– సమాజాన్ని చీల్చేదే సోషల్ మీడియా. దానిని నాయకత్వ స్థానాల్లో ఉన్న వారు జాగ్రత్తగా వాడాలి. మార్పు ఆన్‌లైన్ ద్వారా రాదు.
– అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా
– ఓహో ! సమాజాన్ని కలిపి ఉంచాలని మీకు కూడా అనిపిస్తోందన్నమాట!
– అవసరమైతే రాజ్యాంగం మారుస్తాం. రాజ్యాంగం తయారైనప్పుడు లేని సెక్యులరిజం మధ్యలో తెరమీదికి వచ్చింది.
– కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డే
– హెగ్డే గారు ! రాజ్యాంగం మార్చుతామనే మాట మీ నుండి వస్తే అదేదో అపచారం జరిగిపోతున్నట్లు సూడో సెక్యులరిస్టులు భావిస్తున్నారు. రాజ్యాంగంలో మార్పులు చేయకపోతే డెబ్బై ఏళ్లలో వెయ్యికి పైగా సవరణలు ఎందుకు జరిగాయో ? వారే చెప్పాలి.
– స్టాలిన్ ఉంటే ఎన్నికల్లో గెలవలేం. ఆర్.కె.నగర్ వైఫల్యమే నిదర్శనం.
– డియంకె నేత అళగిరి
– నాన్నా అళగిరి! మీ నాన్న కరుణానిధి, సోనియమ్మ ఇద్దరికీ కొడుకులపై ధృతరాష్ట్ర ప్రేమ. వాళ్లు ఎన్నిసార్లు ఓడినా ‘మా వాడు గొప్పవాడే’ అంటారు.
– రాహుల్ నేతృత్వంలో అధికారం ఖాయం
– టిపిసిసి నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి
– ఏది ! ఢిల్లి, బిహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్‌లలో వచ్చిన అధికారమా ఉత్తమ్ అన్నా !
– తెల్ల గడ్డం ముసలాయన డబ్బులన్నీ దోచుకెళ్తాడు.
– కాంగ్రెసు నేత మనీష్ తివారీ
– అబ్బా ! మొదట మీ ఘన కార్యాలు చూసుకోండి.
– దమ్ముంటే పతంజలి కండోమ్‌లు తెండి
– రామ్‌దేవ్ బాబాకు బాలీవుడ్ నటి రాఖీసావంత్ సవాల్
– ఇంతకీ మీరేం చేయబోతున్నారు !?
– డా|| పి.భాస్కరయోగి
మాటకు మాట, విశ్లేషణ జాగృతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి