– నన్ను ‘పప్పూ’ అని పిలవండి. కానీ నన్ను గుర్తించండి.
– కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
– పప్పో, ఉప్పోగానీ మీరు ఏంచేసినా మీవాళ్ళు తెగ సంబరపడిపోతున్నారు. ఇక సూడో సెక్యులర్‌ లిబరల్‌ గ్యాంగ్‌ అయితే మీరు కన్నుకొట్టడం చూసి మహా మురిసిపోతున్నారు.
– సైన్యాన్ని అవమానించవద్దు. మేం పనిచేసుకొనేవాళ్ళం. వంశాలపేర్లు చెప్పుకొనేవాళ్ళ కళ్ళలోకి చూడలేం.
– నరేంద్రమోదీ, ప్రధాని
– మోదీగారు అంతలా మోదితే ఎలా? ఇప్పటికే రాహుల్‌ గిజగిజ లాడిపోతున్నాడు !
– మాట తప్పినవాడు మనిషే కాడు. ఏపికి ఇచ్చిన మాట తప్పారు.
– ఎంపి గల్లా జయదేవ్‌
– మీ అధినేత చెపుతున్న అబద్ధాలు మీకూ ఎక్కినట్లున్నాయి.
– త్వరలో స్వరాజ్య ఉద్యమం.
– జయప్రకాశ్‌ నారాయణ, లోక్‌సత్తా
– సురాజ్య ఉద్యమం అయిపోయిందా ?
– తప్పుల్లేకుండా రాహుల్‌ 15 ని||లు మాట్లాడితే భూమి కంపిస్తుంది.
– బిజెపి ఎంపి పరేశ్‌ రావల్‌
– వేరే దేశంలో వచ్చిన భూకంపానికి కారణం అదే అంటున్నారు.
– రాహుల్‌ వ్యాఖ్యలు అబద్ధం.
– ఫ్రాన్స్‌ అధికారవర్గాలు
– పట్టింది పరక (చేప) అంటే చూసినవాడు జల్ల (చేప) అన్నాడట.
– మోదీ అహంకారంతో మాట్లాడాడు. ఏపీకి అన్యాయం చేసాడు.
– తెదేపా వర్గాలు
– ఒక వేలుతో ఎదుటివారి తప్పును చూపించాలని భావిస్తే, మరో మూడు వేళ్ళు మన తప్పులను చూపిస్తాయి. అది మరువకండి.
– అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం.
– రాహుల్‌ గాంధీ
– అంటే అది రాదన్నమాట. కాంగ్రెస్‌పై ప్రజలకు అంత నమ్మకం.
– కృష్ణుడి కన్నా కరుణానిధే గొప్ప
– కేంద్రమంత్రి
– ఎందుకంటే ! కృష్ణుడి మనుమలు స్కాములు చేయలేదు కదా!
– కాంగ్రెసు నేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలి
– ఎఐసిసి కార్యదర్శి బోసురాజు
– అంటే ఇప్పటివరకు లేరా ఏంటి ?
– ఓటర్లతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.
– టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
– ఎలాగో మీరే చెప్పండి!
– తల్లి విదేశీయురాలు. రాహుల్‌ ప్రధాని కాలేరు.
– బిఎస్‌పి ఉపాధ్యక్షుడు జైప్రకాశ్‌
– పార్టీకో ప్రధాని అభ్యర్థి ! ఏం చేస్తాం ప్రకాశ్‌..!

*********************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట : విశ్లేషణ : జాగృతి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి