వేమన రసవాధి అని చెప్పే పద్యాలు మచ్చుకు కొన్ని చూడొచ్చు.

* ఇహమున సుఖియింప హేమతారక విద్య
పరమున సుఖియింప బ్రహ్మవిద్య
కడమ విద్యలెల్ల కల్ల మూఢుల విద్య॥

* అంజనంబు కనుల కంటించి చూచిన
సొమ్ము దొరకు భువిని సూత్రముగను
నమ్మి గురుని కరుణ నభిమంటి చూడరా ॥

* ఉక్కుదిన్నవాడె ఉర్విపై సిద్ధుండు
యుక్కుదిన్నవాడె యుండు జగతి
నుక్కుసుధకు మిఱుగ నెక్కు కల్పంబు॥

* ఉక్కు భస్మం దీర్ఘాయుష్యునిగా చేస్తుందని భావం.

* ఉక్కు రసము జేర్చి యుదుటగ సింధూర
హరిదళము చేత హతము జేయ
గరసవాద మదియె ధరజేయ లేరది ॥

(శరీరంలో కొత్త రక్తాన్ని, పుష్టిని కల్గించేందుకు ఆయుర్వేదంలో ఉక్కు భస్మంతో చేసే మందుల విధానం ఉంది. ఆమవాదం, ఉబ్బుజాడ్యం, గ్రహణి, గుల్మము, ప్రమేహము, పాండువు మొ.న రోగాలను నయంచేసే మందు ఉక్క్భుస్మం కలపడం ఆయుర్వేదంలో ప్రసిద్ధం)

* ఉప్పు చింతపండులూరిలో నుండగా
కరవదేల వచ్చె కాపులారా
తాళకంబెరుగరో? తగరంబ నెఱుగరో ॥

రాగిని బంగారం చేయాలని రసవాదులు పడే తాపత్రయాన్ని చెప్తూ-

* కనకంబు సేయను కలియుగంబున జనులు
పచ్చనాకులు దెచ్చి పసరు పిండి
రాగిదుడ్డుకు సవిరి రవళించి చూతురు ॥

* విశ్వబ్రాహ్మణుల రసవాదాన్ని ప్రశంసించాడు

కల్లలాడుదురిల కంసాలి దొంగని
యతని సొమ్ముకెట్టులతడు దొంగ
మన్ను బంగరును మఱిచేసి పెట్టడా ॥

* పరస మినుముసోక బంగారమైనట్లు
కప్పురంబు జ్యోతి గలిసినట్లు
పుష్పమందు తావి పొసగినట్లు ముక్తి ॥

రస విద్యద్వారా బంగారం తయారుచేయవచ్చా?

స్వర్ణవిద్య, హేమతారక విద్య, స్వర్ణం తయారీ- అనే పేర్లుగల ఈ విద్య ఋషులకు మాత్రమే తెలుసు. ఇది రసవిద్యలో భాగంగా ప్రచారం అయింది. ఇప్పటికే రహస్యమైన ఋషులవద్ద ఈ విద్య ఉంది. అలాంటి స్వర్ణ రసవిద్య సాధ్యమా? అని ఆలోచిస్తే-

* శాస్త్రాల్లో వస్తువును మార్చే ‘జాత్యంతర పరిణామం’అనే విద్య ఉన్నది. దానే్న బయాలజీలో ట్రాన్స్‌ముటేషన్ అంటారు.

* మనకు దాదాపు 109కి పైగా మూలకాలున్నాయి. వాటిలో ఒక్కో మూలకానికి ఒక్కో పరమాణు సంఖ్య ఉంది. ఆ మూలకాల్లో కొన్ని అస్థిర మూలకాలు ఉన్నవి. అవిపోగా మిగిలిన వాటిలో ఉదా॥ 90 స్థిరమైనవి అనుకుందా. ఈ 90వ మూలకాలకి ఒక నిర్దిష్టమైన ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ సంఖ్య ఉందనుకుందాం. ఈ మూలకాలన్ని వాటికున్న నిర్ధిష్ట పరమాణు సంఖ్యవల్లనే ప్రత్యేక ధర్మాలు కల్గిఉన్నాయని విజ్ఞానశాస్త్రం చెబుతుంది. అలాంటప్పుడు ఈ 90 పరమాణు సంఖ్యగల మూలకాల్లో ఒక సంఖ్యను తొలగిస్తే 89వ మూలక ధర్మాలు ఈ పదార్థానికి వస్తాయికదా! అంటే ఒక మూలకము పరమాణు సంఖ్యను ఏ పదార్థంలో తేలగలిగితే అది బంగారం కావడానికి అవకాశం ఉంది. అదే దృష్టితో ఇవాళ శాస్తవ్రేత్తలు ఈ విషయాన్ని ఆలోచిస్తున్నారు.

సూర్య విద్య:

అలాగే సూర్య సిద్ధాంతం ప్రకారం దాదాపు 150కి పైగా ఉన్న సూర్యకిరణాలను ఒక క్రమపద్ధతిలో పంపి ఒక పదార్థాన్ని ఇంకో పదార్థంగా మార్చే విద్య ‘సూర్యవిద్య’. ఈ సూర్యవిద్యలో రావణుడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు నిష్ణాతులు. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగాడు విశ్వామిత్రుడు. ‘సూర్యునినుండి విడివడ్డదే భూమి’అనే థయరీ మనం చెబుతున్నాం. 
సూర్యతత్వాన్ని ఆపోసన పట్టినవాడు అగస్త్యుడు.
డళ్ఘూష్ద జశ ఒళషూళఆ నిశజూజ్ఘ’ఱక -్ఘ ఱ్ఘూశఆ్యశ తన పరిశోధనలో భాగంగా కాశీలో ఒక మహాత్ముణ్ణి కలుసుకొన్నప్పుడు ఆయన బ్రంటన్‌కు ఎన్నో మహిమలు చూపాడు. ఇసుకను-వజ్రాలుగా మార్చడం, చనిపోయిన పిచ్చుకను బ్రతికించడం, తన జేబురుమాల్లో వారి దేశంలో అరుదుగా పూసే పుష్పపు వాసన గుబాళింపజేయడం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఈ పుస్తకం 20కి పైగా ముద్రణలు పొందింది. అంతవరకు ఈ జేబురుమాలు వాసన ఉన్నట్లు తెలియజేయడం జరిగింది.

* సైన్సు ప్రకారం ఇప్పటివరకు బంగారం తయారుచేయలేదు కాబట్టి ఇకముందు తయారుచేయలేం అనడం నిజం కాదు. ఎందుకంటే ‘సైన్సు ఏమి జడ పదార్థం కాదు అన్న విషయం మరవొద్దు’- న్యూటన్ సమయంలో ఒక సిద్ధాంతం ఉంటే, అది ఐన్‌స్టీన్ కాలంలో ఇంకో సిద్ధాంతంగా మారింది. ఇప్పుడు ఐన్‌స్టీన్‌ను కూడా దాటి పరుగెత్తుతోంది. కాబట్టి ఈ విషయంపై ఇంకా పరిశోధనలు కొనసాగించాల్సి ఉంది.

* మహాభారతంలో ‘అక్షయపాత్ర’ను ధర్మరాజు సూర్యోపాసన ద్వారానే పొందాడు.

* అలాగే శ్రీకృష్ణుడిక లభించిన ‘శమంతకమణి’ కూడా సూర్యవిద్యకు సంబంధించినదే.

* ఆధునికకాలంలో ప్రపంచం మొత్తం ప్రాచుర్యం పొందిన ‘ఒక యోగి ఆత్మకథ’ రచించిన పరమహంస అనుభవాల్లో వస్తువులను స్పృశించి మాయంచేసే ‘్ఫకీరు’ గురించిన సందర్భాన్ని చూడవచ్చు.

* పుస్తకరచయిత స్వామిరామ హిమాలయ యోగులూ ‘అక్షయ పాత్ర’ను పొందినట్లు తెలుస్తుంది. కాబట్టి వస్తువులను సృష్టించడం, బంగారం తయారుచేయడం వంటి విద్యలు ఈ దేశంలో చాలామంది చేసేవారు ఉన్నారు. వారిని గురించి పరిశోధించే వారే లేరు, ఈ పరిశోధనల మీద ఆసక్తి చూపించకపోవడంతో నష్టపోయేది మనమే.

- ఇంకావుంది...

********************************************************
✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి