– తెదేపా గెలుపు చారిత్రక అవసరం. ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పబోతున్నాయి. జనసేన, వైకాపాలకు ఢిల్లీ నుండే స్క్రిప్ట్‌ అందుతుంది.
– మహానాడులో చంద్రబాబు
– మీరేమైనా చైనాతో గాని, పాకిస్తాన్‌తో గాని యుద్ధం చేయబోతున్నారా? అంత చారిత్రక అవసరం ఇప్పుడోమొచ్చింది బాబూ! మరి జనసేన, వైకాపా ప్రాంతీయ పార్టీలు కావా ?
– చంద్రబాబుకు అవగాహన లేదు. ఎస్‌.సి. అయిన నన్ను అవమానించాడు. నా బిడ్డ పెళ్లికి రమ్మంటే లేటుగా వచ్చాడు. మేం పడిగాపులు కాశాం. నాకు గవర్నర్‌ పదవి ఇవ్వకుండా అడ్డుకున్నాడు.
– మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సిములు
– ఇన్నేళ్ళకు తెలుసుకున్నావా నర్సన్నా ! అదో చారిత్రక సత్యం.
– బెంగళూరులో భాజపాకు అడ్డుకట్ట పడింది. ఈ విజయంతో కాంగ్రెసు ముందుకెళ్తుంది.
– కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
– పక్కోడి ఇంట్లో పెళ్లయితే మనింట్లో భోజనం పెట్టడం అంటే ఇదే..!
– తెలంగాణ, ఆంధ్రాలలో పాగా వేస్తాం
– భాజపా నేత రాంమాధవ్‌
– అదేదో త్వరగా ప్రారంభించండి మాధవ్‌ జి !
– రమణ దీక్షితులకు నాలుగు తగిలిస్తే అన్నీ చెప్పేస్తాడు.
– మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి
– భాష మార్చుకోండి ! లేదంటే పురోహితులు మీకు పిండాలు పెడతారు !
– కర్ణాటక అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లకు అభినందనలు. ప్రాంతీయ రాజకీయ పక్షాల్ని శక్తిమంతం చేయడమే మా పని.
– బెంగాల్‌ సిఎం మమతా బెనర్జి
– అవును! మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో ప్రతిపక్ష కార్యకర్తలను వేటాడి వెంటాడి మరీ బలోపేతం చేశారు.
– నా పుట్టిన రోజు సందర్భంగా ‘నల్గొండ ఎమ్మెల్యె’ అని సిఎం తన సందేశంలో పేర్కొన్నారు. అంటే నన్ను ఎమ్మెల్యెగా సిఎం అంగీకరించినట్లే.
– ఎమ్మెల్యె కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– మీ మధ్య ఈ ‘ఎకసెక్కాలు’ కూడా ఉన్నాయా!
– మీడియా విమర్శలను సానుకూలంగా తీసుకొంటాం.
– మంత్రి హరీశ్‌రావు
– అసలు మిమ్మల్ని విమర్శిస్తేగా…?
– పెట్రోలు, డిజిల్‌ ధరలను జిఎస్‌టిలోకి తేవాలి; అప్పుడే ధరలు తగ్గుముఖం. కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు. అన్ని స్థానాలకూ పోటీ చేస్తాం.
– తెజస అధ్యక్షుడు కోదండరాం
– ముందు అభ్యర్థులను వెతుక్కోండి సార్‌.
– దేశమంతా చూస్తుండగా నేను కుమారస్వామికి చేయి అందించాను. ఆయన నన్ను విస్మరించారనే భావిస్తున్నా. నేను బంతిని కాదు, ఆటగాడిని..!
– కర్ణాటక కాంగ్రెసు నాయకుడు డి.కె.శివకుమార్‌
– అంటే ఆట అప్పుడే మొదలయ్యిందా డి.కె. ?!
– సుస్థిరపాలన నా లక్ష్యం. సంకీర్ణ ధర్మాన్ని విడనాడను.
– కర్ణాటక సిఎం కుమారస్వామి
– గతంలో మీరు చేసిన పనులు మర్చిపోయారా !!
– ఆర్‌.ఎస్‌.ఎస్‌. భావజాలానికి తలవంచలేదనే కాల్పులు.
– తత్తుకూడి ఘటనపై రాహుల్‌గాంధీ
– మోకాలికీ బోడిగుండుకూ ముడి పెట్టడమంటే ఇదే. అక్కడున్నది పళనిస్వామి అన్నాడిఎంకె ప్రభుత్వం. దీనికి ఆర్‌.ఎస్‌.ఎస్‌.తో అసలు సంబంధం ఉందా? ముందు మీ స్ట్క్రిప్ట్‌ రైటర్లను మార్చండి.

************************************************************
– డా|| పి.భాస్కరయోగి
మాటకు మాట  విశ్లేషణ : జాగృతి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి