాన్ల స్థూపాల ముందు కొవ్వొత్తుల ముందు వెలుగులు ఆరకముందే రాజకీయం మొదలైంది.


లోక్‌సభ ఎన్నికలు దగ్గరకు వస్తుంటే ప్రధాని పదవికి పోటీపడుతున్న వాళ్లు, ‘నేనే పొలిటికల్ ఇండస్ట్రీకి ఆద్యుడిన’ని చెప్పేవాళ్లు వీరజవాన్ల మృతిపై సవాళ్లు విసురుతున్నారు. సర్జికల్ స్ట్రైక్, పెద్దనోట్ల రద్దు, ‘ఎన్జీవో’ల ఆటకట్టు, నిరంతర నిఘా, అంతర్జాతీయ దౌత్యం.. వంటి చర్యలతో టెర్రిరస్టు దాడులు తగ్గాయి. పుల్వామా ఘటన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జరిగిన అతి పెద్ద ఉగ్రవాద దాడిగా చెప్తున్నారు. మరోవైపు దేశంలోని అంతర్గత శత్రువులు చేస్తున్న ప్రచ్ఛన్నయుద్ధం తక్కువేం కాదు. రాజకీయ అవకాశవాదంతో కొందరు చేస్తున్న దాడిలో భారతీయులు రోజూ మరణిస్తూనే ఉన్నారు. పాక్ టీవీ చానెల్ చర్చలో కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ‘భారత్-పాక్ చర్చలు జరగాలంటే మోదీని గద్దెదించాలి’ అన్నాడు. పంజాబ్ మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకుని ‘్ఫరిస్తా’ అని పొగిడొచ్చాడు. అమీర్ ఖాన్ లాంటి ప్రఖ్యాత నటుడు ముస్లింలకు దేశంలో భద్రత లేదన్నాడు. నసీరుద్దీన్ షా అనే వృద్ధ నటుడు అంతర్జాతీయ ఆమ్నెస్టీ వారి అడుగులకు మడుగులొత్తుతూ, తన పిల్లలకు ఇక్కడ రక్షం లేదని వాపోయాడు. 

ఐదేళ్లు ఉప రాష్టప్రతి పదవి అనుభవించి పోతూ పోతూ ‘అసహనం’ అంటూ హమీద్ అన్సారీ వ్యాఖ్యానించాడు. తీవ్రవాదుల కోసం ప్రశాంత్ భూషణ్ అనే న్యాయకోవిదుడు అర్ధరాత్రి సుప్రీం కోర్టు తలుపులు తెరిపిస్తాడు. సినిమాలో ‘భారతీయుడు’లా వేషం వేసి ‘శహబాష్’ అనిపించుకొన్న కమల్‌హాసన్ కశ్మీర్‌లో ప్లెబిసైట్ పెట్టాలంటాడు. అదే కోవలో కవితా కృష్ణన్, వి.ప్రకాశ్, సానియా మీర్జా, సిద్ధూ, అమరుల బలిదానాలను కించపరుస్తూ వ్యాఖ్యలు మొదలుపెట్టారు. ఇక కమ్యూనిస్టు ఆస్థాన గాయకులు స్వామి అగ్నివేశ్, మేధాపాట్కర్, అరుంధతీ రాయ్, కన్హయ్య, ఉమర్ ఖలీద్, షెహ్లా రశీద్‌లు కూడా తమ గళం త్వరలోనే వినిపిస్తారు. ‘్ధరవనిత’ మమతా బెనర్జీ ప్రధాని మోదీపై ద్వేషంతో విషం కక్కగా, భారత రాజకీయాలకు ‘దిక్సూచి’ లాంటి చంద్రబాబు ఆమెను సమర్థించాడు.

సాధారణ వృద్ధులు సైతం పాక్ ఉగ్రదాడులను ఖండిస్తుంటే.. ప్రచారంలో మునిగితేలే అభ్యుదయవాదులు.. సేవ్ డెమోక్రసీ గ్యాంగులు, ఇండియా గేట్ క్యాండిల్ ర్యాలీ బ్యాచ్‌లు, సపోర్ట్ ఆసిఫా బ్యాచ్‌లు.. రోహింగ్యా రక్షణ కవచాలు, అవార్డు వాపసీ వృద్ధ జంబూకాలు.. ‘జస్ట్ ఆస్కింగ్’ బృందాలు.. వ్యవస్థ పరిరక్షకులైన జడ్జీలు, చైనా చెంచాలు, ‘మీ టూ’ ఉద్యమకారులు.. ఎర్రకళ్లద్దాల మీడియా, హర్యాలీ మేధావులు, కిస్ ఆఫ్ లవ్ గ్యాంగ్, బీఫ్ ఫెస్టివల్ బ్యాచ్, పుస్తక స్మగ్లర్లు, కులగజ్జి గ్యాంగు.. జన విజ్ఞానవేదికలు, అర్బన్ నక్సల్స్.. వీళ్లంతా 42 మంది వీర సైనికుల చావు గురించి ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు!


బెంగళూరు, కోయంబత్తూరు బాంబు పేలుళ్ల సూత్రధారి అబ్దుల్ నాసర్‌ను విడుదల చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన కేరళ కమ్యూనిష్టుల నుండి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించగలం? ‘ఈ దేశ బడ్జెట్‌లో మొదటి ముద్ద ముస్లింలకే’ అని హిందువులపై సవతి తల్లిప్రేమ ప్రదర్శించిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నుండి మనం ఏం ఆశించగలం? బాట్లీహౌజ్ ఎన్‌కౌంటర్‌లో తీవ్రావాదులు మరణిస్తే తెల్లార్లు నిద్రలేకుండా బాధపడిన యూపిఏ చైర్ పర్సన్, త్యాగమూర్తి సోనియా గాంధీ నుండి మనం ఏం ఆశిస్తాం? రోహింగ్యాలకు మద్దతు ప్రకటించిన ‘ప్రధాని అభ్యర్థి’ మమతా బెనర్జీ నుండి ఏం ఆశించగలం? ఐపిఎస్ అధికారి కృష్ణప్రసాద్‌ను నిర్దాక్షిణ్యంగా చంపిన తీవ్రవాదిని అప్పనంగా వదిలిపెట్టిన రాజకీయ వ్యవస్థ నుండి మనం ఏం ఆశించగలం? ముంబై పేలుళ్ల సూత్రధారిని ఊరేగించే విద్యార్థి నాయకులున్న ఈ దేశం ఇంతకన్నా ఏం ఆశిస్తుంది? ముంబైలో బాంబు పేలుళ్లను లైవ్ టెలికాస్ట్ చేసిన జర్నలిస్టులున్న వ్యవస్థ నుండి ఏం ఆశించగలం? దేశ విభజనకు కారణమైన జిన్నాను ఆరాధించే విశ్వవిద్యాలయాలున్న ఈ వ్యవస్థ నుండి ఏం ఆశించగలం? ఇవేవీ లక్ష్యపెట్టకుండా- మీ ప్రాణాలను ఈ మట్టికోసం ధారపోసిన వీరసైనికులారా.. దయచేసి మమ్మల్ని క్షమించండి..!


****************************
 * డాక్టర్. పి. భాస్కర యోగి *
 * ఆంధ్రభూమి : భాస్కర వాణి *

కొక్కొరో ... క్కో ...


శనీశ్వరుడు చంద్రబాబు నడినెత్తిన కరాళనృత్యం చేస్తున్నాడు. కాబట్టి శుభప్రదమైన పచ్చ చొక్కాలు విడిచిపెట్టి నల్ల చొక్కాలను ధరించారు. తాను ధరించడమే గాక పార్టీ వాళ్లందరికీ నల్ల చొక్కాలు తొడిగి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అంటూ ఢిల్లీకి వెళ్లి ధర్నా మొదలుపెట్టారు. ఏపీ భవన్‌ తెలుగుదేశం పార్టీ కార్యాలయమో లేక ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లానో భావించి అక్కడ దీక్ష పేరుతో ప్రజలకు శిక్ష వేసినంత పని చేసారు. ఖరీదైన ¬టళ్లు, సుఖసంతోషాల మధ్య ‘నిరసన దీక్ష’ చేపట్టారు. ఇది తెలుగు ప్రజలకు శిక్ష అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సాయంకాలం ప్రైమ్‌టైమ్‌ అంతా తెలుగు టీవీ ఛానళ్లు ఒకే ప్రోగ్రాంను ప్రసారం చేసాయి. వాళ్ల హెడ్డింగులు చూస్తే మనకు కళ్లు బైర్లు గమ్మి స్పృహ కోల్పోవాల్సిందే. బాబుగారి రాజగురువు నడిపే టీవీ ‘ఢిల్లీలో ధర్మపోరాటం’ అనీ, ‘మండే చంద్రుడు’ అని మరో దగ్గున్న ఛానల్‌, ‘దద్దరిల్లిన ఢిల్లీ’ అనీ పచ్చకలర్‌ టీవీ, ఢిల్లీతో ఢీ అని మరో కులపక్ష పాత టీవీ, ‘ఆఖరి పోరాటం’ అని మరో మాయదారి టీవీ, ‘ఆత్మ గౌరవ పోరాటం’ అని ఇంకో కామెర్ల కెమెరా.. ఇలా చెప్పుకుంటూ పోతే కళింగ రాజ్యంపైకి అశోకుడు దండయాత్ర చేసినప్పుడు పెట్టాల్సిన హెడ్డింగులన్నీ మన టీవీ ఛానళ్లు పెట్టాయి. వికృతానందంతో అన్ని టీవీల్లో ఇదే ఏడుపు అయ్యేసరికి తెలుగు ప్రేక్షకులు కళ్లలో వత్తులేసుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోయారు.

ఇందులో బాబుగారి మహాగొప్ప ఉపన్యాసం ప్రజలు విని తరించాల్సిందే. ఎందుకంటే అబ్రహంలింకన్‌, సుభాష్‌చంద్రబోస్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌, జయప్రకాశ్‌ నారాయణ్‌, చంద్రశేఖర్‌.. వంటి ‘మహా వ్తలను తలదన్నే ఉపన్యాసం అది!?’ ముందున్న వారు మురిపెంగా కరతాళ ధ్వనులు చేస్తుంటే డిక్షనరీలోని తిట్టు పదాలను ముత్యాల సరాల్లా ఏర్చికూర్చి చదివిన ‘మోదీపై తిట్లదండకం’ విని తరించాల్సిందే. మీరు ‘సూపర్‌ బాబు!? రసహీనమైన ఆ ఏడుపుగొట్టు ఉపన్యాసం వినలేక చచ్చినా, పచ్చ మీడియా మాత్రం నిద్ర లేకుండా పలవరించడం మరో విడ్డూరం.

నక్సలైట్లు, తీవ్రవాదులు ప్రధానిని గోబ్యాక్‌ అనలేదు కాని ఒకదేశ ప్రధానిని ‘గోబ్యాక్‌’ అంటూ ఆంధ్ర నడిబొడ్డున ప్లెక్సీలు పెట్టడం ప్రజాస్వామ్య అపహాస్యం కాదా? ప్రత్యేక ¬దా అనేదే ఈ దేశానికి ఇప్పుడు ఆక్సిజన్‌ అన్నట్లు బాబు ఆండ్‌ కో ప్రవర్తించడం దానిని ప్రత్యక్షంగా, పరోక్షంగా మోదీని తిట్టేందుకు ఉపయోగించడం ఈ దేశ ప్రజాస్వామ్య రక్షణా?’ రాజుగారి రాచపుండు రాజ్యానికే కష్టం వచ్చిందన్నట్లు ప్రచారం చేసే వంధిమాగధ మీడియాను చూస్తే పాత్రికేయులకు ఇంకా బ్రతికున్నామా అనిపిస్తున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా విభజన తప్పదని తెలిసినా బాబుకు ఇలాగే వత్తాసు పలికిన తెలుగు మీడియా 2014లో భంగపడింది. అంతెందుకు.. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే హైద్రాబాద్‌లో చేవలేని బాబు ప్రసంగాలను ఆహా.. ఓహో.. అంటూ ఊదరగొట్టి తెలుగు మీడియా కాంగ్రెస్‌ నడ్డి విరిస్తే ఆ పార్టీ ఇప్పటికే స్పృహ నుండి బయటకు రాలేదు. ఇప్పుడు కూడా ఢిల్లీ ధర్నాకు ఫ్రేమ్‌కట్టి తెలుగు ప్రజలను వంచించే పనికి బాబుతో సహా మీడియా పూనుకొన్నది. ఇక ఆ ధర్నాలో పాల్గొన్న పాతకాపులంతా ఆత్మరక్షణలో పడి తమ స్వీయ రక్షణను వెతుక్కున్న వారే. ఇందులో నరాలు తెగిన ఓ సీనీ నటుడు బాబుగారిని, ఆయన పుత్రరత్నం లోకేష్‌ను పొగుడుతుంటే ముత్యాల ముగ్గు సినిమా రావుగోపాల రావు మేళం ఒక్కటే తక్కువ అనిపించింది. మరో స్వయంప్రకటిత మేధావి టీవీల్లో ‘నేను ఏ పార్టీ కాదు’ అంటూనే బాబుగారి చంకలో ఎక్కి పుచ్చలపల్లి సుందరయ్యలా భుజంపై కండువాతో ఫోజులిస్తుంటే రాజకీయం ఇంత ఊసరవెల్లిలా మారిందా? అని బాధ కలుగుతోంది. హతవిధీ..!!

***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
 18 -24 ఫిబ్రవరి - 2019
సంపుటి : 71, సంచిక : 16


పృథ్వీరాజ్ చౌహాన్ మన దేశంపైకి దండెత్తి వచ్చిన మహమ్మద్ ఘోరీని పదహారుసార్లు క్షమించడం నిర్హేతుకం. పదిహేడవసారి అతనికి అవకాశం దొరికింది. దాంతో ఈ దేశంలో విదేశీ శక్తులకు సంపూర్ణంగా బీజం పడింది. ఆనాటి నుండి భారత్ అనేక యుద్ధాలను ఎదుర్కొన్నది. ఇక్కడున్న హిందూ సమాజం మతపరమైన దమనకాండను తట్టుకొని అస్తిత్వాన్ని నిలబెట్టుకొంది. మహమ్మద్ బిన్ కాసిం దండయాత్రతో మొదలైన దాడి ఈరోజుకూ ఏదో రూపంలో ఈ దేశం ఎదుర్కొంటూనే వుంది. ఇక్కడ మతాన్ని రాజకీయాన్ని విడదీసి చూడలేం. మహమ్మద్ బిన్ కాసింకు ఏ లక్ష్యం ఉన్నదో ఒసామా బిన్ లాడెన్‌కు అదే లక్ష్యం ఉంది. అలాంటి గాయాలతో హిందూ సమాజం నెత్తురోడుతూ పయనిస్తూనే వుంది. ఇపుడు శిథిలమైన, జీవమున్న అస్తిపంజరం మాత్రమే భౌతికంగా కన్పిస్తున్నది. కానీ దీనికి ముందున్న రూపం, నశించిన జైవిక లక్షణం గురించి అంతర్గతంగా పరిశీలించడం కాదు కదా దాని గురించి ఆలోచించే తీరిక లేనంతగా మనం విభజనకు గురయ్యాం. కులాలుగా ముక్కలు ముక్కలైపోయిన హిందూ సమాజం ఎప్పుడో ఒకపుడు కార్గిల్ లాంటి యుద్ధం లాంటి సంఘటన జరిగితే తప్ప ఏకోన్ముఖంగా ప్రయాణం చేయట్లేదు. వందల ఏళ్లనుండి అది ఆక్రమిత శక్తులకు రాచబాటగా మారిపోయింది.

మొఘలాయిలు భయపెట్టి ఈ దేశాన్ని పాలిస్తే, బ్రిటీష్ వారు కుయుక్తితో ఇక్కడ ప్రజలను తమ చెప్పుచేతల్లో పెట్టుకొన్నారు. అందువల్ల ఇక్కడి హిందువులు జన్మతో మాత్రమే భారతీయత కలిగివున్నారు. అదే ఇతర మతాలవారికి అంతర్జాతీయ నిర్దేశాలు, ఆదేశాలు, సారూప్యత, రాజకీయ అవగాహన స్పష్టంగా ఉంది. హిందువుల బానిసత్వం కారణంగా భాష, తిండి, ఆచార వ్యవహారాలు అన్నీ విదేశీయమైనాయి. ఇపుడు మరో సంధి అవస్థలో, సంఘర్షణలో జీవిస్తున్నాం. పూర్తిగా స్వదేశీ, విదేశీ ఏదీ కాని దుస్థితి. మన సభ్యత సంస్కారాల్లో, మన నమ్మకాల్లో మనం సగం విదేశీయులుగా, సగం స్వదేశీయులుగా జీవిస్తున్నాం. ఈ విషయాన్ని 1947లో మనకు స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా చర్చిల్- ‘ భారత్ మూడు సంవత్సరాల్లోనే విభజనలతో తనను తాను నాశనం చేసుకుంటుంది’’ అన్నాడు. దీనికి కారణం ఇక్కడి మూల జాతీయులు, మెజారిటీల వైపునుండి ఎలాంటి గుర్తింపు లేకపోవడం! శ్యామ్యూల్ హంటింగ్‌టన్ అనే మేధావి "Who we are" అనే పుస్తకం రాసి శే్వతజాతీయుల గుర్తింపునకు నిర్వచనం ఇచ్చాడు."White Anglo axent protestent christian speaking English'' ... ఇధీ అమెరికా ప్రజల జాతిపరమైన నిర్వచనం. అదే భారత్‌లో హిం దువులు మెజారిటీగా ఉన్నా ఎలాంటి ప్రత్యేక హక్కులు లేవు. ఇతరులు దాడిచేసినా వౌనంగా ఉండడం సామరస్యంగా, గొప్ప ఆదర్శంగా హిందూజాతికి అలవాటు చేశారు.

స్వాతంత్య్రం రాకముం దు హిందువులు ఒకరకమైన సమస్యను ఎదుర్కొంటే, స్వాతంత్య్రం వచ్చాక ‘పెనం మీది నుండి పొయ్యిలో పడినట్లు’ అయింది. హిందువులకు ప్రజాస్వామ్యం అనే ముసుగు తగిలించి మరింతగా కాలరాస్తున్నారని ఇటీవల అంతర్గత ఆందోళన ఎక్కువైంది. అసలు ప్రపంచంలో ఎక్కడా లేని మైనారిటీ సంతుష్టీకరణ, మతమార్పిడి అనే జాడ్యాలు దేశంలో ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తున్నాయి. ఇపుడు దేశంలో అభివృద్ధి, ప్రగతి కన్నా సెంటిమెంట్లే రాజ్యమేలుతున్నాయి. మనోభావాల పేరుతో మెజారిటీ ప్రజలను ద్వితీయ శ్రేణిపౌరులుగా మార్చే చర్యలు హిందువుల్లో ఆందోళన రేపుతున్నాయి.
ఇపుడు దేశంలో విభజన రాజకీయాలకు ప్రాధాన్యం ఏర్పడింది. అలాంటివాళ్లకే మీడియా, సమాజం ఎక్కువగా గౌరవం ఇవ్వడం ఆందోళనకరం. ఔరంగజేబు తమ్ముడు, యువరాజు దారాషికో ఉపనిషత్తులను పర్షియాలోకి తర్జుమా చేశాడు. ఆధునిక కాలంలో మన కళ్లముందు ఈ దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించి ‘అణుభారతం’గా మార్చిన ఘనుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. వాళ్లకు మన సమాజంలో సరైన గుర్తింపు ఉండదు. బద్రుద్దీన్ అజ్మల్, అసదొద్దన్ ఓవైసీ, ఆజంఖాన్... ఇలాంటి వాళ్లముందు కలాం ఆదర్శాలు దిగదుడుపే! అలాగే జార్జి ఫెర్నాండెజ్ కర్ణాటకలో పుట్టి మరాఠీ ప్రాంతంలో రాజకీయం చేసి, ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాడు. మంచం పట్టేవరకు తన బట్టలు తానే ఉతుక్కున్నాడు. కానీ క్రైస్తవులకెవరికీ ఇలాంటి గొప్ప వ్యక్తి కంటబడడు. సేవ పేరుతో మత మార్పిడిలను ఒక సిలబస్‌గా నడిపిన వ్యక్తి ఆరాధ్యనీయురాలు అవుతుంది. ఈ సందిగ్థ, సంఘర్షణ వాతవారణం ప్రభావం ఇక్కడి మూలవాసులైన హిందువులపై సామాజికంగా, రాజకీయంగా చూపుతోంది. దానికి కారణం హిందువులకు మతం, రాజకీయం వేర్వేరు అంశాలు. నాయకులంతా హిందువులే, కానీ హిందుత్వకు స్థానం ఇవ్వరు.


ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మతం మారిన క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తానని తీర్మానం చేశాడు. బాబా సాహెబ్ అంబేడ్కర్ లాంటి మేధావికి కూడా కలగని ఈ ఆలోచన చంద్రబాబుకు కలగడం ఆశ్చర్యం! అంబేడ్కర్‌కు కానీ, రాజ్యాంగ రచన కమిటీ సభ్యులకు గానీ ఆ రోజు ఈ అద్భుతమైన ఆలోచన వారి మెదళ్లలో మెరవలేదు. ఓట్ల కోసం ఈనాటి కుత్సిత రాజకీయ నేతలకు కలగడంలో వింతేమీ లే దు. ఇప్పటికే చంద్రబాబు పెట్టిన మాల -మాదిగ వర్గీకరణ చిచ్చు రావణకాష్ఠంలా రగులుతూనే వుం ది. ఇపుడు మత మార్పిడి సంస్థలకు, హిందూ సంస్థలకు మధ్య జరగబోయే సంఘర్షణకు తెరలేపింది ఎవరు? ఇక్కడే హిందూ సమాజం భ్రమలో పడిపోయింది. మరోవైపు సూడో సెక్యులర్ లిబర్ శక్తులు ఈ దేశ మూల సంస్కృతిని విమర్శిస్తూ నిరంతరం మేధో ఉగ్రవాదం ప్రదర్శిస్తున్నాయి. సాహిత్య సాంస్కృతిక చారిత్రక రంగాల్లో తిష్ఠవేసుక్కూచున్న ఈ శక్తులు హిందుత్వను రోజూ అపహాస్యం చేయడమే కాదు, దాన్ని బలిపీఠం ఎక్కిస్తున్నాయి.

హిందువులు మెజారిటీగా వున్న ఈ దేశంలో 40వేల పైచిలుకు దేవాలయాలను కూల్చినా హిందువులు బాధపడరు. భారత్‌తో ఏ సంబంధం లేని బాబార్ పేర వెలసిన మసీదు కింద శిథిలమైన రామాలయం తిరిగి కట్టుకొంటామని నాలుగు వందల ఏళ్ల నుండి హిందువులు పోరాడుతూనే వుంటారు. బాబ్రీ కట్టడాన్ని కూల్చినపుడు మాట్లాడేందుకు అన్ని పార్టీలు, సంస్థలు ముందున్నాయి కానీ కాశ్మీర్‌లోని వంద ప్రాచీన దేవాలయాలు కూల్చితే ఒక్క గొంతైనా పెగిలిందా? అని హిందువులు ప్రశ్నిస్తున్నారు. శంకరాచార్య పర్వతానికి పేరు మార్చినపుడు, అమర్‌నాథ్ యాత్రికులపై దాడి చేస్తామని బహిరంగంగా ప్రకటించినపుడు సెక్యులర్ గుంపు ఎక్కడ నిద్రపోయింది. ‘తీవ్రవాదులు మా రాష్ట్రంలో గౌరవ పౌరులు’ అని జమ్మూ కాశ్మీర్ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ప్రకటిస్తే ఒక్క కలంలోని సిరాతో ఒక్క అక్షరం ఎందుకు రాయలేదు?

అమెరికా జనాభా ముప్ఫై కోట్లు దాటగానే అక్కడ తీవ్రమైన ఆందోళన మొదలైంది. మరి అమెరికా మనకన్నా 4 రెట్లు భూభాగం విస్తీర్ణంలో పెద్దది. మరి ఇక్కడి హిందువుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంటే భవిష్యత్తులో వారు నోరు మెదపగలరా? ప్రతి రాజకీయ నాయకుడు ఫలానా నియోజకవర్గంలో మైనారిటీలే రాజ్యాధికారం నిర్ణయం చేస్తారని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. మరి హిందువులను కులాలుగా విభజిస్తున్నారు. ఇపుడు కాశ్మీర్‌లో హిందువును ముఖ్యమంత్రిగా ఎందుకు చూడలేని స్థితి? తిరుమల తిరుపతి హిందువులకు గొప్ప పుణ్యక్షేత్రం. అదే తిరుపతి సమీపంలోని తొండవాడలో హైదర్ అలీ చేతిలో ధ్వంసమైన విష్ణ్వాలయం శిథిలాలు ఓ వైపు వెక్కిరిస్తుండగానే దానికి సమీపంలో అరబిక్ విశ్వవిద్యాలయం ఎలా వచ్చింది? ఇంత జరుగుతున్నా హిందువులు తమ ఆధ్యాత్మికతను మతంలోకి అలాగే పెట్టుకున్నారు గానీ రాజకీయంలోకి చొరబడనీయలేదు. అన్ని మతాలకు గౌరవం, ప్రాధాన్యం ఇచ్చేది ఒక్క భారత్‌లోనే. హిందూ మెజారిటీగా వున్నందునే ఇది సాధ్యం. పాకిస్తాన్‌లో 2003 నుండి 2012 వరకు 42,772 మంది ముస్లింలను ముస్లింలే హత్య చేశారు. భారత్‌లో హిందువులకు వారి రక్తంలో ప్రవహిస్తున్న ఔదార్యమే అన్ని సంస్కృతులను గౌరవించే తత్వం నేర్పింది.

ఇక్కడి మేధావులు, చరిత్రకారులు, నాయకులు, మీడియా మేధావులు ఒకరకమైన సంతుష్టీకరణకు అలవాటుపడి అదొక మానసిక రుగ్మతగా మార్చుకొన్నారు. సమాచార వ్యవస్థ డబ్బు రూపంగా మారినపుడు ఆ కాసుల వేటలో అర్భకులను తెలివైనవాళ్లుగా, తెలివైన వాళ్లను సుపరిపాలకులను నిరంకుశులుగా చూపించడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలో ఏ జాతీ తన చరిత్రను ధ్వంసం చేసినా తిరిగి అదే శిథిలాలపై పునరుజ్జీవనం పొందలేదు. కానీ ఈ దేశ బుద్ధిజీవుల చేతిలో నలిగిపోయిన భారతీయత, జాతీయతలకు కొత్తరక్తం ఎక్కించుకుంటూ మరో రూపంతో వికసించడం చెప్పుకోదగిన అంశం. ఇజ్రాయిల్‌లో చరిత్ర మరిచిపోని నరమేధాన్ని జర్మనీ చేసింది. ఇజ్రాయిల్ ఆ నరమేధాన్ని మరువలేదు. ప్రపంచాన్ని మరిచిపోనివ్వలేదు. భారత్‌లో విదేశీ పాలకుల చేతిలో అంతకన్నా ఎక్కువ ఘోరం జరిగింది. కానీ భారతీయులు ‘రేపు బాగుంటే’ అదే పదివేలు అని జీవించారు. అదే ఇపుడు ఇక్కడి జాతీయతకు బలంగా, బలహీనతగా మారింది. దేశంలోని ప్రజలు ఇపుడున్న సంఘర్షణ మనస్తత్వాన్ని వదలి సామరస్య జీవనం చేయాలంటే భారతీయతను సాధించాలి. సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఇక్కడి నాగరికతను గౌరవిస్తూ ఎవరి ఆరాధన వారు చేసుకోవచ్చు. అలా కాకుండా ‘హిందువులపై దాడులు కొనసాగిస్తాం’ అని భ్రమిస్తే మట్టికరిచిన రాజదండాన్ని ధర్మదండం తన భుజాలకెత్తుకోవడం ఖాయం.

మరోవైపు ‘ఈ దుఃఖాలనుండి నేర్వాల్సిన గుణపాఠం- నాగరికతా రక్షణకై ఎల్లవేళలా జాగరూకులై ఉండడమే’ అన్న విల్ డ్యూ రాంట్ మాటలు భవిష్యత్తును సూచిస్తున్నాయి. ఇపుడు హిందూ సమాజం సంఘర్షణలో వున్నా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నది. ఈ మథనం నుండి పుట్టిందే జాతీయవాద భావన. అది మరింతగా సుదృఢమయ్యేవరకు ఈ అంతర్గత వేదన తప్పదు. కానీ ఎన్నాళ్లీ వౌనరోదన అనేది ఇటీవల అంతర్గతంగా హిందూ సమాజాన్ని ఆవేదనకు గురిచేస్తున్నది. ఈ దమనకాండ హిందువుల స్వాతంత్య్రాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ అభద్రతను పోగొట్టే భావజాలాన్ని రక్షించుకోకపోతే మనకు మనం సమాధి కట్టుకోవడం ఖాయం.
****************************
 * డాక్టర్. పి. భాస్కర యోగి *
 * ఆంధ్రభూమి : భాస్కర వాణి *మోతీలాల్‌ నెహ్రూ, ఫిరోజ్‌, ఇందిర, సంజయ్‌, రాజీవ్‌, సోనియా, రాహుల్‌, ప్రియాంక.. మరోసారి భారత రాజకీయాల్లో వారసత్వ గర్వరేఖ తళుక్కుమంది. 1919లో మోతీలాల్‌ నెహ్రూ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుండి 2019లో రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసే వరకూ ఈ దేశ రాజకీయం ప్రపంచంలోనే ఓ పెద్ద సమాజ వారసత్వ గొడుగు క్రింద బ్రతకడం దురదృష్టం. ఇది ఒక అంటువ్యాధిలా సోకి రాష్ట్రానికో రాజకుటుంబం తయారవడం ఈ దేశ ప్రజాస్వామ్యానికి పట్టిన చెద..!? దీని వికృతి ఎంత దారుణంగా ఉందో చెప్పటానికి ఒక్క ఉదాహరణ చాలు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ కూతురు కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఆమె ‘చుండ్రు’ వారి కోడలు. కానీ పచ్చ కామెర్ల తెలుగు మీడియా ఆమెను నందమూరి సుహాసినిగా ఎక్స్‌పోజ్‌ చేసింది. అలాగే రాబర్ట్‌ వాద్రా భార్య అయిన ప్రియాంక వాద్రాను ఈ దేశ సూడో సెక్యులర్‌ మీడియా ‘ప్రియాంకా గాంధీ’గా చెపుతూ తిరుగులేని ప్రచారం కల్పిస్తోంది ఆమె భర్త భూకుంభకోణాలు, ఢిపెన్స్‌ దళారీ కుంభకోణాల్లో చిక్కుకున్న పరమ నైష్ఠికుడు. సయ్యద్‌ షుజా ద్వారా ఈవియంల ట్యాంపరింగ్‌ పేరుతో బ్రిటీష్‌ అనలిటికాతో కలిసి కాంగ్రెస్‌ కపిల్‌ సిబాల్‌ ఆడిన నాటకం ఎందుకో తెరపైకి అంతగా ఎక్కలేదు. అదంతా కాంగ్రెస్‌ సెలక్టెడ్‌ డ్రామాగా ప్రజలు భావిస్తారని భావించిన కాంగ్రెస్‌ వర్గాలు దానిని మరిపించేందుకు ప్రియాంకా వాద్రాను మీడియాకు అందించింది. ‘నదిలో కొట్టుకుపోతున్న వాడికి గరికపోచ దొరికినా ఘనమే’ అన్నట్లు ఓవైపు సపా-బసపాల పొత్తును అతి వినయంగా గౌరవిస్తూనే మరోవైపు వాళ్లను ఆత్మరక్షణలో పడేసే వ్యూహం ఇది. అయితే చరిత్రలో సోదరీమణు లెవ్వరూ సోదరులను రక్షించలేదు సరికదా మరింత కష్టాల్లోకి నెట్టారు. రావణ-శూర్ఫణఖ, కంసుడు- దేవకి, హిరణ్యకశ్యపుడు – హోలిక.. ఇలా దర్పానికి సోదరిలను వాడుకోవడంతో మొదటికే మోసం వచ్చింది. ఈ పదకొండవ కొత్త వారసత్వం ప్రియాంకా వాద్రా రాహుల్‌ను ఎలా రక్షిస్తుందో చూడాలి.
దేశం నిండా వారసత్వ రాజకీయం ఓ క్యాన్సర్‌లా వ్యాపించింది. షేక్‌ అబ్దుల్లా ఫరూఖ్‌ అబ్దుల్లాకు కశ్మీర్‌ అప్పగిస్తే, ఫరూఖ్‌ అబ్దుల్లా ఒమర్‌ అబ్దుల్లాను ఇప్పటికే సీఎంను చేసేశాడు. అలాగే హర్యానాలో చౌతాలా కుటుంబం, మహారాష్ట్రలో శరద్‌ పవార్‌ సుప్రియ, అజిత్‌ పవార్‌లను ముందే రంగంలో పెట్టాడు. ముఫ్తి సయీద్‌ తాను చావ ముందే మెహబూబాను రంగంలోకి దింపాడు. లాలూ యాదవ్‌ రాబ్రీదేవితో అసెంబ్లీలో ఇప్పటికే మాట్లాడించాడు. ఇంకో యాభై ఏళ్లకు సరిపడా తేజస్వీ యాదవ్‌, తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌, మీసాభారతిని బీహర్‌ గడ్డపై నిలబెట్టాడు. ములాయం యాదవ్‌ తన శక్తిమేరకు అఖిలేష్‌ యాదవ్‌, డింపుల్‌ యాదవ్‌, శివప్రతాప్‌ యాదవ్‌లను యూపీలో గట్టిగా పాతేశాడు. ఆఖరుకు మాయావతి తన సోదరులను, వాళ్ల కొడుకును రాజకీయాల్లో చురుగ్గా ఉంచింది. ఇక దేవెగౌడ కుటుంబమంతా రాజనీతిలో ఉన్నవాళ్లే. కుమారస్వామి, దేవణ్ణలను చూస్తూ తొంభై రెండేళ్ల మాజీ ప్రధాని మురిసిపోతున్నాడు. కరుణానిధి కుటుంబం గురించి ఓ లిస్టే తయారు చేయొచ్చు. ఇక తెలుగునాట కేసీఆర్‌ తన కుమారుడికి రాష్ట్రం అప్పగించారు. అయితే కేటీఆర్‌ మాత్రం స్వయం ప్రకాశం ఉన్నవాడే. అలాగే ఇంకో గొప్ప కుటుంబం గురించి ఎవరూ చెప్పనక్కరలేదు. ఎన్టీఆర్‌, నారా, దగ్గుపాటి వారి ప్రాయోజిత కార్యక్రమం ఇంకా నందమూరి బ్రాండ్‌పైనే ఆంధ్రలో కొనసాగుతున్నది. మహరాష్ట్రలో స్వయంగా తండ్రి మార్గంలో ఎదిగిన థాకరే మరో ఇద్దరు థాకరేలను అందించాడు. ఎంఐఎం పార్టీలో ఒకప్పుడు తండ్రి ఒవైసీ, ఇప్పుడు పుత్ర ఒవైసీలు పూజింపబడుతూనే ఉన్నారు. సింధియా, పైలట్‌, రాజే కుటుంబాలు రాజకీయాలు చేసినా అవి ప్రభావవంతంగా లేవు. వాళ్లందరికీ కుటుంబమే పార్టీ. మరి జాతీయ వాదులకు పార్టీయే కుటుంబం. ఇదే వారికీ వీరికీ తేడా!
మనకు చలనం లేదా?
‘మనం వెయ్యేళ్ల నుండి బానిసలం’ మీకు గుర్తుందా? అంటే మెదడు వాపు వ్యాధి వచ్చిన వాళ్లలా నటిస్తున్న మెజార్టీలను ఎవరు రక్షిస్తారు? కులాల కుళ్లును మనకళ్లపై చల్లేసి కాలం గడుపుతున్న ‘కులౌకికవాద’ కుట్రలు మీకు తెలుసా ? అంటే కళ్లు తేలేసే ఈ దేశ మూలవాసుల గతి ఏం కానున్నదో! రాష్ట్రం, ప్రాంతం, భాష.. ఏది దొరికితే దానితో రాజకీయం చేస్తూ మన గొంతులను మనతోటే కత్తిరింపజేసిన దుర్మార్గపు దౌష్ట్యాలకు చలనం లేదా? మతాలు మాత్రమే ముఖ్యం అనుకున్నవాళ్లు, కులం మాత్రమే మాకు ముఖ్యం అనుకున్నవాళ్లు, సిద్ధాంత రాద్ధాంతం మాత్రమే మాకు స్వంతం అనుకున్నవాళ్లు, మాకు కుటుంబం మాత్రమే ముఖ్యం అనుకున్న వాళ్లు.. తమ స్వార్థ రాజకీయం కోసం బురదను హిందూ మెజార్టీపై వేస్తున్నా, చలనం లేని జడపదార్థాలు మెజార్టీ ప్రజలు..!?
ఏ దేశంలోనైనా మెజార్టీ ప్రజల అభిప్రాయమే అందరి అభిప్రాయం. కానీ ఇప్పుడు ఇక్కడ పుట్టిన రాముని కన్నా ఎక్కడో పుట్టిన బాబర్‌ ఆరాధ్యుడు అయ్యాడు! ఇప్పటికీ ఇక్కడి మెజార్టీ ప్రజలను ముప్పైవేలకు పైగా ధ్వంసమైన దేవాలయాలు వెక్కిరిస్తున్నా నిస్తేజంగా చూస్తున్న మన బేలతనం..! అత్యాచారాలు మెజార్టీపై జరిగినా, ఊరేగింపులపై రాళ్ల వర్షం కురిసినా ఏమీ అనకుండా మిన్నకుండి పోవడం ఈ దేశంలో మతాల మధ్య సుహృద్భావ వాతావరణం అని మురిసిపోతారు! కశ్మీర్‌, కేరళలో ఐసిస్‌ జెండాలు అందలమెక్కినా, తీవ్రవాదులు ‘మా భూమి పుత్రులు’ అని మెహబూబా ముఫ్తి మురిసి పోయినా అది గొప్ప భావస్వేచ్ఛ అని మురిసిపోతాం. అజ్మల్‌ కసబ్‌, అఫ్జల్‌గురులను ఏళ్లకేళ్లు బిర్యానీలు పెట్టి మర్యాదలు చేసి తీరా ఎలక్షన్ల ముందు ఉరి తీస్తారు. ఇది అంతర్జాతీయ స్థాయి విచారణ!? హిందూ సన్యాసి సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ను మహిళ అని కూడా చూడకుండా 9 ఏళ్లు చిత్రహింసలు పెట్టినా మానవ హక్కుల సంఘాలు చప్పుడు చేయరు. పార్టీలకతీతంగా మైనార్టీలు ఏకమై ‘మాకు ఇంకా హక్కులు కావాలని’ గోల చేస్తే ‘జీ హుజూర్‌’ అనే నాయకుల ‘సెక్యులర్‌ పాతివ్రత్యం’ భంగం కానీయక రక్షించడమే రాజ్యాంగ స్ఫూర్తి అనే మేధావుల కుబుద్ధికి సలాం!
శబరిమలను చెరబట్టినా, అయోధ్యను అదుపులో పెట్టినా, కులం కుట్ర చట్రంలో మెజార్టీలను ఇరికించినా, అస్తిత్వాల కుస్తీ చేసి మెజార్టీలను అదుపు చేయాలనుకొన్నా మిన్నకుండే ఈ దేశ మెజార్టీ ప్రజల పాదాలకు వందనం. సహనం మా ఊపిరి అంటున్న మెజార్టీ పై ‘అసహనం’ ప్రకటిస్తున్నా, శాంతి మాకు భ్రాంతి అంటున్నా, బిక్క చూపులు చూస్తున్న మెజార్టీలలో చలనం లేకపోతే.. మరోసారి దేశ విభజన చూడాల్సిన పరిస్థితులు వస్తాయేమో..!?
***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
 04 -10 ఫిబ్రవరి - 2019
సంపుటి : 71, సంచిక : 14ఓ కుమారుడు తండ్రిని- ‘నాన్నా! ఒట్టు అంటే ఏంటి?’ అని ప్రశ్నించాడట. ‘పచ్చి అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు తరతరాలుగా వాడుతున్న టెక్నిక్‌రా కన్నా!’ అన్నాట్ట ఆ తండ్రి. మన దేశంలో అబద్ధాన్ని అతికినట్లు చెప్పేందుకు ఓ వర్గం మీడియా, దాని వెనుకున్న రాజకీయ వర్గాలు పడరాని పాట్లు పడుతున్నాయి. దొంగే ‘దొంగా దొంగా!’ అని అరుస్తుంటే నోళ్లువెళ్లబెట్టి చూడటం తప్ప ఇంకేం చేయలేని దుస్థితి. దుష్ప్రచారం బాగా చేయగల నేర్పరులు పార్టీలు, సిద్ధాంతాల ముసుగుకప్పుకొని ఇప్పుడు దేశాన్ని లూటీ చేస్తున్నారు. దోచుకొన్న ధనాన్ని దాచుకొని కులానికో పార్టీ, ఇంటికో పార్టీ పెట్టుకొని అబద్ధాలతో ఏలేస్తున్నారు. చేసిన తప్పును ఎత్తిచూపినా, కోర్టుల్లో కేసులు నమోదైనా, ముదిమి వయస్సులో శిక్షపడినా దానినీ సానుభూతిగా మలచుకొనే దుస్థితి నుండి ఈ దేశాన్ని ఎవరు రక్షించాలి?

మమతా బెనర్జీ తాజాగా చేసిన గోలే ఇందుకు ఉదాహరణ. ఆధ్యాత్మిక లోకానికే దిక్సూచి లాంటి శ్రీరామకృష్ణ పరమహంస సతీమణి శారదాదేవి పేరిట బెంగాల్‌లో ఓ కంపెనీ ఏర్పాటైంది. దాన్ని 240 అనుబంధ కంపెనీల సమాహారంగా మార్చిన పెద్దలు రియల్ ఎస్టేట్, రిసార్ట్స్, హోటల్స్, చిట్స్.. వగైరా వ్యాపారాలతో జనంలోకి వెళ్ళారు. 2008 నుండి 2013 వరకు ప్రజల నుండి ఈ కంపెనీ బ్రోకర్లు కమీషన్లకు కక్కుర్తిపడి 2500 కోట్లు వసూలు చేశారు. ఇది మెల్లగా రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లి ‘సెబీ’కి ఫిర్యాదులందాయి. దాంతో ఆ కంపెనీ ఎలాంటి వసూళ్లు చేయరాదని ‘సెబీ’ ఆదేశించింది. ఈ సంస్థకు చెందిన సుదీపా సేన్, దేవజన ముఖర్జీ అరెస్టయ్యారు. 

రజత్ మజుందార్, శ్రుంజయ్ బోస్, మజన్ మిత్ర, కృణాళ్ ఘోష్ అనే తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పెద్ద నాయకులు 2013-14లలో అరెస్టయ్యారు. కొందరు బెయిల్ మీద బయటకు వచ్చారు. అలాగే అధిక వడ్డీల ఆశ జూపి రోజ్‌వ్యాలీ సంస్థ చేసిన గొలుసుకట్టు మోసం బెంగాల్‌లో వెలుగు చూసింది. అందులో తపస్‌పార్, సుధీప్ బంధోఫాధ్యాయ అనే తృణమూల్ కాంగ్రెస్ అగ్ర నాయకులు. శ్రీకాంత్ మెహతా అనే సినీ నిర్మాత, టిఎంసీ సానుభూతిపరుడైన ఓ ధనవంతుడు అరెస్టుయ్యరు. ఈ రెండు కుంభకోణాలపై ఫిర్యాదులు, కేసులు, బెయిళ్ళు దాదాపుగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ హయాంలో జరిగినవే. 2013లో ఈ కుంభకోణాల కథా కమామిషు తేల్చేందుకు ఇపుడు మమత వెనకేసుకొస్తున్న, మొన్నటి బెంగాల్ రగడకు కారణమైన పోలీసు ఉన్నతాధికారి రాజీవ్‌కుమార్ ‘సిట్’కు నేతృత్వం వహిస్తున్నారు. 

ప్రపంచంలోనే రాజీవ్‌కుమార్ అంత నీతిపరుడు లేడని ఈ రోజు మమత చెప్తున్నా, ఇదే రాజీవ్‌కుమార్‌ను వామపక్ష ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. వామపక్ష ప్రభుత్వం కనుసన్నల్లో రాజీవ్‌కుమార్ తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని మమత ఒకప్పుడు ఆరోపణలు చేయడమేగాక, తాను అధికారంలోకి వచ్చా క ఇతడిని ప్రాధాన్యత లేని పోస్టులో ఉంచాలనుకొన్నారు. కొందరు పోలీసు ఉన్నతాధికారుల కోరిక మేరకు రాజీవ్ కుమార్ మమతకు దగ్గరవడమే గాక ఈ రోజు రాజ్యాంగ సంక్షోభానికి కారణం అయ్యాడు. 

2013లో ‘సిట్’కు నేతృత్వం వహించిన ఆయన తృణమూల్ నేతలకు పరోవక్షంగా సహాయపడుతూ వారిని కేసుల నుంచి తప్పించే ప్రయత్నం చేశాడు. కేసుకు సంబంధించిన కీలక దస్త్రాలను ఆయన మాయం చేస్తున్నాడని బాధితులు 2014కుముందే సుప్రీం తలుపు తట్టారు. 2014 నుండి అత్యున్నత న్యాయస్థానం మూడుసార్లు ఆదేశాలు జారీ చేసినా ఇతను ఢిల్లీ ముఖం చూడకుండా తప్పించుకొంటున్నాడు. చివరికి కోర్టు ఆదేశాలతో సిబిఐ అధికారులు కోల్‌కతా వెళ్తే మమత రాద్ధాంతం సృష్టించింది. నిజానికి ఈ సంక్షోభానికి తెరలేపింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే. మమత దీక్ష విరమణలో కూడా ఈయనే ప్రధాన ఆకర్షణ.

ప్రపంచంలో అన్ని వస్తువులనూ తానే కనుగొన్నట్లు చెప్పే బాబు సిబిఐని ఏపీకి రానివ్వకుండా చేసే అద్భుతమైన ఆవిష్కరణను కూడా మొదట చేశాడు. ఏ కేసులోనైనా విచారణ చేపట్టే అధికారం వున్న ‘జనరల్ కనె్సం ట్’ను ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకొంది. బాబు సలహాపైనే మమత ఈ విధానాన్ని ఆచరించే క్రమంలో సిబిఐని అడ్డుకొంది. ఇక్కడ రెండు సారూప్యతలు స్పష్టంగా ఉన్నాయి. శారద, రోజ్‌వ్యాలీ కుంభకోణంలాగే ఆంధ్రలో అగ్రి
గోల్డ్ కుంభకోణం చాలా పెద్దది. కాల్‌మనీ సెక్స్ రాకెట్ మరో రోజ్‌వ్యాలీ లాంటిదే. వీటిని తప్పించుకోవాలంటే కేంద్రాన్ని, మోదీని విలన్లుగా చేస్తూ వ్యవస్థలు ధ్వంసం అంటూ ‘బాబు పాఠశాల’లో చదివిన అవినీతి గ్యాంగంతా గగ్గోలు పెడుతున్నది.

నాయకులు, పార్టీల నేతలు విచారణను ఎదుర్కోకుండా ఇదో సానుభూతిగా మలచుకోవడం రాజ్యాంగ సంక్షోభం కన్నా ప్రమాదకరం. నేతలను విచారించడం అ న్న విషయాన్ని రాజకీయ,కులం, ప్రాంతం కోణాల్లో చూస్తే నేర పరిశోధక వ్యవస్థలకు పిండం పెట్టాల్సిందే. ప్రధాని మోదీ కూడా గతంలో సీబీఐ విచారణను ఎదుర్కొన్నాడు. యూపీఏ ప్రభుత్వంలో సీబీఐ అధికారులు గుజరాత్‌కు వెళ్తే గంటలకొద్దీ వాళ్ల ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చాడు. ‘దుర్బల రాజకీయం’ పేరుతో నటిస్తే ఏ రాజకీయ నాయకుడూ దోషిగా తేలడు!?

అన్నా హజారే ఆలోచనల నుండి పుట్టిన అరవిం ద్ కేజ్రీవాల్ అవినీతి, చీఫ్ సెక్రటరీ కేసు 2016, 2017, 2018లో ఉంది. కేజ్రీవాల్ మంత్రుల అవినీతి బా గోతం వాళ్ల పార్టీవారే బ యటపెట్టారు. కేజ్రీవాల్‌ను విచారిస్తే నీతివంతుపై దాడిగా భావించాలా? బహుజన సమాజ్ పార్టీని నడిపే మాయావతి రూ. 1400 కోట్ల స్మారక స్థూపాల కేసు, 4,900 కోట్ల జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నిధుల మాయం కేసు ఎదుర్కొంటున్నది. మరి ఆమెను విచారించడం ఒక కులం నాయకురాలిపై దాడిగా అభివర్ణిస్తారా? 

ఎ.రాజా, కనిమొళిలపై 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసు ఉండేది. వారు నిర్దోషులుగా రావడాన్ని సవాల్ చేస్తు 2018లో మరో కేసు వేశారు. ఇపుడు వారిని కోర్టులు, దర్యాప్తు సంస్థలు విచారించాలా? వద్దా?? కరడుగట్టిన కమ్యూనిస్టు యోధుడు, కేరళ సీఎం పినరయి విజయన్‌పై 2006లో లవలీన్ జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు కేసు సీబిఐ దగ్గర ఉంది. ఇపుడు ఆయనను విచారించడం కేరళ ఆత్మగౌరవంపై దాడిగా చూద్దామా? యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌పై అక్రమ మైనింగ్ లీజులు, మనీ లాండరింగ్ వంటి కేసులు ఉన్నాయి. వీటిపై సీబిఐ విచారిస్తే యాదవుల గౌరవం పోయినట్టా? బిహార్ నుండి ఆగమేఘాలపై కోల్‌కతా వెళ్లి మమతా దీదీ పక్కన నిల్చున్న ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్‌పై 2017 మార్చిలో ఐఆర్‌సిటిటీ స్కాం నమోదైంది. ఆయనను విచారిస్తే అది బిహార్‌కే కళంకమా?

ఈ దేశంలో ప్రముఖులైన భూపేందర్ హుడా, వీరభద్రసింగ్, ఆస్కార్ ఫెర్నాండెజ్, మోతీలాల్ వోరా, శ్యామ్ పిట్రోడా, డి.కె.శివకుమార్, చగన్ భుజ్‌భల్, సుజనా చౌదరి, సచిన్ పైలెట్, అశోక్ గెహ్లాట్‌లపై వున్న కేసులు రాజకీయ ఆరోపణలకు భయపడి మూసివేయాలా? గుజరాత్ అల్లర్ల విషయంలో మోదీ కేసులను ఎదుర్కోలేదా? సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షాను ఎంతలా టార్గెట్ చేసారో తెలియదా? భావి ప్రధానిగా కాంగ్రెస్ వారు అభివర్ణిస్తున్న రాహుల్ గాంధీపై 5000 కోట్ల నిధుల అవకతవకలపై నేషనల్ హెరాల్డ్ కేసు లేదా? ‘త్యాగమూర్తి’ సోనియా గాంధీపైనా ఇదే కేసులో యూపిఏ ప్రభుత్వంలోనే డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్లు వేశారు కదా! ఈ ఎపిసోడ్‌కంతా మూలపురుషుడైన చంద్రబాబుపై 2010 బాబ్లీకేసు, ఓటుకు నోటు కేసు ఉన్నాయి కదా! ఇపుడు చంద్రబాబు దగ్గరకు దర్యాప్తు సంస్థలో, కోర్టులో వస్తే అది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యా?

అలాంటపుడు అందరూ కలిసి దర్యాప్తు సంస్థలు, కోర్టులను మూసేస్తే సరిపోతుంది కదా! రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన వ్యక్తులే రాజ్యాంగాన్ని గౌరవించకుండా స్వప్రయోజనాల కోసం ఇలా రచ్చ చేస్తే దీనికి ఏం పేరు పె ట్టాలి? దీక్ష సందర్భంగా రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసం, భావస్వేచ్ఛ, ఫెడరల్ వ్యవస్థల గురించి మమత ఉపన్యాసాలు దంచడం విడ్డూరం. 

ఇదే మమతా బెనర్జీ 2013లో ఇమాంలకు, వౌహజ్జమ్‌లకు అడ్డగోలుగా జీతభత్యాలు పెంచితే హైకోర్టు మందలించినా ఆమె గౌరవించలేదు. 2014లో అమిత్‌షా ర్యాలీ చేస్తానంటే మమత ప్రభుత్వం అడ్డుకోగా, హైకోర్టు అనుమతిని ఇచ్చింది. 2014 డిసెంబర్‌లో విశ్వహిందూ పరిషత్ ర్యాలీని అడ్డుకొన్న మమత ప్రభుత్వం భావస్వేచ్ఛ గురించి మాట్లాడుతోంది. జనవరి 2017లో ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీని, భాజపా సభ్యుల మేళాను ఆమె ప్రభుత్వం అడ్డుకొన్నది. దుర్గా నిమజ్జనంపై నిషేధం విధిస్తే కోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం సహకరించలేదు. ఇలాంటి నియంతృత్వంతో ప్రభుత్వాన్ని నడిపే మమతా బెనర్జీ వ్యవస్థల విధ్వంసం గురించి చెప్తున్న నీతులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అమిత్ షా తన కుటుంబ సభ్యులతో తిరుమలకు వస్తే రాళ్లతో దాడిచేసినవారే ఈ రోజు వ్యవస్థల విధ్వంసం అంటూ గంగవెర్రులెత్తుతున్నారు. ప్రధానిని రాష్ట్రంలోకి కాలుపెట్టనివ్వననే వ్యక్తులు రాజ్యాంగం సంక్షోభంలో పడిందంటూ వాపోడమా?

ద్వంద్వ నీతులను బట్టబయలు చేయాల్సిన వారు ఇదంతా రాజ్యాంగ సంక్షోభమని ప్రచారం చేయడం మరో విషాదం. కొన్నాళ్లు నితీశ్‌ను, తర్వాత కేజ్రీవాల్‌ను, మరికొన్నాళ్లు కన్హయ్య కుమార్‌ను, ఆ తర్వాత రాహుల్‌ను, ఇపుడు మమతను- మోదీని బాగాతిట్టగల సమర్థులని, సమఉజ్జీలని ప్రచారం చేయడం వికృతానందం కాదా? రాజకీయంగా ఎదుర్కోవలసిన వారిని దుష్ప్రచారంతో విలన్లుగా మార్చే ప్రయత్నం సాగేందుకు ఇది అద్వానీజీ, వాజ్‌పేయిల కాలం కాదని గుర్తిస్తే మంచిది. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై షుజా-కపిల్ సిబాల్ నాటకం ప్రజల మెదళ్లలోకి ఎక్కలేదని ప్రియాంక వాద్రాను తెరపైకి తెచ్చారు. అదీ ఎవరూ పట్టించుకోలేదని మమత- సీబిఐపై యుద్ధం అంటూ నడివీధిలో నాటకాన్ని రక్తికట్టిస్తున్నారు. ఇక రాబోయే కొత్త చిత్రం ఏమిటో..?

****************************
 *✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
 *ఆంధ్రభూమి : భాస్కర వాణి*

 


ఇజ్రాయిల్ స్వతంత్ర దేశంగా ఏర్పడ్డాక అక్కడి ప్రజాప్రతినిధుల మొదటి సభ ఓ ఆశ్చర్యకరమైన వ్యాఖ్య చేసింది. ‘్భరత్‌కు ధన్యవాదాలు.. ప్రపంచంలోని అన్ని వర్గాలచే అత్యాచారానికి గురైన మా జాతి, ఒక్క భారత్ నుండే అలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు..’ అన్న ఆ మాటను ఒక్కసారి- భారత్‌ను, హిందుత్వను ధ్వంసం చేయాలనుకొనే శక్తులు గుర్తుతెచ్చుకోవాలి. భారత్‌ను విచ్ఛిన్నం చేయాలనుకొనే శక్తులు బయటి దేశాల్లో శాంతికాముక సంస్థల్లా ముసుగేసుకుని, ఇక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. భారత్‌లో సంక్లిష్ట రాజకీయాల కారణంగా విదేశీ శక్తులు ఇక్కడి మీడియాను, మేధోగణాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకొని ఆడిస్తున్నాయి. విదేశాల్లో మత తీవ్రవాద శక్తులు మానవ హక్కుల ముసుగేసుకొని ఇక్కడ కొందరిని తమ ఏజెంట్లుగా పెట్టుకొని రోజూ విషం కక్కుతున్నాయి.

అమెరికా జాతీయ సంస్థ డైరెక్టర్ డాన్‌కోట్స్ ఓ నివేదికను సెనేట్ సెలక్ట్ కమిటీకి పంపారు. ‘్భరత్‌లో రానున్న ఎన్నికల్లో మత ఘర్షణల ప్రమాదం పొంచి ఉందని, హిందుత్వ ఎజెండాతో భాజపా ఎన్నికలకు వెళ్తే మత కల్లోలాలు జరిగి, అక్కడి ముస్లింలను వేదనకు గురిచేస్తాయి..’ అంటూ ఆ నివేదికలో ఉన్న అంశాలు పత్రికల ద్వారా బహిర్గతమయ్యాయి.

డాన్‌కోట్స్‌తోపాటు సీఐఏ, ఎఫ్‌బిఐ డైరెక్టర్లు కూడా ఇలాంటి నివేదికలనే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదంతా ప్రపంచ వ్యాప్తంగా హిందుత్వను అపఖ్యాతిపాలు చేసే సంస్థల కార్యాచరణలో భాగమే.
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సంస్థలు, వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా భారతీయతపై అదేపనిగా ఇలాంటి నివేదికలు వెల్లడించారు. పుస్తకాలు ప్రచురించడం, సెమినార్లు పెట్టడం, మీడియాలో గోల చేయడం ఒక వ్యూహాత్మక పద్ధతిలో చేస్తున్నారు. నిజానికి అమెరికా లాంటి దేశంలోనే ఇలాంటి జాతి వివక్ష, రాజకీయ వివక్షలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే అమెరికా ఎన్నికల్లో పోటీపడతానని చెప్తున్న హిందూ అమెరికన్ తులసీ గచ్చార్డ్ ఇటీవల కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆమె రిపబ్లిక్ పార్టీ ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని అనగానే ఆమెపై ‘హిందూ నేషనలిస్ట్’ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. గతంలో ఆమె నరేంద్ర మోదీని కలిసినందువల్ల ఆమె ‘హిందూ నేషనలిస్ట్’ అంటూ ప్రపంచ వ్యాప్త లిబరల్, కుహనా మేధావులు, ఎలాంజలిస్ట్‌లు, మీడియా సంస్థలు దుష్ప్రచారం మొదలుపెట్టాయి.

డొనాల్డ్ ట్రంప్ మోదీపై ప్రశంసలు కురిపించగానే అతనిపై అనేక ఆరోపణలు మొదలుపెట్టారు. నిజానికి తులసీ గచ్చార్డ్ మాత్రమే మోదీని కలుసుకున్న వాళ్ల లిస్టులో లేదు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్ వంటి వాళ్లెందరో మోదీని కలుసుకున్నారు. ఒక హిందూ మహిళ అమెరికా అధ్యక్ష పదవికి పో టీలో ఉండడం ‘వాటికన్’కు నచ్చదు. అదే భారత్‌లో ఇటలీ మూలాలున్న మహి ళ అతి ప్రాచీనమైన రాజకీయ పార్టీని తన చెప్పుచేతల్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు ఆడించవచ్చు! ఇది భారత ప్రజాస్వామ్యం గొప్పతనమో, బలహీనతనో తేల్చుకోలేని దుస్థితి భారతీయులది.

నిజానికి భారత్‌లో హిందువుల సహజమైన ఆదరణీయ మనస్తత్వమే ఇక్కడ భిన్న సంస్కృతుల విస్తృతికి కారణం. అది ఒకరకంగా హిందువుల బలం, బలహీనత! ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత ‘స్వాగత హృదయం’ ఉన్న జాతి మనకు కన్పించదని తారెఖ్ ఫతే లాంటి ఇస్లామిక్ రాజకీయ పరిశోధకుడే చెప్తున్నాడు. ‘దాహిర్‌సేన్ అనే హిందూ రాజు మహమ్మద్ ప్రవక్త అసలైన వారసులకు ప్రాణరక్షణ కల్పించాడు. అలాంటి హిందూ రాజులను జీహాదీ మనస్తత్వం గల మహమ్మద్ బిన్ కాశీం లాంటి మతోన్మాదులు సంహరించారు. ప్రపంచంలోనే మక్కా మసీదు తర్వాత భారత్‌లోని మలబారు తీరంలో రెండవ మసీదు నిర్మించబడింది. అదీ ఓ హిందూ రాజు సహకారంతో సాధ్యమైంది’’ అంటారు తారేఖ్ ఫతే. అలాంటి హిందువులు ఈ దేశంలో వెయ్యేళ్ల పాటు ఇతర మతాల పాలనలో బానిసలుగా ఉన్నా తమ అస్తిత్వాన్ని ఆధ్యాత్మికత రూపంలో కాపాడుకొన్నారు.

ఈ దేశంలో ఛత్రపతి శివాజీ మహరాజ్, కాకతీయ సామ్రా జ్యం, విజయనగర సామ్రాజ్యం, దక్షిణ భారత హిందూ సామ్రాజ్యాలు, రాజపుత్రులు.. ప్రక్కనబెడితే అంతా ఇస్లామిక్ పాలనతోనే హిందువుల కాలం గడిచింది. సంఘర్షణల మధ్య హిందువులు జీవించారు.
స్వాతంత్య్రం రాకముందే దేశంలో మతపరమైన విభజన ఎందుకు మొదలైందో ఈ దేశ చరిత్రకారులుగా పోజులిచ్చే ఎవరూ సరిగ్గా వివరించరు! పోనీ లక్షలాదిమంది హిందువులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ విభజనను అడ్డుకునే ప్రయత్నం ఎందుకు విఫలమైందో ఏ రాజకీయ విశే్లషకుడు నోరు తెరచి మాట్లాడడు.

15 మే 1999న హురియత్ కాన్ఫరెన్స్ నేత మిర్వాయిజ్ ఒమర్ ఫరూక్ శ్రీనగర్‌లో మాట్లాడుతూ- ‘‘కాశ్మీరు భూలోక స్వర్గం. వే లాది విగ్రహాలను, ఆవును పూజించే అవిశ్వాసులు స్వర్గాన్ని స్వంతం చేసుకోలేరు. ఎలాగైనా సరే వారికి అక్కడ తావు లేకుండా చేయాలి’’ అని బహిరంగ ప్రకటన చేశాడు. అదే మనస్తత్వంతో ఇటీవల కె.ఏ.పాల్ అనే క్రైస్తవ రాజకీయ నాయకుడు ‘విగ్రహారాధకులకు మనం ఓట్లేయకూడదు’ అంటూ బహిరంగంగా చెబుతున్నాడు. ఇం త జరుగుతున్నా, వాళ్లలో ఇంత స్పష్టత ఉన్నా ఈ దే శంలో మెజారిటీ ప్రజలైన హిందువుల్లో ఒక్కరూ నో రుతెరచి మాట్లాడలేని దు స్థితి. దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌లోని హిందూ జనాభా ఈ రోజు ఎంత వుందో చెప్పగలరా? బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లలో హిందువుల జనాభా తగ్గిపోయిందని ఒక్క అంతర్జాతీయ సంస్థ అయినా ఏనాడూ విచారం వ్యక్తం చేయలేదు.

నిజానికి మైనారిటీలంటే జనాభాలో 10శాతం కన్నా తక్కువ వుంటేనే అలా పిలవాలని ఐక్యరాజ్యసమితి ఛార్ట్‌ర్ చెప్తున్నది. కశ్మీర్‌లో హిందువులు మైనారిటీలా? మెజార్టీలా? అంటే ఒక్క కుహనా మేధావి కూడా వ్యా ఖ్యానం చేయడు. ఈశాన్య రాష్ట్రాల్లో, కేరళలో ఎవరు మైనారిటీలు? పంజాబ్‌లో ఎవరు మైనారిటీలు? మొత్తం భారతదేశంలో ఐక్యరాజ్యసమితి ఛార్టర్ ప్రకారం ఎవరు మైనారిటీలు? ఇదంతా రాజకీయ కుయుక్తే గానీ వేరొకటి కాదు. రోజూ మానవ హక్కుల గురించి టీవీ చానళ్లలో గొంతు చించుకునేవారు, పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసేవారు మావోయిస్టు సానుభూతిపరులుగా ఎందుకు మారిపోయారు? మాలేగావ్ పేలుళ్లలో అక్రమంగా అరెస్టు చేయబడి తొమ్మిదేళ్ల తన విలువైన జీవితాన్ని రాజకీయ కుట్రకోసం బలిపెట్టుకున్న సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గురించి వీళ్లు ఎవరైనా మాట్లాడారా? స్ర్తి అని కూడా చూడకుండా, సన్యాసిని అని కూడా చూడకుండా ఆమెను ‘హిందూ ఉగ్రవాది’ అని ముద్ర వేసేందుకు ఒక ప్రభుత్వమే ఎందుకు ప్రయత్నం చేసిందో నిజానిజాలు ఎవరైనా చెప్పగలరా? ‘హిందూ ఉగ్రవాదం’ అన్న పద ప్రయోగం చేసి, దానిని సాకారం చేసేందుకు యూపిఏ మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్, మణిశంకర్ అయ్యర్.. లాంటి నాయకులు సాధ్విని బలిపశువును చేయడం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ ఆమె విడుదలై బహిరంగంగా చెప్పుకొన్నది.

ఇంకా విశేషమేమిటంటే, సన్యాసి వేషం ధరించి దేశ విచ్ఛిన్నకర శక్తులతో కలిసి పనిచేసే స్వామి అగ్నివేశ్ లాంటి వ్యక్తి ఆమెను జైల్లో కలిసి ‘నాకు చిదంబరం బాగా పరిచయం. నీవు కొన్ని సంస్థల పేర్లు, వ్యక్తుల పేర్లు చెప్తే నిన్ను బయటకు తెప్పిస్తా’ అని సాధ్వి ప్రజ్ఞకు చెప్పడం ఈ దేశ రాజకీయాలపై, లౌకికవాదంపై వున్న గౌరవం పోయేట్లు చేయడం కాదా? మానవ హక్కుల పేరుతో పోరాడిన ఇరోమ్ షర్మిలను అంతర్జాతీయంగా గొప్పదానిని చేసిన ఈ దేశ మీడియాకు తొమ్మిదేళ్ల జైలు జీవితంలో చక్రాల కుర్చీలో తిరిగే దుస్థితికి చేరిన సాధ్విపై చిన్నచూపుఎందుకు? ఇవన్నీ బాబర్ కాలంలోనో, ఔరంగజేబ్ కాలంలోనో జరిగిన ఘటనలా? మన కళ్లముందు కదలాడిన కఠోర సత్యాలు.

ఈ దేశంలో హిందువులపై వివక్ష అంతా ఇంతా కాదు. ఎవరైనా ఈ దేశ అత్యున్నత పీఠంపై కూర్చోవచ్చు కానీ హిందుత్వ భావజాలం ఉండే వ్యక్తులు మాత్రం కూర్చోవద్దన్నది ఎలాంటి లౌకికవాదం? మతోన్మాద పార్టీలతో అంటకాగే వారు సైతం ఈ దేశంలో అన్ని పదవులకు అర్హులు. మరి హిందుత్వ రాజకీయం మాత్రం ప్రమాదమా? హిందువులకు మతోన్మాదం ఉంటుందనే అపప్రథను శాశ్వతం చేయడం లక్ష్యంగా ప్రపంచంలోని విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. దానిని ఓటు బ్యాంకుగా మార్చుకొనేందుకు ఇక్కడి రాజకీయ పార్టీలు, కొన్ని వైదేశిక మానసిక శక్తులు తీవ్రంగా ప్రయత్నం జరుపుతున్నాయి.

దేశంలో స్థానికంగా జరిగే చిన్న చిన్న ఘటనలను సైతం భూతద్దంలో చూపిస్తూ హిందుత్వను అపఖ్యాతిపాలు జేయడమే వీళ్ల అసలు ఎజెండా. కానీ గులాబీలను బట్టలో కట్టి దాచినంత మాత్రాన వాటి సుగంధాలు చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రభావితం చేయకుండా ఉంటాయా? గులాబీలపై పేడ చల్లినంత మాత్రాన దాని అంతర్గత సుగంధం చెడిపోతుందా? ఆ గులాబీలు తాత్కాలికంగా పేడ కంపులో కుళ్లిపోయినా దానిని తర్వాత ఎరువుగా మార్చుకొని కొత్త మొక్కలకు జీవనం ఇచ్చినట్లే హిందుత్వ ఎదుగుతుంది. అది చరిత్ర చెప్పిన సత్యం. దానిని విస్మరిస్తే మోదీలు, యోగీలు అనేక మంది పుట్టుకొస్తారు. ఇదే జాతీయవాద నవ జీవనం.


****************************
 * డాక్టర్. పి. భాస్కర యోగి *
 * ఆంధ్రభూమి : భాస్కర వాణి *