కొక్కొరో.. క్కో..

భారత్‌-పాకిస్తాన్‌ను తలదన్నే విధంగా మొన్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాగానే ఉబ్బరంతో ఉబ్బసంతో ఉడికిపోయిన దమ్మున్న దగ్గున్న తెలుగు ఛానళ్లు వీక్షకులకు బిపిని పెంచేశాయి.
రాజ్యాంగంలో గవర్నర్‌ అనే పాత్ర లేనట్లు, ఆయన్నేదో మోది తన ప్రతినిధిగా పెట్టుకొన్నట్లు నెత్తీనోరూ బాదుకొంటూ దుష్ప్రచారం చేశాయి. వెనకటికి ఏలిన వృద్ధ పార్టీ ఏర్పాటు చేసిన సర్కారియా కమీషన్‌ తీరిగ్గా అధ్యయనం చేసి, 88 సార్లు కాంగ్రెసు పెట్టిన గవర్నర్ల దుష్ట పాత్రను తరచి చూసి 14 వందల పుటల్లో వండి వారిస్తే, అందులోంచి మూడవ పాయింటును ఆధారం చేసుకొని, యడ్యూర్పను గద్దెపైకి పిలిస్తే అది పెద్ద నేరమా!
మన చేనుకు కంచె వేసుకోకుండా పక్కవాడి పశువులపై నింద మోపినట్లు తమ ఎమ్మెల్యేలను సిద్ధాంతాలతో, నాయకత్వంతో రక్షించుకోలేక మోది, అమిత్‌షాలపై దుమ్మెత్తి పోసేవాళ్లకు వత్తాసు పలికే ఎల్లో జర్నలిజం ఇంకెన్నాళ్ళు ? ప్రతిపక్షాలు, అధికార పక్షాలు, కులపత్రికలు – వాటి నుండి పుట్టిన విశ్లేషకులు వ్రతం చేసిన ఘట్టం కళ్లముందు కన్పించింది !?
సహజంగా జరిగిన యడ్యూరప్ప కొలువు కూటంపై కాలకూటం వెదజల్లుతూ ‘నోటి వాటం’ ప్రదర్శించిన మన తెలుగు ప్రసార మాధ్యమాలను చూసి ముక్కున వేలేసుకోవడం, ఫక్కున నవ్వుకోవడం తప్ప ఇంకేం చేయ గలం?
ఇతర పార్టీ యమ్మెల్యేలతో ఫిరాయిరపు జరిపిరచి, నిర్లజ్జగా మంత్రి పదవులు కట్టబెట్టిన తెలుగు చంద్రుళ్ళను ప్రశ్నిరచే ధైర్యర లేని ఛానళ్ళు దమ్మున్న ఛానళ్ళమని చెప్పుకోవడం చూసి తెలుగు ప్రజలు నవ్విపోతున్నారు.

************************************************************
– డా|| పి.భాస్కరయోగి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి