ఫ్రపంచం ముందుకు దూసుకుపోతుందని మనం అంటుంటాం. కాని ఆ పరుగులో మనం ఎక్కడున్నా, ఈ దేశ అస్థిత్వం మాత్రం పలుచబడుతుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా సాంస్కృతిక, భాషాపరమైన అంశాల్లో మనం చాలా వెనుకబడ్డామనే చెప్పొచ్చు.

భారతదేశం దాదాపు వేయి సంవత్సరాలు బానిసత్వంలో మగ్గింది. మన సార్వభౌమత్వాన్ని సవాలుచేస్తూ, ఈ దేశ సంస్కృతిని, నాగరికతను, భాషను అణచివేసిన బ్రిటీషువారు మన దేశంనుండి వెళ్ళిపోయినా, వారి సాంస్కృతిక భాషా బానిసత్వం మాత్రం మనల్ని వెంటాడుతూనే వుంది.

భారతదేశం స్వాతంత్య్రం పొందినా పరభాషావ్యామోహం తగ్గకపోగా, రోజురోజుకు ఇంకా పెరిగిపోతోంది. మన దేశంలాగానే ప్రపంచంలోని ఆఫ్రికా, బర్మా, శ్రీలంక, బ్రెజిల్, చీలి, చైనాలాంటి అనేక దేశాలు చాలా ఏళ్లు బానిసత్వంలోనే మగ్గిపోయాయి. పై వాటిలో చాలా దేశాలు ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా దేశాలకు బానిస దేశాలుగా ఉన్నాయి. ఆ దేశాలన్ని స్వతంత్రం పొందాక భాష విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ తమ అస్థిత్వాన్ని చాటుకొన్నాయి. తమ మాతృభాషల్లో పాలన సాగిస్తూ విశేషమైన అభివృద్ధి సాధించాయి.

చైనా 1949లో స్వాతంత్య్రం పొందింది. సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇవాళ అమెరికాలాంటి దేశాలకే సవాల్ విసరగలిగే స్థాయికి చేరింది. దానికి కారణం తమ మాతృభాష అయిన ‘చీనీ’్భషను పాలన భాషగా మార్చుకోవడమే. ‘‘చైనా ఇప్పుడు కూడా ఆంగ్ల భాషలో మునిగితే, ఇప్పటివరకు ఇంత అభివృద్ధి సాధించేదికాదు’’అంటారు అక్కడి మేధావులు.

అలాగే జపాన్ ఒకప్పుడు అమెరికా పాలన క్రింద బానిస దేశంగా ఉండేది. కాని ‘జపనీష్’ను మాతృభాషగా చేసుకున్న తర్వాత సామాజిక, ఆర్థిక రంగాల్లో ఆకాశమంత ఎత్తుకుఎదిగింది. అమెరికా నియంత్రణలో నడుస్తుందని చెప్పుకునే ‘‘హాలీవూడ్’’ ఇవాళ జపాన్ సహకారంతో నడుస్తుందని చెప్పొచ్చు. హాలీవుడ్ సినీ పరిశ్రమలో జపాన్ పెట్టుబడులే ఉన్నాయన్నది నమ్మలేని నిజం. 

మోటారు, సినిమా, పెట్రోలియం వంటి రంగాల్లో జపాన్ పెట్టుబడులు, మానవ వనరులు అన్నీ ఎక్కువభాగం జపాన్‌వే. రెండవ ప్రపంచయుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అమెరికా ఆటంబాంబులు వేసి ఆ దేశ వెనె్నముకను విరిచింది. అయినా జపాన్ తమ దేశంలో మాతృభాష అయిన ‘జపనీష్’ను పాలనాభాషగా ప్రవేశపెట్టి చాలా ప్రగతి సాధించింది. వైజ్ఞానిక పరిశోధన, విశ్వవిద్యాలయం, పాఠశాల వంటి అన్ని విభాగాల్లో మాతృభాషను ప్రవేశపెట్టి జపాన్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. 

‘మాతృభాషనే మా సంకల్పశక్తికి కారణం’అంటారు ఆ దేశ మేధావులు. ఈ జపాన్, చైనా రెండు మన దేశానికి చాలాదగ్గరగా ఉన్నాయి. కాని మన దేశంనుండి దూరంగాఉన్న బ్రెజిల్ కూడా మాతృభాషలోనే పరిపాలనచేస్తూ అభివృద్ధిలో ముందుకుపోతోంది. ఈ దేశం అమెరికాకు భౌగోళికంగా చాలా దగ్గరగా ఉంది కాని అక్కడ అమెరికాకు చెందిన భాషలు గాని, ఆంగ్లం గాని నడవదు. ఈ దేశం చాలా సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నా మాతృభాషను పకడ్బందీగా అమలుచేస్తున్నది. అందువల్లనే అభివృద్ధిలో దూసుకుపోతోంది.

ఇదే విధంగా ఫిన్‌లాండ్, డెన్మార్క్, నార్వే వంటి 26 దేశాలు ప్రపంచంలో చాలా చిన్నవి. ఈ దేశాల్లో 15నుండి 30 కోట్లకన్నా ఎక్కువ జనాభా లేదు. వాటికి సైనికశక్తి, మానవ వనరులు తక్కువగాఉన్నా ఏ అగ్ర దేశానికి భయపడకుండా తమ మాతృభాషను అమలుచేస్తున్నాయి.

ఫిన్‌లాండ్ వంద సంవత్సరాలు బానిసగా ఉన్నది. ఆ దేశ మాతృభాష అయిన ఫిన్‌ష్‌ను ఇంజనీరింగ్, మెడికల్ రంగాల్లో కూడా ఉపయోగించుకుంటూ ముందుకుసాగుతుంది. విచిత్రం ఏమిటంటే ఫిన్‌లాండ్, బ్రిటన్‌కు దగ్గరగా ఉంది కాని ఇంగ్లీషు భాషకు దూరంగానే వున్నది. ‘‘నా భాష మాకు రక్షణగా ఉన్నన్ని రోజులు మా స్వాతంత్య్రాన్ని ఎవరు గుంజుకోలేరు’’ అంటారు ఈ దేశ ప్రజలు. కేవలం 22లక్షల జనాభాఉన్న డెన్మార్క్ తమ మాతృభాష ‘డెనిష్’ను తమ దేశంలో ప్రతి అవసరంలో, ప్రతి రంగంలో ఉపయోగిస్తుంది. ప్రపంచంలోనే అతి తక్కువ శబ్దాలుగల భాష మాది అని వాళ్లు గర్వంగా చెప్పుకొంటారు.

 అలాగే బానిసత్వం ఉన్న స్వీడన్ స్వాతంత్య్రం పొందినప్పటినుండి స్వీడిష్‌ను అమలుచేస్తున్నది. అదే విధంగా ఇంకా చిన్న దేశమైన నార్వే తమ మాతృభాష నార్వేజియన్‌ను కేజి నుండి పీజి వరకు అమలుచేస్తున్నది. ఈ దేశాలన్ని ప్రపంచ దేశాలముందు ఆర్థిక, భౌగోళిక, విషయాల్లో తక్కువస్థాయిలో ఉండవచ్చు కానీ భాష విషయంలో మాత్రం రాజీపడలేదు.

ప్రపంచంలోనే ఎక్కువ మానవ వనరులు కల్గిన దేశాల్లో భారత్ స్థానం గొప్పది. ఎక్కువ మంది వైద్యులు, ఇంజనీర్లు, రైతులు, కార్మికులు భారతదేశంలోనే ఉన్నారు. కాని మాతృభాషల పరిరక్షణలో భారతదేశం వెనుక బడింది. భారతదేశంలో సంస్కృతం పాలనాభాషగా ఉన్నన్ని రోజులు స్వర్ణయుగంగా, బంగారుపిట్టగా పిలవబడింది. ఈ దేశంలోని గొప్ప సాహిత్యంగల 25 భాషల్లో ఏ ఒక్కటీ ఈ దేశ రాజభాషగా, అధికార భాషగా స్థిరపడలేకపోయింది.

విద్య, జ్ఞానం, దార్శనిక శాస్త్రాల్లో భారతదేశం 17, 18 శతాబ్దాల వరకు అగ్ర భాగంలోనే ఉంది. ఎప్పటివరకు సంస్కృతం రాజభాషగా ఉందో అప్పటివరకు శిరసెత్తుకుని నిలబడింది. సంస్కృతం దేవభాష. దేవతలు జ్ఞాన స్వరూపులు. ఆ సంస్కృతం ఎలా పతనమయ్యిందో అలాగే భారతదేశం కూడా పతనంవైపు అడుగులు వేసిందనే చెప్పవచ్చు.


- ఇంకావుంది...


***************************************
✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి