-కవులకు పుట్టినిల్లు తాండూరు
-జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత సంఘటన
-కార్యదర్శి భాస్కర యోగి
తాండూరు టౌన్ : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సాహితీ సమితి తాండూరు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పట్టణంలోని సిద్ధార్థకళాశాలో నిర్వహించిన కవి సమ్మేళనం ఎంతోగాను ఆకట్టుకుంది. కార్యక్రమంలో ముఖ్యవక్తగా పాల్గొన్న జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత సంఘటన కార్యదర్శి పి.భాస్కరయోగి మాట్లాడుతూ కవులకు తాండూరు పుట్టినిల్లని అన్నారు. తాండూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో ఎందరో కవులు ఉండడం తాండూరు అదృష్టమన్నారు. ఇంకా యువకులు సాహిత్యంపై పట్టుసాధించాలని సూచించారు. హిందూ పండుగలన్నింటిలో సాంప్రదాయంతో పాటు శరీరానికి అవసరమయ్యె శక్తినిచ్చే ఔషధగుణాలున్నాయన్నారు. ఈ సందర్భంగా సద్దిలింగయ్య పంతులు తయారు చేసిన దుర్ముఖినామ సంవత్సరం పంచాంగాన్ని ఆవిష్కరించిన అనంతరం పంచాంగ శ్రవణం పఠించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, ఫ్లోర్‌లీడర్ సునీతా సంపత్, సాహితీ సమితి అధ్యక్షుడు నరేందర్, కార్యదర్సి నరహరిరెడ్డి, సాహితీ బంధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

4/9/2016 1:06:49 AM RANGAREDDY NEWS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి