తెలుగు రాష్ట్రాల్లో కులోన్మాదుల కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సూడో సైన్సు, నాస్తిక, హేతువాద ముఠా ఒకటి తయారై అవి పెట్టిన పుట్టలోంచి ఒక్కో పాము బయటకు వస్తున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు తెలంగాణాను కబళించాలనే కసితో బుసకొడుతున్న ఈ పాములు తాము వ్యక్తిగతంగా ఎదగడానికి సిద్ధాంతాల నిచ్చెనమెట్లు ఎక్కుతున్నాయి. దూషణ, తిరుగుబాటు, అసభ్య భాషలను అకాడమిక్‌ భాషగా పుస్తకాల్లోకి ఎక్కించిన మార్క్సిస్ట్‌ మంత్రదండం ఓ కత్తిని సృష్టించింది.
గోక్కునే గోగినేని బాబును తప్పించడానికి ఓ టివి ఛానల్‌ పెద్ద పన్నాగమే పన్నింది. అందమైన ముఖంతో దుర్గంధ సిద్ధాంతాలను తెలుగు ఛానళ్ళ ‘భావస్వేచ్ఛ’ మాటున మనందరికి రుద్ది వాసన చూస్తున్న గోగినేని బాబు శ్రీరామునిపై చేసిన విపరీత వ్యాఖ్యలపై చర్చ పెట్టి ఈ అపరమేధావి కత్తి మహేశ్‌ను అభిప్రాయం చెప్పమన్నారు. ఈ సుత్తి కత్తి మహేశ్‌ పవన్‌ కల్యాణ్‌ను తిట్టినట్లే యధాలాపంగా శ్రీరామునిపై ‘పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా’ అన్నట్లు రామదూషణ చేశాడు. ఇది రావణకాష్టంలా మండి ‘రామోద్యమం’గా మారి ప్రతివారిని ఉడికించింది. హిందువుల ఆశాజ్యోతి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్ర, హిందూధార్మిక సంస్థల పట్టుదల ‘ఖరదూషణ రాక్షసుణ్ణి’ తమిళనాడు దగ్గరున్న చిత్తూరుకు తరలించేవరకు చేరింది. సరిక్రొత్త రావణాయణం చెబుతున్న మారీచుడిని రావణ రాజ్యమైన శ్రీలంకకు తరలిస్తే మరీ బాగుండేది.

************************************************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట  విశ్లేషణ : జాగృతి
16 - 22 : July : 2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి