* చరిత్రను వక్రీకరించినవారి తీరును దుయ్యబట్టాలి. దీనిని ఉద్యమంలా చేపట్టాలి. చరిత్రలో విస్తరించిన మ¬న్నతుల జీవిత గాథలను పాఠ్యాంశాల్లో చేర్చాలి. మహమ్మద్ గజనీ, అల్లాఉద్దీన్‌ఖిల్జీ, బాబర్, ఔరంగజేబు సమకాలీకులకు చరిత్రలో స్థానం కల్పించాలి.
– యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్
# యోగి జీ ! దానికోసమే 70 ఏళ్ళ నుండి ఎదురుచూస్తున్నాం. సతీశ్‌చంద్, రొమిల్లా థాపర్, అరుంధతీ రాయ్ వంటి కుహనా లౌకికవాద రచయితలు రాసిన చరిత్రలను చదివి, చదివి భారతీయులు తమ అస్తిత్వాన్నే మరచిపోయారు. కనీసం ఎన్‌డిఎ ప్రభుత్వమన్నా సాంస్కృతిక, కళారంగాల్లో పాతుకుపోయిన సూడో సెక్యులర్ మేధావులను తొలగిస్తుందనుకొంటే అదీ జరగలేదు.
* జిహాద్ ముసుగులో జమాత్-ఉద్-దవా అధ్యక్షుడు ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నాడు.
– పాకిస్తాన్ ప్రభుత్వం
# ఎన్నాళ్ళకు దుష్టబుద్ధికి తెలివి వచ్చిందమ్మా !
* ఇప్పుడు ఇస్తున్న రూ.5 కోట్లు ఎంపి లాడ్స్ ఏ మూలకూ సరిపోవడం లేదు.
– నిజామాబాద్ ఎంపి కవిత
# ఇచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో ముందు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఆ తరువాత సరిపోతున్నాయా ? లేదా ? అనేది ఆలోచించవచ్చు.
* రెచ్చిపోతే చచ్చిపోతారు. ఇప్పటికే తెలంగాణాలో మీ జాడలేదు. మీ బతుకు ధర్నాలో స్థానికులనెందుకు కొట్టారు ?
– కమ్యూనిష్టుల గురించి తెలంగాణ ¬ంమంత్రి నాయని నర్సింహారెడ్డి
# బాగుంది భాష ! తిట్లనే సాహిత్యంగా, ఉపన్యాసంగా మార్చుకొన్న కమ్యూనిష్టులకు ఇలాంటి సన్మానం మీలాంటి వారు చేయాల్సిందే నర్సన్నా!
* దేవుడు శాసిస్తే, రాజకీయాల్లోకి రావాల్సి వస్తే వెనుకడుగు లేదు. నేడు నటుడ్ని.. రేపేమవుతానో..!
– సూపర్ స్టార్ రజనికాంత్
# అయ్యా..! రజని గారు మరీ బోర్ కొట్టించకండి ! మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చూద్దాంలెండి.
* నేను మూర్ఖుడిని కాను. 2019లో జరిగే ఎన్నికల్లో ప్రధాని రేసులో లేను. జాతీయ అధ్యక్షుడిగా శరద్‌యాదవ్ కొనసాగలేకపోయినందుకే నన్ను ఎన్నుకున్నారు. దీంతో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని నేను భావిస్తున్నానని అనుకోవడం తప్పు.
– బిహార్ సిఎం నితీష్‌కుమార్
# ఈ ఆలోచన ముందే ఉంటే మీరు ఇప్పటికీ ఎన్‌డిఎ లోనే ఉండేవాళ్ళు.
* ప్రభుత్వం గ్రుడ్డిగా నా మీదకు సీబిఐని ఉసిగొల్పుతోంది.
– బిహార్ మాజీ సిఎం లాలూప్రసాద్
# గ్రుడ్డిగా కాదు.. ‘గడ్డి’ కుంభకోణంలో.. లాలూజీ !
* ఇద్దరు భారత సైనికులను కాల్చిచంపి తలలు నరికిన పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం. ముందుగా చెప్పం. చేసి చూపిస్తాం.
– కేంద్ర గృహమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
# రాజ్‌నాథ్ జీ ! మీరు ఆ పని త్వరగా చేయాలని ప్రజలు విపరీతంగా కోరుకుంటున్నారు. ప్లీజ్….!
* కాంగ్రెస్ దొంగల పార్టీ. ఓ పొట్టోడు కెసిఆర్‌ను ఏకవచనంతో తిట్టడమా!
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
# తిట్లు, శాపనార్థాలే ఈనాటి రాజకీయ భాష అయిపోయింది. ఏం చేస్తాం..!
* ఉరిశిక్ష ఆపేందుకు అవసరమైన చర్యలు తీసుకోండి, జాదవ్‌ను చూసేందుకు అనుమతించండి. వియన్నా ఒప్పందం ప్రకారం అది మీ బాధ్యత.
– పాకిస్తాన్‌కు ప్రపంచ న్యాయస్థానం చురక
# మా దేశంలో లాగా అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా డబుల్ బెంచ్, ఫుల్‌బెంచ్‌లు, తీర్పులు, అప్పీళ్ళు ఉంటే పాకిస్తాన్‌కు పండగే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి