– ఎస్‌.టి. కోటా పెంపు బాధ్యత నాది. ఆందోళన చెందవద్దు. కొట్లాడి తెచ్చుకొందాం.
– సిఎం కెసిఆర్‌
– ముందు ఆదిలాబాద్‌లోని ఎస్‌.టి.లకు, ఆదివాసీలకు జరుగుతున్న యుద్ధాన్ని ఆపండి.
– స్టేట్‌మెంట్లు ఇవ్వకపోతే బ్యాంకర్లను గల్లాపట్టి లాగి తన్నండి. కెసిఆర్‌ పాలన తెలంగాణ రైతులకు శాపం
– పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
– మీరు ‘ఉత్తములు’ అయి ఉండి, ఇలా మాట్లాడితే ఎలా? బ్యాంక్‌ ఉద్యోగుల ఓట్లు ఉండవనే కదా ఇంతలా రంకెలేస్తున్నారు. పూటకోసారి ప్రజాస్వామ్యం పేరు వల్లించే మీరు, మీ పార్టీ ఇలా మాట్లాడవచ్చా! రేపు మీరు అధికారంలోకి వచ్చి ఏదైనా పని జరుగకపోతే ముఖ్యమంత్రిని ఇలా చెయ్‌! అలా చేయ్‌! అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అధికారం కోసం ఏదంటే అది మాట్లాడుతారా! మీ పాలనలో రైతులంతా బంగారు నాగెళ్లతో ఏమైనా దున్నారా ?! మీకెందుకీ దుడుకుతనం!?
– బిజెపిని ఐక్యంగా ఎదుర్కొందాం.
– వామపక్షాలకు మన్మోహన్‌సింగ్‌ పిలుపు
– గత డెబ్భై ఏళ్ల నుండి మీ సంప్రదాయం కొనసాగిస్తూనే ఉన్నారు కదా! ఓ ఐదేళ్లు ఇతరులను పాలించనివ్వండి. మొన్న ఎన్నికల్లో ఐక్యంగా ఎదుర్కొంటే ఏం జరిగిందో చూశారు కదా! కాస్త ఓపిక పట్టండి. జాతీయ వాద భావజాలాన్ని ఎదుర్కోవడానికి దుష్టశక్తులన్నీ ఒక్కటవడం ఈ దేశానికి కొత్తేం కాదు. అవినీతిపరులు, కుటుంబ పార్టీలు, కుల పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, మతతత్త్వ పార్టీలు అన్నీ కలిసే కదా ‘సెక్యులర్‌ ఫ్రంట్‌’గా జతగట్టేది. అయినా మీకింకా రాజకీయాలెందుకు ? పదేళ్ళు భారత ప్రధానిగా పనిచేశారు. దానికి మించిన గౌరవం మీకింకెక్కడ లభిస్తుంది ?!
– నిర్మలా జి! సిగ్గు సిగ్గు. మీ బాస్‌ మీ నోరు మూసేయాల్సిన విషయమై సిగ్గుపడాలి.
– కాంగ్రెస్‌ నేత రాహుల్‌
–   గురివింద ముందు తన చరిత్ర తెలుసుకోవాలి. బోఫోర్స్‌ శతఘ్నులు మొదలుకొని బొగ్గు కుంభకోణం వరకు జరిగిన వరుస కుంభకోణాల చరిత్రను ముందు అధ్యయనం చేయండి రాహుల్‌జీ.
– ముస్లిం వ్యతిరేక ధోరణి తప్పు. మత ప్రాతిపదికన భారత్‌ను చీల్చే ఆలోచనకు వాళ్లు (భాజపా) ఎప్పుడు స్వస్తి పలుకుతారు ?
– ఫరూఖ్‌ అబ్దుల్లా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత
– దుష్టుడైన శకుని భగవద్గీత ప్రవచనం చెప్పినట్లు ఉంది సార్‌ మీరు మాట్లాడుతుంటే! మీ వల్ల కదా కశ్మీర్‌ నాశనం అయింది! డెబ్భై ఏళ్ల నుండి మీ కుటుంబమే కదా కశ్మీర్‌ దుస్థితికి కారణం! మీరే కదా కశ్మీరును భారత్‌ నుండి చీల్చడానికి నేటికీ ప్రయత్నిస్తున్నారు!
– కాంగ్రెసును పాతాళానికి తొక్కితేనే బంగారు తెలంగాణ
– మంత్రి కెటిఆర్‌
– వాళ్లు ప్రస్తుతం అక్కడే ఉన్నారు. మీరు భూతలం మీద ఉన్నారని అనుకొంటున్నారా ఏంటి!
– నిరుద్యోగులకు బ్రతుకుదెరువు చూపాలి.
– జెఎసి నేత ఆచార్య కోదండరాం
– కొంపదీసి రాజకీయ నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారా ఏంటి? పార్టీ కూడా పెడతారని ప్రకటించారు!?
–  రాహుల్‌ క్రొత్త ఇమేజ్‌తో ప్రధానికి భయం
– ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌
– రాహుల్‌కు పెళ్లి సంబంధం ఏమైనా కుదిరిందా ఏంటి? అయినా నిన్నటికి నిన్న ‘మూడీస్‌ రేటింగ్‌’లో మోదీ అగ్రస్థానంలో నిలిచారు. అలాగే అమెరికన్‌ మేధో సంస్థ డైరెక్టర్‌ పిల్స్‌బరీ ‘చైనాకు ఎదురొడ్డి నిల్చిన మగాడు’ అని పేర్కొన్న విషయం మరిచారా!
– రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దు. ఆ దిశగా చర్యలు అనుమతించం.
– రాజస్థాన్‌ హైకోర్టు స్పష్టీకరణ
– కాస్త ఈ విషయం కెసిఆర్‌ గమనిస్తే బాగుంటుంది.
– తెలంగాణ కోసం చంద్రబాబును ఏడ్పించా
– ఎర్రబెల్లి దయార్‌కరావు, తెరాస నేత
– ఊసరవెల్లి – ఎర్రబెల్లి అని ఆనాడు ఆరోపణలు చేసిన వారిని నవ్వించడానికేనా ఈ ప్రకటన !
– డా|| పి.భాస్కరయోగి  మాటకు మాట, విశ్లేషణ జాగృతి  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి