– రాజకీయాల్లో రాణించాలంటే పెళ్ళి చేసుకోవద్దు
– పారిస్‌ జైనచంద్‌, మధ్యప్రదేశ్‌ మంత్రి
– ఈ సలహా రాహుల్‌కా ? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అవుతుంది.
– కర్ణాటకలో ప్రజాస్వామ్యం ఖూనీ జరిగింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గెలిచాయి.
– సిఎం చంద్రబాబు
– మీ పార్టీలోకి చేర్చుకొన్న వైసిపి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించగలరా ! గురివింద నీతులు అంటే ఇవే మరి !
– ఆర్‌.ఎస్‌.ఎస్‌., మోది, షాల అహంకారానికి కర్ణాటక పరిణామాలు అడ్డుకట్ట.
– కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
– చెప్పిందే చెబుతున్నారు..! క్రొత్త స్క్రిప్టు తయారు కాలేదా ?
ం గవర్నర్‌ వ్యవస్థ దుర్వినియోగమైంది. సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యాన్ని బతికించింది.
– నిన్నటి వరకు ‘సుప్రీంకోర్టు ధ్వంసం అయిపోయింది’ అన్న మీరే ఇప్పుడు ‘ఉత్తమోత్తమం’ అంటున్నారు. మీకు అనుకూలమైతే అంతా ఉత్తమమే నన్నమాట.
– 2019లో జనసేన ప్రభుత్వం వస్తుంది. నన్ను సిఎంను చేయండి.
– పవన్‌ కళ్యాణ్‌ జనసేన
– రాహుల్‌ పిఎం, మీరు సిఎం. బాగుంది.
– తిరుమలపై జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి.
– అర్చకులు రమణ దీక్షితులు.
– మిమ్మల్ని విచారణ చేస్తారు..! జాగ్రత్త..!!
– కర్ణాటకపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తాం. తదుపరి కార్యాచరణ ఏమిటన్నది బలపరీక్ష తర్వాత ప్రాంతీయ పార్టీలు నిర్ణయించుకొంటాయి.
– బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ
– మనింట్లో కరెంట్‌పోతే పక్కింటి వాళ్లవైపు చూడడం అంటే ఇదే.
– కెసిఆర్‌ పాలన రైతులకు శాపం. 4 వేల మంది రైతులు మరణిస్తే పరామర్శించలేదు.
– ఉత్తమ కుమార్‌ రెడ్డి
– అందుకే కదా ఇప్పుడు 4 వేలు ఇస్తోంది..!
– జాతీయ పార్టీలను ప్రజలు విశ్వసించే రోజులు లేవు.
– ఎంపి కవిత
– కర్ణాటకలో భాజపా 104, కాంగ్రెసు 78, ప్రాంతీయ పార్టీ జెడియస్‌కు 38. ప్రజలు ఎవరిని విశ్వసించినట్లో..!
– బాబు పాలనలో అనాథగా ఆంధ్ర. హిందూ ధర్మాన్ని గాడి తప్పించిన బాబు.
– భాజపా నేత సోము వీర్రాజు
– అయ్యో !

************************************************************
– డా|| పి.భాస్కరయోగి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి