– రాజ్యసభ ఎన్నికల్లో గుడ్డిగా అభ్యర్థిని పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళకు సోయి లేదా ?
– సిఎం కెసిఆర్
– వాళ్ళకు సోయి లేదుకాబట్టే మిమ్మల్ని గుడ్డిగా నమ్మారు. లేకపోతే..!?
ం తెలంగాణ భాజపా టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడంలో విఫలమైంది. కార్యకర్తలతో మాట్లాడి త్వరలోనే ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటా.
– మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి
– ఇక్కడి భాజపా పెద్దగా చింతించడం లేదు.
– ఎప్పటి నుంచో సిక్కులకు ఐఎస్‌ఐ శిక్షణ ఇచ్చి ఉగ్రవాదులుగా భారత్‌లోకి ఎగదోస్తున్నది.
– పంజాబ్ సిఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్
– ధైర్యంగా ఎదుర్కోండి కెప్టెన్ గారూ !
– దొంగ, నేరస్థుడు ప్రధానిని ఎలా కలుస్తారు ? భాజపా చెప్పేవన్నీ అబద్ధాలు.
– సిఎం చంద్రబాబు
– దొంగనోట్ల శేఖర్‌రెడ్డి గురించి మాట్లాడితే మీరెందుకండీ దూరతారు ?!
– ఇచ్చిన వాటికి ముందు లెక్క చెప్పండి. మేం ఎంతో చేశాం. తేదేపా కావాలనే ఎన్‌డిఎ నుండి బయటకు వెళ్ళి భాజపాను బద్నాం చేస్తోంది.
– భాజపా అధ్యక్షుడు అమిత్‌షా
– షా గారూ! దయచేసి సీరియస్‌గా ఆపరేషన్ మొదలుపెట్టండి. ఇతరులను అపఖ్యాతిపాలు చేయడంలో చంద్రబాబు దిట్ట.
– స్పీకర్ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు.
– పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి
– గతంలో మీ ప్రభుత్వం ఉన్నపుడు పనిచేసిన స్పీకర్ సురేశ్‌రెడ్డిలా ఉన్నాడని బాధపడుతున్నారా !?
– ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనని సినిమావాళ్ళు దుర్మార్గులు.
– ఎమ్మెల్సి రాజేంద్రప్రసాద్
– దాని గురించి పోసాని కృష్ణమురళిని అడిగితే అద్భుతంగా చెప్తాడు.
– మా కులాలకు కెసిఆర్ దేవుడు.
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
– అందుకే ఎప్పటి నుండో క్షీరాభిషేకాలు జరుగుతున్నాయ్ కదా !
– తప్పులు చేశాం. వెరీ సారీ.
– ఫేస్‌బుక్ సిఇఒ మార్క్స్ జుకర్‌బర్గ్
– ఫేస్ ‘బుక్కు’ అంటేనే ‘తప్పులు చేయడం – దిద్దుకోవడం’.
– ప్రాంతీయ పార్టీల మధ్య వైరుధ్యాలున్నాయి. అందర్నీ కూడగట్టి నిలబెట్టడం సాధ్యం కాదు. కెసిఆర్ ఫ్రంట్ కూడా విఫలమే.
– సిపిఎం నాయకుడు ప్రకాశ్‌కారత్
– ఈ ఫ్రంట్‌లన్నింటికీ ముందుగా టెంట్ వేసేది మీరేగా !
– భాజపా పతనం ప్రారంభమైంది.
– సిపిఎం నేత రాఘవ
– అదే ! మొన్న త్రిపురలో లాగానా !
************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి