– సీమాంధ్రుల మనోభావాలు పట్టించుకొలేదు. కాంగ్రెసు రాజకీయ కోసం డ్రామా ఆడింది. ఆంధ్రులను అవమానించడం కాంగ్రెసుకు అలవాటు. అందుకే తెలుగుదేశం పుట్టింది. అంజయ్యను, పీవిని అవమానించారు.
– ప్రధాని నరేంద్రమోది
– మీరు ఆంధ్రుల మనసులు గెలుచుకున్నారు మోదిజి.
– కాంగ్రెస్‌ లోఫర్‌ పార్టీ. నరహంతక చరిత్ర ఆ పార్టీకి ఉంది. రాహుల్‌ పప్పు, ఉత్తమ్‌ దద్దమ్మ.
– ఇష్టాగోష్ఠిలో మంత్రి కెటిఆర్‌
– మీ కుటుంబంలో అందరూ తెలివి గలవారే. మిగతావాళ్ళు కూడా అలా ఉండాలంటే ఎలా !
– కాంగ్రెసు, జెపి, కమ్యూనిస్టులతో కలిసి ప్రత్యేక ¬దా కోసం కేంద్రంపై పోరాటం చేస్తాం.
– ఉండవల్లి అరుణ్‌కుమార్‌
– రాజకీయ నిరుద్యోగుల పని పోరాటం చేయడమే కదా !
ం మీరంటే మాకెంతో గౌరవం
– వెంకయ్యతో విపక్షాల నేతలు
– మరి ఎవరి పైన మీ మంట ?
– సభాపతిజీ రేణుకను అడ్డుకోకండి. రామాయణం సీరియల్‌ తర్వాత అంతటి నవ్వును వినే భాగ్యం మనకు ఈ రోజే దక్కింది.
– వెకిలిగా నవ్విన రేణుకా చౌదరిపై ప్రధాని మోది చురక!
– పాత్ర పేరు చెబితే ఇంకా స్పష్టంగా ఉండేది కదా మోదీజీ !
ం విభజన హామీలు ఏమయ్యాయి ?
– కాంగ్రెసు నేత మల్లికార్జున ఖర్గే
– ‘మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కడం’ అంటే ఇదే మరి.
– రాఫెల్‌, రైతులు, నిరుద్యోగంపై ప్రజల ప్రశ్నలకు మోది జవాబు ఇవ్వాలి.
– రాహుల్‌గాంధి
– మీ తాతల నాటి భోఫోర్స్‌, నేటికీ నడుస్తున్న నేషనల్‌ హెరాల్డ్‌లకు సమాధానాలు చెప్పారా!
– కెసిఆర్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం. తెలంగాణ సెంటిమెంటుకు కాలం చెల్లింది.
– సిపిఎం నేత బివి రాఘవులు
– ‘కాలం చెల్లిన సిద్ధాంతం’ అనేమాట మీకు ఊతపదమా!
– కెటిఆర్‌ వాడిన భాష అభ్యంతరం
– మాజీ మంత్రి జానారెడ్డి
– ‘తలుపు చెక్కకు తమలపాకుతో సమాధానం చెప్పడం’ అంటే ఇదేమరి.
– మోది, కెసిఆర్‌లకు రాజకీయ సన్యాసం తప్పదు.
– యువజన కాంగ్రెసు జాతీయ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌
– ముందు మీ నాయకుణ్ణి జాగ్రత్తగా చూసుకోండి.
– బాబ్రీ మసీదు విషయంలో వెనక్కి తగ్గం
– ముస్లిం పర్సనల్‌ లాబోర్డు సమావేశం
– ‘త్రిపుల్‌ తలాక్‌’ బిల్లులా అవుతుంది జాగ్రత్త.
– మేధావుల మౌనం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. మెరుగైన సమాజ స్థాపనకు రాజకీయాల్లోకి రావాలి.
– పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
– జయప్రకాశ్‌ నారాయణ్‌లా మాట్లాడకండి.

****************************************************
– డా|| పి.భాస్కరయోగి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి