ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై- ఏ అంశం దొరికినా వదలకుండా విమర్శలు గుప్పిస్తున్నాయి. మోదీ ప్రధాని పదవిని చేపట్టి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో పశువధను నిషేధిస్తూ తీసుకున్న కీలక నిర్ణయాన్ని మీడియాలోని ఒక వర్గం, కొన్ని రాజకీయ పార్టీలు, సం స్థలు కావాలని వివాదాస్పదం చేస్తున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశ్నించేవారు రా జ్యాంగాన్ని గౌరవిస్తారా? లేదా? గోవా, ఈశాన్య భారతం, కేరళ, బెంగాల్‌లో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ గోవధ నిషేధ చట్టాలున్నాయి. ఇదేం కొత్తగా ‘జిఎస్‌టి’లా తెచ్చిన బిల్లు కాదు. గతంలో ఇలాగే జైనుల పర్వదినాలను పురస్కరించుకుని ‘పశుమాంసం’ అమ్మకాలను నిషేధించిన మహారాష్ట్ర ప్రభుత్వంపై అందరూ అక్కసు వెళ్లగక్కారు. అదే బాటలో జమ్ము-కశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు నడవడం జీర్ణించుకోలేని మేధావులు, నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. మాంసానికి మతం రంగు, దళిత బహుజన రంగు పులిమి జాతీయ ప్రభుత్వంపై ఒంటికాలిపై లేస్తున్నారు.
ఇదంతా రాజకీయం. కానీ, పశువధ వల్ల సమాజానికి జరుగుతున్న నష్టాన్ని మరో కోణంలో ఆలోచించడం శాస్ర్తియత అని తెలుసుకోలేకపోతున్నారు. ముస్లింలు పశువధకు మద్దతు ఇస్తారని, వారి ఆహారం అదే అని ప్రచారం చేస్తూ దానికి మతపరమైన సూత్రీకరణలు చేస్తున్నారు. ఈ వ్యవసాయిక దేశంలో రైతులకు పశువధ వల్ల ఎంత నష్టం జరుగుతున్నదో అంచనా వేయడం లేదు. వ్యవసాయా న్ని కాపాడే హిందూ వర్గంపై అనవసర ఖండన మండనలు చేస్తున్నారు. పశువధ వల్ల వ్యవసాయరంగం ఎంత బలహీనమైపోతోందో, విదేశీ ఎరువుల కంపెనీల ముందు మనం ఎంత దాసోహం అయిపోతున్నామో ఈ తీవ్రతలో వివేకంతో ఆలోచన చేయలేకపోతున్నారు.
పూర్వం నుంచి గోరక్షణ-పశుపోషణ హిందుత్వంలో అంతర్భాగాలు, దిలీపుని గోసేవ, శ్రీకృష్ణుని గోరక్షణ, ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం వంటి పదాలు హిందూ ఇతిహాస, పురాణాల్లో స్థానం పొందాయి. గోరక్షణకు పవిత్రత ఆపాదించిన ఋషులు దానిలోని పరమార్థాన్ని జనం అర్థం చేసుకుంటారని భావించారు. దురదృష్టవశాత్తూ పవిత్రతను మాత్రమే పట్టుకుని, సామాజిక ఉపయోగ దృష్టిని విస్మరించాం. అందువల్ల పశుపోషణ, పశుహింసకు గల తేడాను గ్రహించలేకపోతున్నాం. దానికి మతం రంగు పులిమి మరింత రాక్షసక్రీడగా మార్చుకున్నాం. మహాత్మాగాంధీ గోవధ నిషేధాన్ని బలపరిచారు. ఓ బహిరంగ సభలో- ‘నేను ప్రధానిని అయితే పశువధ శాలలన్నీ మూసివేయిస్తాను’ అని ఆయన ప్రకటించారు. 1924లో మదన్‌మోహన్ మాలవ్యా గోవధ నిషేధంపై యూనిటీ కా న్ఫరెన్స్‌లో తీర్మానం చేయించారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 48 గోసంపదను రక్షించాలని ఆదేశిస్తోంది.
మన రైతులు 1740 నాటికే తమిళనాడులోని ఆర్కాట్ జిల్లాలో ఆవుపేడను ఎరువుగా, ఆవు మూత్రాన్ని క్రిమిసంహారిణిగా ఉపయోగించారు. రాబర్ట్ క్లైవ్ భారత వ్యవసాయ వ్యవస్థను పరిశీలించి ఇచ్చిన సలహా ఆధారంగా ముప్పై వేల ఆవులను వధించి మాం సంగా మార్చే తొలి గోవధశాల 1760లో ఏర్పాటైంది. 1910 సంవత్సరం వరకు 350 మాత్రమే ఉన్న గోవధ శాలల సంఖ్య 1947 తర్వాత 36,000కు పెరిగింది. అప్పటినుండి దేశంలో ఆవు, ఆవుసంతతి ధ్వంసం జరుగుతునే ఉంది. గోరక్షణను ప్రాథమిక హక్కుగా మార్చాలని నేషనల్ కమిషనర్ ఫర్ క్యాటిల్ (ఎన్‌సిఎఫ్‌సి) నాలుగు సంపుటాల్లో 1,500 పుటల నివేదిక 3 ఆగస్టు 2002న కేంద్రానికి సమర్పించింది. గోవు విషయంలో 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్‌వారు ఉపయోగించిన కుటిల నీతి మన పాలకులకు ఆదర్శమైంది. బాంబుల చివర పెట్టే కొవ్వు విషయాన్ని హిం దూ-ముస్లింల సమస్యగా మార్చి 1857 తిరుగుబాటును నాటి పాలకులు నీరుగార్చినట్టే నేడు లౌకిక వాదుల పేరుతో కొందరు పశువధను మత దృష్టితో చూపిస్తూ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్నారు. కేవలం 2002లో 8,780 కోట్ల రూపాయల తోళ్ల ఎగుమతి జరగ్గా, అందులో 60 శాతం ఆవులను చంపడం వల్ల లభించినదే కావడం గమనార్హం.
ఎస్.శ్యామ్‌ప్రసాద్ అనే అధికారి ఇటీవల తీసిన లెక్కల ప్రకారం ఒక పశువధశాల నుండి 20 కోట్లరూపాయల ఎగుమతులు జరిగితే అక్కడ చంపబడే పశువులతో తయారు చేయదగ్గ ఎరువులు, శక్తి విలువ 910 కోట్ల రూపాయలను మనం కోల్పోవడమే! ఒక ఆవు పాలతో తనజీవిత కాలంలో 25,478 మంది వ్యక్తులను తృప్తి పరచగలుగుతుందని స్వామి దయానంద తన ‘గోకరుణానిధి’ పుస్తకంలో పేర్కొన్నారు. 1995లో స్వీడన్‌కు చెందిన శాస్తవ్రేత్త డా.క్రిట్జ్‌గామ్ ఆవుపేడపై పరిశోధనలు చేసి కొత్త విషయాలు పేర్కొన్నారు. ఆవుపేడకు యాంటిసెప్టిక్ ధర్మాలున్నట్టు వెల్లడించారు. డా.శిరోలిన్ అనే రష్యన్ శాస్తవ్రేత్త ఆవుపాలు, నెయ్యి, పేడలోని అద్భుత గు ణాలు రేడియో ధార్మిక శక్తిని నిర్వీర్యం చేస్తాయని చెప్పారు.
స్వాతంత్య్రం వచ్చాక గాంధీజీ ఇచ్చిన మూడు ప్రాధాన్యతల్లో ‘గోవధ నిషేధం’ ఒకటి. అయితే నేడు గోవులను ఇంత దారుణ చిత్రవధకు గురి చేసి సొమ్ము చేసుకోవడం ఎంత ఘోరం? ఈ హింసాకాండను ఆపలేని ప్రభుత్వాల అసమర్ధతను ప్రశ్నిస్తూ 1989లో అఖిల భారత కృషి గోసేవా సంఘ్, అహింసా ఆర్మీట్రస్ట్ అనే రెండుసంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఆ తర్వాత ఈ కేసులో నాటి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది. జస్టిస్ ఆర్.సి.లాహోటీ నేతృత్వంలో 2004లో ఓ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి విచారణ సుదీర్ఘంగా చేసి 2005 సెప్టెంబర్‌లో తీర్పు వెలువరించింది. ఇందులో ముఖ్య ప్రతివాది ఖురేషి సమాజ్ (అతి ఎక్కువ గోహత్యా కేంద్రాలు నడిపే సంస్థ) ఎన్నో అబద్ధాలను, హేతురహిత అంశాలను కోర్టుకు సమర్పించింది. అందులో మొదటి కు తర్కం ముసలి ఆవులను పోషించడం కష్టమనీ, గ్రాసం లేక ఆకలి చావు చచ్చేదానికన్నా పశువధ శాలకు వెళ్లడం మంచిదనీ, స్థలా భావం వల్ల గోవులను పోషించడం కష్టమనీ, ముసలి గోవులను చంపి దేశ ఆర్థిక వ్యవస్థను తాము పరిరక్షిస్తున్నామని కోర్టుకు తెలిపింది. దానికి చివరగా ‘గోహత్య మా మత హక్కు’ అని కూడా ఇంకో కొత్త పల్లవి అందుకున్నది. దీనిపై కేసులు వేసిన పై సమాజాల వారు కోర్టుకు తర్కబద్ధంగా కొన్ని గణాంకాలను సమర్పించారు. వాటిని విశే్లషిస్తే-ఒక ఆవు జీవిత కాలం 20 ఏళ్లు. ఆరోగ్యం జీవించే ఆవు బరువు 300 నుండి 350 కిలోలు. దానిని చంపడం వల్ల లభించే మాంసం 70 కిలోలు. అంతర్జాతీయ మార్కెట్‌లో మాంసం ధర 50 రూపాయలు. అంటే ఒక ఆవును చంపగా వచ్చిన మాంసం ధర 3500 రూపాయలు. ఆవునుండి లభించేది 20 నుండి 25 లీటర్ల రక్తం. దాని ధర సుమారు 2000 రూపాయలు మాత్రమే. దాని ఎముకల ధర రు.1200 నుండి 1300 లభిస్తుంది. చర్మం, ఇతరాల నుండి మరి కొంత. మొత్తానికి ఒక ఆవును చంపినపుడు దానివల్ల సుమారు 7,000 రూపాయలు లభిస్తాయి. మరి ఆవును బతికిస్తే ఒక ఆరోగ్యకరమైన ఆవు ప్రతిరోజూ 8 నుండి 10 కిలోల పేడనిస్తుంది. ఒక కిలోపేడతో 38 కిలోల సేంద్రియ ఎరువు (ఆర్గానిక్ ఫర్టిలైజర్) తయారు చేయవచ్చు. ఈరోజు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 6 రూపాయలు. ఒక లీటర్ ఆవుమూత్రం ధర భారత మార్కెట్లో 500 రూపాయలు. గోమూత్రం ద్వారా ఆస్టియో ఫోరోసిస్, ఆస్టియామైలీటాస్, ట్యూబర్కిలోసిస్, బ్రాంకైటిస్ వంటి రోగాలకు మందులు తయారు చేయవచ్చు. గోమూత్రంపై అమెరికా మూడు రకాల పేటెంట్ హక్కులు కైవసం చేసుకుంది. ఇవాళ గోమూత్రం అంతర్జాతీయ మార్కెట్‌లో 800-1200 రూపాయల వరకు పలుకుతున్నది. ఆవుపేడ నుండి మీధేన్ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తే 70 పైసలకే కిలోమీటర్ వాయు కాలుష్యం లేకుండా వాహనాలపై ప్రయాణం చేయవచ్చు. శబ్దం రాని వాహనాలతో ధ్వని కాలుష్యం లేకుండా నివారించవచ్చు. వంట చెరుకుగా కట్టెలకు బదులుగా ఇళ్లలో, ఫ్యాక్టరీలలో ఆవుపేడను ఉపయోగించి అడవులను కాపాడవచ్చు. తద్వారా పర్యావరణ పరిరక్షణ చేయవచ్చు. ఇలా ఒక ఆవు తన జీవిత కాలంలో గణాంకాల ప్రకారం 40 లక్షల రూపాయలు మనకు అందిస్తుంది. మరి ఆవును చంపి దాని రక్తమాంసాలను 7 వేలకు అమ్ముకుందామా? ఒక ఆవును రక్షించి 40 లక్షల రూపాయల ఆర్థిక పుష్టిని కలిగిద్దామా? అని కేసు వేసిన సంస్థలు వాదించాయి. గ్రామీణ ప్రాంతాల్లో వెల్పేర్ బోర్డు ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన నివేదికల ప్రకారం ఒక ముసలి ఆవు ద్వారా సంవత్సరానికి 4500 లీటర్ల బయోగ్యాస్, 180 టన్నుల సేంద్రియ ఎరువు, 200 లీటర్ల కీటక నివారణ ఔషధాలు లభ్యమవుతున్నాయి. 1989లో వాటి విలువ రు.17,885 అయితే 1998లో రు.25,000గా ఉందని గణాంకాలతో సహా నిరూపించారు. దాంతో న్యాయమూర్తి సంతృప్తి చెందారు. వెంటనే ప్రతివాదులు ఆవును చంపడం తమ మతహక్కు అని వాదించారు. దానికి పై సంస్థలవాళ్లు కొన్ని ఉదాహరణలు, మత గ్రంథాలు, చారిత్రక గ్రంథాలు చూపించారు. ఖురాన్, హదీస్‌లలో ఎక్కడా గోహత్య లేదని వాదించారు.
దాదాపు 750 ఏళ్లకు పైగా భారత్‌ను పాలించిన ముస్లిం రాజులెవరూ గోవధ చేయలేదని నిరూపించారు. బాబర్ తన ‘బాబర్‌నామా’లో తన మరణానంతరం కూడా గోవధ నిషేధం అమలు చేయాలని రాయించుకున్నారు. దానిని ఆయన కుమారుడు హుమాయున్ పాటించాడు. అక్బర్, జహీంగీర్, ఔరంగజేబు సహా అందరూ గోవధ నిషేధించారు. ‘హిజిరి 935’లో అక్బర్ గోవధ నిషేధం చేస్తే జహంగీర్ ‘్ఫర్మానా 1586’ జారీ చేసి తాను సింహాసనానికి వచ్చిన గురువారం, అక్బర్ పుట్టినరోజైన ఆదివారం ఆవుతోపాటు ఇతర ఏ జంతువులను చంపొద్దని శాసనం చేసాడు. బక్రీదు పర్వదినం నాడు గోవధ నిషేధం విధించాడు ఔరంగజేబు. టిప్పుసుల్తాన్ తండ్రి మైసూరు రాజు హైదరాలీ గోవధ చేసిన వారి చేతులు నరకమన్నాడు. బహదూర్‌షా తన రాజ్యంలో గోవధ నిషేధం పకడ్బందీగా అమలు చేసాడు. ఇలా అనేక వాదనలు రుజువు చేసాక ఒక నెల సమయం కోరిన ప్రతివాదులు తమ వాదనను సమర్ధించుకోలేకపోయారు. చివరకు సెప్టెంబర్ 2005లో సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పును వెలువరిస్తూ వెంటనే దేశంలో గోహత్యా నిషేధం చేయాలని, రాష్ట్రాలు దీన్ని వెంటనే అమలు చేయాలని, గోవులను రక్షించడం ప్రతి పౌరుని బాధ్యత అని తీర్పునిచ్చింది. తీర్పు పూర్తి పాఠం తీతీతీ.ఒఖఔళౄళష్యఖూఆష్ఘఒళ్ఘతీ.ష్యౄలో చూడవచ్చు.
మరి ఈ దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో భాగమైన సుప్రీంకోర్టు తీర్పును గౌరవించరా? ఆవు మాంసం తింటున్నందుకే పాకిస్తాన్ సైనికులు బలంగా ఉన్నారని ఓ కుహనా మేధావి వాదిస్తున్నాడు. అంత బలంగా ఉన్న మొనగాళ్లు భారత్ చేతిలో నాలుగు యుద్ధాల్లో ఎందుకు ఓడినట్టు? వెయ్యేళ్ల నుండి హిందువులు ఎన్నో త్యాగాలు చేస్తే, ఇతర మతస్థులు హిందువుల మనోభావాలను గౌరవించడానికి ఒక్క త్యాగం చేయలేరా? గోవధ నిషేధం అమలు పర్చాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు నటిస్తుంటే పౌరులు ఉద్వేగాలకు లోనై ప్రతి చర్యలకు పూనుకుంటున్నారు. ప్రతి చర్యలను విమర్శించేవాళ్లు చర్య జరగకుండా ఎందుకు నిలువరించలేకపోతున్నారు? *

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125
Published Andhrabhoomi, Thursday, 8 June 2017
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి