– రాముడి పాలనలో శిస్తు ఉండేది. కెసిఆర్ పాలనలో రైతుకే డబ్బులు. సింహం సింగిల్‌గానే వస్తుంది.
– మంత్రి కెటిఆర్
– రాముడు అవసరమైతే నారచీరలు ధరించి అరణ్యానికి వెళ్లాడు. మరీ రజనీకాంత్ డైలాగులు రాజకీయాల్లో బాగుండవేమో.
– పల్లెల్లో కూలిన ఇల్లు ఉండొద్దు.
– సిఎం కెసిఆర్
– కొంచెం వివరంగా చెపుతారా ?
– తెలంగాణ ఆంధ్రులకూ టిక్కెట్లు. గత ఎన్నికలకూ ఇప్పటికీ వాతావరణం మారింది. వారిమద్దతు మాకే.
– టిపిసిసి ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
– ‘రేవు దాటితే బోడి మల్లన్న’ లాంటి సామెతలు ఇటువంటి అద్భుత దృశ్యాలను చూసే పుట్టాయి.
– లంబాడాలపై మీరేమంటారు? ఎస్‌టి జాబితాలో చేర్చడంపై జవాబు ఇవ్వండి.
– కేంద్రం, తెలుగు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
– రాజ్యాంగం ప్రకారం మీరేమంటారని అడిగేందుకు మీ దగ్గరకు వస్తే మీరు అభిప్రాయం అడగడం సమంజసమా!
– అస్సాంలో నివసించే వారందరు పౌరులు కారా ?
– కేంద్రాన్ని పార్లమెంటులో నిలదీసిన ప్రతిపక్షాలు
– ‘వారందరు’ అంటే ఎవరెవరో వివరంగా మీరే చెప్పాలి.
– కాపు రిజర్వేషన్లపై జగన్ మాట మార్చడం దారుణం.
– ఎపి మంత్రి నారాయణ
– నారాయణ! నారాయణ! మాట మార్చడం అనే పెద్ద బాలశిక్ష నారా వారి ఇంట్లోనే గదా రూపుదిద్దుకున్నది!
– బిజెపి అడుగులకు టిఆర్‌ఎస్ మడుగులొత్తుతున్నది.
– టి.కాంగ్రెస్ నేతలు
– ఈ మధ్య తెదేపా అడుగుల్లో మీరు అడుగు వేయట్లేదా!?
– సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సిందే.
– దయానిధి మారన్‌కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ
– శశికళ, కార్తీ, చిదంబరం, దయానిధి మారన్… ఈ కేసులు తెగవు, ముడిపడవు. ఈ విచారణపై విచారం వ్యక్తం చేయాలి అంతే!
– భారత్‌తో బంధానికి సిద్ధం. వారు ఒకడుగు వేస్తే మేం రెండు అడుగులు వేస్తాం.
– పాకిస్తాన్‌లో గెలిచిన ఇమ్రాన్‌ఖాన్
– మీరు రెండడుగులు వేసేది కశ్మీర్ వైపా ?
– 58వ పుట్టిన రోజు శుభాకాంక్షలు
– ఉద్ధవ్ ఠాక్రేకు ట్వీట్ చేసిన రాహుల్‌గాంధి
– ‘కొత్త ఒక వింత – పాత ఒక రోత’ సామెత బాగా అతికింది !?
*********************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట : విశ్లేషణ : జాగృతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి