ఆలయంలో ప్రధాన పూజారి కృష్ణుడికి పూజ చేస్తూ ఉన్నాడు. అక్కడికి మీరాబాయి వచ్చింది. ఆమెను చూసి పూజారి తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. పట్టలేనంత ఆవేశం అతనిలో కలిగింది. ఆగ్రహంతో ‘‘మీరా! నీవు వెంటనే ఇక్కడినుంచి వెళ్లిపో, ఇక్కడి ఆలయంలోకి ఏ స్ర్తికి అనుమతి లేదని నీకు తెలియదా!’’ అన్నాడు.
మీరా నవ్వుతూ, ‘నాకు తెలిసినంతవరకు శ్రీకృష్ణుడు తప్ప అందరూ స్ర్తిలే; ముప్పై ఏళ్లపాటు శ్రీకృష్ణుని ఆరాధించి కూడా నువ్వు ఇంకా పురుషుడని అనుకుంటున్నావా?’’ అన్నది. ఈ మాటలు విన్న అర్చకుడు నిశే్చష్టుడయ్యాడు. వెంటనే మీరాబాయి పాదాల చెంత వాలిపోయి, ‘‘ఇప్పటివరకు ఈ విషయం ఎవరూ చెప్పలేదు’’ అన్నాడు. ‘‘అత్యున్నత స్థాయిలో నువ్వు ప్రేమ మార్గాన్ని లేదా ధ్యాన మార్గం అనుసరిస్తే నువ్వు స్ర్తిత్వంగా పరిణమిస్తావు’’ అన్నది. అతని మనస్సు సున్నితంగా మారిపోయి పరిపూర్ణ కృష్ణ్భక్తుడయ్యాడు.
భారతీయ స్ర్తికి మీరాబాయి ఒక ప్రతీక మాత్రమే. అలాంటి నారీమణులు భారతీయ చరిత్ర నిండా మనకు కన్పిస్తారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన భారత్-అమెరికా ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు (జిఈఎస్) ‘విమన్ ఫస్ట్ ప్రాస్పెటరీ ఫర్ ఆల్’కు అనుగుణంగా జరిగింది. దానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ‘్భరతీయ మహిళ’ను మరోసారి గుర్తుచేశారు. మోదీ ఝాన్సీ లక్ష్మీబాయిని గుర్తుచేయగా, ఇవాంకా ‘‘ఈ సదస్సుకు హాజరైన 1500మంది వ్యాపారవేత్తల్లో మెజారిటీ.. అనగా 52.5 శాతం మహిళలే కావడం నాకు సంతోషంగా ఉందని, పురుషాధిక్య పరిశ్రమలో నేను ఓ వాణిజ్యవేత్తగా, ఉద్యోగినిగా, అధికారిగా పనిచేశాను. అప్పుడు చాలా దగ్గరకు చూశాను, మహిళలు తమను తాము నిరూపించుకోవడానికి ఎక్కువ కష్టపడ్డారని’’ అన్నది.
అంటే పాశ్చాత్య ప్రపంచంలో కూడా పురుషాధిక్య సమాజం ఉందనే ఆమె ఒప్పుకొంది. కానీ భారతీయులు మాత్రం స్ర్తిని తల్లిగా, చెల్లిగా, చెలిగా, నెచ్చెలిగా ఎప్పుడూ గౌరవిస్తూనే వస్తున్నారు. ఎక్కడ స్ర్తిలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నాట్యం చేస్తారన్న సూక్తిని ఆచరణాత్మకంగా మన సమాజం చూపింది. అందుకు ప్రతీకగానే బ్రహ్మ సరస్వతిని నాలుకపై ఉంచుకోవడం, విష్ణువు లక్ష్మీదేవిని వక్షస్థలంలో పెట్టుకోవడం, శివుడు పార్వతికి తన శరీరంలో అర్ధ్భాగం ఇవ్వడాన్ని చెప్పుకోవచ్చు. ఏకంగా శాక్తేయం పేరుతో స్ర్తితత్వాన్ని ఉపాసించే ఓ సంప్రదాయమే ఉండడం భారతీయుల గొప్పతనం! విద్యను సరస్వతిగా, ఆర్థిక శాస్త్రాన్ని లక్ష్మీదేవిగా, యాంత్రిక విజ్ఞానాన్ని పార్వతీమాతగా మనం ఆరాధిస్తాం. వ్యాపారి లక్ష్మీదేవిని ఆరాధిస్తాడంటే అది ధనారాధనే! అది దురాశగా మారడం మన దురదృష్టం!?
మొట్టమొదట యోగవిద్యను హిరణ్యగర్భుడనే బ్రహ్మ యాజ్ఞవల్క్య మహర్షికి చెప్పగా, ఆ మహర్షి తన భార్య గార్గేయికి ఉపదేశించాడు. ఆమె ద్వారా లోకంలో ‘హిరణ్యగర్భయోగం’ వ్యాప్తి చెందింది. అలాగే హఠయోగాన్ని శివుడు పార్వతి ద్వారానే లోకానికి అందించాడు. స్ర్తిల ద్వారానే యోగవిద్య భూమిపైకి వచ్చింది. వేదాల్లో అనేకమంది స్ర్తిలు మంత్రద్రష్టలుగా ఉన్నారు. వారిని వేదం ఋషికలనీ, బ్రహ్మవాదినులనీ పేర్కొంది. విశ్వావారేత్రేరుూ, ఆంగీరసీ శశ్వతి, ఘోష, వసుక్రపత్ని, రోమశ, గోధా, నైతోమిశచి, సావిత్రా సూర్య, మైత్రేయి, అపాల, అనసూయ వంటి ఋషికలు ద్రష్టలుగా ఉన్నారు. పాకయజ్ఞం అనే పేరుగల యజ్ఞంలో యజమానపత్నులే మంత్రాలు చదువుతూ చేయాల్సిన యజ్ఞక్రియలను నిర్వహిస్తారు.
ఎన్నో తీర్థస్థలాలు మన దేశంలో స్ర్తి దేవతల పేరున ఏర్పడ్డాయి. అరుంధతీదేవి, శ్రుతావతీ అనే స్ర్తిలు గొప్ప తపస్సు చేసి తీర్థక్షేత్రాల నిర్మాణానికి తోడ్పడ్డట్లు మహాభారతం తెలిపింది. ఒక్కొక్క తీర్థస్థానం ఏర్పడడానికి అక్కడ తపస్సు చేసి వాంఛితార్థాలు పొందిన స్ర్తిల గాథలు చదివితే అర్థమవుతుంది. స్కాంద పురాణం అలాంటి ఎందరో స్ర్తిమూర్తులను గురించి చెప్పింది. మహాజ్ఞాని మదాలసను గురించి మార్కండేయ పురాణం తెలిపింది. ఇక రామాయణంలో సీత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దుర్మదాంధుడైన రావణబ్రహ్మ వైపు కనె్నత్తి కూడా చూడకుండా గడ్డిపరకతో మాట్లాడి రావణుని పొగరు దించిన మహాసాధ్వి. అందుకే పంచకన్యలను ప్రతిరోజూ స్మరించాలని శాస్త్ర నిర్దేశం. సీత, ద్రౌపది, అహల్య, మండోదరి, తార- అనే పంచ స్ర్తిమూర్తుల్లో సీత అగ్రగణ్యురాలు. ఆమె వ్యక్తిత్వం, కుటుంబపాలన, వాత్సల్యం, ఓర్పు ఈనాటి భారతీయ స్ర్తిలకు ఆదర్శంగా నిలిచాయి.
భారతంలో ద్రౌపది, సత్యభామల పాత్ర అమోఘం. ధర్మరాజు జూదంలో ఓడిపోయి నిశే్చష్టుడు కాగా, ‘నన్నోడి తన్నోడెనా! తన్నోడి నన్నోడెనా’ అని ఆమె వేసిన ప్రశ్న కురువృద్ధులందరిని తికమక పెట్టింది. ఈ రోజు వరకు ఆ ప్రశ్నకు సమాధానం లేదనే చెప్తారు. నరకుణ్ణి చంపడానికి వెళ్లిన సత్యభామ శ్రీకృష్ణుల కథలో సత్యభామదే అగ్రస్థానం. ఈ కథ ఆమె ధైర్యాన్ని మిగతా ఘట్టాలు ఆమె గడుసుదనాన్ని ఈనాటి స్ర్తిలకు తెలియజేస్తాయి.
భారతదేశంలో భూమిని, నదిని, విద్యను, ధనాన్ని, శక్తిని అన్నింటిని స్ర్తిదేవతలుగా అర్చిస్తారు. ఆఖరుకు గ్రామ దేవతలంతా స్ర్తిమూర్తులే. పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఈదమ్మ, ఎల్లమ్మలు దేవతలుగా, పండుగను కూడా ‘బతుకమ్మ’గా ఆరాధించే సంస్కృతి మనది. బసవేశ్వరుని కాలంలో అక్కమహాదేవి, గంగాంబిక, హేమారెడ్డి, మల్లమ్మ అనుభవ మంటపంలో ప్రసంగించిన మహిళలు.
వేద, పురాణ కాలంలోని స్ర్తిలేగాక ఆధునిక భారతదేశంలోని స్ర్తిలు కూడా సామాన్యులుకారు. క్రీ.శ.1857లో మొదటి తిరుగుబాటులో బ్రిటీషువారికి ఎదురుతిరిగిన ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, రాణీ చెన్నమ్మ, రుద్రమదేవి వంటి ధైర్యశాలులైన స్ర్తిలు కావచ్చు ఈనాటికీ ఆదర్శమూర్తులే! యుద్ధంలో మాత్రమే కాకుండా ధ్యానంలో కూడా భారతీయ స్ర్తిలు గొప్పవారే. శ్రీరామకృష్ణుని దేహత్యాగం తర్వాత ఆయన శిష్యులను కన్నతల్లిలా కాపాడిన శారదామాత, ఆధునిక స్ర్తిమూర్తుల్లో పేర్కొనదగిన మహిళామణి. ‘ఆమె లేకపోతే వివేకానందుడు పరిపూర్ణంగా తీర్చిదిద్దబడేవాడు కాడు’ అంటారు ఓ తత్త్వవేత్త. అలాగే భారతీయ తాత్విక చింతనకు ఆకర్షింపబడి ఈ మట్టిలో తమ జీవితం వెళ్లబుచ్చిన సిస్టర్ నివేదిత, మేడం బ్లావట్స్కీ శరీరాలు పాశ్చాత్య దేశాల్లో పుట్టాయి కానీ వారు ఆత్మపరంగా భారతీయులే. అరవిందు పూర్ణయోగాన్ని లోకానికి అందించినవారు శ్రీమాత కూడా అగ్రశ్రేణి భారతీయ మహిళనే. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా తన ప్రేమతో ఆధ్యాత్మిక సేవలందిస్తున్న మాతా అమృతానందమయి భారతీయతకు నిలువెత్తు నిదర్శనం. జైన, బౌద్ధాల్లో ఎందరో గొప్ప స్ర్తిలు మనకు కన్పిస్తారు. భారతదేశపు శక్తిని ప్రపంచానికి చాటిన ప్రతి భారతీయుని తల్లి ఈ దేశంలోని ఓ మాతృమూర్తే. స్వాతంత్య్ర పోరాటంలో అనిబిసెంట్, సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్‌ముఖ్, సుచేత కృపలానీ వంటి వారి పేర్లు మాత్రమే మనకు తెలుసు. కానీ ఎందరు మహిళామణుల పేర్లు కూడా దేశ ప్రజలకు తెలియకుండా తాము ప్రాణాత్యాగాలు చేశారో! స్వతంత్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్‌లో ‘కెప్టెన్ లక్ష్మి’ నాయకత్వంలో మహిళా రెజిమెంట్ సుభాష్ ఏర్పరచారు. ఆధునిక భారతదేశంలో స్ర్తి విద్యకు బీజావాపనం చేసిన సావిత్రీ బాయి పూలే మన స్ర్తిమూర్తుల్లో ఆరాధ్యురాలు.
నైజాం స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ధీరవనిత చాకలి ఐలమ్మ, స్వాతంత్య్ర పోరాటంలో ముందున్న ఉన్నవ లక్ష్మీబాయమ్మ, కనపర్తి వరలక్ష్మమ్మ, దళితులకోసం పోరాటం చేసిన సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, జాతీయ భావాలందించిన సదాలక్ష్మి మన ప్రాంతంలో సేవలందించిన మహిళామూర్తులు.
పాకిస్తాన్ దురాగతాలకు అడ్డుకట్ట వేయడానికి ధైర్యంగా పాకిస్తాన్‌తో యుద్ధం చేసి ఆ దేశాన్ని రెండు ముక్కలు చేసి తన శక్తిని నిరూపించుకొంది ఇందిర. భారతదేశానికి వనె్నతెచ్చే బ్యాంకుల జాతీయం, దళితుల అభివృద్ధితో, విదేశీ నీతిలో అసమాన ప్రతిభ ప్రదర్శించి నాటి ప్రతిపక్ష నాయకుడైన అటల్ బిహారీ వాజ్‌పేయితో ‘అపరకాళి’గా అభివర్ణించబడిన స్ర్తిమూర్తి ఆమె.
చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి తన ప్రసంగాలతో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా మన్నన పొందుతున్న సుష్మాస్వరాజ్ భారతమాత మెడలోని దండలో అరుదైన పుష్పమే.
క్రీడల్లో, సినిమాల్లో, రాజకీయాల్లో సేవలందిస్తున్న లెక్కకు మిక్కిలి మహిళలంతా అద్భుత ప్రతిభగలవాళ్లే. భారతీయ స్ర్తి జీవితంలో రాజకీయం, ఆర్థిక సమానత్వం, స్వేచ్ఛ, క్రమశిక్షణ, త్యాగబుద్ధి, నిస్వార్థం కలగలిపి ఉంటాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలినా భారతీయ స్ర్తిల దగ్గరున్న బంగారం మొదలైన స్ర్తిధనం మన దేశాన్ని రక్షించడం ఖాయం అన్న ఓ ఆర్థికవేత్త మాటలు అక్షరసత్యాలు. స్ర్తిలే భారతదేశపు ఆర్థిక పుష్టికి ఉత్పత్తి సాధనాలు.
స్ర్తిలమీదనే ఆధారపడి మన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. పెద్ద ఆర్థికవేత్త దేశాన్ని పురోగతి వైపు నడిపితే భారతీయ మహిళ కుటుంబ ఆర్థిక మంత్రిగా ఇంటిని చక్కబెడుతుంది. అలాంటి స్ర్తిమూర్తులపై వికృత మనస్తత్వాల ఆగడాలు అనునిత్యం జరుగుతున్నా ఆమె సర్వస్వాన్ని ఈ దేశానికి అర్పించింది. అలాంటి స్ర్తిమూర్తులున్న ఈ దేశంలో ఎలాంటి అక్షరాస్యత లేకుండానే ఇంట్లో క్రమశిక్షణగా బాధ్యతలను నిర్వర్తించే తల్లులున్నారు. వారే భారత ప్రగతికి దోహదపడేవారు. ఈ రోజు బుట్టలల్లేవారు, బట్టలుతికేవారు మొదలుకొని భారత పార్లమెంట్‌కు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న సుమిత్రా మహాజన్వరకు అందరికీ మనం దాసోహం చేయాల్సిందే.
ఉపనిషత్తుల్లో ఆశీర్వాదం కోసం ఓ జంట ద్రష్ట వద్దకు వస్తారు. ఆయన ఆశీర్వదిస్తూ నువ్వు పదిమంది పిల్లల తల్లివి అవుతావు, చివరికి నీ భర్త నీ పదకొండవ పిల్లవాడవుతాడని నేను ఆశిస్తా. నువు నీ భర్తకు తల్లివి కానంతవరకు నీవు భార్యగా విజయం పొందలేవు అని వింత ఆశీర్వాదం ఇచ్చాడు. ఇందులో భారతీయుల అపారమైన మానసిక అంతర్ దృష్టి వుంది. నవీన మానసిక శాస్త్రం ప్రకారం ప్రతి పురుషుడు స్ర్తిలో తన తల్లిని చూస్తాడు అన్నదే భారతీయ దర్శనం ఏనాడో చెప్పింది. దానికొరకే- భారతీయులు స్ర్తి పురుషులకు అర్ధనారీశ్వర వ్రతం చెప్తూనే స్ర్తిని ముందు చెప్పారు. సరస్వతీదేవి నుండి చాకలి ఐలమ్మవరకు భారతీయ స్ర్తిల ప్రతిభా పాటవాలు మనకున్నవే! ఈ రోజుకూ ఏ ఇంటి గడప తొక్కినా ప్రతి స్ర్తిలో ఓ ఆర్థికవేత్త.. ఓ మేనేజర్.. ఓ క్రమశిక్షణ గల అధికారి.. ఓ త్యాగమూర్తి.. ఓ పోషకురాలు.. అందరూ ఏకకాలంలో దర్శనమిస్తారు! ఆమె త్యాగానికి.. అనురాగానికి మారుపేరు..! అలాంటి భారతీయ స్ర్తికి శతకోటి వందనాలు!!

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125
Published Andhrabhoomi, 1 December 2017
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి