– హిందూ ఉగ్రవాదం గురించి నేనెప్పుడు మాట్లాడాను ? సంఘ్‌ పరివార్‌ ఉగ్రవాదానికి పాల్పడుతుందనే చెప్పాను.
– కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌
– మీ అధ్యక్షుని బాటలో నడుస్తున్నావా డిగ్గీరాజా ! రెండు రాష్ట్రాల ఇన్‌చార్జ్‌షిప్‌ ఊడగొట్టేసరికి పంథా మార్చావా ?
– దేవుడి దయతో మల్లన్న సాగర్‌పై తొలగిపోయిన స్టే. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్న కాంగ్రెస్‌.
– మంత్రి హరీశ్‌రావు
– వారు పీకేసిన ప్రతి ఈకను అందుకొని మీరు ‘నెమలి పింఛం’గా తయారు చేసుకుంటారు. ఇంకేంటి అన్నా !
– పాలనా వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం ఉండదు. సంకీర్ణ ధర్మానికి ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలుగనీయను.
– కర్ణాటక సిఎం కుమారస్వామి
– 108 సీట్లున్న భాజపా, 78 సీట్లున్న కాంగ్రెసు నోరు తెరిచి చూస్తుంటే 38 సీట్లున్న నీవు అధికార పీఠం ఎక్కావు. ఇంకేం తక్కువ! ‘రొట్టె వాడి కన్నా ముక్క వాడే గొప్ప’ అన్న సామెత నిజమైంది కదా !
– మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం. వచ్చే సంవత్సరం జూన్‌ నాటికి అధికారం మాదే.
– టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
– డెభ్బైఏళ్ళ నుండి ఒకటే పాట. అయినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే. గొంగళిది తప్పా! దానిని వేసిన వాడిది తప్పా!
– రంజాన్‌ సందర్భంగా కాల్పుల విరమణ నిర్ణయం ఘోర తప్పిదం.
– భాజపా ఎమ్మెల్యే సురేంద్రసింగ్‌
– శాంతిదూత నిర్ణయానికి తుపాకీ మోతల సందేశాలు !?
– 72 గంటల్లోపు నా కుమారుణ్ణి చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. లేదా నేనే ఆపని చేస్తా.
– ప్రభుత్వానికి వీరజవాన్‌ ఔరంగజేబు తండ్రి విజ్ఞప్తి
– మరో సర్జికల్‌ స్ట్రెక్‌ జరపాల్సిందే !
– ఉత్తర కర్ణాటక ప్రాంతానికి ప్రాధాన్యం దక్కడం లేదు. సిఎం సహా అన్ని కీలక పదవులు దక్షిణ కర్ణాట వారే స్వంతం చేసుకుంటున్నారు.
– కాంగ్రెసు సీనియర్‌ నేత యం.బి.పాటిల్‌
– ‘సిద్ధరామయ్య విభజన వాదం’ ఇప్పుడు తెలిసొచ్చిందా!
– చాముండేశ్వరి నియోజకవర్గ ప్రజలు నన్ను మోసం చేసారు. అక్కడి ఓటమి నన్ను బాధించింది.
– మాజీ సిఎం సిద్ధరామయ్య
– అబ్బ ఛా.. !
– అధికారం కోసం బిజెపి గవర్నర్‌ను వాడుకొంటోంది.
– టిడిపి నేతలు
– మొన్నటివరకు గవర్నర్‌ మీకు పితృ సమానుడు. మీరు బిజెపితో విడిపోగానే ఆయన బిజెపి ఏజెంట్‌ అయ్యాడా ?! ఏం సెప్పారండీ !?
– ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును మేము అడ్డుకొన్నాం. ముస్లింలకు రక్షణగా మేం ఉంటాం. కేంద్రంపై యుద్ధం చేస్తాం.
– ఎపి సిఎం చంద్రబాబు
– ఓట్లకోసం ఇంతగా కూడా దిగజారతారా!

************************************************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట  విశ్లేషణ : జాగృతి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి