– శ్రీలంకలో తమిళులు సురక్షితంగా క్షేమంగా ఉండాలంటే మళ్ళీ ఎల్టిటిఇ ఆవిర్భవించాలి.

– ఎండిఎంకె నేత వైగో
– ఉన్న తీవ్రవాదులనే పీచమణుస్తుంటే ఇంక వాళ్ళెందుకు వైగో..!
–  జకీర్‌ నాయక్‌ను భారత్‌కు అప్పగించేది లేదు.
– మలేషియా ప్రధాని మహతీర్‌ మహమ్మద్‌
– ‘దారుల్‌ఇస్లాం’లో ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం.
– అసలు మా కుటుంబంలో విభేదాలు ఉన్నాయని ఎవరన్నారు? నాకు, తమ్ముడు తేజస్వి మధ్య ఎలాంటి అంతరాలు లేవు.
– లాలూ పెద్దకొడుకు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌
– వివరణ ఇస్తున్నారంటే ఏం జరిగిందో మరి. నిప్పులేనిదే పొగ పుట్టదు కదా! అసలే, మీ నాన్న మెగాస్టార్‌ లాలూ కారాగారంలో ఉన్నారు.
– హామీల కోసం కేంద్రంపై సమష్టి పోరాటం
– కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌
– ముందు మీ పార్టీని సరిదిద్దుకోండి.
– రాహుల్‌గాంధీ డ్రగ్స్‌కు బానిస. డోప్‌టెస్ట్‌ నిర్వహిస్తే ఫెయిలవుతాడు.
– భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి
– అన్నీ రహస్యాలే చెబితే ఎలాగండీ..!
– జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం. కేంద్రం పెత్తందారీ సాగదు.
– టిడిపి, తృణమూల్‌ పార్టీలు
– మరి యా కూరిమి విరసింబైనను నిక్కము నేరములే తోచుచుండు నిక్కము సుమతీ.
– అమ్మా.. బొమ్మా.. అనే వారితో ఏం మాట్లాడతాం !
– కెటిఆర్‌పై కాంగ్రెస్‌ నేత మల్లుభట్టి విక్రమార్క స్పందన
– ఇంకేం మాట్లాడతారు ? వినడమే.
– రాహుల్‌ నా కన్నా జూనియర్‌. అయినా ఆయనతో కలిసి పనిచేస్తా.
– పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జి
– అందుకే కాంగ్రెస్‌ కమ్యూనిస్టుల మధ్య కంచుకోట నిర్మాణం అయ్యింది.
– కేజ్రీవాల్‌పై నమ్మకంలేదు.
– కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌
– ఢిల్లీలో కయ్యం – గల్లీలో వియ్యం.
– ఒకేసారి ఋణమాఫీ కర్ణాటకలో చేయండి.
– కాంగ్రెస్‌ నేతలకు కెటిఆర్‌ సవాల్‌
– వాళ్ళవి ‘ఆపద మొక్కులు’ అని మీరే చెప్పారుగా.
– మీ నట్టింట్లోకి ‘జియో’ – ఫైబర్‌ బ్రాండ్‌ బ్రాడ్‌బండ్‌ సేవలు త్వరలో అందిస్తాం.
– జియో అధిపతి అంబానీ
– అందుకే అంతా ‘అ(జి)యోమయం’….!



************************************************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట  విశ్లేషణ : జాగృతి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి