‘‘ఏ జాతి తన ఫూర్వులను స్మరించదో, ఏ జాతి తన ఉజ్వల గత చరిత్రను విస్మరిస్తుందో- ఆ జాతికి భవిష్యత్తు ఉండదు. ఏ జాతి తన ధర్మ సంస్కృతి పరంపరలను విడనాడుతుందో ఆ జాతికి మనుగడే లేదు. కాబట్టి ఈ పవిత్ర భారతావనిలో జన్మించిన మహనీయుల సుగుణాలు స్మరించుకుంటూ, గత వైభవాన్ని నెమరేసుకుని స్ఫూర్తిని పొంది ఉత్తేజితులై, నవభారత నిర్మాణానికి కంకణధారులం కావాలి మనం’’- అని దేశంబధు చిత్తరంజన్‌దాస్ అంటారు. నిజమే! ఏ జాతి తన పూర్వ వైభవాన్ని మరచి జీవిస్తుందో ఆ జాతి కాలగర్భంలో కలిసిపోతుంది. అందుకే ప్రపంచంలో నేడు నవనాగరికతలో మునిగితేలుతున్న పాశ్చాత్య దేశాలు తమ మూలాలు వెతుకుతున్నాయి. కానీ మనం వేల సంవత్సరాల ‘్భరతీయ వైజ్ఞానిక పరంపర’ను గురించి ఆలోచించకపోగా, ఆధునికత, నాస్తికత, హేతువాదం, సోమరితనం, దేశభక్తి లోపం- అనే పంచ లక్షణాలతో ఈ దేశాన్ని కులాలుగా, పార్టీలుగా, భాషలుగా, సిద్ధాంతాలుగా, ప్రాంతాలుగా- విభజించుకుని మన సంస్కృతిని మనమే అవహేళన చేస్తున్నాం. కాని ముమ్మాటికీ నిజమైన సత్యం ఏమిటంటే- ఈ జాతిపై ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని దౌర్జన్యాలు జరిగినా ఎప్పుడో ఒక రోజు ప్రపంచ పటంపై శిరసెత్తి నిలబడేది మనమే. అలాంటి ఋషి పరంపర మనది. ఆ ఋషి పరంపర వల్ల దేశంలో అనేక శాస్త్రాలు వెలిసాయి.

- జంతు పరిణామం కన్నా ముందే మానవ పరిణామం ప్రబోధించే ‘పాతంజల యోగ సూత్రాలు’ రచించిన పతంజలి మహర్షి మనవాడే.

- ప్రపంచం కళ్ళు తెరవకముందే వేదం, వైద్యం, జ్ఞానం, ధర్మం అనేవాటికి జీవం పోసింది భారతీయ ఋషులే.

- గణితం, ఖోగోళం, జ్యోతిషం, నౌకాశాస్త్రం, వాస్తు శిల్పం, నృత్యం, మంత్రం, తంత్రం, ఆయుర్వేదం- అన్నీ మన ఋషుల ఆవిష్కరణలే!

అందులో భాగంగా భారతీయ ఋషులు ఆయుర్వేద శాస్త్రాన్ని, అంతకన్నా విశేషమైన రసాయన శాస్త్రాన్ని ఆవిష్కరించారు. అందులో రసవాదం అనేది ప్రత్యేకం. భారతీయ ఋషులు ఈ విద్యలను నేరుగా చెప్పకుండా ఒక నీతి బోధగానో, ఒక ఆచారంగానో ఆధ్యాత్మిక కథ రూపంలోనో చెప్తారు. ఎందుకంటే మేధావులకన్నా సమాజంలో సామాన్యులు ఎక్కువ. విజ్ఞానాన్ని విజ్ఞానంగా చెబితే అర్థం చేసుకోరు. అలాగే రసవాదం కూడా మన దేశంలో రహస్యంగా వుంది. ఈ రసవాదంవల్లనే రసాయన శాస్త్రం అభివృద్ధి చెందింది. సైన్సుకు హిందువులు వ్యతిరేకం అన్నట్లుగా నేటి హేతువాద ప్రచారం చేస్తున్నారు. అందుకే మన ఋషులు కనుగొన్న రసవిద్యను నేటి రసాయన శాస్త్రానికి పూర్వభాగంగా అంగీకరించటంలేదు. కానీ 2000 ఏళ్ళకు ముందే పాదరసాన్ని మన ఋషులు ఉపయోగించారంటే వారి పరిజ్ఞానం ఏపాటిదో మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు వారి మేధకు అందినంతవరకు గొప్ప పరిశోధననే చేశారు.

రసవిద్య అంటే

- లోహమైన పాదరసం ఉపయోగించి శరీరానికి ఆరోగ్యం కల్గించే మందులను చేయడం.

- వజ్రం లాంటి శరీరంగా మార్చుకునే దేహసిద్ధికొరకు

- కాయకల్ప చికిత్స కొరకు (ఆయుష్షు పెంచుకోవడానికి)

- బాహ్యదారిద్య్రం పోగొట్టే స్వర్ణం తయారీకి, ఇలా ‘రసా’న్ని అనేక విధాలుగా ఉపయోగించడానికి ఈ విద్యను ఉపయోగించారు. ఇదే రసవిద్య.

రసవిద్య వల్ల కలిగే ఉపయోగాలు

- లోహమైన రాగి, సీసం, తుత్తునాగం, బంగారం, వెండి వంటి వాటిని శుద్ధి చేసే విధానం ఈ విద్యవల్లనే మనం 
తెలుసుకోగలిగాం.

-సప్త్ధాతువులైన రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్లం- వీటి సారంతో ఓజస్సు ఏర్పడుతుంది. ఇది తగ్గకుండా ఉండేందుకు రసవిద్య ఉపయోగపడింది.

- భిన్న భిన్న ధాతువుల మిశ్రమాలు తయారుచేయడం

- ఖనిజాల్లోని హానికర గుణాలను గుర్తించి వాటి వల్ల కలిగే మేలును రసవాదం బయల్పరచింది.

- ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రయోగాలకు అనుగుణంగా రసవిద్యను ప్రచారం చేశారు మహర్షులు.

- 1. స్వేదనం (డిస్టిలేషన్) 2. పరిశుభ్రం చేయడం 3.్భస్మం చేయడం 4.లోహాల రంగులో మార్పు తీసుకురావడం 5.మిశ్రధాతువు తయారుచేయడం 6.అగ్నిశిలల నుండి రాగిని రాబట్టడం- వంటి ప్రక్రియలు మొదట రసవిద్య ద్వారానే సాధించారు మన ఋషులు.

రసవాదంపై భారతదేశంలో అనేక గ్రంథాలు వచ్చాయి.

రసవిద్యలో ప్రసిద్ధులు

మన్థాన భైరవుడు, సిద్ధబుద్ధ, కన్టడి, కోరణ్టక, సురావస్థ, ఖర్ఫటి, పూజ్యపాద, నిత్యనాథుడు, నిరంజనుడు, కపాలి, బిన్దునాద, కాకచండీశ్వర, అల్లమదేవ, అస్వకంచుక, బాలుకీ, నాగార్జునుడు, సోమేశ్వరుడు పురాణకాలంలో కూడా కొందరు ఉన్నట్లు తెలుస్తుంది.

ఆధుని కాలంలో రసవిద్య - ప్రయోగం

- ధాతువాదాన్ని ‘అల్కెమీ’ అంటాం. పూర్వం విజ్ఞానవేత్తలైన ఋషులు ఏ వస్తువును చూసినా కిమిదమ్ - కిమ్ ఇయమ్- ఇది ఏంటి? అని పరిశోధించేవారు.

- ప్రకృతికి సంబంధించిన రహస్యాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘కిమియాశాస్త్రం’ అంటూ వచ్చారు.

- ఇంకావుంది...

*****************************************
✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి