ఇతర దేశాల్లో భాస అనుసంధాన సాధకం. విదేశీయులు తమ భాషలను ‘ఉపయోగించే విధానం’పై అధ్యయనం చేస్తారు. మన భాషలో ధ్వని ప్రధానం. వాక్కు, అర్థం రెండూ విడదీయరానివిగా భావిస్తాం. శబ్దాన్ని ‘నాదస్వరూపం’గా పిలుస్తాం. దానినే వేదాంతం ‘శబ్ద బ్రహం’గా అభివర్ణించింది. నిర్గుణ, నిరంజన, స్వయంజ్యోతిర్లింగ పరమాత్మను శబ్దబ్రహ్మతో సూచిస్తాం. ప్రకృతి నిండా వ్యాపించి ఉన్న శబ్దబ్రహ్మానికి ప్రతీక.. ఓంకారం. అది ఆ పరమాత్మకు మరోపేరు. దాని ప్రాముఖ్యత అంతా ఒక ధ్వని, ఒక సంకేతం. దానిలోని అర్థాన్ని గురించిన ప్రశ్న కన్నా దాని ధ్వని స్వరూపానికే మన శాస్త్రాల్లో ప్రాధాన్యం ఎక్కువ ఉంది. దానికి ఆధ్యాత్మికత కన్నా విజ్ఞాన తత్వం ఎక్కువ. సాధకుడు అంతరంగాన్ని కదపగలిగే శక్తి ఆ ఓంకారానికి ఉంది. మనసు లోతుల్లోని పొరల్లో దాగి ఉండే వాసనలనే మలినాలను బయటకు విరజిమ్మి ఆత్మతత్వాన్ని గుర్తుచేసేది శబ్దబ్రహ్మంగా పిలిచే ఓంకారం. ఓంకార జపం చేస్తే చిత్తమాలిన్యాలను తొలగిస్తుంరా శబ్దాన్ని ఉచ్చరిస్తే వివిధ చక్రాలపై పనిచేసి వాటిని చైతన్యవంతం చేసి లక్ష్యసిద్ధిని, ఆనందాన్ని కలిగిస్తుంది. శబ్దం నుంచే యోగం వైపు తీసుకెళ్లే సాధనం ఓంకారం. ప్రకృతి నిండా వ్యాపించిన శబ్దబ్రహ్మానికి ఓంకారం ప్రతీక. నాదబ్రహ్మాన్ని పట్టుకుంటే పరమాత్మవైపు మనం అడుగులు వేసినట్టే. అందుకే మన మహర్షులు.. ఓంకారాన్ని మోక్షసాధనంగా అభివర్ణించారు. 

*********************************************************************************
డాక్టర్‌ పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి