భారతదేశం గురించి మన నాయకులు గత ఆరవై ఏళ్ల నుండి మన దేశంలోని, ఇతర దేశాల్లోని వేదికలపై మన దేశగొప్పతనాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు; కానీ నిజంగా దేశం-ధర్మంపట్ల ఆసక్తి ఉన్న నాయకులు ఎందరు? ఇటీవల కాలంలో భారత రాజకీయ యవనికపై ‘జాతీయ ప్రభుత్వం’ కొలువు తీరటం వైదేశిక మానసపుత్రులకు ఎర్రబుద్ధి జీవులకు కంటగింపైంది. విషయం దొరికిందే ఆలస్యం ఒంటికాలిపై లేస్తూ, తమ వంధిమాగధులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలను సమాయత్తపరచి కాషాయధ్వజంపై కాలకూట విషాన్ని చిమ్ముతున్నారు. గుజరాత్ అల్లర్ల గురించి పదేపదే కాకుల్లా అరచే వీళ్లు గోద్రాదుర్ఘటన, సిక్కుల ఊచకోతపై మాట్లాడానికి ‘పక్షవాతం’ వచ్చిన వాళ్లలాగా నోళ్లు మూసుకొంటారు. దేశంలోని మెజార్టీ ప్రజల మనోభావాలను లెక్కపెట్టకుండా వారి సంస్కృతీ సంప్రదాయాలను తూలనాడుతారు.
విదేశీ సంస్థలు విసురుతున్న ఎంగిలి మెతుకులకు బానిసలై స్వదేశీపెంపుడు చిలకలాంటి హిందూధర్మాన్ని (కొవ్వుబలిసిన వాయసాల్లాగా కొరికి తినడానికి సాహసిస్తున్నారు. వీళ్ల అడుగులకు మడుగులొత్తే ‘వామపక్ష మాధ్యమం హిందూధర్మాన్ని కించపరచడానికి ఒంటికాలిపై లేస్తున్నది. మరీ ముఖ్యంగా తెలుగునాట అక్రమ సంపాదనతో, కులబలంతో ఏర్పడ్డ ఛానళ్లు హిందూ ధర్మాన్ని బోనులో నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా సాధ్వి నిరంజన్ జ్యోతి ఓ సభలో మాట్లాడుతూ “ఈ దేశంలో ఉన్నదంతా రాముని సంతానమే” అనే అర్థం వచ్చేట్లు మాట్లాడింది. ఈ మాట కుహనా సెక్యులర్ వాదులకు కర్ణకఠోరం అయ్యింది. అభ్యుదయ వాదులమని చెప్పుకొనే వీళ్లు డి.ఎన్.ఏ పరీక్షలు జరిపితే తెలుస్తుందిగా! హిందువులది- ఈ దేశంలోని ఇతరులది ఒకే డి.ఎన్.ఏనా? కాదా అని! అలాగే మత మార్పిడి విషయంలో కుహనా లౌకికవాదులు కుడితిలో పడ్డ ఎలుకల్లా తన్నుకుంటున్నారు.
డిశంబర్ 25న ధర్మజాగరణ్‌మం తలపెట్టిన ‘పునరాగమనం’ వీళ్లకు నచ్చడం లేదు. ఇటీవల ఇస్లామిక్ టోపీలు ధరించిన కొందరు నుదుట తిలకం దిద్దుకొని, యజ్ఞం చేస్తుంటే సెక్యులరిస్టులు ఉడికిపోతున్నారు. మరి రాజదండం చేతిలో పెట్టుకొని హక్కన్న, బుక్కన్నలాంటి మహా మేధావులనే మతం మార్చిన చరిత్ర విన్నపుడు హిందువుల గుండెలు ఎన్నిసార్లు బ్రద్దలయి ఉండొచ్చు? ఇటీవల కాలంలో జకొర్ నాయక్ అనే మత ప్రబోధకుడు బహిరంగంగా హిందూ యువకులను మతమార్పిడి చేస్తున్న వైనం ఈ అపశకునపక్షులకు తెలియదా? విదేశీ నిధులతో వీధికో చర్చి నెలకొల్పి ఈశాన్య భారతంలో భయోత్పాతంతో, ఇతర ప్రదేశాల్లో ప్రలోభాలతో మతం మార్చి జాతిని మార్చుతున్న వారిని గురించి ఈ విదేశీ మానస పుత్రులు నిర్లజ్జగా మతం మార్పిడి చేస్తున్నపుడు సెక్యులర్ వాదులు చెవులు, కళ్లు మూసుకొన్నారా? ఇక ఈ దేశానికి జాతీయపక్షి నెమలి, జాతీయ జంతువు పులి, జాతీయగీతం ‘జనగణమన’. ఇలా అన్నీ ఉన్నా జాతీయ గ్రంథం ఉందా? ఈ దేశంలోని 88 కోట్ల హిందువులకే కాదు ప్రపంచ హిందువులకే ఆరాధ్యగ్రంథమైన భగవద్గీత ఎందుకు జాతీయ గ్రంథం కాకూడదు?
****************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి