కల్తీ దుర్మార్గాన్ని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలి. అన్ని రకాల కల్తీలపై ఉక్కుపాదం మోపాలి

– సిఎం కెసిఆర్‌
కాస్త ‘రాజకీయ కల్తీపై’ కూడా దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారూ.
 గోరక్షణ పేరిట మనుషులను కొట్టి చంపుతున్న దారుణాలు తెలిసి, తట్టుకోలేని కోపం వస్తుంది. నా రక్తం మరుగుతోంది. ఇటువంటి ఘోరాలు ప్రతి నిజమైన భారతీయుడి రక్తాన్ని మరిగిస్తాయి.
– ప్రియాంక గాంధి, కాంగ్రెస్‌ నేత
సిక్కు అల్లర్లను, ముంబై పేలుళ్లను తలచుకొన్నప్పుడు ఎప్పుడూ రక్తం మరగలేదా ? మీ యూత్‌ కాంగ్రెసు నాయకులు కేరళలో నడిరోడ్డుపై ఆవులను కోసి హత్య చేసినప్పుడు రక్తం మరగలేదా ? గోపాలన చేసే వ్యక్తిపై కర్ణాటకలో (మీ ప్రభుత్వమే అక్కడ ఉంది) హత్య జరిగితే అప్పుడు ఎక్కడకు పోయిందమ్మా మీ పౌరుషం ?
రాజ్యాధికారం బహుజనులకు దక్కాలనే లక్ష్యంతో అంబేడ్కర్‌, ఫూలే ఆలోచనా విధానాలతో ఏర్పడిన మహా సమాజం పూర్తిగా ప్రజల పక్షం. ఇది మావోయిస్టుల అనుబంధం కాదు.
 – ప్రజా గాయకుడు గద్దర్‌
ఇన్నాళ్లు మావోయిస్టులది ప్రజల ఎజెండా అన్నావు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు అన్నావు. ఇప్పుడు వారితో మహాజన సమాజానికి సంబంధం లేదు అంటున్నావు. అప్పుడూ ప్రజలే – ఇప్పుడూ ప్రజలే! ఏది నిజం అన్నా!
మంత్రి జగదీశ్‌ రెడ్డి రాజీనామా చేసి, మళ్ళీ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను.   
 – కాంగ్రెసు నేత కోమటిరెడ్డి
ఆయన రాజీనామా చెయ్యడు; మీరు ‘రాజీనామాలు చేయండి’ అనే డిమాండును విరమించుకోరు! ఇది నిజం! వెనుకటికి ఎవడో ‘వైద్యానికి పులిపాలు తేండి’ అన్నాడట.
 గోరక్షణ పేరిట మనుషుల్ని కొట్టి చంపడాలు ఎన్డీయే పాలనకన్న యుపిఎ పాలనలోనే ఎక్కువ      
 – భాజపా అధ్యక్షుడు అమిత్‌షా
కొంపదీసి లెక్కలు తీస్తారా ఏమిటి ! మరో కుంభకోణం కాగలదు.
 జిఎస్‌టి అంటే గుడ్‌బై సింపుల్‌ టాక్స్‌  
 – కాంగ్రెసు నేత కపిల్‌ సిబాల్‌
మీ మాటలన్నీ అడ్డదారిని తలపించేవే.
 ప్రణబ్‌ నాకు పితృ సమానులు. 
– ప్రధాని నరేంద్రమోది
అది మీలోని సంస్కారం.
 తాడోపేడో తేల్చుకొంటాం. పోడు భూముల పరిరక్షణలో ఎర్ర జెండాలది ఒకే ఎజెండా.
– సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి
అంటే వేరే విషయాల్లో ఎర్రజెండాలకు వేర్వేరు ఎజెండాలున్నయన్నమాట.
ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముంచివాడు. ఆయనతో పోటీ నాకు సిద్ధాంతపరమైనదే.
 – విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌
అంటే మంచి వాళ్లకు మంచి సిద్ధాంతాలు లేవనా ! లేక మీరు చెడ్డ సిద్ధాంతంలో ఉన్న మంచి వ్యక్తి అనా ! ఏమిటి మీ భావం ? ఏమిటీ కన్ఫ్యూజన్‌…!
 త్యాగాలు వృధా కానియొద్దు ! ఓట్లతో గెల్చినవాళ్లకు ఓట్లతోనే బుద్ధి చెప్పండి.
– జెఎసి నేత కోదండరాం
‘ఎలక్షన్లలో నిలబడను, రాజకీయ పార్టీ పెట్టను’ అని మీరంటారు. మరి ఓట్లు ఎవరికి వేయాలి ?
మంచి రోజులు వస్తాయ్‌. ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబుది అవినీతి పాలన.
– వైయస్‌ జగన్‌
ఉన్నది రామన్న రాజ్యం ! రానున్నది రాజన్న రాజ్యం ! ఏంది తేడా జగనన్నా !!
– డా||పి.భాస్కరయోగి  మాటకు మాట, విశ్లేషణ జాగృతి  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి