Description

             మాన్యశ్రీ పి. భాస్కరయోగి 1977 లో మహబుబ్ నగర్ జిల్లా పోతిరెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. వారి స్వగ్రామం బుద్ధసముద్రం. చిన్నతనం నుండి ఆధ్యాత్మికసంస్కారం కలిగిన ఈయన, కళాశాల చదివే రోజుల్లో ప్రముఖతాళపత్ర పరిశోధకులు శ్రీరుష్యశివయోగి గారివద్ద (1996లో) 'యోగదీక్ష' స్వీకరించారు. వారిద్వారానే మాన్యులు గోరంట్ల పుల్లయ్య  గారితో పరిచయమేర్పడింది. ఆ తర్వాత హైద్రాబాదులోనే స్థిరపడ్డారు. ఎన్నో గ్రంధాలను పరిశోధించారు. వివిధ ఆధ్యాత్మిక పత్రికల్లో, దినపత్రికల్లో దాదాపు 200 పైగా సాహిత్య, ధార్మిక వ్యాసాలు ప్రకటించారు.
             ఈ యోగి కేవలం రచనా వ్యాసంగమే కాకుండా ఆధ్యాత్మిక చర్చలు, ఉపన్యాసాలు చేయడంలో కూడా విశేషకృషి చేస్తున్నారు. ఎన్నో ఆధ్యాత్మిక సభల్లో అనేకాంశాలపై వందలకొద్ది ప్రసంగాలు చేసారు. పత్రాలను సమర్పించారు. అదే విధంగా ఈయనకు మహాత్ములన్నా, పండితులన్నా, పుస్తకాలన్నా ఎంతో ఇష్టం. అందుకే చిన్నవయస్సులో ఎన్నో గ్రంధాలను చదివారు. ఎందరో మహాత్ములను దర్శించారు. ప్రస్తుతం పాలమూరుజిల్లా సంకీర్తనసాహిత్యంపై పరిశోధన చేస్తున్నారు.
            మనధర్మం పట్ల ఆసక్తిని, అనురక్తిని కలిగించడానికి ధార్మికులైన వారి మనస్సులోని సందేహాలను 'ధర్మజిజ్ఞాస' రూపంలో మనకు అందిస్తున్నారు. అద్భుతమైన వివరణలతో, పఠనీయతో కూడిన ఈ గ్రంధాన్ని తెలుగు ప్రజలు చక్కగా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం. 
            మహాభారతం సపాదలక్షగ్రంధంకాగా ఈనాడు పాఠకులకు ఒక్కొక్కదానిపై సవాలక్షసందేహలున్నవి. వాటిని తీర్చడానికి ఈనాడు ధార్మికపత్రికలు ఈ ప్రజావేదికను పెట్టి ఎందరో పాఠకుల సందేహాలను శాస్త్రీయమైన సమాధానాలు పండితులచేత యిప్పిస్తున్నవి. ఈ భాస్కరయోగిగారు పాఠకుల సందేహాలను తీర్చడానికి 'ధర్మజిజ్ఞాస' నందిస్తున్నాడు.
- పి. భాస్కరయోగి

Features

  • : Dharma Jignasa
  • : T Bhaskara Yogi
  • : Jatheya Sahitya Parishath
  • : NAVOPH0177
  • : Paperback
  • : 252
  • : Telugu


1 కామెంట్‌:

  1. ఈ తరానికి దొరికిన ఒక అద్భుత చుక్కాని భాస్కర యోగులు.. బహుముఖ ప్రజ్ఞాశాలి, ఇంత పరిశోధనను కొనసాగించటం మానవ మాత్రుల వల్ల అయ్యే పని కాదు.. దైవ అనుగ్రహం ఉండటం వల్లనే భస్కరులు భాసిల్లుతున్న రు

    కృష్ణా రెడ్డి

    రిప్లయితొలగించండి