‘పిచ్చి కుదిరింది, తలకు రోకలి చుట్టమన్నాట్ట’ వెనుకటికొకడు. సమాజంలో కులోద్రేకాలు రేకెత్తించడానికి ఓ అనామకుడు పథకం ప్రకారం వాచాలత్వం ప్రదర్శిస్తే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్న పాలనవారు దోషికీ, సాక్షికీ ఒకే శిక్ష వేయడం ఎలా సబబు?
తన స్వంత పాపులారిటీతో ప్రసార మాధ్యమాలను, సామాజిక మాధ్యమాలను వాడుకొంటున్న ఇలాంటి విషపు ఎత్తులను మొలవకుండా ఆపడానికీ దెబ్బకొట్టించుకొన్న వాడికీ బహిష్కరణ శిక్ష వేయడం ఏ నాగరిక చట్టంలో ఉంది?
ఈ దేశంలో హిందువులను, వారి సంస్కృతిని ఎంత దూషిస్తే అంత ప్రచారం పొందొచ్చన్న కుత్సితం నేర్పిస్తున్న ప్రసార మాధ్యమాల దిక్కుమాలిన చర్య భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందా?
ఏమీ తెలియని వాళ్లు మతిలేకుండా తలాతోకా లేకుండా ఏదో మాట్లాడితే తెంపరితనంతో ప్రసారం చేయడం ఏ రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యం!
భారతదేశ దీనస్థితి చూస్తుంటే అధిక సంఖ్యాకులైన హిందువులకు ఈ దేశంలో స్వాతంత్య్రం వచ్చిందా? అనే అనుమానం లుగుతున్నది.
ఎవరికి తోచినంత పేడ వారు హిందుత్వంపై చల్లుతుండడం, దానికి ప్రజాస్వామ్యమనే ముసుగేయడం తెంపరితనం కాక ఇంకేమిటి?
*********************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట : విశ్లేషణ : జాగృతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి