ఈ దృష్ట్యా నాగార్జునుని గురించి పలురకాల కథలు వ్యాప్తిచెందాయి.
నాగార్జునుడు సిద్ధ నాగార్జునుడు వేరువేరని ప్రజల్లో ఒక గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళంలో ఈయన రసాయనిక శాస్త్రానికి చేసిన సేవలు, అనుపమానమైన పరిశోధనా కృషి యావత్తు తెరమరుగున ఉండిపోయాయి. ఈ వివాదానికి నిర్దిష్టమైన సమాధానానికి చరిత్ర ఆధారాలు సుస్పష్టముగా లేవు. ఈ విషయ చరిత్ర గ్రంథాల్లో అక్కడక్కడ వీరి పేర్లు వేరువేరుగానే వున్నాయి.
జీవిత చరిత్రకారుల ప్రకారం నాగార్జునుడు బాల్య దశలోనే వేదవేదాంగ పారంగతులయ్యారు. వివాహప్రసక్తి లేకుండానే సన్యసించి సర్వజ్ఞాని అయ్యారని చరిత్రకారులు చెబుతున్నారు. హిమాలయాల్లో అపార విజ్ఞాన సంపత్తితో విలసిల్లిన బౌద్ధ సంఘారామంలో అధ్యయనాలుచేసి, రసాయన, వృక్ష, ఖనిజ, వైద్య విద్యలను అభ్యసించారు. అమరావతి స్థూప ప్రాకార ప్రతిష్టకు ప్రారంభోత్సవం చేసింది ఈయనే నాగార్జునుడు తమ జీవితకాలంలో రసాయన శాస్తప్రరంగానేకాక వైద్యరంగం, యోగసాధన రంగం మొ. గ్రంథ రచనలు చేసినట్టు తెలియవస్తున్నది.
ఈ పర్వత సానువులనే ఖనిజ రసాయన పరిశోధనల ప్రయోగశాలగా మలచుకున్న నాగార్జునుడు జీవిత చరమాంకంలో గాఢ పరిశోధనలకు అంకితమయ్యారు. ఆచార్య పీఠము ప్రపంచఖ్యాతి పొందింది.
నాగార్జునుడు సకల శాస్తప్రారంగతులు, అపరధన్వంతరి, శస్త్ర శాస్త్ర ప్రవీణుడు, తత్వవేత్త, తార్కికులు, ఖనిజ కళానిష్ణాతులు, వేద విద్యా విశారదులు, కవిసార్వభౌములు, మాధ్యమిక వాద (ప్రవక్త), మహాయాన మార్తాండులు, శతాధిక గ్రంథకర్త- ఈ విధంగా ఎందరో పండితులు తమతమ రచనలలో ప్రశంసించారు. ప్రాచీన భారతదేశంలో ఈయనకు మించిన పూర్ణపురుషుడు లేరన్నవారూ వున్నారు.
ఈనాటి నాగార్జునసాగర్‌కు 8 కి.మీ. దూరంలో ‘అనువు’అనే ప్రదేశంవద్ద ఇక్ష్వాకుల నాటి కట్టడాలను పునర్నిర్మితం చేసారు. ఈరోజున ‘అనువు’ చరిత్రకే పరిమితమైంది.
రెండవ నాగార్జున
ఇదే సంవత్సరంలో రెండవ నాగార్జున గూర్చి తెలుసుకుందాం. ఈయనను సిద్ధ నాగార్జునుడుగా వ్యవహరిస్తారు. క్రీ.శ.600 ప్రాంతంలో జన్మించారు. ‘రసవిద్య’లో అఖండులు, కర్నాటకలో నివసించారు. జైన సాహిత్యంలో ఈయన వివరాలు కొన్ని తెలియవచ్చాయి. పూజ్యపాదుని మేనల్లుడు. ప్రసిద్ధ జైనతత్వవేత్త, వైద్యప్రకాండులు అయిన పూజ్యపాద వద్ద ఈయన ఉద్యోగం చేసారు.
జైనుడుగా జన్మించినప్పటికీ, బౌద్ధమతం వైపు ఆకర్షితులై బౌద్ధ్భిక్షువుగా రూపొందారు. భారతదేశం, నేపాల్, టిబెట్ మొ.దేశాలలో పర్యటించి బౌద్ధమత ప్రచారం చేసారట. ఆ తర్వాత మన రాష్ట్రంలోని శ్రీశైలం కొండల ప్రాంతానికి వచ్చి, నాగార్జున బోధిసత్వ పేరుప్రఖ్యాతులకు ఎంతో ప్రభావితులయ్యారు. రసాయన శాస్త్రప్రయోగాలను అనుసరించారు. రసవాద విద్యద్వారా మోక్షాన్ని పొందగలిగారు. వివిధ ఇతర సిద్ధులనుకూడా పొందినట్టు చెబుతారు. ఆ కారణంతో ‘సిద్ధనాగార్జునుడు’గా ప్రచారంలోకి వచ్చారు. రసవిద్యను వివిధ గ్రంథ రచనలతో ప్రచారంచేసారు. రసకాచపుటం, కక్షపుట తంత్ర, (సిద్ధ చాముండ) మొ. గ్రంథాలు సిద్ధనాగార్జునుడి పేరుమీద ఉన్నాయి.
మూడవ నాగార్జున
ఇదే సందర్భంలో మరో నాగార్జునుడిని గూర్చి చెప్పుకుందాం. ఈయన నాగార్జున-3. అసలు పేరు భాదంత నాగార్జున. క్రీ.శ.7వ శతాబ్ది పూర్వార్ధంలో కేరళ రాష్ట్రంలో జననం కేరళకు చెందిన బౌద్ధ సన్యాసిగా చరిత్ర పుటలలో నిలిచిపోయారు. సంస్కృత భాషలో సాధికారత పొంది ప్రాచీన భారతీయ సాంప్రదాయ వైద్యగ్రంథాలను ఔపోసనపట్టారు. ఈనాటి ఆయుర్వేద వైద్యరంగంలో ప్రతిష్టాత్మక గ్రంథమైన ‘రసవైశేషిక సూత్ర’ను ఈయనే రచించారు. ఆయుర్వేద వైద్యవౌలిక సూత్రాలు ఇందులో వున్నాయి. షడ్రుచులను (ఆరురుచులు) గూర్చి వైద్యపరమైన అమోఘజ్ఞానాన్ని అందించిన ఈ గ్రంథం 486 సూత్రాలతో నాలుగు అధ్యాయాలుగా వుంది. స్వతంత్రంగా తనదైన శైలిలో ఒక వైద్య సంప్రదాయాన్ని (నాగార్జునియాస్) నెలకొల్పి, అనేకమంది అనుచరులను పొందగలగడం ఈయన వైద్యశాస్త్ర విశిష్టత, ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
(శ్రీ వాసవ్యగారు రచించిన ప్రాచీన భారతీయ శాస్తవ్రేత్తల సౌజన్యంతో)
మన దేవతా స్వరూపాలు - ఒక విశ్లేషణ
భగవంతుడు/ దేవుడు- అన్ని మతాల వారికి ఒక్కడే. అయితే హిందువులు మాత్రం లోకంలో జీవి పుట్టడం, పెరగడం, నశించడం అనేది ప్రతి జీవికి ఏర్పడే అవస్థ అని ఈ మూడు స్థితులైన జననం - పోషణం - మరణం అనే వాటిని సర్వజంతు సామాన్యంగా గుర్తించి ఈ కార్యక్రమాల నిర్వహణకు అధిష్ఠాతలుగా బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులు లేదా రుద్రులుగా ముగ్గురిని ప్రధానంగా భావించింది. అందువల్ల హిందూ మతంలో ఏ శాఖ అయినా ఈ ముగ్గురి ప్రసక్తి ఉంటుంది. అందుకే మన తెలుగులో పంచమ వేదమైన మహాభారతానికి శ్రీకారం చుట్టిన నన్నయ.
- ఇంకావుంది...
*****************************************
✍ డాక్టర్. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి