భారతదేశంపై మొదట దండయాత్ర చేసిన మహమ్మద్ ఖాసీం ఆ తర్వాత వచ్చిన తైమూర్, గజనీ, నాదిర్షి, పోర్చుగీసు, ఆంగ్లేయులు. ఇలా అందరూ ఈ దేశ భాషాసంస్కృతులపై దాడిచేసినవారే.
ప్రత్యేకించి ఆంగ్లేయులు నాటి భారతదేశంలోని 7 లక్షల 32వేల గురుకులాలను మూసి వేయించారు. దాంతో సంస్కృతం ఇతర దేశ భాషల ప్రాబల్యం తగ్గిపోయింది. ఆంగ్లేయులు ఈ పరంపరను అలాగే కొనసాగించారు.
స్వాతంత్య్రానికి ముందు మన దేశ రాజకీయ నాయకుల్లో ఎక్కువ మందికి ఆంగ్లంపై వ్యతిరేకత ఉండేది.
మొదటి స్వాతంత్య్రవీరులైన నానాసాహెబ్, ఝాన్సీలక్ష్మీభాయి, తాంతియాతోపే, రాణీచెన్నమ్మ- వీళ్ళంతా మాతృభాషల్ని బాగా ప్రేమించి, ఆంగ్లాన్ని, ఆంగ్ల సంస్కృతిని వ్యతిరేకించారు. ‘‘్భరతదేశ స్వాతంత్య్రం మాతృభాషతో ముడిపడి ఉంది. మన మాతృభాషతో సాధారణ ప్రజానీకానికి న్యాయం, మేలు జరుగుతుందో అదే స్వాతంత్య్రం’’ అని ఉద్ఘాటించారు.
అలాగే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ‘‘నేను మరాఠీ భాషపట్ల నిష్ఠగల వాణ్ణి అయినప్పటికీ రాష్ట్ర భాష స్థానం దేశ భాషలకుండాలని కోరుకునే వాణ్ణి. ముఖ్యంగా ‘హిందీ’అధికార భాష కావాలని కోరుకొనే వాణ్ణి’’ - అంటారు. ’‘‘హిందీనే దేశాన్ని ఐక్యంగా ఉంచగల్గుతుంది’’ అని గాంధీజీ ఎన్నోసార్లు ప్రకటించారు.
ఎక్కువ సంస్కృత శబ్దాలుగల హిందీ మాత్రమే ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచగల్గుతుందని స్వామి దయానంద సరస్వతి కూడా ఉద్ఘోషించారు. ఆ తర్వాత వారైన సమర యోధులు అరవింద యోగి, అష్ఫాకుల్లా, నేతాజీ, ఆజాద్ వంటి వీరులు హిందీనే అధికార భాషగా ఉండాలని కోరుకొన్నారు. ‘‘ఆంగ్లేయ భాష నుండి విముక్తిచేసి, దాని స్థానంలో హిందీని రాష్ట్ర భాష’’ చేయాలన కోరుకున్నారు. వీళ్లందరు ఎవ్వరు కూడా ఆంగ్లం అధికార భాష కావాలని కోరలేదు.
1947లో స్వాతంత్య్రం వచ్చింది. 1946 జూన్‌లో ‘‘దేశానికి హిందీ అధికార భాష అవుతుంది.’’అని గాంధీజీ ప్రకటించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చాక చట్టసభల్లో హిందీ మాట్లాడని వారిని జైలుకు పంపేందుకు నేను సత్యాగ్రహం చేస్తాను’’అన్నారు గాంధీజి. ‘‘అధికారం, సింహాసనం నాకు వద్దు, దేశ భాషలే అధికార భాష కావాలనడానికి నేను బలిదానానికి సిద్ధం’’’అని కూడా గాంధీజీ ప్రకటించారు.
‘‘నాకు ఒక్కరోజు అధికారం ఇస్తే దేశానికి మూడుపనులు చేయాలనుందని, అవి 1. హిందీని రాజభాషగా ప్రకటించడం, 2. సంపూర్ణ మద్యనిషేధం, 3. గోహత్య నిషేధం’’అన్నాడు గాంధీజీ. కాని అమలుకు నోచుకోలేదు.
గాంధీజీ అంత ఆదర్శంతో దేశ భాషలపట్ల మక్కువ చూపిస్తే, స్వాతంత్య్రం వచ్చాక ఆయన వారసులు ఆ ఆదర్శాలను తుంగలోతొక్కారు, తొక్కుతున్నారు. ముందునుండి ఆంగ్ల భాషను, ఆంగ్ల సంస్కృతులను అధికంగా ప్రేమించే వ్యక్తులు అధికారంలోకి వచ్చారు.
ప్రపంచంయొక్క అభివృద్ధికి ఆంగ్లమే మూలకారణం అనుకునే వ్యక్తుల వారసత్వం నేటికి కొనసాగుతూనే ఉంది. న్యాయ, పరిపాలన, శాసన, వ్యాపార, విద్యావ్యవస్థల్లో ఆంగ్ల భాషాప్రాధాన్యం నాటినుండి నేటివరకు పాలకులు అమలుచేస్తూనే ఉన్నారు.
26 జనవరి 1950నుండి రాజ్యంగం అమల్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగంలో భాషలకు సంబంధించిన 345,348 ప్రకరణల్లో ద్వంద్వ ప్రమాణాలు పాటించబడ్డాయి. అందులోని 2,3 పరిచ్ఛేదాలు పరస్పర వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకచోట హిందీ అధికార భాషగా ఉంటుందనీ, మరోచోట 15 సంవత్సరాల ఆంగ్లం యూనియన్ భాషగా ఉంటుందనీ 15 సం.ల తర్వాత పార్లమెంటరీ కమిటీ నిర్ణయం చేస్తుందని చెప్పబడింది.
1965లో ప్రభుత్వం ఒక సమితిని ఏర్పాటుచేసింది. ఆ సమితి ‘‘హిందీ అధికార భాషగా పూర్తిస్థాయిలో కొనసాగించడం కుదరడం లేదని’’ తేల్చిచెప్పింది. అలాగే పైన చెప్పిన ప్రకరణాల్లోని ఇంకోమాటను ఉల్లేఖించింది- ‘‘దేశంలోని ఏ రాష్ట్రం హిందీని ఒప్పుకోకున్నా హిందీ అధికార భాషగా పూర్తిగా స్థాయిలో అమలుచేయడం కష్టం’’-అనేది అందులోని సారాంశం.
ఏ ఒక్కరికి తెలియని ఆంగ్లభాషను బ్రిటిషు పాలకులు ఎలా ప్రవేశపెట్టి రుూ స్థాయికి తీసుకొచ్చారు? దేశ విభజనకి గాంధీ, నెహ్రూలు ఏ ప్రజల ఆమోదానికి ఎదురుచూశారు?
పార్లమెంటులో హిందీని దేశ భాషగా ప్రకటించి తగిన రీతిలో కేజి తరగతి నుండి మొదలుపెట్టినా నేటికి అనగా 63 సం.ల కాలములో దేశ ప్రజల్లో ప్రతిఒక్కరు హిందీని వ్రాయటం, చదవటం వచ్చేదిగా? ఈనాటి అనైక్యత రూపుమాపబడేదిగా? ఇలా చేయకపోవటానికి కారణం నాయకులు చేసే ప్రకటనల్లో చిత్తశుద్ధి లేకపోవటమే.
కమిటీల ఏర్పాటు ఇంగ్లీషుని అధికార భాషగా కొనసాగించాలనేదే గుప్తంగా జరుగుతున్న కుట్రలో భాగము. ప్రజలారా మేల్కోండి! ఏక భాషాలోపంలోని తీవ్రతను తెలియపరుస్తూ హెచ్చరించటానికి ఈ విమర్శ జోడింపబడింది. అలాగే కొందరు నాయకులు 1965లో తమిళనాడులాంటి ప్రాంతాల్లో హిందీపై ఉన్న గుడ్డి వ్యతిరేకతతో అల్లర్లుచేసి ఆంగ్లాన్ని ఆహ్వానించి పెద్ద పీటలువేసారు. అదే ఇవాళ మనకు ప్రాణసంకటమైంది.
అలాగే కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో హిందీని ప్రోత్సహించలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్లేయుల వ్యాపార సంస్కృతిని ప్రోత్సహించి, పెద్దపీటలువేసే నాయకులకు ఈనాడు దేశంలో కొదవలేదు. వారి మనస్సునిండా ఆంగ్లమే గొప్పదన్న భావన గూడుకట్టుకున్నది.
ఆంగ్లం సమృద్ధికర సంపూర్ణ భాష అనీ, ప్రపంచ భాషల్లోనే అత్యంత విశిష్టమైనదనీ, వైజ్ఞానిక పరిశోధనకు ఆంగ్లమే అనుకూలమైనదనీ- ఈ నాయకుల నమ్మకం.
- ఇంకావుంది...
***************************************
✍ డాక్టర్. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి