– సింగరేణిలో కార్మికుల విషయంలో ఉత్తమ్, రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.
– హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
– నర్సన్నా ! వాళ్ళమీద నీవేమైనా పిహెచ్‌డి చేసినవా ఏంది ?
– నోట్ల రద్దు, జి.ఎస్.టి.తో భారత ఆర్థికరంగం కుదేలయ్యింది. మోది నాకు ద్వారాలు తెరిచారు. జైట్లీ నన్ను గుర్తించాడు.
– మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్‌సిన్హా
– మోదిని మోదాలని ఓ వర్గం మీడియా ఉవ్విళ్ళూరుతుంటే మీరు వారికి భలే తోడయ్యారు సార్. కేజ్రీవాల్, నితీశ్, మమతల వంతు అయ్యాక ఇప్పుడు మీరే లైనులో ఉన్నారేమో !
– వారసత్వంలో కారుణ్యం. అందరికీ ఉద్యోగాలిస్తాం. అందుకు వందశాతం బాధ్యత నాదే.
– సింగరేణి కార్మికులకు సిఎం కెసిఆర్ భరోసా
– ఎన్నికలంటే అంత క్రేజ్ మరి !?
ం ప్రొఫెసర్ ఐలయ్య పై కెటిఆర్ వ్యాఖ్యలు సరికావు. భావ ప్రకటన స్వేచ్ఛతో ఇతరులను అవమానించడం సరికాదు.
– సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం
– మరి భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కంచ ఐలయ్య ఇతరులను అవమానించడం సరైందేనా ? అయినా ఐలయ్య పుస్తకాలు మీరు చదివారా వీరభద్రం ! ఆయన కమ్యూనిష్టులను కూడా ఏం వదలిపెట్టలేదు. కమ్యూనిష్టుల అగ్రకుల నాయకత్వంపై అనేక విమర్శలు చేశారు. అయినా మీరు మద్దతిచ్చే వాళ్ళంతా సమాజానికి హాని చేసేవారే అయినా మీరు వారి పంచనే చేరుతున్నారు. నాయకులు మరీ ఇంత దిగజారి ప్రవర్తిస్తున్నందుకే కమ్యూనిజం నామరూపాలు లేకుండా పోతోంది. కెటిఆర్ ఓ సెక్యులర్ ముసుగేసుకొన్న జర్నలిస్ట్ ప్రశ్నకు సమాధానంగా మాట్లాడాడు. అది అవమానించడమని మీరెందుకు అనుకుంటున్నారు ?
– మేం రంగంలోకి దిగితే ఉత్తర కొరియా వినాశనమే
– అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
– మరో ఇరాన్‌ను, ఆఫ్ఘన్‌ను సృష్టిస్తారన్న మాట. కానీయండి!
– ఆర్థిక వ్యవస్థ పతనం తథ్యం. యశ్వంత్ సిన్హా చెప్పింది నిజం.
– కాంగ్రెస్ నేత రాహుల్
– విదేశాల నుండి వచ్చినప్పుడల్లా ఓ కవితాత్మకమైన వ్యాఖ్య చేస్తారు రాహుల్ జీ ! అక్కడెవరో మంచి రసహృదయం గలవాళ్ళు మీకు నేర్పిస్తున్నారా ఏంటి ? అప్పుడెప్పుడో ‘సూట్ బూట్ సర్కార్’ అన్నారు. అయినా మీరు ఎంత నిరాడంబరులో చూపించుకోవడానికి పైజామా, లాల్చీ ధరించడం మాత్రమే సరిపోదు. వ్యక్తిత్వం కూడా అలా ఉండాలి.
– రాహుల్‌గాంధీ ‘గుజరాత్ పర్యటనలో భాగంగా పలు హిందూ దేవాలయాలకు వెళ్ళారు. అసలు ఆయన ‘తాను హిందువా! కాదా’ అన్న విషయం చెప్పాలి. ఎందుకంటే ఆయన క్రిష్టియన్ అని, 10 జనపథ్‌లో ఓ చర్చ్ కూడా ఉందనీ నా అనుమానం
– భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి
– ఊరుకోండి స్వామి గారు ! మీరు భలే చెప్తారు. మీరు నోరు తెరిస్తే కాంగ్రెస్ వాళ్ళవి, ముఖ్యంగా సోనియా కుటుంబం గుండెలు అదురుతాయి. అందుకే వాళ్ళు మౌనం వహించారు.
– డా||పి.భాస్కరయోగి మాటకు మాట, విశ్లేషణ జాగృతి 09-15 October 2017

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి