– ఎద్దులబండిలో వెళ్ళండి! కేవలం గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు. కులమతాలను రెచ్చగొడుతున్నారు. వాళ్ళ నైజమేంటో యూపి ప్రజలకు తెలుసు.
– ప్రధాని నరేంద్రమోది
– మోదీని వ్యతిరేకించడమే వాళ్ళకు నిజం. ఇదే వాళ్ళ నైజం.
– గుజరాతీలు కులం ఆధారంగా కాకుండా అభివృద్ధికే పట్టం గడతారు.
– అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు
– నిజమే! మతంలో మిమ్మల్ని ఎదుర్కోలేని కాంగ్రెస్‌ అక్కడ కులం పరిమళాల్ని వెదజల్లాలని చూస్తోంది. ఆ అమ్ములపొదిలోంచి తీసిన అస్త్రాలే జిగ్నేష్‌, హార్దిక్‌ పటేల్‌…!!
– సామాజిక తెలంగాణ కోసం పోరుబాట. ముఖ్యమంత్రి కెసిఆర్‌ అబద్ధాల కోరు.
– సిపిఐ నేత సురవరం ప్రతాపరెడ్డి
– మీరేమో సత్యహరిశ్చంద్రుని అంకపీఠం నుండి ఊడిపడ్డారు!? ‘పోరి పోరి’ పోరాటాలు కూడా అలసిపోయాయిగానీ మీ కల నెరవేరటం లేదు కామ్రేడ్‌!
– వడ్డీ మాఫీ కావలసిన రైతుల వివరాలు సేకరిస్తున్నాం. కాంగ్రెస్‌ కార్యకర్తల ద్వారా అధికారులకు అందజేస్తాం. గ్రామస్థాయికి సోషల్‌ మీడియా. ఇవిఎంలతో ఎన్నికలు వద్దు.
– కాంగ్రెస్‌ వర్గాలు
– పాత ఋణాలు ఇప్పటీవరకు మాఫీ కాలేదు! అయినా కొంపదీసి అధికారంలో ఉన్నాం అని అనుకుంటున్నారా ఏంటి? ఇవిఎంల నుండి జంపింగ్‌ అంటే ‘ముఖం బాగా లేదని అద్దం పగుల కొట్టుకోవడం’ వంటిది మరి!
– ప్రధాని మోది నిజమైన హిందూవే కాదు, దేశంలో ప్రతి ఒక్కరిని సోదరుడిగా సోదరిగా, లేదంటే తల్లిగా భావించే వ్యక్తే అసలైన హిందువు.
– కపిల్‌ సిబల్‌, కాంగ్రెస్‌ నేత
– నిజమే! మోదీ లాలూప్రసాద్‌లా పెద్ద బొట్టు పెట్టి ఛాత్‌ పూజ చేయడు. మెడలో రుద్రాక్షలు వేసుకోడు. కమల్‌నాధ్‌లా బాబాల చుట్టూ తిరగడు. సెక్యులర్‌ నాయకుల్లా రంజాన్‌ రాగానే ఇఫ్తారు ఇవ్వడు. టోపీలు పెట్టుకోడు. కాబట్టి హిందువు కాడు. మీ పరిభాషలో హిందూ సంప్రదాయాలను పాటిస్తూ, వాటిని ధ్వంసం చేయడమే నిజమైన సెక్యులరిజం.
– ఎవరైనా గుడిలో చోరీ చేస్తే చూస్తూ సహించను. అవసరమైతే దాడి చేసేందుకు కూడా వెనుకాడను.
– సినిమా నటుడు కమలహాసన్‌
– మీ ప్రతాపం మొన్న ఓ అభిమానిని పిడుగుద్దులు గుద్దినపుడే తెలిసిందిలే. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యిందిలే!
– కాంగ్రెస్‌వి దిక్కుమాలిన రాజకీయాలు. ఓర్వలేకనే కేసులతో అడ్డుపడుతున్నారు.
– మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, లక్ష్మారెడ్డి
– వాళ్ళకేదైనా పని కల్పించొద్దా?
– ఏకతాటి పైకి కెసిఆర్‌ వ్యతిరేక శక్తులు. చేతులు కలుపుతాం. వ్యతిరేక ఓటు చీలిపోకుండా పావులు. రాష్ట్రంలో రాహుల్‌ టీమ్‌ ఆపరేషన్‌
– కుంతియా, కొప్పుల రాజు ఆలోచనలు
– ముందు గుజరాత్‌ సంగతి చూడండి. ఇక్కడింకా టైముంది కదా!
– అమిత్‌షా జైన్‌ ! అయినా హిందువునంటున్నాడు.
– కాంగ్రెస్‌ నేత రాజ్‌బబ్బర్‌
– ముందు మీ నాయకుడు ఏ మతమో చెప్పండి. సోమనాథ్‌ మందిరంలో హిందూయేతరుల్లో ఎందుకు పేరు రాశారు? గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో గుళ్ళచుట్టూ ప్రదక్షిణాలు ఎందుకు? కపిల్‌ సిబాల్‌ మోదీ హిందువు కాదు అంటే, మీరేమో అమిత్‌షా హిందువు కాదంటున్నారు. పోనీ మీరు హిందుత్వ రక్షకులుగా ఉంటారా ప్రకటించండి. మరి యుపిఎ ప్రభుత్వంలో షిండే, చిదంబరం, ‘హిందూ ఉగ్రవాదం’ అన్నపుడు మీరంతా ఎక్కడున్నారు?
– భారత్‌పై లష్కరే దాడులకు స్వాగతిస్తున్నా!
– పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌
– కొంపదీసి హఫీజ్‌ సయీద్‌ పెట్టే కొత్త పార్టీలో చేరుతున్నారా ఏంటి?
– డా|| పి.భాస్కరయోగి  మాటకు మాట, విశ్లేషణ జాగృతి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి