– మేం ఇక్కడ కెసిఆర్‌తో యుద్ధం చేస్తుంటే ఆంధ్రా నాయకలు ఆయనకు అతి మర్యాదలు చేస్తారా ! ఇక్కడ భాజపా లేదు, అందుకే దత్తన్నను మంత్రి పదవి నుండి తొలగించారు.
– తెదేపా నేత రేవంత్‌రెడ్డి
– రేవంత్ గారూ! కాంగ్రెస్‌లోకో, ఇంకో పార్టీలోకో వెళ్తానని నేరుగా చెప్పలేరా! లేక జనం నాడి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారా! కొన్నాళ్ళైతే అన్నీ బయటపడతాయి కదా !
– భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ నేతల మాటలు ఎవరూ నమ్మవద్దు. ప్రతి అంశంలోనూ రాజకీయ స్టంట్ అక్కర్లేదు. భాజపా, ఆర్.ఎస్.ఎస్.లను రాముడే శిక్షిస్తాడు.
– ఆర్.జె.డి. అధ్యక్షుడు లాలూప్రసాద్
– ‘ఉట్టి కింద నిలబడి పిల్లి శాపనార్థాలు పెట్టడం’ అంటే ఇదే. రాముడు 1990 తర్వాత తనను నమ్ముకున్నవాళ్ళను ఎక్కడ ఉంచాడో, రామయాత్రను అడ్డుకొన్న మిమ్మల్ని ఎక్కడ ఉంచాడో చరిత్ర చదివితే తెలుస్తుంది.
– దలైలామాను కలవడం నేరం. మాతో సత్సంబంధాలు కోరుకొనేవారు ఇలాగే చేయాలి
– చైనా హెచ్చరిక
– మరి హఫీజ్ సయీద్‌ను కలవడం, ఐరాసతో మద్దతు పలకడం దేనికిందికి వస్తుంది ? అయినా నీతిలేని దేశానికి రాజధర్మం ఏం తెలుస్తుంది ?! మరి ఈ విషయంపై చైనా భక్తులు మా దేశంలో తేలు కుట్టిన దొంగల్లా చప్పుడు చేయడం లేదు. రోజూ తెల్లారితే బౌద్ధం గురించి మాట్లాడ్డానికి ఒంటికాలిపై లేచేవాళ్ళు ఈ విషయంలో నోరు మెదపరు. హిందువులను తిట్టడానికే వాళ్ళకు బౌద్ధం కావాలి అన్నది సత్యం. ప్రపంచంలో ఈ రోజు బౌద్ధం గురించి దలైలామా కన్నా ఎవరు ఎక్కువ చెప్పగలరు ? మొన్నటికి మొన్న బౌద్ధ దేశమైన మయన్మార్ నుండి రోహింగ్యా ముస్లింలను తరిమేస్తుంటే ఇక్కడ బౌద్ధులమని చెప్పుకునే సూడో బౌద్ధులు రోహింగ్యాలకు మద్దతుగా నిలిచారు. ఇక్కడి సూడో సెక్యులరిస్టులు దలైలామాను, సాల్మన్ రష్దీని, తస్లీమా నస్రీన్‌ను ద్వేషిస్తారు. దీనికి అద్భుతమైన ముసుగు సెక్యులరిజం. వాళ్ళ ప్రయోజనాలు, సిద్ధాంతాలు అన్నీ దీని చుట్టే తిరుగుతుంటాయి.
– రేవంత్ బరాబర్ వస్తున్నాడు. ఆ రెడ్డి ఈ రెడ్డి అనే కాదు, ఈ ప్రభుత్వ ప్రజా విధానాలపై పోరాడాలనుకొనేవారు ఎవరైనా సరే కాంగ్రెస్‌లోకి రావల్సిందే.
– కాంగ్రెస్ నేతలు వంశీచంద్, సంపత్‌కుమార్
– మీ ఆహ్వానం సరే! ఆయన స్పందనేది ?! ఒంటె పెదవికి నక్క ఆశపడ్డట్లు మీ సైడు నుంచి ఒకే. మరి అక్కడి నుండి ? కొంపదీసి వన్‌సైడ్ లవ్ కాదు కదా!
– మహిళలను అసభ్యంగా చూపిస్తే శిక్షించాలి
– మహిళా కమీషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం
– ఇన్నాళ్ళకో మంచి మాట మాట్లాడారు. ఇంతకూ సినిమావాళ్ళ గురించేనా మీరు చెపుతున్నది ?
– సాగు నీరివ్వడం కాంగ్రెస్‌కు, కోదండకు ఇష్టంలేదు. మల్లన్న సాగర్ తెలంగాణకు వరప్రదాయిని. దానిని వ్యతిరేకిస్తే నిలదీయండి.
– మంత్రి హరీష్‌రావు
– మరీ అంత కక్ష ఉంటుందా హరీశ్ అన్న! మల్లన్న సాగర్ బాధితులు ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నారు. ముందు వాళ్ళ సంగతి చూడండి.
– కల్వకుర్తిని ప్రారంభించింది కాంగ్రెస్సే. అప్పుడు కెసిఆర్ ఎమ్మెల్యె కూడా కాదు.
– కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి
– ఎప్పటి సంగతో ఎందుకండీ.. ఇప్పటి మీ పరిస్థితి గురించి చెప్పండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి