– నాకు ఇవే చివరి ఎన్నికలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.
– కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
– సిద్ధూ! పుత్రరత్నాన్ని రంగంలోకి దింపావుగా ? ఇంకెందుకు చింత !
– 40 ఏళ్ళుగా సీనియర్లు క్యూలో ఉన్నారు. ఇపుడు ఊడిపడి నేనే ప్రధాని అంటున్నాడు. ఆ కుర్చీ మీ కుటుంబానికేనా ? అపరిపక్వ రాహుల్‌నకు దేశం అంగీకరిస్తుందా ?
– ప్రధాని నరేంద్రమోదీ
– వాళ్ళ చారిత్రాత్మకమైన పార్టీ అంగీరించింది కదా మోదీజీ !
ం బిజెపిని ఓడించండి. వేరే ఏ పార్టీకైనా ఓటేయండి. బిజెపి వంటిపార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకూడదు.
– నటుడు ప్రకాశ్‌రాజ్
– ఊరంతా ఓ దారి అయితే ఉలిపి కట్టదో దారి అన్నట్లు మధ్యలో నీదో గోల..!
– రైతుల పాలిట రాబంధు కెసిఆర్
– కాంగ్రెస్ నేత దాసోజ్ శ్రవణ్
– మీరు బంధువులా ?
– గాంధీభవన్ దీక్ష నేను, సంపత్ తీసుకొన్న నిర్ణయం. ఇందులో రేవంత్‌రెడ్డి ప్రమేయం లేదు. రేవంత్ ! సీనియర్లను అవమానించొద్దు.
– కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి
– మీరు ఇలాగే ఒకరు తోకకు ఇంకొకరు నిప్పు అంటించుకోండి. కెసిఆర్ హాయిగా నిద్రపోతాడు.
– మునుపెన్నడూ లేనంతగా రాష్ట్రాలపై కేంద్రంపై దాడి. సొంత ఎజెండా అమలుకే కేంద్రం కుట్ర. అన్యాయం సహించను.
– సిఎం చంద్రబాబు
– మీరు విదేశాన్ని పాలిస్తున్నారా ? లేక సామంతరాజులా ! అందరం భారతదేశంలోనే ఉన్నాం కదా ! మీరు చక్రాలు తిప్పి దక్షిణాది రాష్ట్రాల్లో బంగారురోడ్లు వేయించారా !
– మాపై కక్ష గట్టి కేసుల్లో ఇరికించారు.
– మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం
– జాగ్రత్త ! మీ ‘చిదంబర రహస్యాలు’ బయటపడగలవు.
– కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలు తక్కువ. ముఖ్యమంత్రులు ఎక్కువ.
– మంత్రి హరీశ్‌రావు
– వాళ్ళకు బిజినెస్ తక్కువ.. బిల్డప్ ఎక్కువ..
*************************************************************
– డా|| పి.భాస్కరయోగి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి