ఒకప్పుడు కథ విషాదాంతమైనా సినిమా సందేశాత్మకంగా ఉండేది. ప్రస్తుతం హింస, శృంగారం మితిమీరిపోయి.. వ్యక్తుల మనసుల్ని విషపూరితం చేస్తున్న సినిమాలకు ఎవరు అడ్డుకట్టవేయాలి? వాటివల్ల ప్రేరేపింపబడుతున్న సంఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారు?
ఇవాళ మనిషిని కట్టిపడేస్తున్న అంశాల్లో ప్రచార, ప్రసార మాధ్యమాలు అతి ముఖ్యమైనవి. అందులో ‘సినిమా’ అనేది బలమైన మాధ్యమం. దాని తెరవెనుక ఉండే సినిమా రచయిత, పాటల రచయిత, మాటల రచయిత, సహాయ దర్శకులు, సంగీతకారులు, దర్శకుడు, నిర్మాత.. వీళ్లంతా తెరవెనుక సినిమాను నడిపిస్తే, తెరముందు నటీనటులు కన్పిస్తారు. సమాజంలో విలువల నిర్మాణం, వాస్తవిక దృగ్విషయాలు చెప్పే సినిమా ఈ రోజు ఫైనాన్సర్ల చేతుల్లోపడి సమాజ ధ్వంసం చేస్తుంది. డబ్బు సంపాదన, ప్రచార యావ కలగలసిన సినిమా పరిశ్రమ విలువలకు తిలోదకాలిచ్చి సమాజాన్ని అథఃపాతాళానికి తొక్కేస్తుంది.
ఒకప్పుడు కథ విషాదాంతమైనా సినిమా సందేశాత్మకంగా ఉండేది. ప్రస్తుతం హింస, శృంగారం మితిమీరిపోయి.. వ్యక్తుల మనసుల్ని విషపూరితం చేస్తున్న సినిమాలకు ఎవరు అడ్డుకట్టవేయాలి? వాటివల్ల ప్రేరేపింపబడుతున్న సంఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇదంతా గొంగట్లో కూర్చుని వెంట్రుకలు లెక్కబెట్టిన చందంగా ఉన్నా ఆత్మపరిశీలన అవసరం!
సెలబ్రిటీలుగా వెలిగిపోతూ మితిమీరిన ధనదాహంతో ఆదాయపన్ను ఎగ్గొడుతున్న సినిమావాళ్లూ.. సమాజ నిర్మాణంలో మీ పాత్రను ఒక్కసారి ఆలోచించండి. అడపాదడపా క్రికెట్ మ్యాచ్‌లు ఆడినట్టు నటించి, లభించిన డబ్బును వరదలకు, విపత్తులకు విదిలిస్తూ సంఘసేవకులుగా బిల్డప్ ఇవ్వడం తగునా! ప్రసార మాధ్యమాలు సమాజానికి వేరే అవసరమే లేదన్నట్టు సినిమా వాళ్ళకు ప్రచారం కల్పించడం మరో దురదృష్టం.
మనుచరిత్రలో ఇందీవరాక్షుడు అనే గంధర్వుడు బ్రహ్మమిత్రుడనే ఆయుర్వేద వైద్యుని దగ్గరకెళ్లి వైద్య విద్య చెప్పమని అర్థిస్తాడు. దానికి ఆయుర్వేద గురువు నటులకు ఈ శాస్త్రం చెప్పరాదంటాడు.
‘‘నటవిట గాయక/ గణికావచస్సేధురసము గ్రోలెడు చెవికిం కటువీ శాస్తమ్రు వలదిచ్చట నను జదివింపకున్న జరుగదె మాకున్’’ అని నిర్ద్వంద్వంగా వెళ్లగొట్టేస్తాడు. మరి ఈ రోజు సినిమా నటులు మొదట కొన్నాళ్లు నటించడం, తర్వాత ధన సంపాదన, రియల్ ఎస్టేట్, తదుపరి రాజకీల్లోకి దిగి పదవుల రసాస్వాదన చేయడం. పూర్వం ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్రశ్రేణి నటులు మాత్రమే సెలబ్రిటీలు కానీ ఈ రోజుల్లో బుల్లితెరలోని హాస్యగాళ్లు కూడా సెలబ్రిటీలే!
సినిమాలో హింసకు, మితిమీరిన శృంగారానికి ఎవరు బాధ్యులని మనం పరిశ్రమను ప్రశ్నిస్తే ‘‘దర్శకులు ఎలా చెప్తే మేం అలా చేస్తాం’’ అని నటులంటారు. ‘‘నటులు నటిస్తే చూడకుండా ఎలా ఉంటాం’’ అని ప్రేక్షకులు, ‘‘నిర్మాత పెట్టిన డబ్బు తిరిగి రాబట్టడానికి మేం అలా దర్శకత్వం వహిస్తున్నాం’’ అని దర్శకులు తప్పించుకొంటున్నారు. మొత్తానికి డబ్బుకోసం ఎంతకైనా దిగజారుతున్న పరిశ్రమపై సెన్సార్ బోర్డుకు నియంత్రణ లేదు. ‘కళకోసం’, ‘స్వేచ్ఛకోసం’ లాంటి పదాలు వాడి ఈ ప్రహసనం ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారు!
యువకులను హింసవైపు ప్రేరేపించే సినిమాలు అత్యధికంగా వస్తున్నాయి. సినిమాల్లో హింస బాగా చేసిన వ్యక్తికి ‘హీరో’ పదవినిచ్చి, నిజ జీవితంలో దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారు. కొన్ని కులాలకు అతి గౌరవ వాచకాలను ఆపాదించి సమాజంలో అహంకారం పెంచుతున్నారు. అలాగే మరికొన్ని కులాలను అవమానపరిచే పాత్రలను సృష్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు వివాదాస్పదమయ్యాయి. యువతీ యువకులను ‘ప్రేమ’ అనే పేరుతో లేని బంధాలు చేసి, ఛేజింగులు, దౌర్జన్యాలు, ప్రతీకారాలు వాటి చుట్టూ తిప్పేస్తున్నారు. భావి భారత పౌరులుగా గొప్ప జీవితం జీవించాలనుకొనే యువకుల జీవితాలను, మనస్సులను నిర్వీర్యం చేస్తున్నారు. సినిమాలే జీవితం అనుకొనే వాతావరణం సృష్టించి మన సమాజ శక్తిని విచ్ఛిన్నం చేస్తున్నారు. అమ్మాయిలను లేవదీసుకుపోయే పాత్రల్లో హీరోయజాన్ని చూపిస్తున్న స్టార్ల ఇళ్లలో, అలాంటి సంఘటనలను సమర్థిస్తారా? అంటే తాము తీసే సినిమాలవల్ల ఎవ్వరు నాశనమైనా ఫర్వాలేదు కాని తమ ఇంట్లో పిల్లలు మాత్రం బాగుండాలి? ఇదెంతవరకు సబబు? మితిమీరిన శృంగారం సెల్యులాయిడ్‌పై చూపించడంవల్ల అత్యాచారాల సంఖ్య పెరిగిపోయింది. అత్యాచార సంఘటనలను ఖండిస్తూ నేరస్థులకు ఉరి శిక్ష వేయాలని ఈ మహానటులే ‘ట్వీట్లు’ చేస్తారు!! అగ్రశ్రేణి దర్శకులమని చెప్పుకొనేవాళ్లు కూడా సహజత్వాన్ని వదలిపెట్టి, విధ్వంసాన్ని ప్రమోట్ చేస్తున్నారు. పాత చలన చిత్రాల్లో ఒక్క క్లబ్ డాన్స్ జ్యోతిలక్ష్మి, సిల్మ్ స్మితలతో పెడితే దానినే అశ్లీలంగా భావించేవారు. ఇప్పుడు ప్రతి సినిమాలో క్లబ్ డాన్స్ పెట్టడం రివాజుగా మారిపోయింది. ‘‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే/ చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే/ నాకెవ్వరూ నచ్చట్లే నా వంటిలో కుంపట్లే/ ఈడు ఝుమ్మందీ తోడెవ్వరూ..!’’ అనే ఈ పాట నుండి సమాజం ఏ విలువల్ని ఆశిస్తుంది. ఇది కేవలం ఆడవాళ్లు మాత్రమే పాడుకోవడానికి దర్శకుని కోరిక మేరకు రచించానని ఇటీవల రచయిత గర్వంగా చెప్పుకొన్నాడు. అరవై ఏళ్లు దాటిన నటులు ఇరవై ఏళ్ల ఇతర రాష్ట్రాల అమ్మాయిల ప్రక్కన వేషాలేస్తూ ఏం సందేశం ఇస్తున్నారు? వాళ్ల కుటుంబాల స్ర్తిలు ఇలా చేస్తే ఒప్పుకుంటారా? అసలు కుటుంబాలు కలిసి చూసే సినిమా నూటికి ఒక్కటైనా వస్తున్నదా? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని గొప్పగా చూపిస్తూ వ్యక్తులను దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ కొందరిలో లేని అహంకారాన్ని, బానిసత్వాన్ని పాదుగొల్పుతున్నారు.
సినిమా నటులకు లేని ‘క్రేజీని’ పెంచడంలో మీడియా ఏం తక్కువ తినలేదు. ‘ఉరీ’పై ఉగ్రవాదుల దాడి జరుగుతున్నప్పుడు ఓ ప్రముఖ సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడి జన్మదిన వేడుకలను తెలుగు ప్రాంత ఛానెల్ ఒకటి లైవ్ ప్రోగ్రాం నడిపిస్తున్నది. ఇది ఎంతవరకు సబబు? సినిమాలేదో ప్రజల బాగోగుల కోసం తీస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ, వాళ్లు నష్టపోతే ప్రజలు ఏదో కోల్పోయినట్లు మీడియా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం?
దేశంలో శాస్తవ్రేత్తలకు, మేధావులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని సినిమా వాళ్లకు ఇవ్వడం- ఇచ్చే వాతావరణాన్ని కల్పించడం మీడియా చేస్తున్న దుస్సాహసం. ఆఖరుకు పండుగలు -పబ్బాల రోజు కూడా సినిమా ‘నటుల సందేశాలు’ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ‘్భవసేచ్ఛ’ పేరుతో విశృంఖల భావాలను సమాజంలో వెదజల్లడం సినిమా పరిశ్రమ చేస్తున్న దేశద్రోహం.
సమాజంలో ఆరోగ్యకర భావజాల నిర్మాణంలో సినిమా పరిశ్రమ కృషి గణనీయంగా లేనట్లయితే విచ్ఛిన్నకర శక్తులను నిర్మాణం చేయడమే. ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా ఉన్న మన దేశంలో ఈ విధమైన చర్యలు యువశక్తిని నిర్వీర్యం చేయడమే. సినిమా వాళ్ళు ఏ మాత్రం సిగ్గుపడకుండా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఈ సమాజంలో ఏర్పడే దుస్సంప్రదాయానికి వాళ్లే కారణం అవుతారు.

డాక్టర్ పి. భాస్కర యోగి
అంధ్రభూమి వెన్నెల
Published Tuesday, 30 May 2017
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి