* వస్తు సేవల పన్ను ఒక ప్రయోగం ! ఫలితాలపై వేచి చూడాల్సిందే ! విఫలమైన దేశాల్లో ఎత్తేశారు. కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.
– సిఎం కెసిఆర్
- వ్యక్తులను ఆకాశం నుండి పాతాళంలోకి, పాతాళం నుండి ఆకాశంలోకి ఎత్తడంలో మిమ్మల్ని మించినవారు ఎవరున్నారన్నా !
* ఫిల్మ్ చాంబర్ క్షమాపణ ఎందుకు ? అలా చెప్పడం ఖచ్చితంగా తప్పే !
– టాలివుడ్ పెద్దలకు రాంగోపాల్ వర్మ లేఖ
- నిన్నెవరడిగారు వర్మ ! వాళ్ళ తిప్పలేవో వాళ్లు పడుతున్నారు. వాళ్లూ నటులేగా ! ఎలా నటించాలో వాళ్లకు తెలుసు.
* 2019 ఎన్నికల్లోకి ప్రత్యక్షంగా ప్రియాంక వాద్రా దిగబోతోంది.
– కాంగ్రెసు వర్గాలు
- ఏం రాహుల్‌గాంధీ శకం ముగిసిందా ?
* మోది, షాపై పోరు ఆషామాషీ కాదు; పాత వ్యూహాలు చెల్లవు. కీలక సమయంలో నాయకత్వ అనిశ్చితి కాంగ్రెసు ఉనికికే ముప్పు.
– కాంగ్రెసు సీనియర్ నేత జైరాం రమేశ్
- త్వరలో మీ పోస్టులో మార్పులొస్తాయి. నోరు అదుపులో పెట్టుకోండి. ఆచితూచి మాట్లాడండి. ఇదీ ఈ వారం మీ వారఫలం.
* ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కెసిఆర్ అబద్ధాలు చెప్తున్నారు.
– పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ఏదీ మొన్నటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలా ? ఇప్పుడే ఏం ఎన్నికలు సార్. ఇంకా దాదాపు రెండేళ్ళ సమయముంది.
* ఎస్పిజి ని వదలి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు !? రాహుల్ విదేశీ పర్యటనల రహస్యమేంటి ?
– కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
- మీరు బయటకు తీయండి రాజ్‌నాథ్‌జీ ! ఇటీవల చైనా ప్రభుత్వాధికారులతో భేటీ చూశాం. ఆ తర్వాత విదేశీ పర్యటనలో ఎక్కడెక్కడ తిరిగాడో బయట పెట్టండి.
* ప్రభుత్వానికి మాటలు తప్ప చేతల్లేవ్. కెసిఆర్ ఏమన్నా ఇంజనీరా ?
– కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క
- మీకు అవి కూడా చేతగావని వాళ్ల అభిప్రాయం. కెసిఆర్ మంచి ఉపన్యాసకుడు ! జలవనరుల నిపుణుడు ! ఉద్యమకారుడు ! మాటకారి ! వ్యూహకర్త ! తిరుగుబాటు దారుడు ! మహానేత ! అజేయుడు ! ఇవన్నీ కలగలసిన నేత మీలో ఒక్కరైనా ఉన్నారా ? అని తెరాస వారి ప్రశ్న.
* కెసిఆర్‌కు ఎందుకింత అసహనం !
– సురవరం సుధాకర్‌రెడ్డి, సిపిఐ ప్రధాన కార్యదర్శి
- ఖీ మీకు అయిందానికి, కానిదానికి అసహనం ఉంటే తప్పులేదు కాని కెసిఆర్‌కు ఉండొద్దా !
* సిఎం కెసిఆర్ సింహంలాంటి వాడు. హరీశ్‌కన్నా, నాకన్నా ఆరోగ్యంగా ఉన్నాడు. మరో పదేళ్లపాటు ఆయనే సిఎం
– మంత్రి కెటిఆర్
- జాతకం మూడు ముక్కల్లో భలే చెప్పినవ్ అన్నా !
* ‘బిజెపి క్విట్ ఇండియా’. ఇదే మా 2019 నినాదం
– బెంగాల్ సిఎం మమతా బెనర్జీ
- మమతా జీ ! త్వరలోనే అమిత్‌షా ఆపరేషన్ కలకత్తా చేపట్టబోతున్నారు. మీరు క్విట్ కాకుండా చూసుకోండి !
* ముస్లింలలో అభద్రత, ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇది ప్రధానికే చెప్పాను.
– పదవీ విరమణ ముందు హమీద్ అన్సారీ వ్యాఖ్యలు
- ఏరు దాటాక తెప్ప తగలేయడమంటే ఇదే ! మీపై పదేళ్లలో ఎవరైనా ఏ చిన్న ఆరోపణైనా చేశారా ! మిమ్మల్ని పన్నెత్తి ఒక్కమాటైనా అన్నారా ! తిన్నింటి వాసాలు లెక్కించడమంటే కూడా ఇదే. అన్ని పదవులు అనుభవించి దిగిపోయేటప్పుడు ఈ దేశ మెజార్టీ ప్రజలను వేలెత్తి చూపడం విజ్ఞత అనిపించుకోదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి