‘అత్త పగుల గొడితే పాతకుండ ! కోడలు పగులగొడితే కొత్తకుండ !’ అన్న సామెత తెలుగునాట ఓ పచ్చ పత్రికకు అక్షరాలా వర్తిస్తుంది. తమకు నచ్చపోతే ఎవరు చేసిన తప్పునైనా గిట్టనివారి ఖాతాలో వేసి మొట్టికాయలు వేయడం ఆ పత్రికకు గత మూడు నెలల నుండి పరిపాటి అయ్యింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఓ తెలుగు ప్రముఖ దినపత్రిక ‘స్వామీ! అంత రహస్యమేమి?’ అన్న శీర్షికతో ఓ ఆశ్రమాన్ని బజారుకీడ్చింది. ఈ స్వామి ఉత్తరాది నుండి వచ్చి తిరుపతిలో ఆశ్రమం పెట్టడమే మహానేరం అయ్యింది.
ఈ మధ్య ఉత్తరాది వాళ్లను, గుజరాత్‌ వాళ్లను అన్ని విషయాల్లో నేరస్తులుగా చూపిస్తున్న తెలుగు మీడియా ఆఖరుకు స్వాములను, ఆశ్రమాలను కూడా వదిలిపెట్టలేదు.
సదరు స్వామిని భాజపా అధ్యక్షుడు కలవడం అత్యంత రహస్యంగా జరిగిందంటూ చేసిన దర్యాప్తులో కూడా వారిని విలన్లుగా చిత్రీకరించడమే పనిగా పెట్టుకుంది. అయినా స్వాములను కలిసేవాళ్లు రహస్యంగా కాకుండా డప్పువేసి వెళ్తారా ? స్వాములు సాధన చేసుకొనే స్థలంలో కాకుండా బస్టాండుల్లో తిరుగుతారా ?
ప్రతిదాన్ని సిబిఐ దర్యాప్తు చేసినట్లు చేస్తూ, రహస్యం అంటూ లేని అనుమానాలకు కలిగించడమే ఈ దుర్వార్తలోని దురుద్దేశం. ఈ పచ్చకళ్ళు తిరుపతి పోటులో తవ్వకాలప్పుడు, శ్రీవారి ఆభరణాల మాయమప్పుడు మూసుకుపోయాయా!

************************************************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట  విశ్లేషణ : జాగృతి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి