– ప్రధాన న్యాయమూర్తి మిశ్రాపై విపక్షాల నోటీసులో స్పష్టత, నిర్దిష్టత లేదు. విపక్షాల అనుమానాలు, కల్పనలే వాటికి ఆధారం. ఇలాంటి చర్యలవల్ల కోర్టులపై ప్రజలకు నమ్మకం పోతుంది.

– సిజె అభిశంసనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
– ‘మూడేళ్ళు సాము గరిడీలు నేర్చి మూలనున్న ముసలావిడపై ప్రతాపం చూపడం అంటే ఇదే.
– బుద్ధిలేని పనిచేసిన వెంకయ్య; ఉపరాష్ట్రపతిని అనకూడదు. కానీ తప్పట్లేదు.
– సిపిఎం నేత సీతారాం ఏచూరి
– ‘మార్క్సిస్టు తిట్ల పురాణం’లో ఈ పదాలను కూడా చేర్చాలి.
– బిజేపిని తిట్టడమంటే ప్రజల్ని అవమానించడమే. కమ్యూనిష్టులను ప్రజలు నమ్మరు.
– భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌
– నమ్మేట్లు చేయండి ప్లీజ్‌.
– కోదండరాంవి ఒంటెద్దు పోకడలు
– ఇంటి పార్టీ నేత చెఱుకు సుధాకర్‌
– అక్కడ ఉన్నదే ఒక ఎదు ్ద- ఇక బండెలా నడుస్తుంది ?
– దేశం తగలబడిపోతోంది. మోదీది నియంతృత్వం. ప్రధాని పీఠమే మోదీ లక్ష్యం. రాజ్యాంగాన్ని కాపాడాలి.
– కాంగ్రెస్‌ నేతలు సోనియా, రాహుల్‌
– యూపిఎ హయాంలో పది జన్‌పథ్‌లో అమ్మగారు కూర్చోమంటే కూర్చోవడం, నిలబడమంటే నిలబడ్డం కన్నా ఎక్కువ నియంతృత్వమా! మరి రాహుల్‌గాంధీ లక్ష్యం సన్యాసం తీసుకొని, ఆశ్రమం పెట్టడమా!
– చానళ్ళను నిషేధిద్దాం. సినిమాలపైనే వారి బ్రతుకు ఆధారపడి ఉంది. వాటికి కంటెంట్‌, ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు.
– టాలీవుడ్‌ నటుల భేటీలో చర్చ
– బురదను బురదతో కడగడం అంటే ఇదే.
– ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ కుట్ర చేసింది. చర్చించడానికి గాంధీ భవన్‌కైనా వస్తా.
– మంత్రి హరీశ్‌రావు
– ఇప్పటికే మీపైన సోషల్‌ మీడియాలో దుమారం రేగుతోంది. అక్కడికి ఎందుకు వెళ్ళారు సార్‌.
– పార్లమెంట్‌లోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌
– రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి
– మీ పార్టీ గురించేనా మీరు మాట్లాడేది ? మరీ శ్రీ రెడ్డిలా మాట్లాడితే బాగుండదేమో.
– మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం.
– సిపిఐ నేత నారాయణ
– వినలేక చస్తున్నాం. ఇంకో మాట చెప్పండి.
– భాజపా, కాంగ్రెస్‌ కబంధ హస్తాల నుండి దేశాన్ని విముక్తి చేస్తా. హైదరాబాద్‌లో భూకంపం పుట్టిస్తా.
– సిఎం కెసిఆర్‌
– వారేమో మీ కుటుంబ కబంధ హస్తాల నుండి విముక్తి కల్పిస్తాం అంటున్నారు. మీరేమో వారిని ఇలా అంటున్నారు.
– విప్లవోద్యమాన్ని కేంద్రం అణచేస్తోంది.
– విరసం నేత వరవరరావు
– ఇంకెన్ని రోజులు ఈ అరిగిపోయిన రికార్డు ?!
– కేంద్రం నాపై కుట్ర చేస్తోంది.
– ఎపి సిఎం చంద్రబాబు
– మరీ అంత అభద్రతా భావం అయితే ఎలా బాబూ !
*********************************************************************
– డా|| పి.భాస్కరయోగి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి