ఓజస్సు, మనిషిలోని ప్రాణశక్తి, అస్వస్థతలు, దీర్ఘకాలిక వ్యాధులవలన ఈ ఓజస్సు క్షీణదశకు చేరుకుంటుంది. ఓజస్సును తిరిగి శక్తివంతంగా మార్చడానికి రసాయనములే ప్రధాన పాత్ర పోషించగలవని ఈయన వివరించారు.

శరీరంలోని ఏడు రసధాతువుల (రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్లం) సారంగా ఓజస్సు రూపొందుతుంది. ఓజస్సును తిరిగి వృద్ధిచేయడానికి ముందుగా రసాయన చికిత్స చేయవలసి వుంటుందని ఈయన పేర్కొన్నారు. వ్యాధి నిరోధక శక్తి పెంపుదలకు, శరీరంలో ప్రవేశించిన సూక్ష్మక్రిములను నశింజేయడానికి, శరీరాన్ని శక్తివంతం చేయడానికి కొన్ని చికిత్సలను సంప్రదాయ వైద్యపరంగా తెలిపారు.

వ్యాధిని నిరోధించడంలో కన్పరుస్తున్న శ్రద్ధను వ్యాధిని నియమించడంలో కూడా చూపాలని స్పష్టీకరించారు. వ్యాధులను నియంత్రించడంలో చేసే నిర్లక్ష్యమే అసలు ఆరోగ్య సమస్యలని కూడా వ్యాఖ్యానించారు.

యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే ఉసిరిని, అజీర్తి, విరేచన సమస్యలను నిరోధించే బిల్వ (మారేడు)ను, మరికొన్ని ప్రకృతి అందించే వనమూలికల విశిష్టతను గూర్చి ఈన కూడా ప్రబోధించారు.

ప్రకృతిలో నర్మగర్భితంగా వున్న ఖనిజములు మరియు ప్రకృతి సృష్టించిన మొక్కలు, తృణధాన్యములు, మూలికలు మొదలైన వాటి ద్వారా ఆరోగ్య పరిరక్షణకు ఔషధాల కల్పన సాధ్యం కాగలదని ఈయన స్పష్టీకరించారు.

ప్రాచీన వైద్య శాస్త్ర గ్రంథం ‘సుశ్రుత సంహిత’ను ఆధారం చేసుకుని ‘ఉత్తరతంత్ర’అనే గ్రంథం కూడా రాసారు. దీని మూలప్రతి దేశాంతరాలకు తరలిపోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు.

పాదరస ప్రయోగంతో శరీరములో ప్రకృతి సిద్ధమైన రోగ నిరోధకశక్తిని పెంపొందించే విధానాలు ఈ గ్రంథంలో వున్నట్లు వినికిడి.

ఈయన శస్తచ్రికిత్సలు చేసినట్టుకూడా తెలుస్తోంది. ఈ అంశంలో ఈయన ప్రతిభాశక్తి చైనా, టిబెట్ దేశాల వరకు పాకింది.

ఆచార్య నాగార్జునుడు కంటి శాస్త్ర చికిత్సా నిపుణులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందారు.

కనిష్కుని పాలనా కాలంలోనే బౌద్ధమత ప్రచారానికి ఆంధ్రదేశం వచ్చారు. అదే సమయంలో ఆంధ్ర దేశ పాలకుడు శాతవాహన మహారాజు దీర్ఘవ్యాధితో మరణశయ్యమీద వుంటే వైద్య చికిత్సలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సమకూర్చి, రాజు ఆదరాభిమానములను పొందారు.

ఈయన పేరు ప్రస్తావన లేని ప్రాచీన వైద్యగ్రంథమే కనపడని విధంగా కృషిచేసారు. విషానికి విరుగుడు, ఆయుర్వృద్ధికి అపరామృతమును సృష్టించినట్లు చెబుతారు. 

‘ఆరోగ్యమంజరి’గ్రంథ రచన, ‘‘సృహల్లేఖ’ ఛందోబద్ధమైన సంస్కృత కవితా రచన చేసారు.

నాగార్జునుడు అనేక రచనలు, ముఖ్యంగా కృతులు రాసారు. వైద్యశాస్త్రంలో అనేక పరిశోధనలు చేసారు. రస ప్రక్రియ (అల్కెమీ)ను కూడా నేర్చినట్టు చెబుతారు. వైద్యశాస్త్ర నిష్ణాతులని చెప్పిన కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి.

విజ్ఞాన వాదం

ఈయన కాలంలో బయల్దేరిన ‘విజ్ఞానవాదం’ ప్రముఖంగా ప్రచారమై, ఈయన తదనంతరం కూడా విరాజిల్లింది. 

బాహ్యజగత్తు భ్రమ, విజ్ఞానం ఒక్కటే సత్యం. విజ్ఞానం అంటే చేతన, బుద్ధిమనసు (్ళ్యశఒషజ్యఖఒశళఒఒ) అది మినహా మరేమీ లేదు. ‘‘సర్వం బుద్ధిమయం జగత్’’, ఈ విజ్ఞానవాదం ఆస్తికత్వ సంబంధంగా బయలుదేరి విజ్ఞానశాస్త్ర ఆవిర్భావానికి సుగమమార్గం ఏర్పరచి వుండవచ్చును.

బౌద్ధమత ప్రచారకులు

ఆచార్య సారాహభద్ర వద్ద శిష్యరికం చేసారు. దాదాపు అన్ని సమకాలిక జ్ఞానమార్గాలలో పయనించారు. ఆ తర్వాత బౌద్ధంలోనికి ప్రవేశించారు.

టిబెట్, సింహళ దేశాలలో పర్యటిస్తూ బౌద్ధమత మహాయానశాఖకు విస్తృత ప్రచారం కల్పించారు. ఆ తర్వాత బౌద్ధంలోనికి ప్రవేశించారు.

పురాతన బౌద్ధగ్రంథాల సేకరణలో విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు.

కనిష్కుడు ఏర్పరచిన విశ్వబౌద్ధ పరిషత్‌కు ఈయన అధ్యక్షులుగా వున్నారు.

మహాయాన సిద్ధాంతకర్తగా రూపొందిన తర్వాత ‘బోధిసత్వ’గా గుర్తింపుపొందారు. (అనేకమంది పొరపాటున గౌతమబుద్ధుడిచే బోధిసత్వునిగా వ్యవహరిస్తున్నారు).
ఈయన అభీష్టంమేరకు బౌద్ధమత ప్రచారమునకు శాతవాహన మహారాజు కృష్ణానదీ లోయలో దీపలతో శ్రీపర్వత శిఖరాల్ని తొలిచి, అద్భుత శిల్పసౌందర్యంతో అయిదు అంతస్తుల విశాల భవంతిని నిర్మింపజేసారు. ఇందు నిమిత్తం రాజు కోశాగారంలోని ధనమంతా వ్యయపరిచినా నిర్మాణం పూర్తికాని సందర్భంగా నాగార్జునుడు తన రసవాద (ఆల్కెమీ) విద్యతో కొన్ని ముడి ఖనిజములను బంగారంగా మార్చి, నిర్మాణాన్ని పూర్తిచేయించారని ఒక కథనం.

బౌద్ధ నాగార్జునుడు, సిద్ధ నాగార్జునుడు ఒకడేనా?
బౌద్ధమత సన్యాసి ఆర్య నాగార్జునుడు, బంగారాన్ని రూపొందించటానికి ప్రయోగాలుచేసిన సిద్ధనాగార్జునుడు వేర్వేరు వ్యక్తులని కొంతమంది చరిత్ర పరిశోధకులు తొలినాళ్ళలో అభిప్రాయం వెలిబుచ్చారు.

ఏ విధమైన లోహాన్ని కూడా బంగారంగా మార్చగల ‘పరసువేది’మర్మాన్ని పరిశోధనలు చేసి నాగార్జునుడు కనుగొన్నారని ప్రజలందరిలో ఒక బలీయమైన విశ్వాసం నెలకొని ఉంది.

ఇంకావుంది...


****************************************
✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి

ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి